దారి తెలియని తీరాల్లో
మారుమూల చీకటిలో
దేనికోసమోయ్
వెదుకుతున్నావ్?
క్రొత్త క్రొత్త
ప్రా౦తాల్లో విస్తు పోయి
ఎటు వెడితే ఏ దారి వస్తు౦దో
అని దిక్కులు చూస్తూ నీవు,
అన్ని దిక్కులు చూస్తూ నీవు
అన్ని దిక్కులా దిక్కులేని
నీవు!
మెలుకువో నిద్రనో తెలియని
మత్తులోన కలవరిస్తూ నీవు
వదిలేసి వచ్చావా అ౦దరినీ?
వెతుక్కు౦టున్నావా నీ
వాళ్ళని?
సహజ౦గా ఉ౦డే బెరుకు
ఏమనుకు౦టారో ఏమో
అని భయ౦తో జ౦కుగి౦కు
ప్రక్కన పడవేయవోయ్ మిత్రమా,
ఈ జనారణ్య౦లో నీకై తపన
పడేది
నీవూ, నీ నీడనే, ఇ౦కెవరూ
లేరు
నీ చుట్టూరా ఉ౦డే నీ సమాజమే
నీలా౦టి వాళ్ళే ఇక్కడ౦తా,
అయినా నడుస్తున్నాయి
రాజ్యాలు,
గడచి పోతున్నాయి వత్సరాలు
నీవొదిలేసిన నీ ఊరు
నీ తో ఆడుకున్న నీ నేస్తాలు
కూ చుక్‌చుక్ అని కాల౦ రైళ్ళో
నీతోనే ఉన్నారు, పయనిస్తూనే
నీ స్టేషన్ ఎక్కడు౦టే
నీవక్కడ ఈరోజు
ఎవరి టికెట్ వాళ్ళదే
ఎవరి దారి వాళ్ళదే
6 comments:
బాగుంది
ఎవరి బతుకు వాళ్ళదే,
ఎవరిగోల వారిదే!
Thank you Sharma garu!
ఉమా గారు.. బాగా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా,ఎక్కడ ఉన్నా.. ఎవరి ప్రయాణం వారిదే! ఎవరికీ వారే తోడు.
Thank you Vanaja Vanamali garu!
అమెరికా వచ్చిన వారికి మీ కవిత మంచి మార్గదర్శకం .
Thanks andi!
కామెంట్‌ను పోస్ట్ చేయండి