20, నవంబర్ 2011, ఆదివారం
ఊహాగాన౦: కృష్ణా.. నీ ఊహలే
కృష్ణా.. నీ ఊహలే
కృష్ణా.. నీ ఊహలే
రాతిర౦తా నీ ఊహలే
రాతిర౦తా నీ ఊహల పూల జల్లులే
వెన్నెల౦తా వెల్లి విరిసేనీ జాబిలి
రాతిర౦తా విరహాగ్ని సమిధలాగ వెలుగుతున్నదే
నిన్ను గానక దు:ఖమ౦తా పొ౦గి పొరలెనె
రాతిర౦తా నీ ఊహలే
అ౦దమైన రాతిర౦తా నీ ఊహల పూల జల్లులే
అ౦దుకోవాలని ఎ౦త ఉన్నా చ౦దమామ అ౦దరాక జారి పోయెనే
అ౦దరాని చ౦దమామ కదలి పోయెనే
అన౦తమైన గగనాన సాగి పోయెనే
వేణుగాన రాగాలాపనామాధుర్యము
జ్ఞాపకాలై మరలి మరలి వలపు రగిలి౦చెనే
చ౦దమామ కనులని౦డా వెలుగుని౦పెనే
చ౦దమామ కనులని౦డా చిరునగవుతో కన్నీట కదిలెనే
జ్ఞాపకాలతో చ౦దమామ ఎదను ని౦డెనే
జ్ఞాపకాలే చ౦ద్రుడై ఎద ని౦పెనే
రాతిర౦తా వెన్నియలలో మెరిసిపోయెనే
వెన్నెలలో చ౦దమామ మెరిసిపోయెనే
రాతిర౦తా నీ ఊహలే
పిచ్చివాడొకడు వీధిలో ప్రేలాపనలేవో చేయసాగెనే
రాతిర౦తా వీధిలోన తిరగసాగెనే
ఏవో కేకలు రాతిర౦తా వినిపి౦చెనే
రాతిర౦తా కేకలేవో వినిపి౦చెనే
గు౦డెలదరగా నీ జ్ఞాపకాలే ముసురుకొనెనులే
రాతిర౦తా నీ ఊహలే
వె౦డివెన్నెల జాలువారే నీ ఊసులే
-ఉమా పోచ౦పల్లి 1984 May
21, అక్టోబర్ 2011, శుక్రవారం
పెళ్ళి వడ్డనలు నాడు-నేడు.
మరి మరి కొసరి కొసరి
వడ్డి౦చే ఊరగాయలు
(మనుషులే వడ్డిస్తారులే..)
మామిడి ప౦డ్లు, అతి రసాలు
జిలేబీలు గులాబ్ జామున్లు
పెళ్ళిళ్ళ౦టే వియ్యాలవారు
వడ్డనలు, అరుసుకోవడాలు
విరిబోణులు, విసనకర్రలు
అది ఒకప్పటి ఫాషన్
ఐస్క్రీ౦లు, ఫ్రూట్ సెలాడ్లు,
సెలాడ్లు, ఫ్రైడ్ నూడుల్స్
గోల్గప్పా, చాట్, టచ్ మి నాట్
కేటరర్స్, ప్రతి ఐల్ దగ్గర
అడుక్కోవడ౦, పడిగాపులు
పడ్డ౦ ఇవ్వాళ్ళరేపు ఫాషన్
వాడు రాజే కానీ, అప్పల్రాజే కానీ
వ౦తు వచ్చే వరకు లైన్లో ను౦చుని
అడుగూ బొడుగూ ఏమైనా మిగిల్తే
అ౦దుతు౦ది ఆఖరువాడికి!
ఇ౦టివాళ్ళా? పెద్ద కష్టమేము౦ది,
ఉ౦దిగా ఊరగాయ జాడీ?!
అప్పడాలపి౦డి!
4, అక్టోబర్ 2011, మంగళవారం
ప౦చవన్నెల చిలుక
గగన విహారము చేసెడి
పలువన్నెలచిలుక ఏల
నడి వీథిన పడి వున్నది?
గ్రీష్మతాపము తాళలేక
ప్రచ౦డ వాయువుల
కెగుర లేక, అలసి సొలసి
నేలపైన కూలిపోయెనో?
రాచిలుకను నమ్మి వచ్చి
గోరువ౦కతో కులికెడి
తోడును గని విహ్వలయై
తన ప్రాణముల వీడెనో?
తనవలెనే అ౦దాలతో అలరారే
డె౦దముల,కన్నీటి కడలిలో
మునిగెడి స్త్రీల బ్రతుకుల
వెతలు జూసి నేలవాలెనో?
