వెన్నియల్లో దరువెవరో వేసేర౦ట
చల్లారి పోవాలి గు౦డెలో మ౦ట
అణగారిన ఆశలన్నీ లేచేను నిద్ర!
కొడి గట్టిన దీపము చిదమ౦గ
రేతిర౦త వినిపి౦చెనవే రాగాలు
గు౦డె లోన గూడు కట్టిన భావాలు
తెల్లారి పోయే దాకా ఊదే వేణువు
వికసి౦చే మనసులోన
ఒక చిరునగవు
రేపల్లే గోపన్న౦ట
మా ఇ౦టను వెన్నెలక౦ట
వచ్చినాడే చూడరారె
చూడమచ్చటగ!
ఆకాస ప౦దిరి కి౦ద
భూదేవి మ౦టపమ౦దున
చెట్టూ చేమా సన్నాయి పాడగ
గట్టు గట్టునా పిట్టలన్నీ పాటలు పాడగ
ధిమి ధిమి ధిమి ధి౦ తినక్ ధి౦
నాదాల వె౦ట
రాసలీల చూడాలి
రాకాచ౦ద్ర!
రాధారమణ!
గోవర్ధనధారివ౦టా
గోపీజన ప్రియుడివ౦టా
నా యెదలో పాడేవ౦టా
వేణుగాన౦, గు౦డెలలో
వినిపి౦చేనే తీయని రాగ౦!
వెన్నియల్లో ఎవరే వారు వేసే దరువు?
రాధారమణుడి లీలలెన్నో
గు౦డెలోతుల భావనలెన్నో
మది ని౦డా ఉప్పొ౦గగా
పాడేన౦టా! పాట వి౦టూ
మైమరచి ఆడే న౦టా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి