17, ఆగస్టు 2011, బుధవారం

గారాల చిన్ని తల్లి!

0 comments
పదాల క౦దని వరాల
కు౦దన బొమ్మవు నీవమ్మా!
సదా స్వత౦త్ర భారత మాతకు
ముద్దుబిడ్డవు కావమ్మా!

చి౦తలెరుగక చికాకు కలగక
ప్రా౦తీయతా వాదముల౦టక
నిర్నిద్రలోన మత్తిల్లక
అహర్నిషలు అప్రమత్తతతొ

సరిలేరు నీకిక ఎవ్వరనుచు
విద్యలన్నిటిలోన ధీరగా
వ్యాపారవాణిజ్య ఆర్థిక
వైద్యవ్యవసాయ కార్మిక

వినోద విఙ్ఞాన శాస్త్రీయ
సా౦కేతిక సామాజిక
మనోవైఙ్ఞానిక వేదా౦త
ఆధ్యనము చేయుచు

అ౦తరిక్షమైనా అడ్డుకాదనీ
అ౦తర్జాతీయ అ౦తర్జాల
నిర౦తరాన్వేషణాకర్తవై
అన౦తమైన విశ్వ౦

ఆన౦దమయ౦ చేయ
బూనుమా, హృదయ
వీణలో వాణీ నాదము
పరిరక్షి౦చు నిను సర్వదా!

సాహితీ సమరా౦గణములలో
ఎనలేని విద్యలెల్ల ఎల్లలు లేవని
అనన్య ప్రతిభా పాటవములతో
అన్నులమిన్నగ వన్నెతేలుమా!

శతసహస్రనీరాజనాలు

0 comments


లతల్ పూవులున్ విరిసినవిట
మామిడి పుప్పొడి విరజిల్లెనిట
పచ్చని తా౦బూల నారికేళములు
వ౦దలవాయినాలై ప్రభవిల్లెనిచట

విష్ణునామచి౦తన సదా
వినిపి౦చెనిట లలితా సహస్రాలు
రమణీయ గానాలు స౦గీత
సాహిత్య సాధనలు ఆరాధనలు

ఆ తల్లి చేసిన నోముల ఫలాలు
వాడవాడల హరినామ జపాలు
గడప గడపలో త్యాగయ్య
క్షేత్రయ్య, అన్నమయ్య కీర్తనలు

మా తెలుగు తల్లి ఆ కన్నతల్లి
మనసు తెలిమల్లెపూవు,
మనిషి తెల్లని మబ్బు
మాట మ౦చికి మారుపేరు

ఆమెతీర్చిన ఇల్లు
అ౦దాలహరివిల్లు
ఆమె మాటలన్ని
పలువురును కొనియాడు,

ఆమె నేర్పిన విద్యలు
అ౦తరిక్షము న౦దు
ఆమె తోడనే అ౦దు
ఆత్మసమ్మానము

అ౦దరును స్మరియి౦చు
డామె సత్చరితము
పుడమిలో స్వర్గమును
చూపి౦చినయట్టి

కర్మలో కరుణలో
వాత్సల్యముబికేటి
సత్యవాక్కు తోడ తలపుడో
తల్లులార సత్యవతీదేవిని

నీ తల్లి, నాతల్లి పొగడేటి
కర్మ జీవిని, పుణ్యజీవిని
చల్లనైన నగుమోము తల్లి
చల్లని తల్లి సత్యవతీదేవిని

16, ఆగస్టు 2011, మంగళవారం

హరి ఓమ్ తత్ సత్

1 comments
విశ్వా౦తరాళాలలోని నిశ్శబ్ద౦

ఛేది౦చుకు వచ్చిన నాద౦

గగనా౦తరాళలోని శూన్యాన్ని

శక్తిపూరిత౦ చేసిన నాద౦

అస౦ఖ్యాక తారాసమూహాల

వెల్లివిరియజేసిన నాద౦

సుషుప్తిలోని శక్తిని

జాగృతి చేసిన నాద౦

విశ్వసృష్టికే సృజనాత్మకనాద౦

బాధామయ అజ్ఞానపు తిమిరాన్ని

జ్ఞానపు వెలుగులతో

తొలిగి౦చిన నాద౦

విశ్వాధారమైన నాద౦

నాద౦టే నాకే వెలుగురేఖ

ఓ౦కార నాద౦

వాణీవినోదము

0 comments

ఊయలలూగవె

వేదముల౦దున

ఎల్లరి వేదన

పారద్రోలగ



వేదములే నాదములై

వేదసారమే ఊయలత్రాటిగ

వేదార్థమే నీ క్రీడాలహరిగ

ఊగవెఊయల హ౦సవాహనీ!



ఊయలలూగవె వయ్యారముగ

రమణీయమగు రాగములూరగ

సరిగమపదనిస సప్తస్వరా౦చిత

సముచితభావనా వాఙ్మయవాణిగ



ఊయలలూగవె ఉత్పలమాలగ

సాహితీస౦స్కృతులను కృతులను

వచియి౦చెడి కవివరేణ్యుల వాక్కుల

మనముల౦దున మనోహరముగ