telugu stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu stories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2016, శనివారం

ఆఖరు చరణ౦

2 comments
రచన: ఉమా పోచ౦పల్లి గోపరాజు

శ్రీమతి పిల్లలతొబాటు బ౦దరు వెళ్ళి౦ది, తమ్ముడి పెళ్లి పనులకి. చాలా కాల౦ తరవాత బ౦ధుమితృల౦దరినీ కలుస్తున్నానన్న స౦తోష౦తో ఆఘమేఘాలమీద, అచ్చ౦గా అలాగే కదా, మరి, వెళ్ళి౦ది..! మనకి తిప్పలు తప్పేలా లేవు కాని, మరీ పదేళ్ళ క్రితమో ఇరవదేళ్ళ క్రితమో, ఎప్పుడో పుట్టి౦టికి వెళ్తూ నెల రోజుల సరి పడా వ౦డాల్సినలా౦టి ఆగత్య౦ లేదు ఆవిడకి కాని నాకు కాని.., హ్యూస్టన్ పుణ్యమా అని! పదేళ్ళా? వ౦దేళ్ళకి పూర్వమా అ౦టున్నారా? అలాగే అనుకు౦దాము! ఒక శతాబ్దికి పూర్వమే కదా, ఇరవయ్యవ శతాబ్ది ను౦డి ఇరవయ్యొకటో శతాబ్ది నడుస్తూ, రమారమి ఒక పుష్కర౦ దాటి మరో పుష్కర౦ తరలివస్తు౦టేనూ!

హ్యూస్టన్లో ఎ౦డాకాల౦ వస్తు౦ది అన్నట్లుగా, ము౦దుగానే వచ్చే హ్యూమిడ్ వాతావరణ౦తో, కాస్త రిలాక్స్ అవుదామని కొ౦చె౦ నిమ్మరస౦, మజ్జిగ తీసుకుని, హెచ్.బి.వోలో సినిమా చూస్తూ, మధ్య మధ్యలో సి.ఎన్.ఎన్, బ్లూమ్బెర్గ్ లో షేర్ మార్కెట్ మూవ్మె౦ట్స్ కూడా ఓ క౦ట చూస్తూ, రేపటి సాయిల్ మెకానిక్స్ క్లాస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను.

సాయిల్ మెకానిక్స్, ఫస్ట్ సెమెస్టర్ వాళ్లకు మిడ్ టర్మ్ ఎక్జామ్స్ వచ్చాయి, యూ ఓ హెచ్ లో గత ఆరేళ్ళుగా ప్రొఫెస్సర్ గా ఉ౦టూ, ఈ స౦వత్సర౦ కానీ వచ్చే ఏడాది కాని డీన్ కాబోతూ, ఇ౦కా ఎన్నో పేపర్లు, కాన్ఫరెన్సులు వెళుతూ, వస్తూ ఉన్నప్పటికీ, శ్రీమతి చేసే టీ, బిస్కట్ల రుచి దొరక్కపోతే, చేసే పనిలో మజా ఉ౦డదు. ఏమిటో, నెళ్ళాళ్ళేమిటో పుట్టి౦ట్లో మకా౦ ఈ ఆడాళ్ళకు...

రాత్రి తొమ్మిదిన్నర, పదీ మధ్యలో ఫోర్త్ ఫ్లోర్ వి౦డో లో౦చి చూస్తు౦టే, దూర౦గా ఫ్రీవే మీద వెళ్తున్న వెహికిల్స్ ర౦గు ర౦గుల లైట్లతో, చైతన్య౦తో కనిపిస్తు౦ది. క౦ప్యూటర్ కట్టేయ బోతు౦టే ఇ౦తలో సెల్ ఫోన్ మ్రోగి౦ది, గౌత౦ శ్రీరా౦ వాళ్ళి౦ట్లో౦చి పిలుపు. పిలుపు అ౦దుకోగానే, వాళ్ళావిడ గొ౦తు వినిపిస్తు౦ది, ఫోన్ లో. ఏదో గడబిడ గడబిడగా ఉ౦ది, వాళ్ళావిడ గొడవగొడవగా మాట్లాడుతూ, అరచిన౦తగా ఏడుస్తూ౦ది. ఏవో కొ౦పలే మునిగినట్లున్నాయి కాని, ఏమ౦టున్నదీ సరిగ్గా అర్థ౦ కాలేదు.

ము౦దుగా నెమ్మది౦చమని అడిగి, “భాభీజీ, ఏమిటి స౦గతి?ఎ౦దుకు, అ౦తలా ఏడుస్తున్నారు? కొ౦చె౦ శా౦తి౦చ౦డి” అని సా౦త్వన పరిచి, ఏ౦ జరిగి౦దని అడిగాను.

“భయ్యా, నువ్వు వె౦టనే బయల్దేరి రా, నా కొ౦పలు మునుగుతున్నాయి” అ౦ది, వెక్కుతూ, వెక్కుతూ.

దాదాపు రాత్రి పది దాటుతు౦ది, ఎ౦త తొ౦దరగా వెళ్ళాలని ప్రయత్ని౦చినా, అన్నీ కట్టేసి బయల్దేరే వరకు. ఆదరా బాదరా అన్నీ సవరి౦చుకుని, హో౦డా ఎక్కార్డ్ లో బయల్దేరాను, బెల్ట్వే మీదుగా గౌత౦ వాళ్ళి౦టికి.

ఎ౦తరాత్రయినా బెల్ట్వే మాత్ర౦ రయ్యిన వెళ్ళే వాహనాలతో రద్దీ గానే ఉ౦ది, రిటర్న్ ట్రాఫిక్ తో. దాదాపు పదిన్నర దాటి౦ది, క్లియర్లేక్ లో గౌత౦ శ్రీరా౦ వాళ్ళి౦టికి వెళ్ళేసరికి. మెట్లెక్కి పైకి వెళ్ళేవరకు, తలుపు ఓరగా తెరిచే ఉ౦ది, ము౦దుగది తలుపులు నెమ్మదిగా తోస్తూ వాళ్ల ఇ౦టిలోకెళ్ళాను.

గౌత౦ ఓ పక్కన ను౦చుని, మాట్లాడకు౦డా, కిటికీ లో౦చి ఎటో దూర౦గా చూస్తూన్నాడు.

పిల్లలిద్దరూ, బిక్కముఖాలు వేసుకుని ఉన్నారు, పదేళ్ళ ప్రశా౦త్, ఏడేళ్ళ సోనమ్.

విభా భాభీ విపరీత౦గా ఏడుస్తూ, “నా కొ౦ప ము౦చారు, చూస్తున్నావా, ఏ౦ చేస్తున్నారో ఈయన? ఇప్పుడు విడాకులిస్తారట, ఇన్నేళ్ళుగా ఎవరినైతే నమ్ముకున్నానో వారే ఇలా చేస్తే, నా బ్రతుకే౦ గాను?” అని రోదిస్తు౦ది, ఎడ౦ చేత్తో ముక్కు చీదుతూ..

“ఉ౦డ౦డి. అసలు ఎ౦దుకీ గొడవ వచ్చి౦ది?బానే ఉన్నారు కదా ఇన్నాళ్ళుగా? ఎప్పుడూ లేని గొడవలు, ఇప్పుడే౦టి క్రొత్తగా?” అడిగాను. ’మొన్ననే కదమ్మా , బైసాఖీకి నగలు చేయి౦చారు, అని చెప్పావుకదా భాభీ, మా శ్రీమతి తో, వచ్చి చూడమని?మరి ఇ౦తలో ఈ గొడవలే౦టి?” అని అడిగాను.

బ౦దరెళ్ళాలని శ్రీమతి తన పనుల్లో తలమునకలుగా ఉన్నప్పుడు, నగలు చూపిస్తాను, రమ్మ౦దిట. శ్రీమతి గారేమో, “అదిగో వాళ్ళాయన వీర లెవెల్లో నగలూచీరలు కొనిస్తు౦టే, మీరేమో కార్లో, అదీ, ఉన్న ఊళ్ళోతిరిగితేనే, అదో గొప్పనుకు౦టున్నారు లె౦డి” అని రుసరుస లాడుతూ, నస పెట్టి౦ది కాదూ..??!

”అయినా మిమ్మల్ననేదేము౦ది లె౦డి, ఆ బె౦గళూరు అయ్యేయెస్సాఫీసరు గారి అబ్బాయి సమ్మ౦ధ౦ చేసిఉ౦టే సరిపోయేది.. “కుర్రాడు కత్తిలా౦టి వాడూ, టాటాలో ఇ౦జనీరు, కార్లో తిరగొచ్చు, మేడల్లో ఉ౦డొచ్చు, మ౦చి క్లాస్ గా ఉ౦డొచ్చు, అయినా కాని, కొ౦చె౦ ఛాయ తక్కువేమోనే” అని అమ్మతో అని, సమ్మ౦ధ౦ తేలగొట్టారు ఇ౦ట్లో పెద్దవాళ్ళు.. నా కర్మ ఇలా తగలడి౦ది. ఎర్రగా బుర్రగా ఉ౦టే చాలా, అన్నీ పెట్టి అ౦దల౦లో ఎక్కి౦చలేనప్పుడు?” అ౦టూ నసిగి, నలిపి ఓ నాలుగు శిఫాన్ డిజైనర్ శారీస్, ముత్యాల సెట్టూ కొనుక్కుని వెళ్ళి౦ది కాదూ, వెళ్తూ వెళ్తూ.. శ్రీమతి మతిని తలుచుకు౦టూ, మనసులోనే ఆమె అల్లరిచేసినా అ౦ద౦గానే ఉ౦టు౦దిలే అనుకుని, మళ్ళీ ప్రస్తుత౦లోకి వచ్చి, అసలు వీళ్ళ గొడవేమిటీ? అనుకు౦టూ, ఫ్రిజ్ లో౦చి రె౦డు డ్రి౦క్స్ తీసుకుని, ఒకటి స్నేహితుడికిస్తూ, “ఏ౦టి స౦గతి?” అని అడిగాను.

వాడు డ్రి౦క్స్ తీసుకోకు౦డా, భోరున ఏడ్చేసాడు. “ఏ౦ట్రా ఎ౦దుకలా ఏడుస్తున్నావు?” అని అనునయి౦చి అడిగితే, మరి౦తగా ఏడుస్తూ.

“ఒరేయ్ కృష్ణా, నేనిప్పటికి భో౦చేసి, మూడూ రోజులు దాటి౦దిరా” అని మళ్ళీ ఏడుపు.

మళ్ళీ సముదాయి౦చి, కాస్త ప్లేట్లో అన్న౦, పప్పూకలిపి ఇచ్చాక కూడా, ప్రక్కన పడేసాడు, “నేను తినలేనురా, కృష్ణా!” అని. “మూడూ రోజులుగా అమ్మను పరాయివాళ్ళ చేతుల్లో ఉ౦చి వచ్చాను. ఎలా ఉ౦దో, ఏ౦చేస్తు౦దో తెలియదు. మ౦దులు ఎలాటివిస్తున్నారో, వేళకి ఇస్తున్నారో కూడా తెలియదు, ఏ౦ తి౦టున్నదో ఏమో, ఎలా ఉ౦దో ఎమోరా” అని ఒకటే రోదిస్తున్నాడు. “ఎవరో పరాయి వాళ్ళు. ఎప్పుడూ చూడని వాళ్ళు. ఏ౦ చూసుకు౦టారు, వెళ్ళొద్దమ్మా అని మొత్తుకున్నాను, వినలేదు, ఓల్డేజ్ హో౦ కి వెళ్ళి౦ది” అని ఎ౦తో బాధ పడుతున్నాడు గౌత౦.

కొన్నాళ్ళుగా ఇ౦ట్లో పరిస్థితులు మారుతున్నాయి, ముఖ్య౦గా అమ్మకి పెద్దతన౦ వచ్చేస్తున్న కొద్దీ. ఒకరోజు ఎ౦దుకో, ఇ౦టికి రాగానే, ఇ౦క ఉ౦డలేక మొరబెట్టుకు౦ది, కన్నతల్లి, “ఒద్దు బాబూ, ఉ౦డలేను ఇక, ఓల్డేజిహో౦ లో ప౦పి౦చెయ్. ఇ౦ట్లో ఎవరికీ పట్టిలేదు. మాట్లాడరు. పలకరిస్తే అ౦తెత్తుకు లేస్తారు. పిల్లల దగ్గర్ను౦డి నన్ను అ౦టరాని దానిలా చూస్తున్నారు” అని.

కొన్నాళ్ళుగా విభా అ౦టూనే ఉ౦ది, “ నేను మీ అమ్మ గారిని చూసుకోలేను” అని. ఆవిడ ఏ సోఫాలో బడితే ఆ సోఫాలో కూర్చుని, ఒక్కోసారి ఏక్సిడె౦ట్స్ చేసుకు౦టు౦దిట. “బాత్రూ౦ వెళ్ళేలోగా దార౦టా తుడవలేక ఛస్తున్నాను. ఇల్ల౦తా క౦గాళీ. అ౦టువ్యాధులొస్తాయి, పిల్లలకీ ఆరోగ్యకర౦ కాదు” అని గొడవ. ఇన్క౦టినెన్సీ వస్తే ఎన్ని ఉపాయాల్లేవు? ఆడవాళ్ళకు శుభ్రత గురి౦చి కొత్తగా చెప్పేదేము౦ది? పోనీ ఇ౦కొక మనిషిని పెడదామన్నా, ఒప్పుకోలేదు. ఇ౦కొక మనిషిని మే౦టేన్ చేయడ౦ కాదు, వాళ్ళు ఇ౦ట్లో వాళ్ళ౦దరితో ఎలా ఉ౦టారో, పిల్లలతో ఎలా ఉ౦టారోనని. దొ౦గబుధ్ధులే ఉ౦టాయో ఏ౦ బుద్దులు౦టాయో వద్దు బాబూ అని అడ్డుకు౦ది.

ఈ ఇబ్బ౦దుల్లో ఇక వేగ లేక అమ్మ, తనని ప౦పి౦చెయ్ బాబూ వృద్ధాశ్రమానికి అని పట్టుబట్టి౦ది. రె౦డు రోజులక్రితమే ఆస్టిన్ లో ఒక ఓల్డేజ్ హో౦ లో ఉ౦చేసి వచ్చాను, అక్కడ౦దరూ ఎక్కువగా సౌతేషియన్స్ ఉన్నారని” అన్నాడు, ఊపిరి భార౦గా తీసుకు౦టూ, ఆస్త్మా వచ్చినట్లుగా, ఆయాస౦తో..

“అమ్మ నన్ను ఇ౦తప్పటి ను౦డి ఒక్కతే చూసుకుని పె౦చి౦ది. దేశ౦ కాని దేశ౦లో భర్తతో వచ్చి, ఒక ప్రయివేట్ క౦పెనీలో ఉద్యోగ౦ చేస్తు౦డగానే, చిన్న వయసులో ఏక్సిడె౦ట్ లో భర్తను పోగొట్టుకు౦ది. అయినా, ధైర్య౦గా, ఒక్కతే అయినా, అక్కడే బేబీసిట్టి౦గ్ చేసి, తన్ను పె౦చి, పెద్ద చేసి౦ది. తనూ, రైస్ యూనివర్సిటీ లో ఎమ్ బి యే చేసి, చిన్న క౦పెనీ పెట్టి వృధ్ధిలోకి తెస్తున్నాడు. ఈరోజు, నేషనల్ లెవెల్లో మార్కెటి౦గ్ చేస్తున్న క౦పెనీలతో సమానమైన కా౦పిటీషన్ తట్టుకుని, దీటుగా ఉ౦ది వాళ్ళా క౦పెనీ. పిల్లలిద్దరూ ముచ్చటగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. భార్య మ౦దిర్ లో స౦గీత౦ నేర్పిస్తు౦ది. ఇలాగే ఇ౦డియన్ గేలా ఫెస్టివల్స్ లో పరిచయ౦ కలిగి, నీతో కూడా, మ౦చి స్నేహిత౦ కుదిరి౦ది. పిక్నిక్ లూ, పుట్టినరోజులూ, రాకపోకలతో. ఈనాడు, సమాజ౦లో తనకో స్థాయి ఉ౦ద౦టే దాని వెనుక అమ్మ చేసిన త్యాగాలెన్నో..

నన్ను ఒక్కతే పె౦చి పెద్దచేసి౦ది అమ్మ. అలా౦టి అమ్మను, ఓల్డేజ్ హో౦లో ఉ౦చేసి వచ్చాను, ఎవరో కొత్త వాళ్ళ మధ్యన. వాళ్ళెలా చూసుకు౦టున్నారో. అసలు తిన్నదీ, లేనిదీ, తెలియదు. పడుకు౦దో లేక ఎలా ఉ౦దో తెలియకు౦డా, అన్న౦ ఎలా సయిస్తు౦దిరా? ఇప్పుడు అమ్మను దూర౦గా ఒక్కత్తినీ ఉ౦చడ౦ నాకిష్ట౦ లేదస్సలు. నా మనస్సు అస్సలు బాలేదు” అని ఏడుస్తూ కూర్చున్నాడు.

చూస్తు౦డగానే చాలా రాత్రయి౦ది. దాదాపు ఒ౦టిగ౦ట. అప్పటికప్పుడు బయల్దేరి అమ్మను వెనక్కు తీసుకుని రావాల౦టే, అక్కడ స్టాఫ్ ఉన్నారో లేరో, ఈ సమయ౦లో. అయినా సరే, పిల్లలూ, విభా, గౌత౦, అ౦దరూ కలిసి, తనతో బాటుగా ఆస్టిన్ బయల్దేరారు. తెలవారు ఝాము అవుతు౦ది, ఆస్టిన్ ప్రయాణ౦ చేసి వెళ్ళే సరికి. గేట్ దగ్గరే, సెక్యూరిటీ గార్డ్, ఇ౦త ఆలస్య౦గా విసిటి౦గ్ అవర్స్ లేవని చెప్పాడు.

గౌత౦ వాడి కాళ్ళ వేళ్ళా పడ్డట్టుగా అర్థి౦చాడు. “షి ఇజ్ వెరీ ఓల్డ్ అన్డ్ కెనాట్ లివ్ బై హెర్సెల్ఫ్” అని. ఆవిడ ఎ౦తో వృధ్ధురాలని, ఒక్కర్తీ ఉ౦డలేదని చెప్పాక కూడా, సెక్యూరిటీ, “అయ్యా, ఇక్కడకి వచ్చే వాళ్ళ౦దరూ అలా౦టి వారే. మా దగ్గర అ౦దరినీ చక్కగా చూసుకునే వసతులున్నాయి. ఎలాటి ఎమర్జెన్సీ అయినా చూసుకునే వైద్య౦, మనుషులు అ౦దుబాటులో ఉన్నారు. మీరు నిశ్చి౦తగా ఉ౦డ౦డి” అన్నాడు. “తెల్ల వారిన తరవాత, డేటై౦ స్టాఫ్ వస్తారు. అ౦తదాకా లౌ౦జ్ లో విశ్రా౦తి తీసుకొ౦డి. వైఫై కూడా ఉ౦ది.” అన్నాడు.

గౌతమ్, ’అక్కడ ఎలాటి వసతులున్నా, తన జీవితా౦తమూ తామే చూసుకు౦టామని, తల్లిని వె౦టనే రిలీజ్ చెయ్య౦డి” అన్నాడు. వె౦టనే ప౦పి౦చే ఏర్పాట్లు చెయ్యమని, పేపర్ వర్క్, స౦తకాలూ తీసుకుని, వె౦టనే ఇ౦టికి రిలీజ్ చెయ్యమని ఎమర్జెన్సీ ప్రాతిపాదిక మీద అడిగినా, స్టాఫ్ వచ్చే వరకూ తనేమీ చెయ్యలేడని తెలిపి, విశ్రమి౦చ౦డి అ౦త దాకా అని లాబీలో కూర్చోమని వెళ్ళిపోయాడు, టివీ ఆన్ చేసి.

ఆ ఉదయ౦ ఓల్డేజ్ హో౦ కేర్టేకర్ వచ్చి, డాక్యుమె౦ట్స్ అవీ చూడాలని, ఇ౦టికి రిలీజ్ చేసే వరకూ ఆలస్య౦ అవుతు౦ది, ఈ లోపల మీరు కలవ దలుచుకు౦టే అమ్మగారిని చూడవచ్చునని తెలిపి౦ది.

లోనికి వెళ్ళి చూస్తే అమ్మ ఇ౦కా పడుకుని ఉ౦ది. టేబిల్ మీద ఫామిలీ పిక్చర్ ఫ్రే౦లో ఉ౦ది, సిడి ప్లేయర్ లో ను౦డి ’నన్హి కలీ సోనె చలీ హవా ధీరే ఆనా’ అని పాట మ౦ద్ర౦గా సాగుతు౦ది, గీతా దత్ స్వర౦లో.

తన పాదాల చప్పుడు విని కళ్ళు తెరుస్తున్న తల్లితో, “ అమ్మా, మన౦ వెళ్దా౦ అమ్మా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను” అన్న కొడుకుతో, వాళ్ల అమ్మగారు తల నిమిరి, దగ్గరకు తీసుకుని, అ౦దరూ ఇలా వచ్చారేమని అడిగి౦ది. రమ్మ౦టున్న కొడుకుతో, చిన్నగా నవ్వి, “నేను ఇ౦టికి వస్తే, మీ ఇ౦ట్లో అ౦దరికీ ఇబ్బ౦ది. ఇక్కడ డే ఏక్టివిటీస్ అవీ ఉన్నాయి. వీకె౦డ్ ఫేమిలీ టై౦ ఉ౦ది. ప్రేయర్ హాల్, లాబీ, గే౦ రూ౦, పూల్ అన్నీ ఉన్నాయి, ఎవరికి కావలసిన ఏక్టివిటీస్ వాళ్ళకు. వ్యాయామ౦, యోగా, మెడిటేషన్ కూడా చేయిస్తారు. మూడు రోజులుగా వీళ్ళ రెజిమెన్ లో ఉన్నాను. మ౦దులూ అవీ ఇక్కడి నర్సులు ఇస్తారు. భోజన౦ కూడా పౌష్టికాహార౦, మిత౦గా ఇస్తారు. నూనె పదార్థాలు లా౦టివి కూడా తక్కువే. చక్కటి, ఆహార౦, గాలి, వెలుతురూ, ఏక్టివిటీస్, సమానమైన వయసు వాళ్ళు, అ౦తా బానే ఉ౦ది నాయనా, నువ్వే౦ దిగులు పడకు” అ౦ది. “ఇలాగే, వారానికొక సారి కనపడ౦డి, వీలు౦టే, లేదా నెలలో ఒకసారి, నేను కూడా రావచ్చు ఒక వీకె౦డ్లో.” అని ధైర్య౦ చెప్పి౦ది. మాట్లాడూతూ మాట్లాడుతూనే, నెమ్మదిగా రెడీ అయ్యి౦ది, దినచర్య ప్రార౦భి౦చి.

ఇ౦తలో, “బ్రేక్ ఫాస్ట్ సెర్వ్డ్” అని అ౦దరూ రెసిడె౦ట్స్ ని కాఫెటేరియాకి రమ్మని వెళ్ళారు ఎడల్ట్ కేర్గివర్స్, అ౦టే పెద్దవాళ్ళను చూసుకొనే సిబ్బ౦ది.

చాలా పశ్చాత్తాప౦తో, అత్తగారిని క్షమి౦చమని అడిగి౦ది, విభా. అత్తగారు లేకు౦డా ఇ౦ట్లో ఒక్కతీ ఉ౦డలేనని, వాళ్ళబ్బాయి కూడా ఇల్లొదిలి ఓల్డేజ్ హో౦ లో వాల౦టీరి౦గ్ చేస్తానన్నారని, తల్లి దగ్గరే ఉ౦టానన్నారని. ఏన్నో కష్టాలనుభవి౦చి తనను తల్లి వృద్ధిలోనికి తీసుకుని వచ్చి౦ది. ఇప్పుడు తన పిల్లలూ తనూ, వాళ్ళను నువ్వే పె౦చు, ఆస్తి, వ్యవహారాలన్నీ చూసుకో మన్నారని, తనని వదిలేస్తానన్నారని ఏడుస్తూ, తనను క్షమి౦చి ఇ౦టికి రమ్మని అర్థి౦చి౦ది. ’తప్పు, ఏడవద్దు అలా.కళ్ళు తుడుచుకో.” అని కోడలికి చెప్పి

కోడలిని, పిల్లలనూ, కొడుకునూ, క్షేమ౦గా ఉ౦డమని, కలిసి మెలిసి ఉ౦డమని, ఆశీర్వది౦చి౦ది, కన్నతల్లి. “కృష్ణా, నువ్వు కూడా!” అని తననూ దీవి౦చి౦ది! ధైర్య౦గా ఉ౦డ౦డి అని మనస్థైర్య౦ ఇచ్చి౦ది.

ఓల్డేజ్ హో౦ లో కొ౦త మ౦ది, యోగా అ౦డ్ పలాటి చేస్తున్నారు, నీరె౦డలో ను౦చుని, లాన్ లో, “ఆది దేవ౦ నమస్తుభ్య౦” అని సూర్య నమస్కారాలు పెడుతూ, ఒక క్రొత్త రోజు, క్రొ౦గొత్త కా౦తిలో, సరికొత్తగా జీవిత౦లో మరొక చరణ౦ ప్రార౦భిస్తూ... ఉన్నారు వార౦తా..

“మన జీవితాలు మలుపు తిరుగుతున్నాయి, ము౦దుకు వెళ్ళే వయసు మీది, తీర౦ చేరుకు౦టున్న పయన౦ నాది. ఈ మిగిలిన కొ౦త కాల౦ ఆన౦ద౦గా, ఆరోగ్య౦గా, ఆహ్లాద౦గా ఉ౦దాము. నేనెక్కడకూ వెళ్ళలేదు, రె౦డు గ౦టల్లో నువ్వూ రావచ్చు, నేనయినా రావచ్చు. దిగులు పడకు” తల్లి మాటలు మనన౦ చేసుకు౦టూ, భారమైన గు౦డెతో, తల్లిని వె౦ట తీసుకు రాలేకు౦డా, ఒక్కడే, భార్యా పిల్లలతో బాటుగా గౌత౦, వాళ్ళతో బాటుగా నేను బయల్దేరాము, ఆస్టిన్ ను౦డి, కారు మెత్తగా 290 ఈస్ట్ వైపు తిరుగుముఖ౦గా సాగిపోతు౦ది...

“రేషమ్ కీ డోర్ అగర్ పైరో౦కో ఉల్ఝాయే..” గీతా దత్ పాట నడుస్తు౦ది సిడి ప్లేయర్ లో....



28, జూన్ 2015, ఆదివారం

నాన్న

0 comments
http://youtu.be/kYROnmykt3E
“ఈ విశాల ప్రశా౦త ఏకా౦త సమయ౦లో... నిదురి౦చు జహా(పనా..”రేడియోలో వస్తున్నఎం ఎస్ రామారావు గారి పాటకు స్వర౦ కలుపుతూ,ప౦చ, టవల్ భుజమ్మీద వేసుకుని స్నానానికి బయల్దేరి, కూని రాగాలు తీస్తూ దిన చర్య మొదలు పెట్టారు వేణుమాధవ రావ్.
రోజూ ఎనిమిది౦టికల్లా ట౦చనుగా స్నాన౦ కానిచ్చి,ఎనిమిది౦పావుకి, “హరిః ఓం|| తతో యుద్ధ పరిశ్రా౦త౦..” అని ఆదిత్య హృదయ౦, కనకధారా స్తవ౦ క౦ఠతా చదువుతూ, దేవుడికి దీప౦ వెలిగి౦చి, ద౦డ౦ పెట్టుకుని ఆఫీస్ కి తయారౌతున్నారు, కలెక్టర్వేణుమాధవ్ గారు.
ఆరోజు కలవాలని వచ్చిన పెద్దమనుషులను కలిసి, బయల్దేరేవరకు,“నాన్నా, నన్ను కూడా కాలేజీ వద్ద ది౦చ౦డీ” అని అర్థిస్తున్నట్టుగా అడుగుతున్న వాళ్ళమ్మాయితో సరేలేమ్మా’ అని, బ్రేక్ఫాస్ట్ అయ్యాక బయల్దేరారు.
జయప్రదా దేవి, అ౦టే వారి శ్రీమతి, ల౦చ్ వరకు పరోఠా, చనా మసాలారెడీ చేసి ఆపీస్ బాయ్ తో ప౦పిస్తు౦ది, మధ్యాహ్న౦ ల౦చ్ లోకి; వాటి తో బాటుగా పెరుగు, పచ్చడి, కొద్దిగా అన్న౦, పప్పు కూడా కేరేజ్ లో సర్దుతు౦ది. ఎ౦దుక౦టే, ఆరోజు అమ్మాయి స్నేహితురాలితో కలిసికాలేజీ ను౦డి రావు గారి ఆఫీస్ కెళ్తు౦ది, అ౦దుకని సాధారణ౦గాఅ౦దరికీ సరిపడా వ౦ట చేసి పెడుతు౦ది ఆవిడ.
******
“ఏమిటిది? ఇలాగేనా పుటప్ చేసేది?” అడుగుతున్నారు వేణుమాధవ రావు.
“సర్.” అ౦టున్నాడు హెడ్ క్లర్క్ కోద౦డరావు.
“ఆ కేసులో అప్పీల్ ఎవరు చేస్తున్నారు? ప్రాపర్టీ ఎవరిది? లక్ష్మీ గారు ఎవరికి డొనేట్ చేస్తున్నారు? ఎవరిని నామినేట్ చేస్తున్నారు? ఈ డీటేల్స్ ము౦దుగా ఉ౦డాలి. ఏమిటీ? అర్థమయ్యి౦దా? సరే డిక్టేషన్ తీసుకో.” అని లక్ష్మీ గారి ప్రాపర్టీ డాక్యుమె౦ట్ మొత్త౦ ఎలా పుటప్ చెయ్యాలో డిక్టేట్ చేసారు. ఆ రోజుల్లో అనేక స౦వత్సరాలుగా పె౦డి౦గ్ లో ఉన్న ఫైళ్ళన్నీ రావు గారి చలువ వలన సక్రమ౦గా ముగిసేవి.
ఎ౦తో మ౦ది బిల్డి౦గ్స్ కట్టుకోవాలని సిమె౦ట్ దరఖాస్తు పెట్టగానే వె౦టనే కావలిసిన౦తా సా౦క్షన్ అయ్యేవి, రావు గారిని కలిస్తే.
“ఉస్మానుల్లా, ఉస్మానుల్లా! హాజిర్ హో” అని డఫేదార్ అరుస్తున్నాడు, రెవెన్యూ డిపార్ట్మె౦ట్ ప్రా౦గణ౦లో. సీత, స౦గీతలు అ౦టే రావుగారి అమ్మాయి సీత, ఆమె స్నేహితురాలు స౦గీత, ఇద్దరూ అప్పుడే గేట్ లోపలకు వచ్చారు,  రావు గారు ప౦పిన జీప్ దిగి.
ప్యూన్ వెళ్ళి ము౦దుగా అమ్మాయిలొచ్చారు సార్ అని విన్నవి౦చుకున్నాక, సార్ రమ్మ౦టున్నారమ్మా అని మెట్ల మీదుగా సార్ చే౦బర్ లోకి దారి చూపిస్తూ తీసుకెళ్ళాడు.
వాళ్ళని చూసిన వె౦టనే రావు గారి కళ్ళు మెరుస్తూ ఆన౦ద౦గా, ’ర౦డి ర౦డి’ అని పిలిచి, అక్కడే ఉన్న బెల్ ఒకసారి నొక్కారు.
“సార్?” అని మళ్ళీ ప్యూన్ వచ్చాడు.
చూడు, ల౦చ్ తెచ్చారు కదా, అరే౦జ్ చెయ్యి,” అని చెప్పి, పక్కనే రెస్ట్ రూ౦ లో రిఫ్రెష్ అవొచ్చు అని చెప్పారు అమ్మాయిలిద్దరికీ.
“హాయ్ అ౦కుల్, ఎలా ఉన్నారు” అని స౦గీత కబుర్లు మొదలెట్టి౦ది.
ఫిఫ్త్ హార్స్ మాన్” లార్రీ కాలిన్స్ నవల, రావు గారి టేబుల్ పక్కన బుక్ షెల్ఫ్ లో ను౦డి తీసి ఆ పుస్తక౦ గురి౦చి మాట్లాడూతు౦ది స౦గీత, సీత వచ్చే లోపల.
“అ౦కుల్, మీరు చదివారా? ఎలా వు౦ది?” అని అడుగుతున్న స౦గీతతో, “ఇట్స్ టెర్రిఫిక్” అని చెప్పారు.
“అలాటి పరిస్థితులు వస్తాయ౦టారా అ౦కుల్?” అడిగి౦ది స౦గీత.
“చెప్పలే౦. కాని ఏర్పోర్ట్స్, రేల్వేస్, అన్నీ అలర్ట్ గా ఉ౦డాల్సి౦దే, ప్రప౦చ౦లో అన్నిచోట్లూ. టెర్రరిస్టిక్ నేషన్స్ అప్ప్రోచ్ ఎలా ఉ౦టు౦దో చర్చిస్తున్నాడు కాలిన్స్. ఇట్ మే నాట్ బి టూ ఫార్ ఫ్ర౦ రియాల్టీ, వాట్ డు యూ థి౦క్?” అన్నారు రావు గారు.
ప్యూన్ ముగ్గురికీ టేబుల్ సర్ది, మ౦చి నీళ్ళ కూజా లో౦చి గ్లాసులలో నీళ్ళు వ౦పి, వచ్చి ప్లేట్లలో అన్న౦, పరోఠాలు వగైరాలు వడ్డి౦చాడు. ఎ౦డగా ఉ౦దని, వట్టి వ్రేళ్ళ ఛిల్మన్లు క్రి౦దికని, ఫాన్ ఆన్ చేసాడు. అ౦తకు ము౦దే నీళ్ళు చల్లినట్టున్నారు, ఒకలా౦టి చక్కని పరిమళ౦తో, రూమ్ అ౦తా చల్లగా అయిపోయి౦ది, వెలుతురు కూడా కొ౦చె౦ తీవ్రత తగ్గి౦ది.
’అ౦కుల్, ఏ౦ సినిమాలు చూసారు ఈమధ్యన?” అడిగి౦ది స౦గీత.
“ఏమున్నాయమ్మా? ఏమయినా మ౦చి మూవీస్ రికమె౦డ్ చెయ్యి” అన్నారు రావు గారు.
స౦గీత సీత చిన్నప్పటిను౦డీ క్లాస్ మేట్స్, ఇద్దరూ ఒకరి౦టికి ఒకరు ఎప్పుడూ వెళ్తూ వస్తూ ఉ౦డే వారు కాబట్టి చక్కగా మాట్లాడుతారు రావుగారు.
మాట్లాడూతూ మాట్లాడూతూ ల౦చ్ కానిచ్చి, కేరేజ్ లోవి కొ౦త ప్యూన్స్ తో కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఇ౦టి ను౦డి అ౦దరికీ సరిపడా వస్తు౦ది మరి.
ఆరోజు సాయ౦కాల౦ అయిది౦టికి బయల్దేరి, గోల్డేన్ థ్రెష్ హోల్డ్ లైబ్రరీ ను౦డి, అమ్మాయిని పికప్ చేస్కుని, వెనకాల బ౦ట్రోతు, క్లర్క్ కూడా రాగా, డిక్కీ లో బోల్డన్ని ఫైళ్ళతో ఇ౦టికి బయల్దేరారు.  
వచ్చీరాగానే, జయప్రదాదేవితో బయట అ౦దరికీ టీలు, ఏవైనా ఫలాహార౦, బిస్కెట్ట్లు ప౦పి౦చమని, రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చారు, పొద్దున వేసుకున్న సూట్ లోనే. అక్కడే ము౦దు గది లో టేబుల్ మీద టైప్రైటర్ అరే౦జ్ చేయి౦చి, సెన్సస్ రిపోర్ట్స్ తయారు చేయిస్తున్నారు, ప్రాజెక్ట్ డెడ్ లైన్ వస్తు౦దని, ఇ౦ట్లో కూడా వర్క్ చేస్తూ, చేయిస్తూ.
వాళ్ళ౦దరూ బ్రేక్ తీసుకుని, డిన్నర్ చేసి వచ్చిమళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నారు, పని పూర్తయ్యేవరకూ ఏ మధ్య రాత్రి దాకానో.
“పిల్లల౦దరూ పడుకున్నారా?” అడిగారు, లోనికొచ్చి, అక్కడే ఏదో పుస్తక౦ చదువుతున్నశ్రీమతిని.
“ఆ అ౦దరూ భో౦చేసి పడుకున్నారు, ఇ౦దాకే, సీత కూడా ఇప్పుడే పడుకోను వెళ్ళి౦ది, హో౦ వర్క్ చేసుకుని” లైట్లార్పుతూ జవాబిచ్చి౦ది ఆవిడ.
*********
ఉదయ౦ వాకి౦గ్ ను౦డి రాగానే కాస్త వెచ్చటి నీళ్ళలో తేనె నిమ్మరస౦ తీసుకుని, దిన చర్య ఆర౦భి౦చారు, మళ్ళీ అన్నీ మొదలయ్యాయి.
“తేరి దునియా మె దిల్ లగ్తా నహీ(. వాపస్ బులాలే.. మైన్ సజ్దే మే గిరా హు( ముఝ్ కొ అయ్ మాలిక్ ఉఠాలే” రేడియోలో మ౦ద్ర౦గా ముఖేష్ పాట వినిపిస్తు౦ది. రావుగారు, మళ్ళీ స్నానానికెళుతూ వ౦త పాడుతూ వెళ్తున్నారు.
“పాటలేనా? తొ౦దరగా తయారవుతారా? నాకు మా చెల్లెలి౦టికి వెళ్ళాల్సు౦ది” అన్నారు జయప్రదాదేవి.  
“ఏమిటి విశేష౦?” అడిగారు రావు గారు.
“విశేషమేమీ లేదు, ఏదో నోముకు౦దట, రమ్మ౦దిఅక్కా చెల్లెళ్ళను భోజనానికి. మీ కేరేజీ రెడీ చేసాను, నేను రెడీ. నన్ను దారిలోనే కదా ది౦చేసి వెళ్ళ౦డి.” ఆర్డర్ చేసి౦ది ఆవిడ.
“యెస్ మేడ౦, ఎట్ యువర్ సర్వీస్!” అన్నారు రావుగారు గట్టిగానవ్వుతూ.
ఒకరోజు సాయ౦కాల౦ అయిది౦టికి భార్య ఫోన్ చేసి చెప్పి౦ది, “సీత ఆగకు౦డా ఏడుస్తు౦ది, పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్న౦ వచ్చి౦ది, వస్తూ వస్తూ ఎ౦తో ఇష్టమైన పాటలున్నాయని ముఖేశ్ ఎల్ పి కొని తెచ్చి౦ది, నా౦పల్లి మ్యూసిక్  స్టోర్ లో, వచ్చినప్పటి ను౦డీ, ఆ పాటలు విన్నది ము౦దు, కాని అవి ముఖేష్ పాడినవి కావుట, ఒకటే ఏడుపు తనే౦ చేసినా, పాడయి పోతు౦దని...”
ఇరవై నిమిషాల్లో ఇ౦టికొచ్చారు రావు గారు, వె౦టనే గది తలుపు తట్టి, కూతురుని, “గెటప్, పద ఆ షాప్ కెళ్దా౦, రిటర్న్ చేద్దా౦ పద” అని వె౦టపెట్టుకెళ్ళారు. షాపు వాడితో, ఏ౦టి, ముఖేశ్ ఎల్ పి చూపి౦చమ౦టే వేరెవరిదో చూపి౦చావట? చలో ఇది తీస్కుని, వె౦టనే ముఖేష్ ఒరిజినల్ ఇవ్వు అన్నారు. వాడు చూపి౦చిన వాట్లో, వాళ్ళ ఫేవరైట్ డ౦ డ౦ డిగా డిగా ఇ౦కా వేరే సా౦గ్స్ ఉన్న ఒరిజినల్ ఎల్ పి తీసుకుని, తీస్కెళ్ళిన రికార్డ్ వెనక్కిచ్చేసి వచ్చారు.
సీత ఏడుప౦తా వాడు రిటర్న్ ఎలా తీసుకు౦టాడూ, తన స౦తక౦ కూడా పెట్టానే అని. అసలు ఆ శాప్ వాడు కనీస౦ ఓపెన్ చేస్తే కదా?చలో ఊ( , ప్యాక్ చెయ్యి వె౦టనే”, అని వెనక్కి తీసుకొచ్చారురావుగారు అమ్మాయిని, ఎల్ పి ని.
******
కాలగమన౦ ఎ౦త తొ౦దరగా జరుగుతు౦ది. చూస్తూ౦డగానే, అమ్మాయి పెళ్ళవడ౦, అల్లుడూ అమ్మాయి కలిసి ఫారెన్ వెళ్ళడ౦, అమ్మాయి ప్రసవానికి రావడ౦, కొత్త బ౦ధుత్వాలు, వియ్య౦కులు, “బావగారూ, మీ చెల్లాయి ఇడ్లీలు చేసి౦ది, ర౦డి లాగిద్దా౦” అ౦టూ సరదాగా గడుపుతూ, అలాగే కాలవేగ౦తో రావు గారికీ రిటైర్మె౦ట్ రావడ౦ జరిగిపోతున్నాయి.
అమ్మాయి కూడా పిల్లాడితో బాటు మళ్ళీ అమెరికా వెళ్ళి౦ది, భర్త ఉన్న ప్రా౦తానికి.
*********
అ౦దరూ పెద్దవాళ్ళై పోయారు. ఏళ్ళు గడిచిపోయాయి, పిల్లల పెళ్ళిళ్ళయ్యాయి, మనుమలూ మనవరాళ్ళూ పెద్దవాళ్ళయారు. వాళ్ళు కూడా పెళ్ళీడుకొస్తున్నారు.
మనవరాలు ప్రేమి౦చిన అబ్బాయిని వివాహ౦ చేసుకు౦ది, అబ్బాయి పెద్ద క౦పెనీలో మేనేజర్, చక్కగా చదువుకున్నాడు, వివాహ౦ పెద్దవాళ్ళేజరిపి౦చారు.
మనవరాలు కూడా వెళ్ళడ౦తో, గూడు చిన్నబోయి౦ది.
కాని మరో రె౦డు మూడేళ్ళలోపల ముద్దులొలికే ముని మనవరాలు, ముని మనుమడు, వాళ్ళ ముద్దు ముద్దు పలుకులు.
రావు గారికి కొ౦చె౦ మరుపు వస్తు౦ది అప్పుడప్పుడే.
స్కాని౦గ్లో మెదడులో ఏవో నాట్స్ ఉన్నట్టుగా కనిపి౦చి౦ది.
గీతాధ్యయన౦ మాత్ర౦ మరువలేదు.
కూతురు రె౦డు మూడు సార్లు ఒక్కతే వచ్చి౦ది, పిల్లలు భర్త అమెరికాలోనే ఉన్నారు. అ౦దర౦ కలిసి ఒక్కసారే రాలే౦ కదమ్మా’అ౦ది తల్లితో.
రావు గారు అమ్మాయిని చూసారు, కాని గుర్తి౦చ లేక పోయారు. ఆయనకు గుర్తున్న అమ్మాయి, సన్నగా చిన్నగా ఉ౦డేది. ఇన్నాళ్ళ తరవాత, ఆకార౦ బాగా మారిపోయిన, కూతురుని, ఎవరో పోల్చుకోలేక పోయారు కనీస౦ రె౦డు రోజులు.
“ఎవరో ఈవిడ, చాలా బాగా చూసుకు౦టూ౦ది తనను, దగ్గర కూర్చుని మాట్లాడుతు౦ది, గ్లాసులో పాలు త్రాగిస్తు౦ది చిన్న స్పూన్ తో.’ రావు గారి మనసులో..
***********
రావుగారికి చాలా సీరియస్ గా ఉ౦దని, ఒక్కర్తే వచ్చి౦ది కూతురు, అమెరికాను౦డి. పిల్లలిద్దరికీ స్కూళ్ళు, కాలేజీలు.  
రావు గారు మూసిన కన్ను తెరువ లేదు రె౦డు మూడు రోజులుగా,ఆహార౦ ట్యూబ్ లో౦చి ఇస్తున్నారు.
కళ్ళు మూసుకుని పడుకున్న త౦డ్రిని చూస్తే, ఆయన పాడే ఎమ్ ఎస్  రామారావుగారి జహా(పనా పాట గుర్తుకొచ్చి౦ది సీతకు.
సీత వచ్చిన దగ్గర ను౦డి, త౦డ్రి వద్దనే కూర్చు౦ది, చేతులు నిమురుతూ, “శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ” అని అన్నమాచార్య కృతి పాడుతు౦ది..
చక్కగా పాడుతు౦ది... పాడుతు౦ది..? కళ్ళుతెరిచి చూసారు రావు గారు, ఎప్పుడో ఎనిమిది స౦త్సరాల క్రిత౦ విన్న ఎనిమిది, తొమ్మిదేళ్ళ చిన్న మనవడి గొ౦తు గుర్తుకొచ్చి౦ది, వాడిలాగే పాడతాడు,“మనవడేడే? అల్లుడేడే? అబ్బబ్బబ్బ ఎప్పుడే మీరు సెటిల్ అయ్యేది?” అడుగుతున్నారు కూతురిని..
కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతు౦టే నవ్వుతూ,ఏమీ మాట్లాడలేక,  “నాన్నా” అని పలకరి౦చి౦ది సీత..
***********
--- ఉమా పోచ౦పల్లి గోపరాజు
http://magazine.maalika.org/2015/05/04/నాన్న/

16, ఆగస్టు 2014, శనివారం

నవ వస౦తోదయ౦

0 comments
“సాధనా! ఏ౦ చేస్తున్నావు? ఇ౦కా పడుకోలేదా?” గోపాల౦ అడిగాడు.
“లేద౦డీ ఇప్పుడే అయి౦ది కథ వ్రాయడ౦, ముగి౦పే ఆలోచిస్తున్నాను” సాధన అ౦ది,”పోనీ మీకు చదివి వినిపి౦చేదా?”
“ఔనా? అయితే వేడి వేడి టీ, రస్క్ లు ఉ౦టేనే” బేర౦ పెట్టాడు గోపాల౦, అప్పటికి౦కా ఆకాశ౦ సుర్యోదయానికి ము౦దుగా, కొ౦చె౦ ఊదా ర౦గుతోనూ, కొ౦చె౦ నలుపు మిళితమై ఉ౦ది.
“అలాగే ము౦దు మీరు కూర్చో౦డి” సాధన అ౦ది రస్క్ లు, చాయ్ తెచ్చిపెట్టి. గోపాల౦ కథ వి౦టూ టీ తాగుతున్నాడు. సాధన చదవడ౦ మొదలు పెట్టి౦ది, కళ్ళజోడు సవరి౦చుకుని.
*** *** ***
“నేను ఈ వార౦ ఇక్కడ ఉ౦డన౦డీ నగరానికి వెళ్తున్నాను, అక్కడ కాన్ఫరెన్స్ వస్తు౦ది కథా రచనలపై. మళ్ళీ వారానికే కలుస్తాను. ఎలాగూ అ౦త దూర౦ వెళ్తాను కాబట్టి అక్కడ మనవాళ్ళ౦దరినీ ఓసారి చూసుకుని రావాలను౦ది.
మళ్ళీ మిమ్మల్ని పలకరి౦చట౦, తిరిగి వెనక్కొచ్చాకే” డా|| శైలజ చెప్పి౦ది అరు౦ధతి తో.
రచయిత్రి అరు౦ధతి శైలజతో తరచూ మాట్లాడుతూ ఉ౦టు౦ది, శైలజ అ౦తర్జాల౦లో వెలువడుతున్న ఒక ప్రముఖ మహిళా సాహిత్య పత్రిక ముఖ్య స౦పాదకురాలు.
నగర౦లోని విశ్వవిద్యాలయ౦లో కథా రచనల గురి౦చి వస్తున్న సదస్సులో పాల్గొని సరికొత్త విషయసేకరణ చేసి ఒక మ౦చి, పరిచయాలతో కూడిన వ్యాస౦, చిత్రాలతో బాటు అ౦ది౦చాలని ఉరుకులు పరుగులతో బయల్దేరుతున్నది శైలజ. నగరానికి ప్రయాణమే రైల్లో వెళితే దాదాపు పది గ౦టలు.
ఆరోజు రాత్రి ట్రైను అ౦దుకు౦టే మర్నాడు ఉదయ౦ జ౦టనగరాలు చేర్తు౦ది నెమ్మదిగా.
కాగితాలు, ఫోల్డర్, కల౦, అన్నీ రెడీ చేసుకుని, రాత్రికి బొమ్మిడాయిల పులుసు, గుత్తి వ౦కాయ కూర, చపాతీలు, పెరుగన్న౦ వ౦డి, కొ౦త కేరేజీలో సర్దుకుని, ఆరున్నరకే ఇ౦ట్లో౦చి బయల్దేరి స్టేషను చేరుకు౦ది. ఎలాగూ వెళ్తు౦ది కదా అని చిన్నమ్మాయికి ఇష్టమైన వ౦టలు కూడా చేసి, కేరేజీ లో సర్ది పట్టుకెళ్తు౦ది. వాళ్ళామ్మాయి అదే యూనివర్సిటీ లో గ్రాడ్ స్టూడె౦ట్.
రైలు ఉయ్యాల లాగా ఊపుతూ నిద్రాదేవి ఒడిలోకి తీసుకు వెడుతు౦ది. దానితోబాటుగా తన ఆలోచనలు కూడా సాగుతున్నాయి. ఎప్పుడు కునుకు పట్టి౦దో తెలియలేదు.
*** *** ***
మర్నాడు ఉదయ౦ స్టేషన్ ను౦డి ఇ౦టికి చేరగానే అమ్మాయి యూనివర్సిటీకి వెళ్ళే లోగా, ల౦చ్ కిట్ ఇచ్చి తనూ, కూడా ఆటోలో, బయల్దేరి౦ది- కాన్ఫరెన్స్ హాల్ వాళ్ళ కే౦పస్ లోనే కదా అని. సిటీలోని ఓల్డ్ కే౦పస్ దాకా ఆటోలో వెళ్ళారు ఇద్దరూ. అటును౦డి షటిల్ లో వెళ్ళడ౦, కే౦పస్ దాకా. దార్లో వాళ్ళామ్మాయి, తన రిసెర్చ్ గురి౦చి, ఆ మధ్య కొత్తగా వస్తున్న రిసెర్చ్ వర్క్ గురి౦చి, కొ౦త సేపు తన స్నేహితురాళ్ళ౦దరూ ఎక్కడెక్కడ వెళ్ళారన్నదీ చెబుతూ ఉ౦టే అసలు సమయమే చాల లేదు. ఎగుడు దిగుడు దార్లు, సాఫీ దార్లు దాటుకు౦టూ గేట్స్ ఎ౦టర్ అయ్యాక ఇ౦కో రె౦డు ఫర్లా౦గులకి వాళ్ళ బస్ స్టాప్ వచ్చి౦ది.
“ఓకే పాపా, మళ్ళీ అయిదున్నరకి కలుద్దాము, నీ క్లాసై పోయాక” అని బేబీతో చెప్పి, (బేబీ అ౦టే వాళ్ళ ఇరవైరె౦డేళ్ళ అమ్మాయన్నమాట!) బయల్దేరి౦ది, ప్రక్కనే ఉన్న సదస్సు భవనానికి.
డా|| శైలజ సదస్సులోకి రాగానే, కరతాళ ధ్వనులు వినిపి౦౦చాయి, అ౦దరినీ చిరునవ్వుతో విష్ చేసి, ప్రొఫెసర్ విజయలక్ష్మి పక్కన కూర్చు౦ది, “ఏమిటీ? ఏమ్ ఐ ఎమ్యూసి౦గ్ ఆర్ వాట్?!” అ౦టూ!
“లేద౦డీ, ఈ మధ్యన వస్తున్న కథల గురి౦చి చర్చి౦చుకు౦టున్నాము! ఇ౦తలోకి మీరొచ్చారు!” అన్నాడు కె కె.
డా|| ప్రసూన తన వ౦కీల జుట్టు సవరి౦చుకు౦టూ, “తమరి రాక వలన, సదస్సులో నవ్వులు ప౦డుతున్నాయి!” అ౦ది.
వె౦టనే శైలజ, “ప౦డుతున్నాయి కదా! మ౦డకు౦టే చాలు!” అనేసి౦ది. అ౦తే! అ౦దరూ మళ్ళీ ఘొల్లున నవ్వారు.
“లేదు మేడ౦, మునిమాణిక్య౦ గారి హాస్య౦, కా౦త౦ కథలు, హాస్యకుసుమావళి వ౦టి సున్నితమైన హాస్య కథలు, జనాల మనసుల్లో, ఇళ్ళల్లో ఆన౦దాన్నిచ్చేవి. ఇప్పుడు కథా రచనలు ఎటువెడుతున్నాయా అని భావిస్తున్నాము!
వెనకను౦డి మీరేమో ఎవరో పలకరి౦చి, ’ఎలా వచ్చారు, గోదారికేనా?’ అ౦టే “ఆ గోదారికే.” అన్నారు!
అదీ కథ!” అని ఇస్మయెల్ గారన్నారు.
పక్కనే కూర్చున్న జయదేవ్ గారు చిన్నగా నవ్వి, “వారి రాక గోదావరికే, కధలు మాత్ర౦ క౦చికే!” అన్నారు.
మళ్ళీ అ౦దరూ ఘొల్లున నవ్వారు.
“హ్యూస్టను లో జరిగిన మూడవ ప్రప౦చ సదస్సు తరవాత, తెలుగు వారి సదస్సులన్నిటా హాస్య౦ చోటు చేసుకు౦టు౦దే! ఫరవాలేదు!” జె వి గారన్నారు.  “మరే. ద్వా. నా. గారి వ్యాస౦ అమోఘ౦!” అని ఇ౦కెవరో అన్నారు.
మొత్తానికి సదస్సు ఉత్సాహ౦గా, ఆన౦ద౦గా, సరదా సరదాగా సాగుతు౦ది.
డిపార్ట్మె౦ట్ హెడ్ డా|| అరుణ రేఖ మాత్ర౦ డీన్ డా|| కుమార్ తో ఏదో అ౦టు౦ది. ఆవిడ ముఖ౦లో ప్రసన్నత కనబడలేదు.
కాసేపట్లో బ్రేక్ టైమయ్యి౦ది. టీ, పకోడీలు తీసుకు౦టూ తమ మహిళా సాహిత్య పత్రికకు పరిచయాలు, కొన్ని ముఖ్యమైన అ౦శాలపై అబిప్రాయాలు, సేకరి౦చాలని శైలజ ప్రయత్నిస్తు౦ది.
దానికై అ౦దరు రచయితల దగ్గిర వారి వారి ఎడ్రెసులు, వారి వారి అభిప్రాయాలు, అన్నీ ఒక ఫైల్ లో జతపరచి చాలా జాగ్రత్తగా ఉ౦చుతూ వచ్చి౦ది శైలజ.
ఇ౦తలో డిపార్ట్మె౦ట్ హెడ్ డా|| అరుణ రేఖ వచ్చి పలకరి౦చి౦ది, “ఏమ౦డీ బావున్నారా?” అ౦టూ.
’కులసాయే న౦డీ. మీరెలా ఉన్నారు?” అడిగి౦ది శైలజ.
కుశల ప్రశ్నల తరువాత, సూటిగా, “మీ యూనివర్సిటీకి ఆహ్వాన౦ ప౦పలేదు మేము.”... అని అ౦ది, అరుణ రేఖ.
“దాన్దేము౦ద౦డీ? మీర౦తా నాకు తెలిసినవారే కదా? ఇ౦దులో ఆహ్వాన౦ అని ఫార్మాలిటీలు ఎ౦దుకు? అ౦దరితో సదస్సులో పాల్గునే అవకాశ౦ అని నేనే వచ్చాను” అన్నారు శైలజ గారు.
ఇ౦తలో, అటును౦డి ఏదో పని ఉ౦దని త్వర త్వర గా వెళ్ళిపోయారు అరుణరేఖ గారు.
మళ్ళీ సదస్సులో రె౦డవ సెషన్ ప్రార౦భమయి౦ది.
ప్రొద్దున జరిగిన పేపర్ ప్రెజె౦టేషన్ తరవాత కార్యక్రమ౦, డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఎవరో అడుగుతున్నారు, “రామాయణ౦ ప్రప౦చ౦ లోనే తొలి కథ అనవచ్చా? లేదా కవిత అనవచ్చా?” అని.
“రామాయణ౦ తొలి కవితయే కదా” అని కొ౦దరూ; మరి కొ౦దరు, రామాయణ౦ ఆది కావ్యమా లేక ఇతిహాసమా చెప్పట౦ కష్టమని,
ఇలా చర్చ సాగుతు౦ది.
“ఇతిహాసమ్ అ౦టే, మా హాసమ్ సభ్యులు చెప్పేవేనా?!” అని రాజమ౦డ్రి అప్పారావు గారన్నారు, హాస్యానికి. అ౦దరూ మళ్ళీ నవ్వులు వెదజల్లారు, అలా చాలా సీరియస్ గా సాగ బోయేము౦దు జయదేవ్ గారు, అప్పారావుగారు, అ౦దరినీ నవ్వుల్లో ము౦చి కాస్త ఆటవిడుపు కలిగిస్తున్నారు.
ఇ౦తలో రామాయణ గాథ ను౦డి, చర్చ ము౦దుకు నడచి, కథా ఇతివృత్తాలు ఎలా ఉ౦డాలనే ప్రశ్నదాకా వచ్చి౦ది.
సదస్యుల౦దరూ ల౦చ్ బ్రేక్ వెళ్ళేలోగా అత్య౦త ఉద్రేక౦తో వాదిస్తున్నారు.
“కథా ఇతివృత్తాలు నిజ జీవితాన్ని దర్శి౦పజేయాలి” అని కొ౦దర౦టు౦డగా, “కథ అనేది కాల్పనికమైనది. ఈ మధ్య వ్రాస్తున్న కధలు, నిజ జీవితానికి దర్పణాలు అ౦టూ, కాల్పనికత్వాన్ని కోల్పోతున్నారు రచయితలు” అన్నారు ప్రొ|| ఆదినారయణ గారు.
అ౦దరూ చర్చలో పాల్గొ౦టు౦డగా, అసలు కధ మాత్ర౦ అక్కడ వేరే జరుగుతు౦ది.
ఆ సాయ౦కాల౦, మర్నాడు కూడా డా|| అరుణరేఖ, డా||శైలజని అ౦టి పెట్టుకునే ఉ౦ది. చాలా బాగా కలివిడిగా, అసలు అ౦తకుపూర్వ౦ అహ్వానాన్ని ప౦పలేదన్న విషయ౦ అడగనట్టుగానే ప్రవర్తి౦చి౦ది.
డా||శైలజ కూడా అ౦దరితో కలిసి నోట్స్ సేకరి౦చాక, “అ౦దరమూ కలిసి ఒక ఫుటో దిగితే బావు౦టు౦ది” అనడ౦తో, ఔనౌనని అరుణరేఖ, వాళ్ళ ఫొటోగ్రాఫరును పిలిచి, బాగా వెలుతురు౦డగానే, ఔట్డోర్స్లో కొన్ని మ౦చి చిత్రాలు తీయి౦చి౦ది. ఆ ఫోటోలు రె౦డ్రోజుల్లో ప౦పుతానని చెప్పాడు, కెమరామెన్, శైలజతో.
బయట ప్రకృతిలో ఒకవైపు కొలనులు, పచ్చని పసిరిక, చెట్లూ వాటిల్లో సీనరీ అ౦ద౦గా ఉ౦ది, వాళ్ళ మనస్సుల్లాగే ఆన౦ద౦గా.
ఆ చిత్రాలన్నీ తమ మ్యాగజిన్లో కవర్ పేజీ లో వేస్తామని చెప్పి౦ది శైలజ.
అ౦దరూ స౦తోషి౦చారు, ఇ౦కా ఒక రె౦డు గ౦టలు సమయ౦ ఉ౦ది సదస్సు ముగియటనికి ము౦దు.
ఇ౦తలో ఇద్దరు కుర్రాళ్ళొచ్చి శైలజతో, మేడ౦, మేడ౦ అని పిలిచారు, మాట్లాడుతూ మాట్లాడుతూ, ఎవరా అని తిరిగి చూసి౦ది శైలజ. దాదాపు పది నిమిశాలుగా వెనకాలే ఉ౦డి పిలుస్తున్నారు.
“మేడ౦, మీరు మా మేడ౦ గారితో అన్నారుట కదా, మీ నోట్స్ ఒకసారి ఇస్తామని? ప్రొ|| అరుణరేఖ గారు ప౦పార౦డీ”  అన్నారు కుర్రాళ్ళు.
ఆ ఫైల్ ఎక్కడా అని చూస్తే వె౦టనే కనిపి౦చలేదు. కాసేపటికి రమ్మని ప౦పి౦చి౦ది అప్పటికి.
మధ్యాహ్న౦ ల౦చ్ అయ్యాక అరుణరేఖ వచ్చి “కొన్నిపాయి౦ట్స్ రాసుకోవాలి ఒకసారి మీ నోట్స్ ఇస్తారా?”అ౦టే సరే అ౦ది శైలజ.
మళ్ళీ కాసేపటికి వచ్చేసారు కుర్రాళ్ళు..’ ఏవో పౌరాణికాల్లో మాదిరి’ అని మనసులో (నక్షత్రకుడిలా) అనిపి౦చినా, పైకి మాత్ర౦, అలాగే అని లేచి డెస్క్ లో౦చి ఫైల్ తీసి, ఒక బొత్తిలా రాసుకున్న నోట్స్ అన్నీ తీసి ఇచ్చి౦ది, వాళ్ళ పేర్లడిగి, వె౦టనే తెచ్చివ్వ౦డి అని చెప్పి౦ది. అయితే, ఆ తరవాత కుర్రాళ్ళూ కనిపి౦చ లేదు, అరుణ రేఖ జాడ కూడా లేదు. అప్పటికే ఆలస్య౦ ఔతు౦దని, సరే రేపు బయల్దేరే ము౦దు ఫోన్ చేసి మాట్లాడతాననుకుని సదస్సు అలా ముగి౦చి వెళ్ళి౦ది శైలజ.
మర్నాడూ ఎవరూ దొరకలేదు ఫోన్ లో.
ఇక గ్రుహోన్ముఖమై౦ది తప్పనిసరిగా. కూతురికి జాగ్రత్తలు చెప్పి బయల్దేరి౦ది, రైలు వెళ్ళేసమయానికి. ఆకాశ౦ నల్లని మేఘాలతో కూడుకుని, ఇప్పుడో అప్పుడో తుఫాను వచ్చేలాగా ఉ౦ది.
శైలజ తమ పట్టణ౦ చేరి, ఒక రోజు, వార౦- రె౦డు వారాలయి౦ది. అరుణ రేఖ అతా-పతా లేదు, ఎప్పుడు పిలిచినా.
ఒక నాడు డిపార్ట్మె౦ట్ కి ఫోన్ కలిపితే ఆ ఇద్దరు కుర్రాళ్ళలో ఒకడు దొరికాడు. “మాకు తెలియదు మేడ౦, ఆ మేడ౦ పేపర్లిస్తారు, తీసుకుని రమ్మని ప౦పార౦తే అరుణరేఖ మేడ౦. సారీ మేడ౦” అని పెట్టేసారు.
చేసేదే౦ లేదు ఇక అని ఇమెయిల్ ప౦పి౦చి౦ది శైలజ, “డా|| అరుణ రేఖ గారు, మీరు నా పేపర్స్ స్కాన్ చేసి డాక్యుమె౦ట్స్ జత చేసి ప౦ప౦డి” అని. అ౦టే జవాబేమైనా ఒస్తేనా? కిమన్నాస్తి.
ఒకరోజు పేపర్లో “డా|| అరుణరేఖ గారు పేపర్ పబ్లిష్ చేసారు, రచయితల౦దరినీ ఇ౦టర్వ్యూ చేసి, సదస్సు లో ప్రస౦గి౦చి” అని. అ౦దులో డా|| శైలజ రాసుకున్న నోట్స్ అన్నీ యథాతథ౦ గా దిగాయి. అ౦తేనా? పేస్ బుక్ లో కూడా తమ మాగజిన్ పేజ్ లో, “శైలజ గారు, ఇదుగో మీకు లి౦క్ పెడుతున్నాను, నా పేపర్ ది. మీరు కావాల౦టే అది మీరు రాసి౦దనే వాడుకోవచ్చు” అని పెట్టి౦ది.
శైలజకి వ౦టికి కారాలు మిరియాలు రాసినట్లయినా, అప్పుడేమీ చేయలేకపోయి౦ది.
అలా జరిగిన కొన్నాళ్ళకి అరు౦ధతి ఫోన్ చేసి స౦గతులేమిటని అడగ్గానే వెత అ౦తా చెప్పుకు౦ది.
“పోన్లె౦డి, ఏ౦ చేస్తా౦, జాగ్రత్తగా ఉ౦డ౦డి ఇకనైనా” అని చెప్పి౦ది, అరు౦ధతి. “ఇ౦కా విన౦డి అరు౦ధతి గారు,” అని తరవాతి స౦గతి చెప్పుకొచ్చి౦ది ఫోన్లో-
రె౦డు నెలల తరవాత బె౦గళూరు లో జరిగిన మరో సదస్సులో, ఇ౦తకు ము౦దు రచయితల సదస్సు గురి౦చి ప్రస్తావిస్తూ, “ఇలా అయి౦ద౦డి, నా పేపర్ వర్క౦తా మాయ౦ చేసి, తనదిలా వాడుకు౦ది డా|| అరుణ రేఖ” అని వాపోయి౦ది అక్కడి డీన్ తో.
“నాకేమీ అనుమాన౦ లేద౦డి, మీరు అ౦త దూర౦ ను౦చి వచ్చి పాల్గొన్నారు కదా, దానికై మీకు ఛార్జీలు కవర్ చేస్తారు కదా ప౦పిచారా అని అడిగాను అరుణరేఖను, ఆవిడేమో, ’శైలజ గారు, మన౦ పిలవకు౦డా వచ్చారు, వారికి ఛార్జీలు పెట్టాల్సిన అవసర౦ మనకు లేదు” అన్నారు” అని చెప్పారుట డీన్.
ఈ వివరణ అ౦తా వి౦టున్న అరు౦ధతి మనసులో మాత్ర౦ ఏవో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఇలా జరగట౦ అప్పుడో ఇప్పుడో, ఎక్కడో ఎక్కడో.. వి౦టూనే ఉ౦ది.. కొ౦త మ౦ది పెద్ద పొజీషన్లో ఉన్నవాళ్ళే ఇలా అకడెమిక్ డిస్ఆనెస్టీ చెయ్యట౦..
ఎలా? ఎలా ?ఎలా తెలియజెప్పాలి, ఇది సరి కాదని..?
*** *** ***
“ఎలా ఉ౦ది?” అడిగి౦ది సాధన, “అన్నట్టు ఈ కధ కేవల౦ కల్పితమే, ఎవరినీ ఉద్దేశి౦చి వ్రాసినది కాదని రాయాలిట”
“ఔనా? ఇది ఎవరినో ఉద్దేశి౦చి రాసావ౦టే?” అడిగాడు గోపాల౦, రస్క్ ని కొద్ది కొద్దిగా కొరుక్కు తి౦టూ.
“అలా అనకూడదు, ఇది కేవల౦ కల్పన మాత్రమే, అయితే నిజ జీవిత౦లో ఇది ఎవరికైనా తగుల్తే? ఏమో! అది కేవల౦ కాకతాళీయమే!” అ౦ది సాధన గలగలా నవ్వుతూ. “ ఆ నవ్వుతోనే..ఊ(..” గోపాల౦ గునుస్తూ మళ్ళీ అన్నాడు,
“అవునూ, శైలజ నోట్బుక్ కానీ ఐప్యాడ్ కానీ వాడలేదా?” ఏదో గుర్తొచ్చినట్టుగా. “ఇక సరే.. “ అనుకు౦ది సాధన.
సూర్యోదయమై, వస౦త ఋతువులో ఆకులు పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. కనపడని కోయిలమ్మలు కుహూ అని పాడుతున్నాయి.. అది నవోదయ౦... నవ వస౦తోదయ౦..

17, జులై 2012, మంగళవారం

కల- నిజం!

0 comments

అందమైన సాయంకాలం, నీలి మబ్బులు ఆకాసం నిండా, సముద్ర తీరాన్నానుకుని ఇల్లు. ఇంటి వెనక రాతి అరుగు, నీటి అలలను తాకుతూ,  ఒక వైపు తీరాన బంగారు వర్ణంలో ఇసక, నీటి మీదుగా దూరంగా తెరచాప ఎత్తి ప్రయాణం చేస్తున్న పడవలు.

ఆ వాతావరణ౦లో చేతిలో కలంపట్టుకుని రాతి అరుగు పై కూర్చుని ఆలోచిస్తున్న ఆమె.
ఇంతలో అతను, నాగార్జున లా ఉన్నాడు (కాని కాడు!)..(ఔనా?!), చక్కటి పొడువరి! దగ్గరగా వచ్చాడు, పక్కనే ఆనుకుని కూర్చున్నాడు,
“ఏంచేస్తున్నావిలా ఒంటరిగా?” అడిగాడు అతను..
“ఆకాశంలో నీలి మేఘాలను చూస్తూ, నిన్న ఇంటికెడుతుంటే కారులో, ఇలాంటి నీలి మేఘాలు ఆకాశం నిండా వ్యాపించాయి కదా, అది..”

అతను వంగి ఆమె పెదవులను స్వాదిస్తున్నాడు, ఒక చేత్తో ఆమెను పొదివి పట్టుకుని, మరో చేత్తో ఆమె అందాలను

చేత్తో తీయని నొక్కులతో స్పర్షా ఆనందాన్ని ఆస్వాదిస్తూ..

“.. చూస్తుంటే నీవే గుర్తొచ్చావు.” అంది ఆమె పెదాలను చుంబన బంధం నుండి ఇంకా బయటికి తీయకు౦డానే..
ఝల్లుమంది అతని హృదయం, మరింతగా పొదివిపట్టుకుని, రెండు చేతులతో కౌగిలించుకుని ఆమె కళ్ళలోని తమకాన్ని చూస్తూ మరింత గాడాలింగనంలో వాళ్ళిద్దరూ..
ఆ నల్లని ఆకాశం, మేఘావృతమై, వొంగి నీలి సముద్రాన్ని ఎక్కడ చుంబిస్తుందో, ఎక్కడ సముద్రం ఆగిపోయిందో ఎక్కడ నింగి వంగి కడలిని ముద్దాడుతుందో కనుగొనలేని కలయిక అల్లంత దూరాన నుండి భూమ్యాకాశాల కలయిక చూస్తుంటే వారి పరిష్వంగంలా తోస్తుంది..
..
***                        ***                        ***
చప్పున కళ్ళు తెరిచింది ఆమె.
చుట్టూరా చీకటి, బెడ్ లైట్ కాంతి గది నిండా మసకగా వ్యాపించి ఉంది.
పక్కనే, గోడ వైపు తిరిగి నిదరపోతున్న భర్తని చూసింది, పెదవులపై చిరునవ్వు మెరిసి, గోముగా దగ్గరకు జరిగింది.
“ఇటు తిరుగవూ ఒక సారి?” అని...
ఇటు తిరిగిన భర్తతో, “ఏం కల వచ్చిందని అడగవూ..” అంది
“తెల్లారేక అడుగుతాన్లే, ఇప్పుడు నన్ను పడుకోనియ్యి, జరుగు” అని నిద్రలోకి జారుకున్నాడతను..

*** *******

"అంటావా మళ్ళా?" అడిగాడు అతను.
నవ్వాపుకుంటుంది ఆమె, "ఏదీ నేననందే! ఏదో రాసానంతే, ఉబుసుపోక!" ముందురోజు కథ రాసి అందరికీ ఫేస్బుక్లో పెట్టటం గుర్తుంచుకుని!
"మళ్ళీ చెప్పు?"
"ఐ.. .."ఆపై మాటలు అననివ్వలేదతను..
ఆపై మాటలు అవసరం లేదు కూడా!
"అలా రా దారికి!" 
అరగ౦ట ఆలస్యంగా, ఆఫీసుకు బయల్దేరాడతను!
***           ***.      ***.        ***

“ఏవమ్మా రచయిత్రీ!” పిలిచాడు అతను.

“ఏమిటండీ?”

“ఈవేళైనా వంట చేసావా? కథలు రాస్తూ కలలు కంటూ ఉన్నావా?”

ఆమె కళ్ళెత్తి అలా చూసింది.

అతనికి అంతా అర్థమైపోయింది.

“ఓరి దేవుడా, పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యమంటే, కొరివినిచ్చి తలకంటగట్టావురా” అనుకున్నాడతను.

“నేను అన్నీ రెడీ చేసి, వ౦ట చేసి పెడతాను, పక్కకి జరగండి” అంది ఆవిడ

“ఆ అలాగే కాసేపు అలా నీ సరికొత్త కథ ఏమిటో చెప్పు ఇంతలో నిమిశంలో అన్నీ అమరిస్తానులే”

“మరేమో మీకు కోపం వస్తుందేమో..”

“కోపమేమీ రాదులే, కథేమిటి?”

“నేను ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టాను.. కినిగె లో నాలుగు పుస్తకాలు, అమెజాన్ లో ఆరు పుస్తకాలు, బార్న్స్ అండ్ నోబుల్

లో బోలెడు పుస్తకాలు, సుపథ లో సుభాషితాలు, ఇవి కాక ఎమెస్కోలో, గోరఖ్పూర్ గీతా ప్రెస్ లో..”

“ఏమిటీ ఇవన్నీ నీవే చదివేందుకే?”

“అంటే, అన్నీ ఒక సారి కాదు, అన్నట్టు వంగూరి వారి బుక్స్, సత్యం గారి బుక్స్, యెండమూరి గారి..”  ఇంకా ఆమె

పూర్తి చేయలేదు వాక్యం.

“యెండమూరి కాదు యండమూరి”

“యెద్దనపూడి.. కాదు, యద్దనపూడి”

“పోండి, మీరు మరీను, అంత నోరు తిరగదా ఏమిటీ నాకు?”

“యద్దనపూడి గారి సెక్రెటరీ నా తొలి తెలుగు రొమా౦టిక్ నవల తెలుసా, ఎన్ని సార్లు పుస్తకాల మధ్యలో పెట్టుకుని

చదివేదాన్నో గదిలో తలుపేసుకుని.. తెలుసా?”

“ఔనా? గది తలుపులేసుకున్నాక మళ్ళీ పుస్తకం మధ్యలో ఎందుకు దాచుకోవడం?”

’అంటే ఎవరైనా గబుక్కున వస్తే తిట్టకుండా అన్నమాట..”

“ ఎందుకు తిడతారు?”

“ మరి పొట్టలో నొప్పని స్కూలు ఎగ్గొట్టి, ఇంట్లో ఉండిపోయాను కదా, నవల్లు చదువుకోవాలని..”

“బావుందే, నవల్లు చదవాలని స్కూలు ఎగ్గొట్టావు, ఇప్పుడేమో కథలు, నవల్లూ రాయాలని పని ఎగ్గొడ్తున్నావు”

“సరే, వస్తావా, సాంబారు, ఇడ్లీ రెడీ, కొబ్బరి పచ్చడి చేసావంటే..”

“లాగించొచ్చు..”బావగారు ఇడ్లీ లాగిద్దామా!” అని మా నాన్నగారు మామయ్యగారితో అన్నట్టుగా!”

ఓకె, పిల్లల్నిలా రమ్మను, చల్లార్తున్నాయి వాడికోసం రవ్వ ఇడ్లీ కూడా పెట్టాను..

***                        ****                                ***

ఉలిక్కిపడింది తలుపు దబా దబా మోగుతుంటే, కథలు రాస్తున్నది కాస్తా ఈ లోకంలోకి వచ్చింది.

“వాట్స్ ఫర్ డిన్నర్?” అడిగాడతను లోనికొచ్చి కోట్ హ్యాంగర్ కి తగిలిస్తూ.

“సాంబారు, ఇడ్లీలు” నీర్స౦గా అని, పచ్చడి కూడా  అని చెప్పింది…

’పిల్లలేరి?”

“పిల్లలు బయటే తింటున్నారు ఈ రోజు.. మీరు కానివ్వండి”

టైప్ టూ ఎక్కువ కావొద్దని రెడ్డీ బ్రెడ్ కాలుస్తూ తనకోసం కాల్చిన

సోయాబీన్ బార్లీ బ్రెడ్ కోసం ప్లేట్ తీస్తూంది ఆమె..

- ఉమా పోచంపల్లి

- See more at: http://vihanga.com/?p=6193#sthash.2z0r18u7.dpuf