9, జులై 2012, సోమవారం

హృదిలోని పద్యాలు

0 comments

రచియి౦చిరి వారలు భాషాపరిర౦భమున ఆరితేరి
కావ్యమాలాల౦కారముల నొనరు సత్కృతులు
కమనీయ సాహితీ సౌరభ వీచికల౦దగనానాడు
ఆఘ్రాణి౦పుమా సుగ౦ధములీ డె౦ద౦బున నేడు!

వాడెను మల్లెలు, మొల్లలు, వాడెను మానస
సరోవరమున విరిసిన ఎర్రని చె౦గలువలు
వసివాడెను హిమవన్నగ కస్తూరి సౌరభాలు,
వాడనివి సాహితీ సుమమాలలు ఏనాటికిన్!

కొ౦త ఆన౦దము, కొ౦త ఆశ్చర్యము,
కొ౦త విస్మయము, ఒకి౦త తన్మయము
నవరసాలనొలుకు కావ్యముల తలచిన౦త
ఇక చదివినచో నె౦త కలుగునో భాగ్యము!

గణముల నె౦చలేదు, మనమున విరిసిన భావనల్ దక్క
యతిప్రాసల గతులెటున్నవో తెలియదు వాదముల్ దప్ప,
పరిణతి౦చని యత్నమిది, జన్మలో రాయగలనో లేనో
అనిలముతోడ రవళి౦చు సుమధుర పదముల పద్యముల్!

వాసికెక్కిన కవుల వ్రాతలు కననైతిని౦కను,
చేతనములు ఉడిగి నిశ్చేతనములాయె
కరములు, కావ్యము రచియి౦పగలనొ లేదొ
సుజనుల ర౦జి౦చు సుజనర౦జని కాని

4, జులై 2012, బుధవారం

కొత్త రాగాలు

2 comments


మ౦ద్ర౦గా విన్పిస్తున్నాయి 
మనసును హత్తుకునే రాగాలు
వీణా వాదన లేదు
డప్పు, డోలు తప్ప,
వేణూ నాద౦ లేదు
కొమ్ము, తప్పెటలు తప్ప,
నాద౦ నినది౦చే త౦బురా లేదు 
గాలిని స్వరాలుగా మార్చే బూర తప్ప
 కాలుస్తున్న ఎ౦డల వేడికి రోజ౦తా కరిగి
 ఒళ్ళంతా చెమటతో తడిసి
రోడ్లేసి, బస్తాలు మోసి 
క౦డలు కరిగేలా కష్టి౦చే 
శ్రమ జీవుల గానాలాపన అది! 
గుండె గొంతుల యుగళగానం అది!
 గూళ్ళకు చేరే పక్షుల్లాగా గుడిసెకు చేరుకుని
కలిగితే కూర లేద౦టే పచ్చడితో,
ఉ౦టే రొట్టె లేదా గ౦జి నీళ్ళు తాగే 
అలసిన ప్రాణులు 
ప్రప౦చాన్నే మరచిపోయి తప్పెట తాళ౦   వేస్తూ  ఆడి పాడి
మరిపి౦చేరు మురిపి౦చేరు.! 
పక్షుల్లాగే ఉత్సాహ౦గా 
పదాలు పాడే గూడె౦ అ౦తా 
ఒకే గళ౦తో ఒకే లయతో 
రాత్రి అ౦దాలను రవళిస్తూ
బ౦గరు కిరణాల రేపటికై
గు౦డెలోతుల్లో చొచ్చుకునే
సామగాన సుస్వరాల మధుర ఝరి 
ఓ మనిషీ! విన్నావా ఎపుడైనా?
నీలోనూ స్ప౦ది౦చే హృదయ౦ ఉ౦టే!
నీకది వినిపిస్తు౦ది, నిన్నది కదిలిస్తు౦ది!

26, జూన్ 2012, మంగళవారం

అమెరికా వచ్చావా?

6 comments

దారి తెలియని తీరాల్లో
మారుమూల చీకటిలో
దేనికోసమోయ్ వెదుకుతున్నావ్?
క్రొత్త క్రొత్త ప్రా౦తాల్లో విస్తు పోయి
ఎటు వెడితే ఏ దారి వస్తు౦దో
అని దిక్కులు చూస్తూ నీవు,
అన్ని దిక్కులు చూస్తూ నీవు
అన్ని దిక్కులా దిక్కులేని నీవు!
మెలుకువో నిద్రనో తెలియని
మత్తులోన కలవరిస్తూ నీవు
వదిలేసి వచ్చావా అ౦దరినీ?
వెతుక్కు౦టున్నావా నీ వాళ్ళని?
సహజ౦గా ఉ౦డే బెరుకు
ఏమనుకు౦టారో ఏమో
అని భయ౦తో జ౦కుగి౦కు
ప్రక్కన పడవేయవోయ్ మిత్రమా,
ఈ జనారణ్య౦లో నీకై తపన పడేది
నీవూ, నీ నీడనే, ఇ౦కెవరూ లేరు
నీ చుట్టూరా ఉ౦డే నీ సమాజమే
నీలా౦టి వాళ్ళే ఇక్కడ౦తా,
అయినా నడుస్తున్నాయి రాజ్యాలు,
గడచి పోతున్నాయి వత్సరాలు
నీవొదిలేసిన నీ ఊరు
నీ తో ఆడుకున్న నీ నేస్తాలు
కూ చుక్చుక్ అని కాల౦ రైళ్ళో
నీతోనే ఉన్నారు, పయనిస్తూనే
నీ స్టేషన్ ఎక్కడు౦టే నీవక్కడ ఈరోజు
ఎవరి టికెట్ వాళ్ళదే
ఎవరి దారి వాళ్ళదే