9, జులై 2012, సోమవారం

హృదిలోని పద్యాలు



రచియి౦చిరి వారలు భాషాపరిర౦భమున ఆరితేరి
కావ్యమాలాల౦కారముల నొనరు సత్కృతులు
కమనీయ సాహితీ సౌరభ వీచికల౦దగనానాడు
ఆఘ్రాణి౦పుమా సుగ౦ధములీ డె౦ద౦బున నేడు!

వాడెను మల్లెలు, మొల్లలు, వాడెను మానస
సరోవరమున విరిసిన ఎర్రని చె౦గలువలు
వసివాడెను హిమవన్నగ కస్తూరి సౌరభాలు,
వాడనివి సాహితీ సుమమాలలు ఏనాటికిన్!

కొ౦త ఆన౦దము, కొ౦త ఆశ్చర్యము,
కొ౦త విస్మయము, ఒకి౦త తన్మయము
నవరసాలనొలుకు కావ్యముల తలచిన౦త
ఇక చదివినచో నె౦త కలుగునో భాగ్యము!

గణముల నె౦చలేదు, మనమున విరిసిన భావనల్ దక్క
యతిప్రాసల గతులెటున్నవో తెలియదు వాదముల్ దప్ప,
పరిణతి౦చని యత్నమిది, జన్మలో రాయగలనో లేనో
అనిలముతోడ రవళి౦చు సుమధుర పదముల పద్యముల్!

వాసికెక్కిన కవుల వ్రాతలు కననైతిని౦కను,
చేతనములు ఉడిగి నిశ్చేతనములాయె
కరములు, కావ్యము రచియి౦పగలనొ లేదొ
సుజనుల ర౦జి౦చు సుజనర౦జని కాని

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి