పాడవే ప్రాణసఖీ
కృష్ణుని గాథలు
మదిలో నిండగ
ప్రాణములో, ధ్యానంలో,
పాటలోని సరిగమలు ఒలుకగా
పసిపాపవలె
యమునను దాటి
పవ్వళించేనో
యశోద ఒడిన
యమునా తీరాన
ఆడిన ఆటలు,
బృందా వనిలో
పాడిన పాటలు
వందల గోవుల
గోప బాలకుల
సకలాపదల
కాచిన విధము,
కాపాడిన విషయము
పాడవే ప్రాణసఖీ
చెలువము మీరగ చెలువుల చేలముల
చిలిపి నటనలతో చలువము తోడ
దాచిన వేడుక,
శరణు వేడగా కరుణను ఒసగిన తడవు
కడవల వెన్నెల, కడలిని మించిన
యెడదల ప్రేమల
పాడవే ప్రాణసఖీ
మధురాధరముల
మధురిమలొసగి
కన్నియ వలపుల
విన్నపములన్నీ
కన్నులనిండుగ
మనసున నిలిచి
తానే మనసై,
మనసే తానై
వలపుల తలపుల
తానే నిలిచి
ఈసున మనసున
వగపులన్నీ
మనసు లోనే
భ్రమలని తెలిపి
మధురకు వెడలి,
బలభద్రునితోడుగ
మనుమడిగా
తన తాతను బ్రోచి
కంసుని పీడను
కడతేర్చిన వైనము,
పాడవే చెలీ,చెలీ,
చెలీ నా ప్రాణసఖీ !
🦚🦚
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి