These words are as I feel Krishna is beckoning me, as the flute is played by Hariprasad Chaurasia ji, Krishna's sound is hidden in it and Krishna calls, from the you tube music Hariprasad Chaurasia Krishna calls
ఒకసారి రావేమే
రా రా రా
రావేమే
బిరబిరమని
రావేమే
ఒక్కసారి కనికరించి
రా రా రా రమ్మని పిలువ
Raaga krishna dhwani 2
రావే ఇటు రావే
ఇటు రావే
అటునిటుమని
వెడలకే ఇటు రావే
ఇటు రావే
ఇటు రావే
అటు యెటూ
త్వరత్వరగా త్వరగ త్వరగ
అటునిటు వెడెద వేల
వేవేల మార్లు పిలిచినను
రావేమే
ప్రియ రాధికే
ఎదురు చూచి ఎదురు చూచి,
నా కసులు కాయలాయెనే
ఇటు రావే మటు మాయమై పోవకే
వినరావే
త్వరితగతిన
బిరబిరమని బిరాన రావే
చెలీ నా ప్రియసఖీ
ఒక్కసారి లలిత గతిన
త్వరితగతిన ఇటురావే
సప్త స్వరములలరింపగ
ఇట రావే
ప్రియమారగ
సహజముగా
కలకలమని కలువభామ
నడచి నడచి నటుల
గబగబమని
గలగలమని
పొంచిపొంచి యున్న
నను చేరగ
యమునా తీరమున
పొదపొదలమాటున
యెదయెదల లోతుల
డాగియిన్న నను కానగ
ఇక రావే
ఇటు రావే
కృష్ణ ధ్వనికి
నీ ఉనికి కే
ఇక రావే,,
Note: The song as it is flown is not just a young boy calling for his beloved. It is from Krishna, and His lesson in this song is to seek Krishna with an urgency and find Him with all one’s effort and not just find the manifest form but also His call that is latent and know that He is in the hearts of everything in this world, living and non living or stagnant or mobile ones. That is the Krishna’s call. He beckons His beloved to find Him wherever He is, and seek Knowledge and Truth in all things, that need to be explored and that need to be perceived.
2. సఖీ చూడవే
మువ్వగోపాలుడు
మది చూరగొని
నా మోవి తాంబూలమని
భ్రమసి నాదు అధరమేల
విడువ కుండు
సఖీ సీసీ
సఖీ సఖీ చూడవే
వదలను కదలనను
మోహన మురళిని
సఖి చూడవే
వగలొలుకు
సఖీ చూడవే
3. గానమే చెలీ
మధుర సుధల నొలుకు
మురళీ గానమే
సలిల జలధి నధిగ మించు
మృదంగ అభంగ విన్యాస సహిత
దృగంచల గంగా ఝరీ నినాద
సుగాత్ర తరంగ ధ్వనిత
సుమధుర మురళీ రవళుల
యమునా తటిన పారవశ్య మొనరు
నాద సుధల మోహన
మురళీ గానమే చెలీ
యమునా తీరమున
రవళించు మురళీ గానమే
ఓ చెలీ వీనుల నలరించు
సురకిన్నెరల మించు
గగన సోయగాల పోలు
గానమే చెలీ నాదానందముల
చిందించు గానమే చెలీ||
https://youtu.be/WZ5_MWPiWkQ?si=JhdeBC4SDiO2jX4q
కృష్ణా నీవే
జాగృతివీవే
ప్రగతివి నీవే
ప్రేమలు మీరగ
ప్రీతివి నీవే!
గీతము నీవే
గాత్రము నీవే
ఆతృత తీర్చి
పాత్రత తెలిసి
ప్రారబ్దమునే
తృటిలో తేల్చిన
ప్రాణము నీవే
ధ్యానము నీవే
నీ చరణములో
శరణమునీవే
శ్రీకృష్ణా శరణం మమ||
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి