నీల గగన ఘనశ్యామా!
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
ఉమాపోచంపల్లి గోపరాజు
(రిచ్మండ్ ,టెక్సస్,USA )
🌌నీలాకాశంలో రంగులు
ఊదా రంగు నుంచి బంగారువర్ణంలోకి
మారుతూ మారుస్తూ
విశాల నీలి గగనంలో
ఏ కుంచెతో అద్భుత రంగులు అద్దుతూ ఉన్నావు
నీ పదాల కూర్పులతో
నీ పాదాల విన్యాసాలతో
రచించే నవరసాల
వాగ్విన్యాసాలలో
నీ సృజన ప్రతిఫలిస్తూ
అరుణారుణ కిరణ విస్తీర్ణాన్ని
నీ రసహృదయకవాటాల ద్వారా
నిర్మల తన్మయ ప్రకృతిలో
వినీలమౌతూ, విలీనమౌతూ
వర్ణ వర్ణాల ఆకర్ణికా పేయ శ్రవణానంద సుధారసాలను
కేకికూజిత, పారిజాత
అపరాజితావిర్భవ రసప్రఫుల్ల
సరసహృదయ
సముదితోత్సాహాలతో
సకల భువనజనులకు, భువనభవనాలకు
కరకలిత స్వరజనిత లలితపద తాడిత మనోజ్ఞమధురమనోహర
నాట్య నటనా పరాకాష్టాలతో
జగత్తంతా గ్రీష్మ, హేమంత, వసంతాది
కవితా రసాతరంగాలలో
ప్లావితం చేస్తూ
ప్రభాత రాగ ప్రబోధనలతో
ప్రభావితం చేసే ఓ రవీ
కవితాప్లవీ!
కపిత్థ కంఠారవంలో,
సుమ కుసుమ పరాగాలలో,
హిమశైల ప్రాభవాలలో,
నదీనదాల సుదీర్ఘ సమంచిత సువిశాల సముద్ర సామీప్యతాయత్యాత్రలలో
విభవించే త్రయీభావ త్రిగుణాతీత
సుసత్వ శుద్ధ సత్వగుణ పరిపూర్ణ
అమందానంద దాయక నందనందనా
నమో నారాయణాయ
మంత్రాధిదేవతా!
నారాయణా
మమ్ము కావమను భక్తకోటి
ఆర్తజనవత్సలా,
శ్రీకృష్ణా!
గోపికా ప్రాణ ప్రణయ
సుధానిలయా
నమో నమః!
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి