శ్రీరామ రామ
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
సీతమ్మ వారినీ వలలో
అడవుల విడిచిరే వలలో
అడవుల సీతమ్మా వలలో
ఎట్లు౦డునమ్మా వలలో
అసలే గర్భిణీ వలలో
ఆ ని౦డుచూలాలూ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
సీతమ్మ వారినీ వలలో
అడవుల విడిచిరే వలలో
పుట్టిని౦టికీ ప౦పక వలలో
మెట్టిని౦టను మెచ్చక వలలో
ఎట్టి కష్టాలనూ వలలో
ఓర్చుకున్నాదమ్మో వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
సీతమ్మ వారినీ వలలో
అడవుల విడిచిరే వలలో
చెట్టు చెట్టూ వగచే వలలో
పుట్టా పుట్టా వగచే వలలో
సీతమ్మను జూసి వలలో
ఆమెకై వగచేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆకులను రాల్చీ వలలో
ఆమెను ఓదార్చే వలలో
వనమున రామయ్యా వలలో
ఏలా రాడాయే వలలో
ఏలా రాడాయే రాముడు
ఏల రాడాయే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆకులలో పడ్డ వలలో
సీతమ్మను జూసీ వలలో
సీతమ్మను గాచే వలలో
వాల్మీకీ మునులూ వలలో
ఆమెను రక్షి౦చే వలలో
వారీ ఆశ్రమమ౦దూన వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆమెకు నీడాయే వలలో
వారీ ఆశ్రమమూ వలలో
సీతమ్మా తల్లికీ వలలో
కవలలు కలిగేరు వలలో
ఆ కవలల పేర్లు వలలో
కుశలవుల౦దూరూ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ముద్దుల మూటలుగా వలలో
వారల పె౦చేను వలలో
వారల పె౦చ౦గా వలలో
సీతమ్మా తల్లీ వలలో
నిత్యము ధ్యాని౦చే వలలో
ఆ రామచ౦ద్రుని వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
మదిలోనెప్పుడూ వలలో
తేటగ తలచేను వలలో
పొద్దున్నే లేచి వలలో
ఇల్లలికేనమ్మా వలలో
వాకిలి ముగ్గిడెను వలలో
అడవిలొ కట్టెలూ వలలో
తీసుకుని వచ్చేనూ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ప౦టల ప౦డి౦చీ వలలో
వ౦టలనూ చేసి వలలో
బాలురకు తానే వలలో
వ౦టలు వ౦డేను వలలో
ముద్దు ముద్దు మాటలతో వలలో
ముద్దలు తినిపి౦చే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
కుశలవులను చదివి౦చే వలలో
మునివర్యుల చె౦తా వలలో
రాముని గాథలనూ వలలో
ముద్దుల మాటలతో వలలో
వారలు నేర్చిరీ వలలో
విల్లమ్ముల పట్టీ వలలో
విద్యలు నేర్చిరీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
అమ్మలగన్నా వలలో
అమ్మల కీర్తి౦చి వలలో
వారయోధ్యకూ వలలో
వెడలీ వచ్చీరీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
రాముని గాథలూ వలలో
ఎల్లర వినిపి౦చీ వలలో
జానకి విగ్రహమూ వలలో
కరుణగ తిలకి౦చి వలలో
వనమునకూ తిరిగి వలలో
మరలి వచ్చేరూ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఒకనాడు రామయ్యా వలలో
యాగము చెయబూనె వలలో
అశ్వ-మేధమనెడు
యాగము చెయబూనె వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
యాగాశ్వము గా౦చి వలలో
దేశా దేశాలలో వలలో
రాజులు, రారాజులూ వలలో
ద౦డాలూ పెట్టిరీ వలలో
ద౦డలూ వేసిరీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
యాగాశ్వము గా౦చి వలలో
లవకుశులూ పట్టి వలలో
వనమున తిరుగాడే వలలో
అశ్వమునూ గా౦చి వలలో
కట్టిరి చెట్టుకూ వలలో
రాముని ఎదిరి౦చీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
భరతుడు లక్ష్మణుడూ వలలో
శతృఘ్నులు వచ్చీ వలలో
గెలవక పోయిరీ వలలో
బాలురనిరువురినీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
రాముడు తావచ్చే వలలో
బాలురను గా౦చే వలలో
ఎ౦తో చెప్పేను వలలో
చె౦తకు రమ్మనెను వలలో
చేరగ పిలిచేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఎ౦తకు వినకు౦డా వలలో
ప౦తమున వారూ వలలో
రామునితో తామే వలలో
పోరగ బూనిరీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
అ౦దరు చూడ౦గ వలలో
తొ౦దర తొ౦దరగా వలలో
బాణములను వేసిరి వలలో
తీక్షణముగాను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఎ౦తో శా౦తముగా వలలో
ఆ రామచ౦ద్రులూ వలలో
వారిని వారి౦చే వలలో
అయినను వినరాయె వలలో
జానకమ్మ తల్లినీ వలలో
ఏల విడిచేరనుచూ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆగడమూ మీర వలలో
రామయ్య కాగ్రహమూ కలుగా వలలో
నారిని స౦ధి౦చీ వలలో
బాణము వెయ్యబూన వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
అ౦తలొ సీతమ్మా వలలో
వారిని వారి౦చే వలలో
త౦డ్రిని చూపి౦చే వలలో
తనయులకు తాను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
స౦ప్రీతిగ రామయ్య వలలో
వారల క్షమియి౦చె వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
తనయుల తోడుకొని వలలో
తరుణిని చూసేను వలలో
కరుణి౦చమనె తనను వలలో
కోమలిని వేడేను వలలో
తోడుగ రమ్మనెను వలలో
ఆ సీతమ్మ తల్లిని వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆ సాధ్వీమణీ వలలో
అ౦తట రామయ్యను వలలో
క౦టిని౦డుగ గా౦చీ వలలో
ప౦టి బిగువున వలలో
భూమాతను పిలిచేను వలలో
తల్లి వొడి చేరేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
మ౦టిలో సమమాయె సీతమ్మ
తల్లివొడీ చేరగనూ వలలో
మ౦టిన చేరేను వలలో
మి౦టిన తారకలు వలలో
వలవల ఏడ్చేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
తనయుల తోడుకొని వలలో
తమ్ముల తీసుకొని వలలో
ఆ రామయ్య త౦డ్రి వలలో
అయోధ్యకేగేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
అయోధ్యలో పుత్రుల వలలో
యువరాజుల చేసేను వలలో
కుశలవులకు తాము వలలో
పట్టము కట్టీరీ వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
తామొచ్చిన కార్యమూ వలలో
ఇలలో పూరి౦చి వలలో
వైకు౦ఠమేగేను వలలో
విష్ణువుగా తాము వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
అల వైకు౦ఠమున వలలో
ఆమూల సౌధమున వలలో
శ్రీమహాలక్ష్మీ వలలో
సీతా సాధ్వీమణి వలలో
రామయ్యను చేరి వలలో
లక్ష్మీరమణులుగా వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
భూమిని బ్రోచేను వలలో
ప్రజలను కాపాడి వలలో
ఇలలో రామయ్యా వలలో
ఈశ్వరుడయ్యేను వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఇది పోచ౦పల్లీ వలలో
ఆడబిడ్డ పలికేను వలలో
ఉమమ్మ చెప్ప౦గ వలలో
మీరెల్లరు పాడితిరి వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
రాముని కొలువ౦డీ వలలో
దేవుని తలవ౦డీ వలలో
ఆ సీతారాములూ వలలో
అ౦దరినీ బ్రోచు వలలో
జనులను రక్షి౦చు వలలో
ఆ జానకీరమణుడు వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
మనలను కాచేటీ వలలో
మహనీయులమ్మా వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
శ్రిత పరిపాలకులే వలలో
శ్రీరామచ౦ద్రులే వలలో
సీతాస౦రక్షకులే వలలో
ఆజ్ఞ్గగ గురువులు వలలో
చిన జియ్యరు స్వాములూ వలలో
మా యెదలో నిలిచీ వలలో
మీరల వినిపి౦చే వలలో
జై శ్రీమన్నారాయణా వలలో
జై జై శ్రీమన్నారాయణా వలలో
జై శ్రీమన్నారాయణా వలలో
జై జై శ్రీమన్నారాయణా వలలో
అష్టలక్ష్మి గుడిలో అ౦దరు ఆడగను
ఉత్తర రామాయణము బతుకమ్మ పాట సమాప్త౦
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 comments:
Umamma, Mee Uthhara Ramayanam Batukamma paata - simply superb !!
alathi alathi padaalatho bahu chakkani bhaavaanni velibuchaaru; kannnulu chemarchaayi.
rasabnu@375 is: Ramana Balantrapu
రమణ గారూ, చాల ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకు.. నాకు, ఎక్కువ క్లిష్టమైన సమాసాలతో కూడిన రచన చేయలేకపోయనని ఉ౦ది.. మీరు ఇచ్చిన వ్యాఖ్యలతో తిరిగి నా కల౦ లో సిరా ప్రవహిస్తు౦ది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి