7, ఫిబ్రవరి 2026, శనివారం
జై జై రామానుజాచార్య
31, ఆగస్టు 2025, ఆదివారం
అవతల..
ఇది ఒక ప్రయత్నం
అప్రయత్నంగా…
దిగంతాలకవతల
తేజోమయ జగతిలోకి
తలాతలాలకవతల
కవితాలతల ప్రపంచంలోకి
విలసిత సుమసౌరభాల
భావనామయ జగత్తులోకి
మణిమయమంజీర కదంబ
వనవాసినికై, కోటికోటి
కోరికలను తృణీకరించి
పరిమళించే కలువపూవుల
చిలకరి తెమ్మెరకై తపించే
సహృదయ స్నేహసుధామధుర
గాన రవళికోసం, ఓంకార
ఘోషిత ఝంకార నాదం కోసం
మనిషిలోని మానవత్వం కోసం
ఒక సగటు మనిషి అన్వేషణ..
31, అక్టోబర్ 2024, గురువారం
గడుసరి జడ
విడువను నిన్నింక యంచు, వీరాంగన యా
గడుసరి సాత్రాజితి, తా
'జడ' ముందుకు వైచి నాడు సమరము సలిపెన్!
15, అక్టోబర్ 2024, మంగళవారం
దేశ భవిత, భవ్య చరిత
20, సెప్టెంబర్ 2024, శుక్రవారం
ఈ నిశీధి లోన
అనురాగాల ప్రవాళీ
9, సెప్టెంబర్ 2024, సోమవారం
రఘునందన
15, ఫిబ్రవరి 2024, గురువారం
మన ప్రేమ
23, జనవరి 2024, మంగళవారం
श्री राम जी
26, డిసెంబర్ 2023, మంగళవారం
కృష్ణ కరుణ
7, డిసెంబర్ 2023, గురువారం
పద్మభూషణా!
13, నవంబర్ 2023, సోమవారం
శ్రీ మాత్రే నమ:||
8, ఆగస్టు 2023, మంగళవారం
ఎగరవే ఎగరవే మువ్వన్నెల జెండా
9, జులై 2023, ఆదివారం
దాని పాటలోనే పాఠం
22, ఏప్రిల్ 2023, శనివారం
శ్రీ చరణం
28, జనవరి 2023, శనివారం
తారలు
2, డిసెంబర్ 2022, శుక్రవారం
శాకంబరీ సోది కాదు, సోదరి!
27, నవంబర్ 2022, ఆదివారం
అమ్మమ్మకి లెటర్
Labels: తెలుగు కథలు, ప్రియమైన నీకు 2022 మార్చ్
19, సెప్టెంబర్ 2022, సోమవారం
సుగమమౌగాక సతతము యుగయుగాలకు
కనులలో నిలుపుకొనుము
నా ఊసులను
దాచుకొనుము హృదిలోన
నా ఊహలను
కాను నేను కవితాస్మృతికి
అర్హము
కదిలి జాలువారనీకుము
నీమనసున నా గురుతులేవియు
ఆవిరైపోవనీ అనంత నిశీథిలోన
ఏవేని నా తలపుల శీతోష్ణ తాపాలు
కురవనీ గగనాంచలముల నుండి
ప్రేమపరిమళజల్లులు
ధారలై మధుర మురళీ రసాస్వానమై
గూటిలోని గువ్వవలె దాచుకొనుము
నీ మనసున నాపైని ద్వైవీ భావనలు
కాను నేను ఋషిని,
కాను మీ కృషికి అర్హురాల
మీ జీవనసరళిలో
ధారలైసాగు జీవనదిలో
ఎక్కడో కొట్టుకుపోవు
ధూళిప్రోవును
మీ సుమనస్సుల ఖేదమొనరించి
ఇంకను మరింతగా భారమైతిని
భువికిని బుధజనులకును నా ఉనికితోడ
ఈ క్షమాధరిత్రిన, మీమనంబుల
ఇంచుక కనికరమున్న
మీ కమలేక్షణముల సుంత దయయున్న
అర్థించెద నను గుర్తించకుమని
మరచిపొమ్ము అవలేశమైన
మీ మనముల మలినపరచకుము
కరగిపోయెదనొక దినము
గాలిలో ధూళి వలె
మరచిపొండు, మది తేటగా
పొదవి ఉండనిండు
మేకపెంటిక మెండు
నాకన్న, నా ఉనికి కన్న
ప్రాణమున్నంత మేర
ఈ కాయము పడి ఉండనిండు..
ఎచటనో పంకిలమును
ప్రోగుపడిన కమలదళాలవె
నా చిగురుటూహల
పల్లవించనీయుడు
భక్తితోడ మీ యెల్లరి
చరణములకు చేయు నా
మూర్థనములు స్వికరించి
భాసించనీ మీకీర్తి
పలుదిసలు
కన్నలనిండుగ దినదినము
రామానుజ కటాక్ష వీక్షణములు
కనకవర్షము కురిపించనీ ఇహమునందు
ప్రార్థించెద అందరి కుశలమునకై
ఇహపరములందు చెందుడు
గురు కృపాకటాక్షములను
సాధించగ మీ జీవన ధ్యేయమెల్లరును
