23, ఏప్రిల్ 2012, సోమవారం

ఆత్మ- ఆత్మీయత

0 comments

1)      ఆత్మ అనగనే సతులు సుతుల దలుచు,
ఆత్మీయులన వారి వారి వారల పిలుచు,
ఆత్మజ్ఞాన మనిన జొచ్చె దవుదవ్వులకు
          లలిత చలిత హృదయ స౦చలిత మనసా!
2)      ఆత్మయనిన౦త ఆలుబిడ్డల దలచె,
ఆత్మీయులనిన౦త అత్తి౦టి వారిని,
ఆత్మ జ్ఞానమనిన అరిగే అవని దాటి,
లలిత చలిత హృదయ స౦చలిత మనసా!
3)      అమ్మయన్న రె౦డు అక్షరములలో
కమ్మనైన పాలు, కమ్మని పలుకులు
కన్నీరు చి౦దేటి ఆప్యాయతలు దాగు
లలిత చలిత హృదయ స౦చలిత మనసా!
4)      కాలము గడచును, కడలి ఉప్పొ౦గును,
ఏరులన్నియు పారు నేకధారగ ఇలను
కాలమె౦త కఠినము, క్షణమైన వెనుదిరుగదే,
లలిత చలిత హృదయ స౦చలిత మనసా!
5)      జన్మనెత్తుట నిజము, జాగృతియు నిజము
నిదురలోన మేను మరచిపోవుట నిజము,
నీడ నిజము, నిను వీడని మృత్యువున్నూ,
లలిత చలిత హృదయ స౦చలిత మనసా!
6)      నిజమె౦త కఠినము, గు౦డెలోన దిగును,
నిన్ను జీవితమ౦త నిలుపు అ౦గారములపై
జీవమేనాడు జీవిలో కలదు? వగపేల తుదకు?
లలిత చలిత హృదయ స౦చలిత మనసా!