Printed on ఓసారి చూడండి అంతే@! on first week లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Printed on ఓసారి చూడండి అంతే@! on first week లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జూన్ 2022, శనివారం

పాడవే ప్రాణసఖీ

0 comments

 

పాడవే ప్రాణసఖీ

కృష్ణుని గాథలు 

మదిలో నిండగ

ప్రాణములో, ధ్యానంలో,  

పాటలోని సరిగమలు ఒలుకగా 


పసిపాపవలె 

యమునను దాటి

పవ్వళించేనో 

యశోద ఒడిన 

యమునా తీరాన 

ఆడిన ఆటలు, 

బృందా వనిలో

పాడిన పాటలు

వందల గోవుల

గోప బాలకుల

సకలాపదల

కాచిన విధము,

కాపాడిన విషయము

పాడవే ప్రాణసఖీ


చెలువము మీరగ చెలువుల చేలముల 

చిలిపి నటనలతో చలువము తోడ 

దాచిన వేడుక, 

శరణు వేడగా కరుణను ఒసగిన తడవు

కడవల వెన్నెల, కడలిని మించిన

యెడదల ప్రేమల

పాడవే ప్రాణసఖీ


మధురాధరముల 

మధురిమలొసగి

కన్నియ వలపుల 

విన్నపములన్నీ

కన్నులనిండుగ 

మనసున నిలిచి

తానే మనసై, 

మనసే తానై

వలపుల తలపుల 

తానే నిలిచి

ఈసున మనసున 

వగపులన్నీ 

మనసు లోనే 

భ్రమలని తెలిపి

మధురకు వెడలి, 

బలభద్రునితోడుగ

మనుమడిగా 

తన తాతను బ్రోచి

కంసుని పీడను 

కడతేర్చిన వైనము,


పాడవే చెలీ,చెలీ, 

చెలీ నా  ప్రాణసఖీ !

🦚🦚