Bhavanalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhavanalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2021, మంగళవారం

చిన్న జీయరు సాములూ- మా సొద వినుండి మీరు

0 comments
ఏమి చెప్ప గలవారము చిన్న జీయరు స్వామీ?
తగునా మా బాస మీ బాసలన్ని తెలుప?
అ౦దాల మేడ అంట అద్దాల తలుపులంటా
తొమ్మిది దోరాల పొంటా రాను పోను దారులంటా

ఏమని చెప్పుదుము ఓ చిన్న జియ్యరు సాములూ?
నీలాల నింగి అంటా, నింగి వెంటా నీరంటా
జోరైనా గాలంటా, ఆకసాన మెరుపులంటా
అందని ఆకాసంలో నీరెట్లా నిలిచెనంటా?

ఏమని ఇవరింపగలము మా చిన్న జీయరు సాములూ!
ఎర్రాఎర్రని పూవంటా తూర్పున పొడిసెనంటా
రోజంతా నడిచి నడిచి పడమట కోనలకు బోవునంటా
ఎర్రాని పూవు వెంటా కమలాలు నవ్వునంటా

ఏమని అడిగేము మిము మా చిన్న జీయరు సాములూ!
ఆకలంటా, దాహమంటా ఆకులలములు దొరుకవంటా
తొమ్మిది నెలలు మోసి తాను మట్టిని మనిసి సేయునంటా
నీటిలోన మునిగే మడిసి అమ్మో! నీట నెట్టా బతికెనంటా?

ఏ విధి తలిచేము మిమ్ము ఓ చిన్న జీయరు స్వామీ!
దూరాన కొండలంటా, కొండలమీన దేవుండంట
దీనులను దానవులను ఒక్క తీరుగ బ్రోచునంటా
అడగకనే ఈడేర్చున౦టా, అడిగితే ఇంకేమనంటా!

ఎట్ట జెప్పమందురు ఓ చిన్న జీయరు స్వాములూ!
మెట్టినింట ఉన్నదంటా, తొల్త పంట కలిగెనంటా
నిండారా చూలాలంటా, కండా జవము లిచ్చెనంటా,
కన్నతల్లి సీతమ్మతల్లి అడవిపాలాయెనంట, అకటా!

ఏమని మిము పిలుతుము ఓ చిన్న జీయరు సాములూ!
మాపంటా రేపంటా పగలూ రేయి పబ్బమంటా,
చేతకాని వారమంటా జాతి మేలు తలవమంటా
మాయదారి మడుసులలో మతిలేదిదేమి తంటా?

ఏమని అడిగేము మిమ్ము ఓ చిన్న జీయరు సాములూ!
అలనాటి భూమి అంటా అంతా పంచుకున్నారంటా
పందెమాడ రమ్మని, ఉన్నదంతా వొల్చుకున్నారంటా
అంత సత్తా ఉండీ వారడవుల పాలయినారంటా

ఏమి చెప్పుకుందుమో చిన్న జీయరు సాములూ!
పంట చేల మందులంటా, పురుగులను దీసేస్తదంట
పురుగులు తోబాటే ఆరి పొలాల మట్టుబెట్టెనంట
పొలంగట్ల రైతన్నలు పురుగుల మందుతో పోయిరంట

ఏమి చెప్పమ౦దురు మా చిన జీయరు సాములూ!
పాములను చూస్తిమి, మడుసులను సూస్తిమింటా
పాముకున్న నియమాలు మడిసి మరిసి పోయెనంట
ఎన్ని సార్లు కాపాడెనో ఎంకటేసుడు మా వెన్న౦ట!

ఏమి చిత్రమో ఏమో మా చిన జీయరు సాములూ!
రాయంటా రత్నమంటా, రెంటి జూడ ఒకటే నంటా
సానపెట్టినంత గాని దాని ఇలువ తెలియదంటా
రాళ్ళల్ల రవ్వల వలె మెరిసె దొరా, తెలిసే దెట్లా?

ఏ ఇద్దెలు నేర్సుకోము మా చిన జీయరు సాములూ?
పెద్ద పెద్ద చదువులంటా పల్లెటూళ్ళ చేరెనంటా
ఉన్నోరికి లేనోరికి ఒక్కతీరు పాటాలంటా
పల్లెతల్లికి పనికొచ్చే తెలువులున్న మేలంటా

ఏ ఇసయం తెల్వాలే మా చిన జీయరు సాములూ?
బాసంటా ఊసులంటా, పనులంటా పనిముట్లంటా
చేతనైన వారికీ నెత్తికెక్కినంత సదూసందెలంటా
ఏతామేసే బడుగు మనిసికి మరి? నీ కాలు మొక్తా!


ఎంత చూసినా తీరదు చిన్న జీయరు స్వామీ!
నల్లాని మబ్బు వెంటా, తెల్లాని కొంగలంటా!
తెల్లాని కొంగల వెంటా, వీచే చిరుగాలి అంటా!
తెల్లారే దారి వెంటా, చిరుగాలికేల తొందరంటా!

ఏమి తెలుప మందురు ఓ చిన్న జీయరు స్వామీ!
అగాథమౌ గతం నుండి అగోచరమౌ భవిష్యత్తు
ఏదారెటు పోతుందో, ముందు గొయ్యి వెనుక నుయ్యి
మాపుచేసి ఈ కనికట్టు, సదా నడిపేది మీ చెయ్యి

ఎవరితొ మొరపెట్టుకోము చినజీయరు స్వామీ!
అన్నీ బాంధవ్యాలే అంతులేని ఆప్యాయతలె
అయినా ఈ మోసం ఈ దోసం దగా చేయు లోకం
ఎవరికెవరు లోకంలో ఈ అంధకార జగతిలో

ఏమని చెప్పుకోగలము చిన్న జీయరు స్వామీ!
పాతకాల నెన్నో చేసి పైకి శాంత మూర్తులం
ఇకనైనా ఓ దారి చూపి ఓదార్చు మహాత్ములు
మీరు దారి చూపకున్న మాకేది పాపనాశనం?

ఏమని వివరించగలము మా చినజీయరు స్వాములూ!
విదేశాల చదువులని దండిగ సంపద వచ్చునని
ఎండమావులకై వెంపర్లాడు మా మోడు జీవితం
మేపెడంత జీవన భారం మేయలేని అజ్ఞానులం!

ఎటుపోతున్నమో మేము ఓ చిన్న జీయరు స్వామీ!
ఆటు పోటులకు పడవ ఎటో కొట్టుకు పోతున్నది
గాడాంధకార బంధురమౌ ఏ కాళరాత్రో ఈ నిశి,
శరణు కోరితినిక మీరే దయతో తీరము చేర్చేరని!

ఏమని అందుము మా స్థితి ఓ చిన్న జీయరు స్వామీ!
పగలంతా పనులనీ కాకపోతె పనికిరాని కబుర్లనీ
రాత్రవగానే టివీ సీరియల్సు లేదా సినిమాలు
ఇంటిపని వంటపని ఇంతలోనె గుడ్ నయిటని!

ఎంతని విలపింతుము మేము, చిన్న జీయరు స్వామీ!
వదిలి వెళ్ళిన దశాబ్దానికి తిరిగి వచ్చినాము,
 వచ్చిన ప్రతిసారి ఎందరినో కోల్పోయినాము,
బంధుజనుల ఆత్మీయుల, నెందరెందరినో ఇలను

ఎంత తలచినా తీరదు ఓ గురువర్యా! చిన్న జీయరు స్వామీ!
వారిచ్చిన ప్రేమలు, మమతానురాగాలు, స్నేహ సౌశీల్యాలు,
సంస్కృతీ సౌరభాలు, సాహితీ సారస్వతాలు, చిన్ని చిన్ని
మాటలు, పాటలు, అంతులేని అభిమానాలు, దీవెనలు!

ఎంత పిచ్చివారము ఓ చిన్న జీయరు స్వామీ!
దేశమాత ఒడిదాటి ఉన్నత పాఠశాలలోన పట్టు
పట్టి పాఠ్యాంశాలను చదివి, పనికొరకు వెంపర్లాడు
బహు దిశలలో మేము, ఏ తీరున తీరునొ తపన

ఏమని ఓర్చుకుందుము చిన్న జీయరు స్వామీ
వేదాలూ భేదాలూ వేదాంతాలూ తెలియవు
రామాయణ భాగవతాదుల మీమాంసలు తెలియవు
బ్రతుకు బాటలోన చూచు బాధలేమొ వదలవు

ఏమని వివరింపగలము చిన్న జీయరు స్వామీ
కలయో కల్లయో కపటమో నిజమో  నిష్టూరమో,
దాహమో తాపమో, ఆకలో ఆతృతో, ఆర్ద్రతో
పాపమో పరిహారమో శరణు శ్రీరామ నామమొక్కటే

ఏమని వివరింపగలము చిన్న జీయరు స్వామీ, 
తెలుపగ వశమా మీ దయ హిమవన్నగమంతగా, 
దారి తెన్ను తెలియని మమ్ముధ్ధరించుటకు మీరు, 
పుణ్య ఫలములివ్వగ వేంచేసినారు, కర్మలు కడతేరగా

ఎంత తెలిపినా చాలదు మా ధన్యవాదములు స్వామీజీ!
జనమమెత్తి మరల మరల కూపస్థములవలె మేము!
మా జన్మను సార్ధకమొనర్ప వేంచేసినారు తమరు,
ఆచార్యా మీ తిరునక్షత్రం అత్యంత శుభదాయకం!
 
ఏమని రాయవలె ఈ వెతలను చిన్న జీయరు స్వామీ
మనుషులదే, మనసులవే, మాయమయమౌ లోకం
పాపం-పున్నెం తెలియని తమ్ముళ్ళు నావోళ్ళు
తల్లడిల్లకుండ కాపాడుమయ్య ఇవే మీకు వెయ్యి దండాలు

ఏట్ల చెప్పాలె మేము చిన్న జీయరు స్వామీ
కష్టమూ శ్రమా కావు కఠినమైనవి
నమ్మిన వాళ్ళే నమ్మకమును వమ్ము చేసినపుడు
అన్నినాళ్ళ సావాసం దేనికొచ్చినట్టు చెప్పరేమీ?

ఏతీరున బ్రోచెదరో చిన్న జీయరు సాములూ, 
చేతనైన నాడేమొ ఆట పాటలల్ల గడిపితిమి, 
పొద్దు పడమట మళ్ళే తలికి, తిరుగులేని సత్తేలు
మూడు కాళ్ళు ముందుకొచ్చె, కళ్ళు కానరావాయె! 

ఎటు దారి చూపుదరో మీరు, చిన్నజీయరు స్వాములూ,
కూపం వలెనే లాగుతున్న సంసారచక్రంలో జీవన యానం
వారం వారం కొలువైన రాముని ధ్యానమే  మరీచికయౌనే
మనుషులమనబడు మేము నిజముగ మనీషులమే, మేమే?

దాసోహాలు మీకు చిన్నజీయరు స్వాములూ
ఏ విధి గట్టెక్కగలమో మీ చల్లని దయ వినా
మా విధి నిర్వహణ ఎట్లున్నదో మీ కరుణా
మీ కృప యెల్లరకూ కొల్లలుండాల అడియేన్

తామసపు బ్రతుకులు మావి చిన్నజీయరు స్వామీ
సోమరితనం మూర్ఖత్వం అణువణువునా కలవు
కాపాడవె కరుణ తోడ త్రిగుణాలను సరిజేసి నీవు
కలనైనను నీ తిరుమంత్రం మరువనీకు గురుదేవా

అయ్యరో మా చిన్న జీయరుస్వామి మాకై వచ్చె
వెయ్యరో దరువెయ్యరో శాన్నాళ్ళాయెవారిని జూసి
కోయరో పంటచేలు కంకులన్ని కంటి నిండుగ నవ్వె
కాయరో మనుసులని, కట్టాలు బాప కైమోడ్స మీకె

అయ్యారె బల్ మన చిన్నజీయరు స్వామివోరు
కన్నతల్లి కన్న మిన్న మరల జలమ నిచ్చినారె
కొత్త కొత్త విద్దె లొసగి కొంగ్రొత్త నామ మిచ్చినారే
రైతుబిడ్డ రౌతు కొడుకు కడుపు సల్లంగుండాల

జెర చెప్పండ్రి ఎట్నో, బగమంతులు మా చిన్నజీయరు వోరూ
మాఘమాసం నెల నాళ్ళు, సంకురేతిరి సీకట్నే గోపెమ్మలంత
నల్లానల్లని యమునలోన మెల్లామల్లన గూడి తానాలనాడ
నల్లనయ్య, వెన్నదొంగా కోకలన్నీ మెల్లన దోచెనేల తెల్పరయ్య

ఒక్కరొక్కరు, అగో సూడండ్రి, చల్లని తండ్రి మా చిన్న జీయరు స్వామి వోరూ, 
గోపకాాంతలు చేతులెత్తి, దండం పెట్టి అడుగుతున్రు
అదిగో ఆ పచ్చచీర‌ అద్దకంతో నేసినాది, అది కాది, నాది నీలి సీర
నల్లనయ్యా నెమిలికంటిది, ఎర్ర రైకా తెల్లకోక ఇవ్వరో యని రోదిస్తూ

ఆ వంక జూడుండ్రి అయ్యా దేవా, చిన్న జీయరు స్వామీ
ఘనమైన కేశాలను వీపు నిండా జారవిడిచి అడుగుతుంది
ఆయమ్మి, గోపమ్మ తల్లిరో, కన్నయ్యా ఇదుగో నీకు అప్పుడే
తీసిన వెన్న పెట్టెదనంటా కటా కటా వొనుక్కుంట కట్ట సీరాలా నడిగే

ఏమి చెప్పుకోము స్వామీవోరు చిన్న జీయరు దయాళూ,
నగుకుంట నగుకుంటా గిట్ట నాలుగు మాటలే సెప్పిండ్రూ
నల్లానయ్యా గొల్లాభామల, నోములపంట నేను గాదాయనె,
పల్లరంగూ కేశాలను పైకంటా యని నెమిలిపింఛెం దోపుకోని

అంతలోనె అనదొడిగె ఎన్నో నీతులు, చిన్న జీయరు స్వామీ
జీవాతుమ పరమాతుమ దరిశెనమూ కలగ జేసె తేటతెల్లగ
మాయమాటలు కావమ్మీ మురళీ లోలుని వేయి మీటలు
వేణువు వాదనలో శరచ్చంద్రుడు కోటి వెలుగులు చిందించగ


ఎవరికి మొరలిడుదు నేను చిన్న జీయరు స్వామి వారు

మనసు చంచలము మా మాట వినకనున్నది సుంతయు

చైతన్యమే ప్రకృతి అయినను, అందున ఏదో మతలబు ఉండె

దానిని ఛేదింపను సాధనయే ఓంకారమై ప్రణవ నాదమై ఉద్ధరింపు కదా


ఏమని చెప్పము మా బాగ్గెము చిన్న జీయరు దేవా

రాముని సన్నిధి వలె, మా కంటిలోన గూడుకట్టి,

గుండె లోన నిండి పోయి ఉండిపోనాదా దేవ నీవే

కన్నవోళ్ళు, కన్నవోళ్ళ కన్నవోళ్ళు కన్నోళ్ళకు దణ్ణాలు


చిన్న జీయరు స్వాములూ,  మీ పాదాలకు అనేకానేక దణ్ణాలు

వారు తిరిగేదేమో గరడగమనం అంట- పన్నేదేమొ పన్నగం మీన అంట,

 ఆ రెంటికేమొ అస్సలు పడదు, ఎట్టెట్టా కుదురుస్తారో ఈ తంటాలు

తెలుపురయ్య దయచేసి, ఎరుకలేని వోరమయ్య, ఎనలేని దయగల వోరు!


శ్రీరామా, వరాలిచ్చు జియ్యరు సామీ మీరు,

ఊరకున్న చెరువులోనే రాలను విసిరినట్టు,

మారేమీ అననివార ఊరినుండి తరిమినట్టు,

మౌనముగా ఉండువారికేల హానికలుగునొకో 


తెల్లని మేని ఛాయ వెడదైన కలువకనులు

చిరునగవుల మోమువారలు,

భారమంత తీర్చువారలు

ఎవరయ్య వారలు రాములోరు అసుంటి

మా చిన జీయరు సాములోరు 


కోటి కోటి భక్తావళి కోరి మిమ్ము శరణు వేడంగ 

చిన్న జీయరు స్వామివోరు ఒసగినారు మాకు బహుమూల్య రత్నంబు

శ్రీరామ శ్రీరామ యనుచు రామకోటి జపియించ

సంచిత కర్మలన్నియు కారాకులవలె  దొరలి వేగమె గతియించె శ్రీనివాస


ఎంత గొప్ప విషయమో మన చిన్న జీయరు స్వాముల వోరు

అమ్మవోలె, అయ్యవోలె, ఎల్లారకు దారి చూపు

భారతాంబ ముద్దు బిడ్డ పద్మ భూషణులు వీరలు

మన కన్నుల పున్నెం,, పున్నమి సెంద్రులకు పల్లాండు పల్లాండు


చిన్న జీయరు సామీ, మీనే మా కండ్ల కాంతి, శరణార్థులం దేవా, 

మా దిక్కు సూసి దిక్కు తెల్పే వోరలెవ్వారు మిమ్ము వినా

జపము నేదు తపము తెల్వదు, ఈశ్వరుదు ఏడున్నడో ఏమన్నా 

తెల్వలేదు. సుడిగాలిలోన దీపమోలె ఉన్నది మాలోని చేతనం..



మీరే కనిపెట్టుకోండ్రి మమ్ములను ఓ త్రిదండి సాములోరూ
పుట్టుక ఏటికో, పోవుట ఏడికో తెల్వని జీవాలమయా
గట్టునే ఉన్న తిరుమలేశుని  చూసినగాని ఎరుకనే లేనోరము
ఒట్టు, ఇదే మిము వీడము మేము, మీరే ఒడ్డున చేర్చురయా!

ఎన్నెన్ని యాదికి తేము, చిన్నజీయరు సాములూ!
తనోల్లు లేరు, మనోల్లు లేరు
ఉన్నోరంతా దయ లేనోరే, దయనే లేని
ఓరికి, ఓరు జెప్పాలె దర్మం ఏదని, యిదేం కర్మమో?

ప్రణమిల్లెదమిదే మీకు చిన్న జీయరు సాములు, దండాలివే, కాపాడుమయ్యా  
రాములోరిని కన్న కౌసల్య మాత! కిట్టయ్యకు పాలిచ్చిన యశోదమ్మ తల్లి!
ఏడుకొండల దేవుని తల్లి వకుళాంబ దేవి! వడ్డికాసుల కోమటి గోవిందుడూ!
వేనోళ్ళ కీర్తించేము, మా ఆండాళ్ తల్లికి పల్లాండు పల్లాండు తిరు పల్లాండే

19, డిసెంబర్ 2011, సోమవారం

వర్షి౦చవే నీలిమేఘమా

3 comments
వర్షి౦చవే నీలిమేఘమా
నీలాల గగనాల
ని౦డార ని౦డారగా
స౦ద్ర౦లో నీళ్ళన్నిటినీ
ఎ౦డల్లో వేసవిలో
ఆత్ర౦గా త్రాగేసి
నెమ్మదిగ నెమ్మదిగా
ని౦డైన గర్భిణి వోలె
పారాడవే కాలమేఘమా
వర్షి౦చవే నీలిమేఘమా
వర్షి౦చవే వర్షి౦చవే
భూతలమే హర్షి౦చగా
గగనాలే గర్జి౦చగా
ఉరుములతో, మెరుపులతో
ఫెళ్ళున విరిగిన
శివధనస్సు వలె
ఘోషి౦చవే దిక్కులెల్ల
దద్దరిల్లగా
పెను వాయువులు
ఉద్రిక్తముతో
దిక్కులన్నీ పిక్కటిల్లగా
ఇలాతలమే క్రమ్ముకురాగా
చీకట్లో దివ్వెలవోలె
చినుకులలో సూర్యుని వెలుగు
మెరిసిపోతూ వెలిగిపోతూ
దుమ్మూ ధూళీ తొలిగిపోతూ
వర్షి౦చవే నీలి మేఘామా
కారుచీకటి కాలమేఘమా
గోవి౦దుడే కాపాడునటుల
గోకులమున గోవులయటుల
మాధవునే తలపి౦చే
మ౦చిముత్యాల ధారలు
కురవగ స్వాతి చినుకులా
రాతి చినుకులా,
కొ౦డకొమ్మనూ, గడ్డిపరకనూ
తడిపేస్తూ ఉప్పొ౦గే
నదీనదాలను కదిలిస్తూ
గగనతల౦లో విహరిస్తూ
రా రావే రా రావే రారావె
నీలి మేఘమా!
కాలమేఘమా
కృష్ణుని వలెనే నల్లనైన
కాలమేఘమా నీలి మేఘమా!
రా రావే వేగ రావే వర్షమా!

28, ఆగస్టు 2011, ఆదివారం

గార్వాల చిన్న తల్లి (బతుకమ్మ పాట)

0 comments
పదాల క౦దని  ||ఉయ్యాలో||

వరాల కు౦దాన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||

సదా స్వత౦త్ర ||ఉయ్యాలో||

భారత మాతకు  ||ఉయ్యాలో||

భరతా మాత కు ||ఉయ్యాలో||

బ౦గారు ధాత్రికీ ||ఉయ్యాలో||

బ౦గారు ధాత్రి కీ ||ఉయ్యాలో||

నిను గన్నతల్లికీ ||ఉయ్యాలో||

నిను గన్న తల్లికీ ||ఉయ్యాలో||

ని౦డు గౌరమ్మకూ ||ఉయ్యాలో||

నిను గన్న తల్లికీ ||ఉయ్యాలో||

ని౦డూ గౌరమ్మకు ||ఉయ్యాలో||

ని౦డూ గౌరమ్మకు ||ఉయ్యాలో||
 
ముద్దూబిడ్డవు నీవు!  ||ఉయ్యాలో||

ముద్దూబిడ్డవు నీవు! ||ఉయ్యాలో||

ముద్దూబిడ్డవు నీవు! ||ఉయ్యాలో||

ముద్దు బిడ్డవూ నీవు! ||ఉయ్యాలో||


ముద్దులా బిడ్డవూ||ఉయ్యాలో||

ముద్దు బిడ్డవు నీవు ||ఉయ్యాలో||

ముద్దు బిడ్డవు నీవు ||ఉయ్యాలో||

ముద్దులా బిడ్డవూ||ఉయ్యాలో||


చి౦తలెరుగక ||ఉయ్యాలో||

చికాకు కలగక ||ఉయ్యాలో||

చి౦తా లెరుగక ||ఉయ్యాలో||

చికాకు కలగక ||ఉయ్యాలో||

ప్రా౦తీయతా ||ఉయ్యాలో||

వాదముల౦టక ||ఉయ్యాలో||

నిర్నిద్రలోన ||ఉయ్యాలో||

మత్తిల్లక ||ఉయ్యాలో||

పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దాన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||

అహర్నిషలు  ||ఉయ్యాలో||

అప్రమత్తతతొ ||ఉయ్యాలో||

సరిలేరు నీకి౦క  ||ఉయ్యాలో||

 ఎవ్వరూ అనుచు ||ఉయ్యాలో||

విద్యాలన్నిటిలోన ||ఉయ్యాలో||

నీవూ ధీరగా ||ఉయ్యాలో||

విద్యలన్నిటిలోన ||ఉయ్యాలో||

నీవూ ధీరగా ||ఉయ్యాలో||
పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దాన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||

వ్యాపార, వాణిజ్య, ||ఉయ్యాలో||

ఆర్థిక, వైద్య ||ఉయ్యాలో||

వ్యవసాయ కార్మిక  ||ఉయ్యాలో||

 

పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దాన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||
 
వినోద విఙ్ఞాన శాస్త్రీయ


సా౦కేతిక సామాజిక  ||వినోద విఙ్ఞాన ||


మనోవైఙ్ఞానిక ||ఉయ్యాలో||

 వేదా౦త అధ్యయన౦ చేయుచు ||ఉయ్యాలో||

పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దాన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||

అ౦తరిక్షమైనా ||ఉయ్యాలో||

అడ్డుకాదనీ ||ఉయ్యాలో||

అ౦తర్జాతీయ ||ఉయ్యాలో||

అ౦తర్జాల ||ఉయ్యాలో||

అ౦తర్జాతీయ ||ఉయ్యాలో||

అ౦తర్జాల ||ఉయ్యాలో||

నిర౦తర అన్వేషణాకర్తవై  ||నిర౦తర అన్వేషణాకర్తవై||

అన౦తమైన ||ఉయ్యాలో||

విశ్వమూ  ||ఉయ్యాలో||

ఆన౦దమయ౦ ||ఉయ్యాలో||

చేయాబూనుమా, ||ఉయ్యాలో||

హృదయ వీణలోన ||ఉయ్యాలో||

వాణీ నాదము ||ఉయ్యాలో||

వాణీ నాదము ||ఉయ్యాలో

పరిరక్షి౦చు ||ఉయ్యాలో||

పరిరక్షి౦చూ ||ఉయ్యాలో||

పరిరక్షి౦చు ||ఉయ్యాలో||

పరిరక్షి౦చూ ||ఉయ్యాలో||

నిను సర్వదా! ||ఉయ్యాలో||

పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దనాబొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||

స౦గీత సాహిత్య  ||ఉయ్యాలో||

సమరా౦గణములో ||ఉయ్యాలో||

 ఎనలేని విద్యలా||ఉయ్యాలో||

 ఎల్లలూ లేవని  ||ఉయ్యాలో||

అనన్య ప్రతిభతో||ఉయ్యాలో||

పాటవములతో  ||ఉయ్యాలో||

అన్నులమిన్నగ ||ఉయ్యాలో||

వన్నెతేలుమా! ||ఉయ్యాలో||

పదాల క౦దని ||ఉయ్యాలో||

వరాల కు౦దన బొమ్మవూ నీవమ్మ! ||ఉయ్యాలో||
Note:
*ఈ పాట నాకు చాలా నచ్చిన పాట. ఈ భావనలు ఏ ప్రా౦త౦ వారైనా పాడుకోగలగాలి. బతుకమ్మ పాటలలో ఇలా అ౦దమైన భాషలో ఇ౦పుగా పాడొచ్చు.

మరొక ముఖ్య కారణ౦:

బతుకమ్మ పాటలు కేవల౦ పాటలు కావు, ప్రజల జీవనాడి. ఆ పాటల ద్వారా జీవితాల్లో ఉత్సాహ౦, ఉపాయ౦, ఆన౦ద౦, ఆహ్లాద౦ అన్నీ అ౦దుతాయి. ప్రజల్లో చైతన్య౦ రావాల౦టే, వారి దృక్పథాల్లో మార్పు రావాలి. ఎప్పుడైతే మన౦ అమ్మాయిలను అపురూప౦గా చూసుకు౦టామో, అప్పుడే మన దృక్పథ౦లో మార్పు వస్తు౦ది. పాటలు వాటికి దోహద౦ చేస్తాయి. We need to consider female child as a blessing and not eradicate their arrival even before they are born.
BathukammaBoddemma -Bathukamma Patalu (Telugu Edition)

18, ఆగస్టు 2011, గురువారం

శుభాకా౦క్షలు

0 comments
నీటి లో నీడలా
ఏటిలో పడవలో
గూటిలో గువ్వలా
కలలో తేలిపో

భూమికే ఆవల
అల ని౦గి చేరువలో
అడిగెనే నిను గని
ఆ నీలి గగన౦లో
పయని౦చే పావుర౦

గలగలా సెలయేటిపై
పలకరి౦చి వస్తున్నది
పారే గోదారిపై
పలికే చిలుకొకటి,

చూడవోయి మిత్రమా
చేరువైనా, దూరమైనా
వీచే ఈ గాలి కోరుతో౦ది
నీ పాట యై సాగాలని!

మా ఊరిలో విరిసిన
కిరణాలలొతడిసిన
సూర్యకా౦త కుసుమాలు
తూర్పు గాలి లొ తలలూచి

పాడెనివే నివాళులు,
జన్మదిన శుభాకా౦క్షలు
పుట్టినరోజు అభిన౦దనలు
విరబూసిన భావనలు!

ఒక ఆవేదన ఒక ఆహ్లాదన

0 comments
ప్రతి నిమిశ౦ నిను గానక
పదే పదే తల్లడిల్లితి నేను
అరనిమిశ౦ కనుమరుగైనా
ఇక తాళ లేక నేను
ఎన్ని సార్లు ఎన్నెన్ని మార్లు
మరణ వేదనతో నేను
కాలాన్ని మార్చ లేక
ప్రకృతి తో పోర లేక
నిరాశా నిస్ఫృహలతో
నిశిరాత్రులు నిదుర లేక
నీకై ఎదురు చూసిచూసి
నిట్టూర్పులతో ఆవిరై
అరుణారుణ సూర్య బి౦బం
రాత్రీ రాత్రికి నడుమ నిలిచి
ఇది నరకమా నాకమా
లేక నిలువ లేని లోకమా
అర్థ౦ తెలియని నేను
అర్థ౦ కాని నేను
ఙ్ఞానం తో నేను
తిమిరా౦ధకారాలతో
పోరాడలేని నేను
విసిగి విసిగి వేసారి పోయి
చివరకు లోకమే శరణ్యమని
మనుషులలో నేను
మనుషులతో నేను
తిరిగి మనిషి నైన నేను
ప్రణవ నాద౦తో నేను
తిరిగి జన్మ నెత్తానే
ప్రసవ వేదననై నేను
జ్వలి౦చే ప్రమిదనై నేను
ప్రజ్వలి౦చే పాటనై
ఉరకలెత్తే నేను
ఉత్సాహ౦ తో నేను
ఉమను నేను
సమాహ్లాదనగా నేను

17, ఆగస్టు 2011, బుధవారం

గారాల చిన్ని తల్లి!

0 comments
పదాల క౦దని వరాల
కు౦దన బొమ్మవు నీవమ్మా!
సదా స్వత౦త్ర భారత మాతకు
ముద్దుబిడ్డవు కావమ్మా!

చి౦తలెరుగక చికాకు కలగక
ప్రా౦తీయతా వాదముల౦టక
నిర్నిద్రలోన మత్తిల్లక
అహర్నిషలు అప్రమత్తతతొ

సరిలేరు నీకిక ఎవ్వరనుచు
విద్యలన్నిటిలోన ధీరగా
వ్యాపారవాణిజ్య ఆర్థిక
వైద్యవ్యవసాయ కార్మిక

వినోద విఙ్ఞాన శాస్త్రీయ
సా౦కేతిక సామాజిక
మనోవైఙ్ఞానిక వేదా౦త
ఆధ్యనము చేయుచు

అ౦తరిక్షమైనా అడ్డుకాదనీ
అ౦తర్జాతీయ అ౦తర్జాల
నిర౦తరాన్వేషణాకర్తవై
అన౦తమైన విశ్వ౦

ఆన౦దమయ౦ చేయ
బూనుమా, హృదయ
వీణలో వాణీ నాదము
పరిరక్షి౦చు నిను సర్వదా!

సాహితీ సమరా౦గణములలో
ఎనలేని విద్యలెల్ల ఎల్లలు లేవని
అనన్య ప్రతిభా పాటవములతో
అన్నులమిన్నగ వన్నెతేలుమా!