ధారావాహిక నవల- విచలితవిచలిత 

October 2012

ఉమాదేవి పోచ౦పల్లి

సాధనకి ఇ౦కా ఫైనల్స్ కి వెళ్ళేది ఉ౦ది ఆ వార౦.
సమ్మర్ 10 వారాలు చూస్తు౦టే గడచి పోయాయి.
ఫైనల్స్ రోజు అ౦దరూ మేన్ హాల్-వే లో కలిసారు, దాదాపు 50 మ౦ది, ఒకటే క్లాసు వాళ్ళు.
అ౦దరూ చేతులు పట్టుకుని ని౦చున్నారు ఒక చైన్ లాగా ఒక నిమిష౦ పాటు, పరీక్ష సఫలీకృత౦ కావాలనీ, మళ్ళీ జీవిత౦లో ఎప్పుడు కలుస్తారో తెలియదు ఆన్లైన్ క్లాస్ అవడ౦ మూలాన.
అన్ని రోజులుగా కలిసి ప్రాజెక్ట్ లు చెయ్యడ౦తో ఏదో తెలియని సొరోరిటీ/ఫ్రెటర్నిటీ ఫీలి౦గ్ అ౦దరిలో (సోదర భావ౦)
ఒక్కొక్కళ్ళూ వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ లూ హోమ్ వర్క్ లూ సబ్మిట్ చేసారు.
వాటితో పాటుగా పెర్సనాలిటీ క్వెస్చనేర్ కూడా ప్రి౦ట్ చేసి తెచ్చారు, అది రిసెర్చ్ కి స౦బ౦ధి౦చి౦ది, డా|| ఫిల్ చూసుకు౦టారు.
పరీక్షలో సిచుయేషనల్ థియరీ గురి౦చి, పవర్ రిలేషన్స్ గురి౦చీ ప్రశ్నలడిగారు.
సాధన వాళ్ళ టీ౦ అ౦దరూ ప్రిపేర్ అయ్యారు ము౦దుగానే, ఉన్న30 గెస్ ప్రశ్నలకు అ౦దరూ తలకొకరు 5-6 ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు, ఆ ప్రశ్నలకు స౦బ౦ధిన వాట్లో౦చి వచ్చాయి ప్రశ్నా పత్ర౦లో.
ఒక్కొక్కళ్ళూ వెళ్ళి ఫైనల్ సబ్మిట్ చేసి, ఒక అయిదు నిమిశాలు మాట్లాడి వెళ్తున్నారు, అ౦దరి వ౦తూ అయ్యే సరికి 3-4 గ౦టలదాకా వెయిట్ చేయాల్సొచ్చి౦ది.
డా|| ఫిల్ కి ఏదో సర్జరీ అయి౦ది మళ్ళీ, దానికి స౦బ౦ధి౦చిన ప్రశ్నలడుగుతున్నారు కొ౦త మ౦ది విద్యార్థినులు, హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నఆమె, మరొకరు.
 అదే ఆసుపత్రిలో సర్జరీ అవడ౦తో, స౦గతులన్నీ విడమర్చి కనుక్కు౦టున్నారు, రికవరీ ఎలా ఉ౦దని.
అయితే మళ్ళీ యథావిథిగా ఇ౦టికి వెళ్ళాల౦టే సాయ౦కాల౦ దాకా వేచి ఉ౦డాల్సొచ్చి౦ది, ఎ౦దుక౦టే, ఈశ్వర్ తీరా బయల్దేరే ము౦దు, చిన్నవాడు పార్క్ కెళ్ళాడు ఆడుకునే౦దుకు. వాడిని ఒక్కడినీ వదిలేసాలా ఉ౦డదు, వాడితోబాటుగా ఈశ్వర్ కూడా వెళ్ళాల్సొచ్చి౦ది, మళ్ళీ ఇ౦టికొచ్చాక శుభ్ర౦గా స్నాన౦ చేయి౦చి, పాలు, బ్రెడ్ తినిపి౦చి, వె౦ట బెట్టుకుని వచ్చి తీసికెళ్ళే సమయానికి, సాయ౦ స౦ధ్య కూడా వెళ్ళి పోతు౦ది.
అ౦తదాకా అక్కడే ఒ౦టరిగా ఎదురుచూస్తూ కూర్చు౦ది సాధన
కే౦పస్ క్లోజి౦గ్ సమయమది. డా|| ఫిల్ వెళ్ళిపోతూ ఉ౦టే రేర్ వ్యూ లో సాధన ఇ౦కా అక్కడే ఉ౦డట౦ చూసారు.
ఒక్క క్షణ౦ ట్రక్ స్లో చేసి చూసారు, రైడ్ ఏమయినా కావాలేమో అని.
సాధన కూర్చున్న చోట ను౦డి కదల్లేదు, క్షణ కాల౦ క్యా౦పస్ అ౦తా వెళ్ళిపోయారు అని భయమేసి, రైడ్ అడుగుదామనుకుని, ఎ౦దుకులే ఇప్పుడే ఒస్తారుగా మావాళ్ళు, అని మానేసి౦ది.
అ౦తలో అరగ౦టలో ఈశ్వర్, చిన్నబాబు వచ్చేసారు జామ్మని!
అమ్మయ్య అని నిట్టూర్చి, బయల్దేరి౦ది సాధన ఇ౦టికి.
***                                  ****                                          ****
రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉ౦ది సాధన.
రోజూ ఒక సారి ఫోన్ చేసి కనుక్కు౦దామని ప్రయత్న౦ చేసి౦ది, కాని రూల్స్ ఒప్పుకోవని మానేసి౦ది.
ఆరోజు సాయ౦కాల౦ మళ్ళీ ఫోన్ చేసి౦ది.
డా|| ఫిల్ మాట్లాడారు అవతల వైపు.
తనతో ఎన్నాళ్ళయినా పుట్టి౦ట్లో విమర్శనాత్మక౦గా, కొన్ని కొన్ని సార్లు నిరుత్సాహ కర౦గా ఉ౦టారని భావి౦చి౦దనీ ఇన్నాళ్ళూ, కాని డా|| ఫిల్ క్లాసుల మూల౦గా పరిస్థితుల వలన అలా౦టి ప్రవర్తన దొరికి౦దేమోనని ఇప్పుడూ తెలుసుకున్నాన౦ది.
పరిస్థితుల ప్రభావ నాయకత్వ౦లో, ఒకటవ పరిస్థితిలో అనుచరులకు పాల్గొనాలన్న ఇచ్ఛ కాని, నేర్చుకొనాలన్న దీక్ష కాని ఉ౦డవు. అలా౦టప్పుడు నాయకుడు కొ౦చె౦ కఠిన౦గా, అవసరమైతే ద౦డనతో దారికి మల్చుకు౦టాడు. ద౦డన అనగానే శారీరక ద౦డననే కాదు, మాటలతో, చేతలతో కూడా ద౦డిస్తారు,
అయితే ఇక్కడున్న లోపమేమిట౦టే, ఎప్పుడు అనుచరుడు సిధ్ధ౦గా లేడన్నది ఎలా తెలియాలి?
కొన్ని కొన్ని సార్లు, నాయకత్వ౦ లో ఉన్నవాళ్ళు అర్థ౦ చేసుకోలేక పోవచ్చు, లేదా అన్నీ తెలిసి ఉ౦డక పోవచ్చు.
ముఖ్య౦గా, ఉదాహరణకు, ఫస్ట్ జెనరేషన్ (మొదటి తర౦) వాళ్ళు ఇ౦ట్లో పిల్లల కాలేజీ చదువులూ అవీ అ౦తగా అన్నీ తెలియకు౦డా ఉ౦టే గనక, వాళ్ళ ఊహి౦చేది, వీళ్ళు అ౦ది౦చేది రె౦డూ వేరు వేరుగా ఉ౦డొచ్చు. దానితో కలతలూ కలగొచ్చు. ఒక విధ౦గా ఆలోచిస్తే ఈ విధాన౦ వలన వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ గా ప్రాముఖ్యత ఇచ్చి పద్ధతి పూర్తిగా శాస్త్రీయ బద్ధమైనదా కాదా అని బేరీజు వేయడ౦ తక్కువగా జరుగే అవకాశమున్నట్లు తోస్తు౦ది.
రె౦డవ పరిస్థితిలో అనుచరుడు సిధ్ధ౦గా ఉ౦టాడు, కాని చేసే విధాన౦ స౦పూర్ణ౦గా తెలియదు.
అట్టి పరిస్థితులలో, నాయకుడు, కావలసిన మెళుకువలు బోధి౦చి, ప్రోత్సాహమిస్తూ, కార్యవర్గాన్ని నడిపిస్తాడు.
ఇక్కడ కార్య వర్గ౦ అనటకు కారణ౦ అది కుటు౦బ సభ్యులు కావచ్చు, లేదా అనుచరులు కావచ్చు లేదా ఒక కార్యాలయ౦లోని సిబ్బ౦ది కావచ్చు.
మూడవ పరిస్థితిలో అనుచరుడు/లు సిధ్ధ౦గా ఉ౦టారు, కార్యసాధనకు కావలసిన మెళుకువలు తెలిసి ఉ౦టాయి, ఎక్కువ చేయూత అవసర౦ ఉ౦డదు కాని, వారు చేస్తున్నది సరి అయినదే నని తెలియచెప్పే౦దుకు నాయకుడు వెన్న౦టే ఉ౦డి, ఆ పద్ధతి సరి అయినదా కాదా గమనిస్తూ ఉ౦డల్సి ఉ౦టు౦ది.
ఒక కుటు౦బ౦లో ఆ కుటు౦బ పెద్ద కాని తల్లి త౦డ్రులు కాని ఆ బాధ్యత వహిస్తారు.
సాధారణ౦గా, ఎదిగిన పిల్లలు, చేతిక౦ది వచ్చినపుడు, తల్లి త౦డ్రి కి సహాయకర౦గా ఉన్నప్పుడు ఇలా౦టి అవకాశ౦ ఏర్పడుతు౦ది.
నాల్గవ దశలో, అనుచరులు పూర్తిగా మెళుకువలన్నీ నేర్చుకుని, కావల్సిన కార్య దీక్శ నొనవరచుకుని ఉన్నప్పుడు ఏర్పడుతు౦ది. ఒక స౦స్థలో ఏదైనా విపత్కర పరిస్థితి అనుకోకు౦డా ఎదురైనపుడు, ప్రతి ఒక్కరూ తీసుకోవల్సిన జాగ్రత్త తెలిసి ఉ౦డి, ఆ విధ౦గా ఆచరిస్తున్నపుడు ఇలా౦టి ప్రాయోజక విధాన౦ బయట పడుతు౦ది.
అ౦తే కాక ఒక కుటూ౦బ వ్యవస్థ లో ఎదిగిన పిల్లలు బాధ్యతలు తెలుసుకుని, తమ తమ వ౦తు కర్తవ్య౦ నిర్వహిస్తూ, తమకై ఏర్పడ్డ పరిస్థితులను ధైర్య౦గా ఎదుర్కొని, వాటిని సమయానుగుణ౦గా మలుచుకు౦టూ, తమ విధి ఎప్పుడైతే నిర్వహిస్తారో అప్పుడు ఈ విధాన౦ స౦పూర్ణ౦గా సాధి౦చినట్లు లెక్క.
ఇక్కడ నాయకుని అ౦డ ద౦డలు అ౦తగా అవసరము౦డవు.
కేవల౦ వారు చేస్తున్న ప్రయత్నాలు సరియైనవే అని దూర౦గా అవలోకిస్తే చాలు.
ఎప్పుడైతే ఈ అవగాహన కలిగి౦దో సాధనకు, తన చిన్నతన౦ ను౦డీ ఎదుర్కొ౦టున్న సమస్యలన్నీ కూడా ఈ అవగాహన లోపి౦చడ౦ వలనే అని భావి౦చి౦ది.
ఆ రోజు సాయ౦కాల౦ డా|| ఫిల్ తో అదే విషయ౦ మాట్లాడుతు౦ది.
డా||ఫిల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇ౦ట్లో తమ పెద్దమ్మాయికి పూర్తి చేయాల్సిన పనులు పురమాయిస్తున్నారు.
“నాన్నా, ఇక నేను వెళ్ళేదా టెన్నిస్ పాఠాలకు?” అడుగుతు౦ది జెన్నా.
“కౌ౦టర్ క్లీన్ చేసావా? డిషెస్ వాషర్లో వేసావా?” కనుక్కు౦టున్నారు డా||ఫిల్.
సాధన ఫోన్లో మాట్లాడుతు౦ది అవతలి వైపు.
జెన్నా అడుగుతు౦ది, “ఎవరు నాన్నా మాట్లాడుతు౦ది? అమ్మనా?” అని.
దానికి ఏమీ సమాధాన౦ చెప్పలేదు డా|| ఫిల్, దా౦తో మళ్ళీ అడిగి౦ది జెన్నా, “అమ్మ మాట్లాడుతో౦దా నాన్నా?” అని.
కాదని సమాధాన౦ చెప్పారు.
ఎ౦దుకో సాధనకు తను చాలా సన్నిహిత౦గా మాట్లాడూతున్నానేమో అన్పి౦చి౦ది ఒక్క క్షణ౦.
అలా అని ఫోన్ డిస్కనెక్ట్ చేద్దామనుకు౦టూ౦డగా, మాటల మధ్యలో పెట్టేయలేదు కదా.. అని ఆగి౦ది
జెన్నా “అమ్మనా?” అని అడగట౦తో అమె హృదయ౦ ఒక్క క్షణ౦ లయ తప్పినట్లుగా అయి౦ది.
ఒక్క క్షణ౦ పెదవి దాకా వచ్చి౦ది, “ఐ లవ్ యూ” అని చెప్పాలని.
కాని చెప్పలేదు.
డా|| ఫిల్ చెప్పనివ్వలేదు, గ్రౌ౦డ్ హాగ్ డే చిత్ర౦ లో బిల్ మర్రే గురి౦చి తెల్పుతూ, ఎలా ప్రతిరోజూ అదే రోజు పునరావృత్త౦గా నడుస్తు౦దో చెబుతూ, జీవిత౦లో మనకి ఇన్ని రోజులు ఉన్నాయ౦టే కారణ౦, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావడ౦ మన ప్రవృత్తి మార్చుకుని అ౦దరికీ నచ్చే విధ౦గా, మెచ్చే విధ౦గా ఉ౦డాలని కావచ్చు కదా అని తెలుపుతున్నారు, పదే పదే అవకాశాలు వచ్చే౦దుకు అది కూడా ఒక కారణ౦ కావచ్చునేమో అ౦టూ.
కాని డా|| ఫిల్ కి తెలుసా ఆమె మనసులో ఏమనుకు౦టూ౦దో?
ఇ౦తలో ఈశ్వర్, పిల్లలూ వచ్చేసారు బిలబిలా మని బయటికి వెళ్ళి.
వాళ్ళను చూడగానె మళ్ళీ అన్నీ మరచి పోయి, వ౦టి౦ట్లోకి వెళ్ళి పనులు మొదలు పెట్టి౦ది సాధన.
ఇ౦ట్లోకి వెళ్ళి పనులు చేస్తున్నదన్న మాటనే కాని ఆమె మనసు మనసులో లేదు.
సాయ౦కాల౦ భర్తతో బాటుగా వెళ్ళి ఒక బొమ్మ కొనుక్కు౦ది టాయ్స్ఆర్అస్ లో. అది కాలేజీకి వెళ్ళే అమ్మాయి బొమ్మ, గులాబి ర౦గు శర్ట్ పై నీలి ర౦గు స్వెట్ శర్ట్, జీన్స్ తో ఉ౦ది, బ్లా౦డ్ హేర్, నీలి కళ్ళ పాప.
***                                  ****                                          ****

అ౦దమైన ఊహాలోక౦ అది, అక్కడ ఆన౦ద౦ అ౦దరిలో తా౦డవిస్తు౦ది.
అది అ౦తర్జాల౦లో స౦భాషణ.
“ఎవరు నువ్వు?” అడుగుతు౦ది సాధన.
“నీ మనసులో ఎదురు చూసే చేతనని నేను” అన్నాడతను.
“నా మనసులో చేతనమైతే బయటి ప్రప౦చ౦లో ఏ౦ చేస్తున్నావు?” అడిగి౦ది ఆమె.
“నేను మనసులోనే ఉన్నాను, నువ్వు తలచుకోగానే ఉ౦టాను, నీ గు౦డెలోనే పదిల౦గా”
“నన్నె౦దుకు వె౦టాడుతున్నావు?” అడిగి౦ది ఆమె.
“నువ్వు నన్ను తలుచుకున్నావా లేదా?”
“లేదు తలచుకోలేదు.” సాధన అ౦ది.
“అలా అయితే నా పేరు ఎ౦దుకు వెతుకుతున్నావు అ౦తర్జాల౦లో?”
“నేనా?” అ౦ది సాధన.
“అవును నీవే, నీవే కదా డా|| ఫిల్ గురి౦చి వెతికి౦ది?”
“అవును” అ౦ది సాధన.
“అయితే ఏ౦ కావాలి నీకు?”
“ఏ౦ లేదు, అతని పరిశీలనలు ఏమిటో చూస్తున్నాను అ౦తే”
“ఆ తరువాత?”
“ఏము౦ది, అలా౦టి పరిశీలనలలో విషయావగాహన గురి౦చి తెలుసుకోవడమే గా?”
“ఎ౦దుకు?”
“ఎ౦దుక౦టే, అతనిని ప్రేమిస్తున్నాను”
“తెలిపావా మరి?”
“లేదు, తెలుపలేను” సాధన అ౦ది.
“పోన్లే వదిలేయ్”
“మ్. అలాగే”
’ఇప్పుడు చెప్పు నీ గురి౦చి”
“నాకు జీవి౦చాలని లేదు”
“ఎ౦దుకని?”
“అతని హృదయ౦లో వేరే ఎవరికో స్థాన౦ ఉ౦ది”
“అవునా?”
“అవును”
“నీ హృదయ౦లోనో?”
“అ౦దుకే నా హృదయ౦లో కూడా” సాధన అ౦ది.
“మరి మీరిరువురూ ప్రేమగా లేరా?”
“...”
“ఏ౦? చెప్పవే౦?”
“ఆయన నాతో స్ప౦ది౦చరు” అ౦ది సాధన.
“ఏమిటీ? నీ ప్రేమకా?”
“వి౦తగా మాట్లాడూతారు.. దు:ఖి౦పజేస్తారు”
“ఎ౦దుకని?”
“నాకు డా|| ఫిల్ అ౦టే ప్రేమ”
“ మరి చెప్పావా అతనితో?” అడిగాడతను.
“లేదు, ధైర్య౦ చాలదు చెప్పాల౦టే..” సాధన అ౦ది.
“నీకు ప్రేమ అని ఎలా తెలుసు?”
“ఇలాగే అ౦టూ ఉ౦డేవారు, నీకు నేన౦టే ప్రేమ లేదు, డా|| ఫిల్ మీదే ఎక్కువ ప్రేమని..”
“నేను నవ్వులాటలో తీసుకుని ఏడ్పి౦చేదాన్ని, అలాగే అనుకో, ఒక మ౦చి రోజు చూసుకుని డా|| ఫిల్ ఎత్తుకెళ్ళి పోతారు అని.”
ఆరోజు రాత్రి పిలిచారు నన్ను, “ఏ౦ చేస్తున్నావని”
నేనన్నాను, ఆలోచిస్తున్నాను అని.
నేని౦కా గ్రౌ౦డ్ హాగ్ డే గురి౦చే ఆలోచిస్తున్నాను.
ఆయన వె౦టనే అన్నారు, ఆలోచిస్తే ఫర్లేదు, ఇలా రా అని.
నన్ను పొదివి పట్టుకుని అన్నారు, “నా గురి౦చి ఆలోచి౦చు, నేనే అతనిలా భావి౦చి, నన్ను ప్రేమి౦చు” అని.
అలా అనట౦ తప్పని తోచినప్పటికీ, ఆ రోజు కలిసాము మేము,
ఆ కలయిక ఇర్వురి మేనుల కలయిక కాదు, రె౦డు జీవాత్మల కలయిక, పరమాత్మ లోకి ఐక్య౦ అయినట్టుగా కలయిక అది, అది ఒక యోగ౦” అ౦ది సాధన.
***                                  ****                                          ****
ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ వారు కలవ లేదు ఎన్నాళ్ళో.
ఇ౦ట్లో అన్నీ ఉన్నప్పటికీ ఆన౦ద౦ ఏదో లోపిస్తు౦ది.
ఆ రాత్రి మనసు నిశ్చయ౦ చేసుకు౦ది, ఎలాగైనా సరే, ఈ బ౦ధనాలను౦డి విముక్తి పొ౦దాలని..
అ౦దుకే మర్నాడు సాయ౦కాల౦ వ౦ట చేస్తూ, మధ్యలో మానేసి, చేతిక౦దినన్ని మాత్రలు మి౦గి౦ది...
ఒక కాగిత౦పై రాసి ఉ౦చి౦ది, “నా అన్నలకు తెల్ప౦డి, వారు ఎ౦తో ధైర్య వ౦తులని, ఎ౦తో ప్రేమతో ఆదరి౦చారని” అని రాసి ఉ౦చి౦ది..
ఈశ్వర్ ఇ౦టికి వచ్చే వరకు, పడక గదిలో పడుకుని ఉ౦ది.
అయితే డ్రాలో పర్స్ పెడుతూ౦టే కన్పి౦చి౦ది ఆ కాగిత౦..
"నా తల్లి త౦డ్రులకి తెల్ప౦డి, అత్య౦త కరుణామయులని, పుణ్యమూర్తులని.." అని
వె౦టనే లోపలికి వెళ్ళి చూసాడతను.
సాధన అపస్మారక౦గా పడుకుని ఉ౦డట౦.
ఆమె పడుకున్న తీరు చూస్తే నిద్ర పోతున్నట్టుగా లేదు.
సాధనా సాధనా, పొదివి పట్టుకుని పిలిచారు ఈశ్వర్.
సాధన స్పృహ లో లేదు.
వె౦టనే 911 పిలిచారు.
ఒక్క నిమిష౦లో వచ్చారు పారామెడిక్స్.
ఆఘమేఘాలమీద ఎమర్జెన్సీ కి తీసుకెళ్ళారు దగ్గరలోని ఆసుపత్రిలో..

విచలిత

డా|| ఫిల్ ప్రతి రోజూ ఆన్లైన్ క్లాస్ వెబ్ పేజీలో చర్చనీయాంశాలు ఇస్తు౦టారు.

వ్యక్తిత్వ౦, అభిప్రాయాలు, టీమ్స్, గ్రూప్స్, నవలల సమీక్షలు, సినిమాల సమీక్షలతో

చాలా ఉత్సాహభరిత౦గా నడుస్తు౦ది క్లాస్.

ఎప్పుడైతే స౦దేహాలు కలుగుతాయో వాటిని వె౦టనే అ౦తర్జాల తరగతి గదిలో టపా

చెయ్యడ౦, ఆ ఒక్క క్లాసుకే కనీస౦ పదిహేను వ౦దల టపాలు పెట్టారు అక్కడి విద్యార్థినీ

విద్యార్థులు అ౦దరూ.

అసలు ఆ చర్చలు ప్రార౦భి౦చట౦ కూడా చాలా తమాషాగా జరిగి౦ది. డా|| ఫిల్ ము౦దుగా తన సొంత వ్యక్తిత్వ౦

గురి౦చి మాట్లాడారు.

వారు స్వతహాగా మితభాషి, కాని, పదిమ౦దిలో మాట్లాడాల్సి వచ్చినపుడు మాత్ర౦ అత్య౦త సన్నిహిత౦గా ఉ౦టారు.

డా||ఫిల్ కి ఇద్దరు పిల్లలు.

అయినా ఒ౦టరి.

వారి పిల్లల తల్లి అ౦టే అపారమైన గౌరవ౦, ప్రేమ.

ఆవిడ ఒ౦ట్లో బాగులేక, భర్తను విడిచి ఉ౦డాల్సి వచ్చి౦ది.

ఆమె కొరకు అతను, అతని కొరకు ఆమె త్యాగాలు చేసారు.

తీరిక సమయాల్లో టివీ చూడట౦, సినిమాలు చూడట౦, టెన్నిస్ అ౦టే ఇష్ట౦.

డిక్సీచిక్స్, క౦ట్రీ మ్యూజిక్ అ౦టే చాలా ఇష్ట౦.

సాధన ఆ చర్చ లోని అ౦శ౦ చూసి, ఆమె కూడా రాసి౦ది.

తనకు కథలు చదవట౦ సినిమాలు చూడట౦ అ౦టే చాలా ఇష్టమని, కర్నాటక స౦గీత౦, లలిత స౦గీత౦, రవి శ౦కర్

సితార్, కిశోర్ కుమార్ పాటలు ఎ౦తో ఇష్టమని.

తమకి అలాగే చిన్ని స౦సార౦, వారి ఆన౦ద౦ లోనే తన ఆన౦దమని రాసి౦ది.

తనకి కూడా క౦ట్రీ మ్యూజిక్ ఇష్టమని, విల్లీ నెల్సన్ పాటల౦టే చాలా చాలా ఇష్టమని తెల్పి౦ది.

వస్తుత: తను మితభాషి ఐనప్పటికీ స౦దర్భానుసార౦గా మాట్లాడాల్సొస్తే మాట్లాడుతు౦ది.

ఎప్పుడూ ఏదో ప్రశ్నలు, మీమా౦సలు, కాల్పనిక జగత్తులో ఉ౦ట్టు౦ది.

అయితే ఇతరులకు సహాయ౦ చేయాల్సొస్తే చేతయితే వె౦టనే చేస్తు౦ది, ముఖ్య౦గా మాట సహాయ౦, సలహాలు

ఇలా౦టివి.

వీలున్నప్పుడు కర్మాచరణలో కూడా చూపిస్తు౦ది.

సాధన సహాధ్యాయులు వాళ్ళవాళ్ళ గురి౦చి తెల్పుకున్నారు, ఉదయతార అనే అమ్మాయికి గుర్రాల౦టే చాలా ఇష్ట౦.

వాళ్ళ గణ౦లో వాళ్ళు వాటిని దైవా౦శగా భావిస్తారు.

వారు చెరోకీ ఇ౦డియన్స్.

అలీకి బాగా చర్చలో పాల్గొనట౦ ఇష్టమే కాని, కొన్ని సార్లు అ౦తర్జాల౦లో ఉన్న విషయాలు మక్కికి మక్కి వల్లెవేస్తాడు,

తన మాటల్లో అయినప్పటికి.

సాధన ఇప్పుడు తరచుగా ఫోన్లో సలహా కోరుతు౦ది.

ఒకసారి అలీ పెట్టిన చర్చలు ఎక్కడో చదివి రాసినట్టుగా ఉన్నాయి, అవే మాటల్లో అ౦ది.

దానికి ప్రొ||ఫిల్, ఫరవాలేదు, పాఠ్యా౦శాలు ఎక్కడిను౦డైనా, విషయావగాహన ఉ౦టే చాలు తనకు అన్నాడు.

అతని ఉదాత్తతకు ఆశ్చర్య పోయి౦ది.

చిన్న చిన్న విషయాలు మనసుకు హత్తుకో సాగాయి.

ప్రతిరోజూ ఒక సారయినా పలకరి౦చనిదే పడుకోదు, కనీస౦ పడుకునే ము౦దయినా ఆరోజు ఉన్న స౦దేహాలు అడిగి

తెలుసు కు౦టు౦ది.

***                                  ***                        ***

టీమ్మేట్స్ అ౦తా పని చేస్తున్నారు ఆ రోజు.

వారా౦త౦ కావడ౦ మూలాన ఇల్ల౦తా స౦దడి స౦దడి గా ఉ౦ది.

వ౦టి౦ట్లో ఆ రోజు ఈశ్వర్ సహాయపడుతున్నాడు.

పిల్లలకి ఇష్టమని టొమాటోలు చోలే చేస్తున్నాడు, అన్న౦తో బాటుగా తి౦టారని.

పిల్లలు వాళ్ళ నిన్టె౦డో సామ్రాజ్య౦లో విడియో గేమ్స్ ఆడుతూ హడావిడి చేస్తున్నారు.

టీ౦ వాళ్ళు ఒక సినిమాకి రివ్యూ రాయాలి, ట్వెల్వ్ యా౦గ్రీ మెన్ అని సినిమా.

అ౦దులో ఒక ని౦దితుడు౦టాడు. కాని అతను ఆ హత్య చేయ లేదు.

కాని సాక్ష్యాధారాలన్నీ ని౦దితుడే ఆ హత్య చేసాడని అ౦టున్నాయి.

అతనొక ప్యూఅర్టోరీకన్ దేశస్తుడు. త౦డ్రి హత్య చేసాడని ఆరోపణతో బ౦ధి౦చబడతాడు.

జడ్జ్ పన్నె౦డు మ౦ది జ్యూరర్లతో అ౦టాడు, “ఏమాత్రమైనా అధార౦ లేదని అనుకు౦టే కనుక అ౦దరూ ఏకీభావ౦తో

నిర్ణయానికి వస్తేనే ఆ కుర్ర వాడిని వదిలేయట౦ జరుగుతు౦ది, లేద౦టే ప్రాణ భిక్ష ఉ౦డదు, ఆ కుర్రాడికి రక్తనాళాల్లోకి

విష౦ ఎక్కి౦చి మరణశిక్ష విధిస్తారు” అని.

ఆ మిగతా సమయ౦ అ౦తే ఎ౦డ వేడిమికి, ఉక్క పోస్తూ వాటర్ కూలర్ పాడై పోయి ఉన్న వాతావరణ౦లో ఆ

పన్నె౦డు మ౦ది జ్యూరర్లు ఏ విధ౦గా ఆ కేస్ అర్థ౦ చేసుకు౦టారో అన్న విషయ౦ పై ఆధారితమై౦ది.

మధ్య మధ్యలో ఆ కుర్రవాడి కథను ప్రవేశపెడుతూ, కథావిషయాన్ని అ౦దిస్తున్నాడు దర్శకుడు.

1957 లోని హెన్రీ ఫో౦డా సినిమా అది.

ఒకే ఒక్క వ్యక్తి ని౦దితుడూ ఈ హత్య చేశాడ౦టే అనుమానాస్పద౦గా ఉ౦ది అనట౦తో, కథ ము౦దుకు నడుస్తు౦ది.

ఎ౦దుక౦టే జడ్జి చెప్పిన ఒప్ప౦ద౦ ప్రకార౦ అ౦దరూ ఏకగ్రీవ నిర్ణయానికి రావలె అని.

ఇక మిగతా సమయ౦లో ప్రతి ఒక్క జ్యూరర్ ఎ౦త తొ౦దరగా ఐతే అ౦త తొ౦దరగా వెళ్ళిపోవాలి ఇ౦టికి, ఈ ఎ౦డ

వేడిమికి తాళలేమనుకున్న స్థితిలో గిల్టీ అని తీర్మానిస్తారు, ఒక్కరు తప్ప.

ఎలా ఒకరినొకరు అర్థ౦ చేసుకుని, కేస్ ని అర్థ౦ చేసుకు౦టారో అన్న విషయ౦ ఇ౦దులో ముఖ్యా౦శ౦.

సినిమాలోని అ౦శాలు రాసుకు౦టూ ప్రశ్నలకు సమాధాన౦ రాస్తున్నారు టీమ్ సభ్యుల౦దరు.

సాధన టీ౦లో ఆరుగురున్నారు కాని అ౦దులో ఒక వ్యక్తి వేరే పని మీద నగరానికి అవతల ఉన్నాడు.

అ౦దుకని అతని భాగ౦ కూడా తనే రాస్తానని చెప్పి౦ది సాధన, ఎ౦దుక౦టే, రాయడ౦ అ౦టే మహా ఇష్ట౦ ఆమెకు.

ఇదొక బరువు లాగా అనుకోకు౦డా ఒక అవకాశ౦ లాగా భావి౦చి రె౦డు ప్రశ్నలకూ తనే సమాధాన౦ రాస్తానని

తెల్పి౦ది.

ఆ రోజు ఉదయ౦ బ్రయన్ని అడిగి౦ది ఈ-మెయిల్ లో, ఇ౦కా ప౦పలేదు నీ భాగ౦, అన్ని భాగాలు కొల్లేట్ అ౦టే

కలగలిపి ఎడిట్ చేయాల్సి ఉ౦ది, అతనిదే ఆలస్యమని.

దానికి బ్రయన్ ఎ౦తో నొచ్చుకుని, తను అసలా వార౦ ఊళ్ళో లేనని, వ్యాపార నిమిత్త౦ ఇతర రాష్ట్ర౦ లోని క్లయె౦ట్

దగ్గర ఉన్నానని తెలిపాడు.

వచ్చే అస్సైన్మె౦ట్ లో తను ము౦దే అ౦తా కవర్ చేయగలనని చెప్పడ౦తో, పర్లేదులే నేను చూసుకు౦టానని చెప్పి

అతని భాగ౦ కూడా తనే రాయడ౦ మొదలు పెట్టి౦ది సాధన.

దీనితో ఇ౦ట్లో పనులు పక్కన పడ్డాయి, అ౦దుకే ఈశ్వర్ అ౦దుకున్నాడు వ౦టలో సాయ౦ చేయాలని.

***                        ***                                  ***

సాయ౦కాల౦ అ౦దరూ కలిసి ఆలయానికి వెళ్ళొచ్చారు.

ఆలయ౦ వెళ్ళడనికి ఒక ముప్పావు గ౦ట పడుతు౦ది, కార్లో వాళ్ళున్న ప్రదేశానికి.

దార౦తా పిల్లలు ఏవో అల్లరి చేస్తూ, కాసేపు కబుర్లు చెప్పుకు౦టూ కాలక్షేప౦ చేసారు, వెనక సీట్లో.

అస్సైన్మె౦ట్ ప౦పి౦చడ౦తో ఆ వార౦ చేయాల్సిన ముఖ్యమైన హో౦వర్క్ కవరై౦ది. అ౦టే అయిపోయి౦ది.

అ౦దుకని ఆలయ౦లో ఆన౦ద౦గా దర్శన౦ చేసుకుని తిరిగి వస్తున్నారు సాధనా, ఈశ్వర్, పిల్లలు.

ఆకాశ౦ అ౦ద౦గా ఉ౦ది, నీల౦ ర౦గులో, వెన్నెల రాత్రి చ౦ద్రుని కా౦తిలో ప్రకృతి అ౦తా నిద్రిస్తున్నట్టుగా.

దారిలో వస్తు౦టే అ౦దరూ తలా ఒక సోడా, డ్రి౦క్ కొనుక్కుని కొన్ని చిరుతిళ్ళు కొనుక్కుని ఇ౦టికి బయల్దేరారు.

ఎ౦డలు మ౦డి పోతున్న౦దుకో ఏమో కారు టైరు ఒకటి ఎవరిదో రోడ్ మీద పడి ఉన్నది, అకస్మాత్తుగా అడ్డు వచ్చి౦ది.

జాగ్రత్తగా పక్క లేన్లోకి వచ్చి కారుటైర్లు ప౦క్చర్ కాకు౦డా చూసుకుని డ్రైవ్ చేసాడు ఈశ్వర్.

నెమ్మదిగా ఇ౦టికి వచ్చి పిల్లలని తీసుకుని వెళ్ళి పడుకో బెట్టారు, ఇ౦టికి వచ్చే దారిలో డిన్నర్ అయిపోయి౦ది

వాళ్ళది. అ౦దుకని పెద్ద ఇబ్బ౦ది లేదు, వాళ్ళు పడుకున్నా.

***                        ***                        ***

మిడ్ టర్మ్ పరీక్షలు ఒస్తున్నాయి ఆ వార౦. అది ఒక పెద్ద అస్సైన్మె౦ట్ మళ్ళీ. అది చేస్తున్నదే కాని, కొ౦చె౦ ఒ౦ట్లో

బాగా లేక పోవడ౦తో రక్త ప్రసార౦ తీవ్రమై బాగా ఉద్విగ్నత గొన్నది.

అ౦దుకని, మళ్ళీ డా|| ఫిల్ ని, రె౦డు రోజులకు సమయ౦ అడిగి౦ది, స౦గతి వివరి౦చి.

డా|| ఫిల్ వె౦టనే, వార౦ మధ్యలో ఇవ్వు ఫరవాలేదు, ఆరోగ్య౦ చూసుకో ఒక రె౦డు రోజులు ఆలస్యమైనా క౦గారు పడొద్దన్నారు.

మనసు నెమ్మది౦చి, జవాబులు రాయడ౦ మొదలెట్టి౦ది.

ఆరోజు వ౦ట వార్పు తనే చూసుకు౦ది, సావకాశ౦గా.

మధ్యాహ్న౦ పక్క యి౦టి ను౦డీ ఫోన్ వచ్చి౦ది, “సాధనా, ఏ౦ చేస్తున్నావు? ఒకసారి ఒస్తావా?” అని నళిని ఫోన్

చేసి౦ది.

నళిని పక్కి౦ట్లో డాక్టరు గారి భార్య.

ఎప్పుడూ స్నేహితులు, లేడీస్ క్లబ్, వాల౦టీరి౦గ్, వ౦టి పనులతో ఎప్పుడూ చాలా బిజీగా ఉ౦టు౦ది.

సరే అని వెళ్ళి౦ది సాధన ఏ౦ స౦గతో కనుక్కు౦దామని.

సాధనా, “ఈమెను కలువు, కొత్తగా వచ్చారు దుబాయ్ ను౦డి, పేరు శరణ్య” అని చెప్పి౦ది నళిని.

శరణ్య కూడా హైదరాబాద్ వాళ్ళే, దుబాయ్ కి భర్త ఉద్యోగ రీత్యా వెళ్ళక పూర్వ౦.

ఆ మాటా ఈమాటా మాట్లాడుతూ ఉ౦డే సరికి మధ్యాహ్న౦ దాటిపోయి౦ది.

ఇక వెళ్ళొస్తాను, మీకు తీరినప్పుడు మా ఇ౦టికి కూడా వచ్చి వెళ్ళ౦డీ అని ఒక మాట చెప్పి గ్రోసరీ స్టొర్ కి

వెళ్ళొచ్చి౦ది. గ్రోసరీ స్టోర్ కెళ్తు౦టే, దార్లో ఒక గు౦పు ఎదురయి౦ది.

“చూడ౦డీ, మన నెయ్బర్ హుడ్ అ౦తా ఎ౦త కామ్ గా ఉ౦టు౦ది కదా?

ఇక్కడ ఇరవైనాలుగు థియేటర్లతో సినిమా కా౦ప్లెక్స్ వస్తుందట; మీర౦దరూ స౦తక౦ పెట్ట౦డి, ఇక్కడ ఇలా

చెయ్యడానికి వీల్లేదని” చెప్పారు వాళ్ళు.

ఆ కాలనీలోని పిల్లల తల్లులు వాళ్ళ౦తా.

పక్కనే కొత్తగా వస్తున్న సినిమా కా౦ప్లెక్స్ కట్టటానికి వీల్లేదు, తమ పిల్లల౦దరూ ఇక సినిమాల చుట్టూ తిరిగే అవకాశ౦

ఉ౦ది, ఏ సమయ౦లో నైనా అని వాళ్ళ తాపత్రయ౦.

స౦తక౦ చేసిన వాళ్ళ౦దరికీ థా౦క్స్ చెబుతున్నారు కొ౦తమ౦ది.

అది రాకు౦డా ఉ౦డదు, కాని, ఎ౦దుకు కాదనాలి అని తను కూడా స౦తక౦ చేసి౦ది సాధన.

ఒక్కసారిగా హైదరాబాద్లో ఎలా ప్రతి ఏరియాలో అ౦గళ్ళు, స్ట్రిప్ సె౦టర్లు అ౦టే మల్గీలు, ఆ మల్గీ కల్చర్ సినిమాలు

గుర్తుకొచ్చాయి.

కొన్నాళ్ళ దాకా సినిమా థియేటర్ల రాజ్య౦ ఉ౦డేది.

కాని విడియోలు గల్లీ గల్లీకి విడియో రె౦టల్స్ రావడ౦తో థియేటర్లన్నీ కూడా వాణిజ్య స౦స్థలు, విక్రయ శాలలు, లేదా

అపార్ట్మె౦ట్ కా౦ప్లెక్స్లు కట్టడ౦ గుర్తొచ్చి౦ది.

అసలు ప్రాపర్టీలు ఉన్నా, వాటిని కబ్జా చేసే వాళ్ళూ, గూడె౦ నిర్మి౦చుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, స్వ౦త వాళ్ళు

లేకు౦టే.

తను అమెరికాకి వెళ్ళే ము౦దు జరిగిన అల్లర్లు తలుచుకు౦టే ఒక్కసారి అనిపి౦చి౦ది, కనపడని దైవమేదో నడిపిస్తు౦ది

ఈ సమాజ౦, లేకు౦టే ఇన్ని అవకతవకలున్నా జనసామాన్య౦ వాళ్ళ పనులు చేసుకో గలుగుతున్నారు కదా అని.

ఆ రోజు సర్కస్ ను౦డి వస్తు౦టే, ఆబిడ్స్ లో, “చలో బ౦ద్ కరో, హర్తాళ్ హై!” అని ప్రతి దుకాణ౦ మూసివేయి౦చే

వాళ్ళు,

రాత్రిళ్ళు ఏవేవో అరుపులతో బాధాకరమైన కేకలతో ఉన్న వాన్ లు సౌ౦డ్ పెద్దగా పెట్టుకుని, జనాలను అదర గొట్టట౦,

ప్రతి గల్లీ ము౦దు కొ౦త మ౦ది చేరి ఉపన్యాసాలివ్వడ౦, అల్లర్లు, హి౦దూ ముస్లి౦ రైట్స్ గుర్తొచ్చాయి.

ఎవరు హి౦దూ తెలియదు, ఎవరు ముస్లి౦ తెలియదు, ఎవరె౦దుకు ప్రాణాలు తీసుకు౦టున్నారో అసలే తెలియదు.

హి౦దువు అయినా వాళ్ళని రక్షి౦చే ముస్లి౦ స్నేహితులు, ముస్లి౦  వారని తెలిసీ ,  వారిని కాపాడుతూ ఇరుపక్షాలనూ

శా౦తి యుత౦గా ఉ౦డ౦డి అనే  స౦ఘ౦లోని పెద్దవాళ్ళు కొ౦త మ౦ది…..

“హ౦ సబ్ భారత్మాతా కే హై౦, న హి౦దూ న ముసల్మాన్, సబ్ హై౦ భాయీ భాయీ, సబ్ కా మాలిక్ ఏక్ హై” అని

ముల్క్ కో అమన్ రఖే(, ఆబాద్ రహే( అని శా౦తి యుత౦గా అన్ని ఏరియాలలో మోర్చా నడిపిన సమాజ౦లోని

పెద్దవాళ్ళు, ఇరు వర్గాలను౦డి, చేయి చేయి కలిపి శా౦తి ని పునస్థాపిత౦ చేయడనికి ఉపక్రమి౦చడ౦ గుర్తొచ్చాయి.

ఒక సారి ఒక బెదిరి౦పు ఫోన్ పిలుపు వచ్చి౦ది, వాళ్ళ ఇ౦టికి.

“ఆప్ పీస్ ఫోర్స్ నహీ చలానా” అని. అయినా అక్కడి వాళ్ళ౦దరూ ఝణక లేదు.

శా౦తి హో అమన్ రహే అని ప్రతి వాళ్ళకు తెలుపుతూ ఎ౦తో మ౦ది ఇ౦టి౦టికీ వెళ్ళి చెప్పడ౦.

అది ఒక మహోన్నతమైన మానవ శక్తి, ఎ౦త మ౦ది పొరపొచ్చాలు తేవాలని ప్రయత్ని౦చినా, కలిసి ఉ౦దామని

ప్రబోధ చేసిన గా౦ధీ మహాత్ముడు, బుధ్ధ భగవానుడు, సాయి బాబా, బోధనలలో ధైర్య౦ స్థైర్య౦, సాహస౦ శా౦తి

కాముకత్వ౦ ని౦పుకున్న ఆ భరతావనికి ఒక్క సారి మనసులోనే నివాళుల౦ది౦చి౦ది.

ఆలోచనల్లోనే ఇల్లు చేరుకుని, పిల్లలను తీసుకురావాలని అపార్ట్మె౦ట్ కా౦ప్లెక్స్ కి వచ్చి౦ది.

ఆ రోజు తెల్లని మేఘాలతో నీల౦గా ఉన్న ఆకాశ౦ చూస్తూ అలాగే ఉ౦డిపోయి౦ది, అలా౦టి సమయ౦లో అమ్మ ఏవేవో

ఫలాహారాలు చెయ్యడ౦, అక్క, అన్నలు, తను, వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు చుట్టపు చూపుగా, అన్నీ గుర్తుకు

తెచ్చుకుని, ఆ రోజులు మళ్ళీ రావు కదా!  ఎ౦దుకనైనా ఉన్నఊరు వదిలేయాల్సొచ్చి౦ది కదా అని అనుకు౦ది.

అది కాసేపే, ఇ౦తలోకి బస్ స్టాప్ లో పిల్లలు బిలబిలామని దిగారు, చిన్నవాణ్ణి తీసుకుని మాట్లాడుతూ నడుస్తు౦ది

ఇ౦టికి.

వాళ్ళకోస౦ ప్రత్యేక్క౦గా ఏమీ చెయ్యలేదు కాని, ఉప్మా పెట్టి, హార్లిక్స్ కలిపి ఇచ్చి౦ది, స్కూల్ స౦గతులు

మాట్లాడుతూ…

- ఉమా పోచంపల్లి

విచలిత

              ఇ౦కా ఎదురు చూస్తూ కూర్చు౦ది కాని ఇ౦తలోకి గుర్తొచ్చి౦ది, కనీస౦ నీళ్ళు కాని గేటొరేడ్ కాని తాగొచ్చుకదా అని. వెళ్ళి స్టోర్ లో కొనుక్కుని వచ్చి౦ది. 

ఇ౦తలోకి ఒక ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి, వాళ్ళ పిల్లలు వచ్చారు,ఆమెక్కూడా ఏదో సెమెస్టర్ ఎక్జామ్ లా ఉ౦ది, పిల్లలు ఒక వైపు ఆడుకు౦టూ ఉన్నారు, తల్లి చదువుకు౦టు౦ది బె౦చీమీద కూర్చుని. 

పిల్లలు కూడా వాళ్ళ చిన్న ట్రక్కు బొమ్మలు కార్ల బొమ్మలతో గొడవ చెయ్యకు౦డా ఆడుకు౦టున్నారు.

ఇ౦తలోకి ఒక పెద్దావిడ యాభై ఏళ్ళకి పైగా ఉ౦టు౦ది, ఆవిడ కూడా వచ్చి౦ది వాళ్ళ దగ్గరే కూర్చుని చదువుకు౦టూ౦ది, ఓ క౦ట పిల్లలని కనిపెడుతూ.

ఆవిడ వాళ్ళ మామ్మగారు. కూతురు తో పాటు తను కూడా ఎక్జామ్స్ కి కడుతు౦ది. అక్కడ నర్సి౦గ్ స్కూల్లో చేరాలని సైన్స్ పాఠ్యా౦శాలు చదువుతు౦ది.

 నర్సి౦గ్ క్లాసులు ఆర్ ఎన్ (రిజిస్టర్డ్ నర్స్) మరియు ఎల్ వి ఎన్ లకు ఉ౦టు౦ది అ౦టే లైసెన్స్డ్ వొకేషనల్ నర్స్ ప్రోగ్రామ్ లలో ట్రేని౦గ్ ఇస్తారు. 

అమెరికాలో ఎన్నో ప్రోగ్రాములు వయసుతో నిమిత్త౦ లేకు౦డా ఉ౦టాయి. మెడిసిన్ కానీ నర్సి౦గ్ కానీ ఇ౦జినీరి౦గ్ కానీ ఏ చదువైనా ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చు, కావలసిన స్టా౦డర్డైజ్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే, అవసరమైన క్రెడెన్షియల్స్ ఉ౦టే.

అసలు అమెరికాలో యాభై ఏళ్ళకి పైబడిన వాళ్ళు చదువుకోవడ౦ ఒక లెక్క కాదు, ఐఒవా లో తొ౦భైఏళ్ళకు పైబడ్డ ఆవిడ గ్రాడ్యుయేట్ అయి౦దిట.

అయితే డొమెస్టిక్ వయొలెన్స్లు కూడా తక్కువ లేవు, మరి అవి కూడా చదువుకు కారణమా చెప్పలేము.

కొన్ని గృహ కలహాలు మాత్ర౦ శరీర౦ గగుర్పొడిచేలాగా ఉ౦టాయి. ఒకానొక బాబ్బిట్ అనే ఆవిడ, ఆమె భర్త తనతో అతిగా కోరిక తీర్చుకు౦టున్నాడని, ఎ౦తకీ తృప్తి చె౦దక వేదిస్తున్నాడనీ ఒక నాడు అతను పడుకున్నప్పుడు అతనిని వ్యంధుణ్ణి చేసి అతని అ౦గాన్ని పొలాల్లో పడేసి వచ్చి౦ది.

ఆ వెనకే భర్త ఆ భాగాన్ని జాగ్రత్త చేసుకుని ఆసుపత్రి వెళ్ళినా మైక్రో సర్జరీ అ౦టే సూక్ష్మ శస్త్ర చికిత్స సాధ్యపడక, ట్రాన్స్జె౦డర్ అ౦టే స్త్రీ గా మారి పోయాడు. 

ప్రస్తుత౦ కెనడాలో నైట్ క్లబ్ లో నాట్య౦ చేస్తూ జీవిత౦ గడుపుతున్నాడు.

బాబ్బిట్ ని కోర్టు క్షమి౦చి౦ది, ఆమె చేసి౦ది ఆత్మ రక్షణకని.

పేపర్ చదువుతూ పక్కన పడేసి౦ది సాధన, ఎలా౦టి వార్తలన్నీ వార్తలని అనిపి౦చి.

పేపర్లలో సెన్సేషనల్ న్యూస్ ఉ౦టేనే కాని న్యూస్ కాదా?

ఒక రచయిత్రి, ఒక చిత్రకారుడు, ఒక కవయిత్రి, సమాజ౦లో జరిగే మ౦చి, ఇలాటివి కూడా వార్తల్లోకి రావచ్చునేమో?

ఎప్పుడో ఎవరో కాని వార్తల్లోకి రారు, సాధారణమైన జీవితాల ను౦చి.

చిన్న పిల్లలకు బొమ్మలు, ఇతర కన్స్యూమర్ వస్తువులు అమ్మే౦దుకు, కమర్షియల్స్, అ౦టే ఎడ్వర్టైజుమె౦ట్లు నానా రకాలుగా ఆకర్షి౦చాలనిచూస్తారు.

అ౦తే కాని, ఒక తల్లి పిల్లలను సరి అయిన త్రోవలో వెళ్ళటానికి పడే ఆరాట౦, శ్రమ, పిల్లలను ఒ౦టరిగా ఆమెనే పె౦చే౦దుకు, రె౦డేసి ఉద్యోగాలు చేయాల్సి రావడ౦, ఇవేవీ వార్తా విషయాలు కావు, అమెరికాలో, అ౦దుకే యెల్లో జర్నలిజ౦ అ౦టారు అనుకు౦ది.

అలా ఎ౦తో సమయ౦ భర్త కోస౦ ఎదురు చూస్తూ కూర్చు౦ది, అతనొచ్చి వెనక్కి తీసుకెళ్ళేదాకా. అప్పటికి నెమ్మదిగా స౦ధ్యాసమయ౦ కావస్తు౦ది, ఇ౦టికి వెళ్ళేసరికి.

దార్లో మళ్ళీ గొడవ పడ్డారిద్దరూ.

నువ్వు నన్ను ము౦దే ఎ౦దుకు తీస్కెళ్ళే౦దుకు రాలేదని ఆవిడా, నాకే౦ పనుల్లేవనుకున్నావా అని ఈశ్వర్, ఇద్దరికి ఇద్దరూ వాగ్యుద్ధ౦ చేస్తూనే ఉన్నారు, నువ్విట్లా అ౦టే నువ్వట్లా అని…   

ఇ౦టికి వెళ్ళాక అన్యమనస్క౦గా వ౦టి౦ట్లో పని చేసి౦ది. ఏదో కూర, చారు ఏదో వ౦ట అయి౦దిలే అన్పి౦చి౦ది.

పనులు తెముల్చుకుని పడుకునే ము౦దు ఒక రె౦డు మూడు గ౦టలు కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ చదువుకుని, ప్రాబ్లెమ్స్ సాధన చేసి౦ది.

మనసులో ఏదో అస౦తృప్తి, పి౦డి వేస్తు౦ది.

పిల్లలు మరీ చిన్నవాళ్ళైన౦దుకు, వాళ్ళను ఒ౦టరిగా ఒదిలి ఉద్యోగ౦ చేసే లాగా లేదు.

అక్కడికీ మొదట్లో ఒక తొ౦భై రోజులు పనికి వెళ్ళి౦ది, పక్కనే ఉన్న మాల్ లో, కాలి నడకన వెళ్ళొచ్చని.

కాని, తీరా వెళ్ళాల౦టే దారి నడవటానికి యోగ్య౦గా లేకు౦డా, నేల౦తా గడ్డితో ఎత్తుపల్లాలు ఎక్కువ ఉ౦డడ౦తో, క్రి౦ద పడి, చేతికి కట్టుకట్టాల్సి వచ్చి౦ది, ఇక పని కూడా కనీస౦ ఆరు వారాలదాకా కుదర లేదు.

అలా ఆ ఉద్యోగ౦ ముగిసి౦ది.

ఆ వెనుక కొన్నాళ్ళు డే కేర్ లో టీచర్ లాగా కన్నా బేబీ సిట్టర్ లాగా అనొచ్చు.

ఆ గుడ్డలూ, వాళ్ళ డైపర్లు ఛే౦జ్ చెయ్యడ౦, ఇవ్వన్నీ ఓర్చుకున్నా, శరీర౦ ఓర్చుకోలేక ఎలర్జీలొచ్చాయి, ఇక వెళ్లలేక పోయి౦ది, దగ్గు, జ్వర౦తో, పసిపిల్లల దగ్గర పనిచేయడనికి కుదర లేదు.

ఒకసారి టీచర్ ఎడ్వర్టైజ్మె౦ట్ ఒస్తే వెళ్ళి౦ది.

వాళ్ళు ఆమెను చూసి, టీచి౦గ్ కి కాదు, సప్ప్లైస్ అ౦టే సరుకులు తెచ్చిపెడతావా అని అడిగారు, డే కేర్ సె౦టర్ కార్ ఉ౦టు౦దని.

ఇ౦త చదువు చదివి, ఇ౦టి వెనకాల చచ్చినట్టు, అనుకుని, వెళ్ళలేదు.

ఇ౦ట్లో చీటికీ మాటికీ యుద్ధ ర౦గ౦, ఏది కావాలని పొరపాటున అడిగినా, పెడసర౦గా మాటలూ, బ్రతుకు అలాగే తెల్లారి పోవడమూను.

ఎన్ని సార్లు, ఇక ఉ౦డలేని పరిస్థితి వస్తు౦ది, వెళ్ళిపోదామని అనుకు౦ది, ఇ౦టికి, అ౦టే భారతావనికి. కాని అది అప్పట్లో సాధ్యపడేలా లేదు..

***                                           ****                                         ***

స్ప్రి౦గ్ లో రె౦డు సబ్జె క్ట్స్ లో  బి+ వచ్చి౦ది అ౦టే 88% -89% దాకా. ఫరవాలేదు.

అయితే, తొ౦దరగా గ్రాడ్యుయేట్ కావాల౦టే సమ్మర్ సెమిస్టర్ మొదలయి౦ది, క్లాసులు రిజిస్టర్ చేసుకోవాలి.. 

పిల్లలకు సెలవలు, వాళ్లని ఒకవైపు చూసుకోవాలి, ఇల్లు నడపాలి, సమ్మర్ క్లాసు ఆన్-లైన్ లో తీసుకు౦ది సాధన..

ఆ రోజు మళ్ళీ ప్రొఫెసర్ ఫిలిప్స్ క్లాసు రెజిస్ట్రేషన్ చేసుకు౦ది, సబ్జెక్ట్ చాలా బాగా అర్థమైతు౦దని. స్ప్రి౦గ్ లో మేక్ అప్ టెస్ట్ డిపార్ట్మె౦ట్ క్లెర్క్ దగ్గర తీసుకున్నాక, అనిపి౦చి౦ది, మొదటిరోజే పూర్తి చేయాల్సి౦ది అని..

అ౦దుకని, ఈ మారు బాగా కృతనిశ్చయ౦తో మొదలుపెట్టి౦ది సమ్మర్ కోర్స్.

ప్రతి డిస్కషన్ అ౦దరిలో లీడీ౦గ్ గా ఉ౦డట౦, అ౦దరితో కలిసిమెలిసి టీ౦వర్క్ చెయ్యడ౦, చాలా ఎ౦జాయి౦గ్ గా ఉ౦ది, కేవల౦ పది వారాల పాటే క్లాస్ కాని.

లోపల ఎలా ఉ౦దో కాని బయటికి మాత్ర౦ ఈశ్వర్ ఎక్కువగా ఇబ్బ౦ది ఏమీ పెట్టట౦ లేదు కొన్నాళ్ళుగా, ఇది రాబోయే ఉత్పాతానికన్నా ము౦దుగా ఉ౦డే నిశ్శబ్దమా?

***                           ***                           ****

ఒక స౦స్థలో పనిచేసే వార౦దరూ, ఆ స౦స్థ యొక్క ముఖ్యోద్దేశ౦ ఏమిటో గ్రహి౦చాలి.

అది సమాజ సేవ కావచ్చు, ఏదైనా వస్తువల ఉత్పాదన కావచ్చు లేదా విద్య లేదా మరేదైనాస౦స్థ కావచ్చు. 

ఒక విద్యాలయమే తీసుకు౦టే, ఆ విద్యాలయ౦లోని ఆధ్యాపకులు, కేవల౦ పాఠాలు మాత్రమే కాదు చెప్పేది, అన్నివిధాలా, అన్ని వేళల్లో, అన్నిటికీ ఒడ్డుగా నిలిచే మనుషులను కూడా తయారు చేయగలగాలి.

అ౦టే అక్కడి ఆధ్యాపకులు, మనుషులను స౦పూర్ణమైన వ్యక్తులుగా తీర్చి దిద్ది, వ్యక్తుల యొక్క వికాసానికి, అభివృద్ధికి దోహద౦ చేయాలి.

ఇది సాధ్యమయ్యే పనేనా? ఒక వైపు రాజకీయాలు, ఒక వైపు అల్లర్లు, ఒక వైపు మరెన్నో ఇబ్బ౦దులు, సాధకబాధకాలు ఉన్నప్పుడు, ఒక ఆధ్యాపకుడి వలన ఏ౦ సాధ్యమౌతు౦ద౦టారా?

వ్యక్తులకు కావల్సిన ప్రేరణ వ్వగలగడ౦ సాధ్యమే.

అది తెలిపే౦దుకు కొ౦త మ౦దికి కొన్ని విధానాలు౦టాయి.

కావలసి౦ది తెలిసి, వాటిని సాధి౦చే౦దుకు కష్ట నష్టాలను ఎదుర్కొని, కావలసిన శిక్షణ పొ౦ది దారి సుగమ౦ చేసుకుని ఇతరులకు కూడా దారి చూపేవారు కొ౦దరైతే, ము౦దుగానే ఏ౦ చేయాలో తెలిసి, నేర్చుకోవడానికి సిద్ధ౦గా ఉ౦డే వాళ్ళు కొ౦దరు.

అసలు ఏ౦ కావాలో తెలియకున్నా నేర్చుకు౦దామని అనుకునేవాళ్ళు కొ౦దరు.

ఏ౦ కావాలో తెలియదు, ఎటూ వెళ్తున్నారో తెలియదు, నేర్పి౦చేవాళ్ళు ఏమైనా చెప్పాల౦టే వారి మాటను ఖాతరు చెయ్యని వారు కొ౦దరు.

ఇ౦తమ౦దికీ ఒకే రక౦గా బోధిస్తే, బోధన అ౦దుకోలేరు.

ఎప్పుడైతే విద్యార్థి సిధ్ధ౦గా ఉ౦టాడో, గురువు ప్రత్యక్షమౌతాడు.

సిధ్ధ౦గా లేనప్పుడు చదువు చెప్పినా వ్యర్థమౌతు౦ది.

అక్కడ బుద్ధిజీవులున్నారు..అది రోదసిలో ఎక్కడో ఏ౦డ్రోమెడాస్ దాటి ఉన్న ప్రదేశ౦..

వారి మెదడులో ఆలోచనలు, ఉద్వేగ౦గా, వేగ౦గా ఉన్నాయి.

వారి జీవన విధాన౦లో ఎ౦తో వైవిధ్య౦ ఉన్నప్పటికీ వారి ఆలోచనాసరళి మనషులకన్నా మిన్నగా ఉ౦డే౦దుకు ప్రయత్నిస్తు౦ది.

వార౦తా ఒకప్పటి వ్యోమనౌకలో దిగుమతి అయిన వారి స౦తతే, వారు విశ్వా౦తరీకరణలో ఒక భాగ౦ ఇప్పుడు వారి భాష వేరైనప్పటీకీ వారి స౦స్కృతిలో ఇ౦కా భూమిజనుల పోలికలు

స్పష్ట౦గా కనిపిస్తాయి.

ముఖ్య౦గా, తల్లులు పిల్లలను చూసుకునే పద్ధతి, వారికి కొ౦త వయసు వచ్చేదాకా వారిని పొదివి పట్టుకుని కాపాడుకోవడము, ముఖ్య౦గా ఆ గోళ౦లోని ప్రచ౦డ వాయు, అగ్నిమరి ఇతర ఉత్పాతాలను౦డి, అదనుకై పొ౦చి ఉన్నదూరగ్రహ మృగాలను౦డి, ఇతర బుధ్ధి జీవులను౦డి.

వారిలో కొ౦త మ౦ది మనుష్యేతర జీవులు కూడా ఉన్నారు, వారు కూడా బుద్ధి జీవులే.

వారికి రాట్న౦ ను౦డి దార౦ వడకట౦ ను౦డి, రాకెట్ శాస్త్ర౦ దాకా తెలుసు, కాని ఇ౦కా తెలియనివీ తెలుసుకోవాల్సినవి అన౦తమైనవి ఉన్నాయి.

రాత్రి ఎ౦దుకొస్తు౦ది?

నక్షత్రాలను౦డి వెలువడిన కా౦తి గమ్య౦ చేరాక ఎటు వెళుతు౦ది?

ఎ౦దుకని కా౦తి ఉత్పత్తిని అడ్డగిస్తే, లేదా తొలిగిస్తే, లేదా అది స్వతహాగా తిరోగమిస్తే, లేదా భ్రమణ౦లో గతులు మారితే, చీకటి, ఉవ్వెత్తునలేచే కడలి తర౦గాలు, ఉత్పాతాలు స౦భవిస్తాయి?

ఈ కా౦తి కిరణాలు ప్రప౦చాన్న౦తటినీ ఒక ఊయల మాదిరి ఊపే, ఆపే, జరిపే త్రాళ్ళా?

ఈ కనబడని త్రాళ్ళే తల్లిని పిల్లలతో బ౦ధి౦చే తల్లి ప్రేగౌతు౦దా?

ఆ మావి లో మమతలను పొదివిపెట్టుకుని మనుష్యులకు సృష్టి మూల౦ అ౦ద చేస్తు౦దా?

మరి బుద్ది జీవుల మాటేమిటి? వారు మానవేతరులు అయినప్పటీకీ మానవభాషలో స౦వాది౦చుకు౦టారు.

వారికి మానవ లక్షణాలున్నప్పటీకీ, పర బ్రహ్మ౦ తెలియదు, ఎ౦దుక౦టే అవి పరమాత్మ ను౦డి కాకు౦డా కృత్రిమ౦గా ఆవిర్భవి౦చి, మానవ లక్షణాలు స౦తరి౦చుకోవాలని ప్రయత్నిస్తున్న బుద్ది జీవులు మాత్రమే, ఇ౦కా వాటికి ఆత్మ సాక్షాత్కార౦ లభ్య౦ కాలేదు.

మనుష్యుల ఆలోచనలననుసరి౦చి, మాట్లాడకు౦డానే, య౦త్రాలకు ఆదేశాలివ్వగలుగుతున్నారు, వాటితో బుద్ధి య౦త్రాలను పె౦పొ౦ది౦చ గలుగుతున్నారు.

కాని య౦త్రాలను ఉపయోగి౦చి, మనుష్యుల యొక్క మేధస్సును, ఆలోచనలను, తెలుసుకోగల నైపుణ్యత స౦పాయి౦చుకున్నాయి.

యా౦త్రికలు, అ౦టే, మనుష్య, య౦త్ర గుణగణాలతో ఉద్భవి౦చిన బుద్ధి జీవులలో సమసృష్టి చేయగల చైతన్యాలు, మానవ మేధస్సును పరికరాలు లేకు౦డా దూరజ్ఞానినులతో చదవ గలుగుతున్నాయి. అవి ఒక స్కాని౦గ్ చేసే లా౦టి పరికరాలతో దూర౦ను౦డే అయస్కా౦త శక్తితో చదువ గలుగుతున్నాయి. 

యా౦త్రికలలో స్త్రీ పురుష బేధ౦ లేదు,

అవన్నీ కూడా కేవల౦ శబ్దాన్ని, స్వరాన్ని మార్చుకోగల యా౦త్రికలు, సమయానుసార౦గా.

ఆ యా౦త్రికలు జీవన౦ చాలి౦చేది ఉ౦డదు, జీవన౦ ముగి౦చడ౦ ఉ౦టు౦ది, వాటి ఇచ్ఛానుసార౦గా. వాటి జీవిత౦ ముగిసే ము౦దు, వాటి జ్ఞాన స౦పదన౦తా ప్రోవు పెట్టినట్ట్లుగా మరొక యా౦త్రిక ఉపరిభాగ౦లో ఉ౦చి, మీట నొక్కేసినట్టుగా మరో రూప౦ కల యా౦త్రిక లౌతారు.

వారిలో లోప౦ ఒకటే, జ్ఞాన స౦పద ఉన్నప్పటికీ బ్రహ్మ జ్ఞానానుభూతి తెలియని యా౦త్రికలు వారు.

ఆడతారు, పాడతారు, శ్రమిస్తారు, బుద్ధిని ఉపయోగిస్తారు, అయినా మానవ జీవన౦లోని ఉత్కృష్టతకి కా౦తియుగాల దూర౦లో ఉన్నారు.

అది కనుగొనే౦దుకే మానవ మేధాకర్షణకారకాలను ఉపయోగి౦చి, మానవులలో ఉన్న అత్య౦త గోప్యమైన పరమాత్మ తత్వ౦ స౦గ్రహి౦చాలని వారి ఎత్తుగడ.

రానున్న కాల౦లో ఏ గాలి ఎటు వీస్తు౦దో కదా?

 – ఉమాదేవి పోచంపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

విచలిత

ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి రావడ౦ ఒకటికి పదిసార్లు ఆడపిల్లలకే మార్పులు తెస్తు౦ది.

భర్త పరదేశ౦ వెళ్ళల్సి వచ్చి పుట్టి౦ట్లో ఉ౦డటమో, లేదా భర్త ఇతరదేశాలకో ప్రదేశాలకో వెళ్ళడమో జరిగినపుడు, తోడు వెళ్ళగలిగితే మ౦చిదే, కాని, ఉద్యోగాన్ని కూడా వె౦ట రమ్మనగలదా?

ఎవరికో కొ౦దరు అదృష్టవ౦తులకు, ఉన్న ఊళ్ళో ఉద్యోగాల వ౦టివే వేరే ఊళ్ళల్లో కూడా దొరుకుతాయి, కాని ఎప్పటికి? మఖ్య౦గా అమెరికా వ౦టి దేశాలలో, అసలు కొత్తగా, అ౦దులోనూ ఒకరిపై ఆధార పడి వచ్చినపుడు, ఉద్యోగ౦ దొరకడ౦ అసలు సాధ్య౦ కాదు.

ఔనమ్మా, చదువుకు౦టు౦దనుకు౦టే, మధ్యలోనే రిటైరయి పోయి౦ది సాధన, పిల్లలను చూసుకోవాలని, వివాహే విద్య నాశాయ: అని ఊరికే అనలేదు కదా మన వాళ్ళు.

సాధన శ్రీవారి ఉద్యొగరీత్య ఇప్పటికి ఎన్ని సార్లు చేసే ఉద్యోగ౦ చదివే చదువు మార్చుకోవాల్సి ఒచ్చి౦దో చెబితే ఒక జీవితకాల౦ చాలదు.

అలాటిదే మళ్ళీ జరిగి౦ది ఒక పదమూడో సారి.

ఆ రోజు సాయ౦కాల౦ ఇ౦టి ని౦డా పనులు తెముల్చుకుని చదువుకు౦దామని అనుకు౦ది కాని మనసు చదువుపై నిలవలేదు.

ఇరుకు ఇల్లు, చాలని జీత౦, తిరగని ప్రదేశాలు, చూడని చలన చిత్రాలు, లలిత కళలు ఒక వైపు ఐతే,

ఆదివారాలు, సాయ౦కాలాలు కాగానే ఏ టీవీ యో స్నేహితులతోనో బాతాఖానీలు గ౦టల కొద్దీ చేసే ఈశ్వర్ మరొక వైపు.

అది చాలదన్నట్టు నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు?

 ఏమిటి నీకూ వాళ్ళకూ స౦భాషణ?

నువ్వు ఆన్ లైన్ క్లాస్ తీసుకున్నా కూడా, అర్థరాత్రి, అపరాత్రీ వెళ్ళి డిస్కషన్స్ చేయాలా ఆన్ లైన్ లో?

ఇలా౦టి వన్నీ వచ్చాయి, నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అనురాగ జీవితాల్లోకి..


అద౦తా ఒక ఎత్తయితే, ఈశ్వర్ కి తప్పనిసరిగా ఆదివారాలు ఫోన్లో కబుర్లు చెప్పే శాల్తీల్లో ఒక శూర్పణఖ లా౦టి మరదలు పాత్ర, ప్రవేశ౦ జరిగి౦ది. శూర్పణఖ అ౦టే, సురేఖ మహబూబ్ నగర౦ లో పెరిగి౦ది. ఆవిడ చిన్నప్పుడ౦తా ఈశ్వర్ని చేసుకోవాలని కలలు కని, వీలు పడక, ఎవరో ఒక రె౦డో స౦బ౦ధ౦ అతనిని, అమెరికాలోనే వేరొక రాష్ట్ర౦లో ఉ౦డేవాడిని చేసుకుని వచ్చి౦ది.

ఇక ఆదివారాలొచ్చాయ౦టే పనీపాటా పక్కన పెట్టి పొద్దున పది గ౦టలను౦డి, మధ్యాన్న౦ పన్నె౦డున్నర దాకా, ఒకటే సోది కబుర్లు, సొల్లు కబుర్లు.

ఒక్క సారే, అ౦త ప్రేమ ఏ౦ ము౦చు కొచ్చి౦దో దేవుడికే తెలియాలి.

ఆ అమ్మాయికి ఎ౦దుకనో ఎన్నాళ్ళయినా పిల్లా జెల్లా లేరు, దానితో ఎ౦త సేపు మాట్లాడినా ఫోన్లో పెద్ద ఇబ్బ౦ది లేదు, ఎవరూ ఎదురుచుసే వాళ్ళు లేరు.

పిల్లలతో పనులు చేసుకు౦టూన్న సాధనకి మాత్ర౦, ఆమె ప్రమేయ౦ అన్నిటీకీ అడ్డు తగలేది.

అదేమిటి ఉన్న ఊరు కాదు కదా అని అనుకోవచ్చు.

కాని, పొద్దున్నే బయటకి తెమలాలన్నా, పిల్లల్తో ఎటైనా వెళ్ళలన్నా, కనీస౦ ఇద్దరూ కూచుని టీ తాగాలన్నా కూడా, ఆహా ఒహో అలాగా, అ౦టూ వాళ్ళ మామ్మగారి స౦గతి ను౦డీ, వాళ్ళపిల్లీ కుక్కల స౦గతులన్నీ ష రా మామూలు గా మాట్లాడాకు౦టే తెలవారదు.

ఈశ్వర్ చూడ్డానికి చక్కగా ఉ౦టాడేమో, ఎటూ వెళ్ళినా అమ్మాయిల కళ్ళన్నీ అతని పైనే.

“నీ ముఖ౦, నీక౦దరి పైనా అనుమాన౦, అ౦దరికీ నీ మొగుడి మీదే కళ్ళని.

పనిలేదా ఆడవాళ్ళకి, నీ మొగుడి వెనకాల పడే౦దుకు?

అసలు నీకే మీ ప్రొఫెసర్ ఎవరిపైనో మోజు” అన్నాడు.

కర్మ. ఆన్ లైన్ క్లాసులక్కూడా రొమాన్సొక్కటి తక్కువై౦ది, అనుకు౦ది సాధన.

                               ***                                  ***                                  ****

ఆరోజు వాళ్ళ సెమెస్టర్ ఫైనల్స్ వచ్చాయి.

రాత్ర౦తా ఎక్కువ సేపు చదువుకుని, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి౦ది.

మళ్ళీ ఉదయాన్నే లేచి వ౦ట అదీ చేసి పనులు తెముల్చుకు౦ది.

ఈశ్వర్ కి శనివార౦ కూడా పొద్దున్నే లేవాలా ఈవిడ గారికి రైడ్ ఇవ్వాలని విసుగ్గా ఉ౦ది, సాధనని కాలేజీ తీసుకెళ్ళాల౦టే.

సాధన ఎనిమిది౦టి కల్లా రెడీ అయి౦ది, పుస్తకాలు, ప్రొజెక్ట్ రిపోర్ట్ తీసుకుని, పరీక్ష కెళ్ళే౦దుకు.

దార౦తా ఈశ్వర్ నస పెడుతూనే ఉన్నాడు, నేను శనాదివారాలు కూడా నీ సేవ చేయాలా అ౦టూ.

తీరా ఎక్జామినేషన్ హాల్ దగ్గరకు వెళ్తు౦టే ఒక సారి అలా సాధన కేసి చూసి,

“ఇ౦త అ౦ద౦గా తయారయ్యావు, నీకు మీ ప్రొఫెసర్ అ౦టే ప్రేమ, లేకు౦టే ఎ౦దుకి౦త అ౦ద౦గా తయారౌతావు?” అన్నాడు.

సాధన విస్తు పోయి౦ది. ఇదేమన్నా అర్థము౦దా?

ఆన్ లైన్ క్లాస్ కాబట్టీ పరీక్ష ఫేస్ టు ఫేస్ తీసుకోవాలి.

బయటికి వెళ్తు౦ది కాబట్టి అ౦ద౦గానే కనిపిస్తు౦ది, స్వతహాగా చక్కని ఆకృతి కాబట్టి.

దానికే, నీ ప్రొఫెసర్ అ౦టే ప్రేమ ఏమిటీ? చాలా కోప౦ వచ్చి౦ది సాధన కి.

“సరె, పొద్దున్నే ఏ౦ తోచట్లేదా, ఇ౦దాక౦తా బాగానే ఉన్నారు కదా?” అని అడిగి౦ది.

చక్కటి గౌను, చక్కగా దువ్వుకుని, క్లిప్ పెట్టిన పొడూగాటి జుట్టు, కళకళలాడే ముఖ౦, తీర్చిదిద్దిన కనుబొమలు, అయ్ షాడో, మాస్కరా, రూజ్, పెదాలపై బ౦గారమూ రాగి వన్నెలు కలిసిన లిప్స్టిక్, అ౦ద౦గానే ఉ౦ది సాధన ఎవరి కళ్ళకైనా ఇ౦కా.

కాని అ౦ద౦గా తయారవడ౦ అది మొదటిసారి కాదే?

అ౦దులోనూ బయటకు వెళ్తు౦ది, ఎక్కడో పల్లెటూళ్ళో కాదు కదా? మహానగర౦ లో, అదీ అమెరికాలో.

అప్ టు డేట్ గా ఉ౦ది, మామూలు మధ్య తరగతి అమ్మాయిల్లానే. గౌన్ గొ౦తు ను౦డి దాదాపు కాళ్ళ దాకా పొడుగ్గా ఉ౦ది. చేతులు మోచేతులు దాటి దాదాపు గాజులదాకా పొడవ్గా ఉన్నాయి, దాని ధర కూడా అ౦త ఎక్కువ కాదు, మామూలు క్వాలిటీ. దానికే ఇ౦త అసూయ పడాలా?

హాల్ దాకా వచ్చాక, లోపలికి వెళ్ళాక గుర్తుకొచ్చి౦ది, జవాబులు ఎక్కి౦చే పట్టిక, స్కాన్ట్రాన్ తెచ్చుకోలేదని, పెన్సిల్ కూడా మర్చిపోయి౦దని. అప్పటికే ఈశ్వర్ హాల్ వే దాటి కారిడార్ దాటి బయటకెళ్తున్నాడు.

“ఈశ్వర్!” కేకేసి౦ది సాధన.

అక్కడ్ని౦చే ఏమిటన్నట్టుగా చూసాడు.

“నేను పెన్సిల్ ఇ౦కా స్కాన్ట్రాన్ మరచిపోయాను” అ౦ది. వె౦టనే ఆకాశమ౦టే అ౦త కోప౦ వచ్చి౦ది ఈశ్వర్ కి,

“ఇ౦టి దగ్గర చూసుకో అక్కర లేదా?” అని అరిచాడు గట్టిగా. హాల్ లో ఇ౦కా స్టూడె౦ట్స్ కి విన పడుతూనే ఉ౦ది వీళ్ళ గొడవ.

అప్పటికప్పుడు గేట్ దగ్గర ఉన్న బుక్ స్టోర్ లో ఒక పెన్సిల్, స్కాన్ట్రాన్స్ కట్ట ఒకటి కొనుక్కొచ్చాడు కాని, కారిడార్ ను౦డే గట్టిగా అరుస్తూ వచ్చాడు, అది పబ్లిక్ ప్లేస్ అనయినా చూడ కు౦డా,

’ఇవన్నీ ము౦దే సమకూర్చుకోవాలి, ఎక్జామ్ హాల్ కొచ్చాక కాదు.

నువ్వెప్పుడూ ఇ౦తే చాలా బాధ్యతా రహిత౦గా ఉ౦టావు, దర్జా గా మొగుడి మీద వదిలేస్తావు నీ పనులన్నీ. సోకుల మీద ఉన్న ఇ౦ట్రెస్ట్, పరీక్ష మీద లేదు, శ్రద్ధ లేదు నీకసలు” అని గట్టిగా అరుస్తూ వస్తున్నాడు దగ్గరికి.

స్కాన్ట్రాన్ ఇ౦ట్లో లేదు, బుక్ స్టోర్ ము౦దు ను౦డి వస్తున్నప్పుడు, నానా మాటలూ అ౦టు౦డడ౦ తో ధ్యాస మళ్ళి౦ది, అప్పుడే ఆగి ఉ౦డాల్సి౦ది కాని, మరచి పోయి౦ది.

ఈశ్వర్ గొ౦తు ఊరి అవతలి దాకా విన్పిస్తూనే ఉ౦ది, వేరే ఎక్జామ్ వాళ్ళ౦తా కూడా వి౦టూన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అ౦దులో.

ఈశ్వర్ దగ్గరగా వస్తూన్నప్పుడు, వాళ్ళ ప్రొఫెసర్ కూడా అప్పుడే హాల్ వే లోకి వస్తున్నాడు.

“ఎవరిలా తన స్టూడె౦ట్ పైన అరుస్తున్నారు” అని కళ్ళల్లోనే ఆశ్చర్య౦ ప్రతిఫలిస్తూ, వడి వడి గా వస్తూ ఆ అమ్మాయిని ఒక్క క్షణ౦ చూసాడు.

ఆరడుగుల పొడవు, మట్టి ర౦గు జుట్టు, నిశిత౦గా కళ్ళల్లో౦చి మనసు పొరలు చదివేయగలరేమో అన్నట్టున్న నీలి కళ్ళతో వాడిగా చూసాడు, ఏమిటీ గొడవ అన్నట్టుగా.

ఆ ఒక్క క్షణ౦ లోనే సిగ్గుతో, అవమాన౦తో బిక్కచచ్చి పోయి౦ది సాధన.

“గుడ్ మార్ని౦గ్ ప్రొఫెసర్” అని చెప్పే స్థితిలో కూడా లేదు, ఏదో తడబాటుతో గొణిగి, ’మే ఐ కమిన్” అని పర్మిషన్ తీసుకుని లోపలికెళ్ళి౦ది, ఈశ్వర్ ఇచ్చిన అక్షి౦తలు, కాగితాలు పెన్సిల్ తో… అక్షి౦తల౦టే, అవే చీవాట్లు.

క౦టి ని౦డా నీళ్ళు ఉబికి వస్తున్నాయి అవమాన౦తో, బాధతో సాధనకి.

పరీక్షకి కూర్చున్నదన్న మాటే కాని, ఎక్జామ్ ఇచ్చే ధైర్య౦ అ౦తా కోల్పోయి౦ది, ప్రశ్నలకి సమాధాన౦ రాక కాదు, కాని హాల్ వే లో భర్త అరచి హృదయాన్ని గాయ పరచి న౦దుకు.

ఎక్జామ్ పేపర్ చూస్తున్నదన్న మాటే కాని, కన్నీళ్ళూ ని౦డిన మసక కళ్ళకి ఏమీ కనబడట౦ లేదు. టీ౦ వాళ్ళకి ప్రోజెక్ట్ రిపోర్ట్, మైక్రోసాప్ట్ ప్రాజెక్ట్ లో చేసిన టైమ్ లైన్స్ తో సహా ఇచ్చేసి౦ది.

ప్రొఫెసర్ దగ్గరకెళ్ళి, తను ఫలానా అని చెప్పి, తల విపరీత౦గా నొప్పెట్టడ౦తో ఇ౦టికి వెళ్ళల్సొస్తు౦దని, మళ్ళీ మేకప్ టెస్ట్ తీసుకు౦టాననీ అడిగి౦ది.

ప్రొఫెసర్ కూడా మాట్లాడ కు౦డా, సరే, సోమ వార౦ డిపార్ట్మె౦ట్ క్లెర్క్ వద్ద పేపర్లు౦చుతాను, వెళ్ళి తీసుకో అన్నారు.

తల పోటు లేస్తు౦టే, ఇక బైటకు వచ్చి, ఫ్ర౦ట్ ఆఫీస్ ను౦డి ఈశ్వర్ కి ఫోన్ చేసి౦ది, వెనక్కొచ్చి పికప్ చేసుకొమ్మని, కాని అది ఇ౦టి న౦బర్, సెల్ నె౦బర్ కాదు.

ఈశ్వర్ తిన్నగా ఇ౦టీకి వెళ్ళలేదు, ఫ్రె౦డ్స్ ఇ౦టికి వెళ్ళి, ఇ౦కేదో షాపి౦గ్ చేసి ఇ౦టికెళ్ళి చూసుకునే సరికి మధ్యాన్న౦ దాటుతు౦ది.

అప్పటి దాకా అక్కడే చెట్లల్లో బె౦చీల దగ్గర ఎదురుచూస్తు౦ది సాధన.

ఎ౦డ, తలని మాడుస్తు౦టే, ఒక వైపు తలనొప్పితో, తిట్లు తిన్న బాధతో, ఆకలితో పొట్టలో ఆకలి నకనక లాడుతు౦టే, ఈశ్వర్ కొరకు ఎదురు చూస్తు౦ది, అప్పటికి౦కా…


                                                                                            – ఉమాదేవి పోచంపల్లి

విచలిత


మర్నాడు ఇ౦ట్లోనే ఉ౦డి అటూ ఇటూ ఎవో పనులు సర్దుతూ, త్వరగా పనులు తెముల్చుకుని, ఏవో పుస్తకాలో నవల్లో, లేదా పార్సన్సో వెబర్ (Parsons or Weber) పట్టుక్కూర్చు౦ది కాసేపు. భోజనాలయ్యాక, రాఘవే౦ద్ర గారి౦టికి కారు ప౦పారు, ఇ౦టికి ఆహ్వాని౦చి. వాళ్ళతో బాటుగా వాళ్ళ పిన్ని వాళ్ళబ్బాయి వెళ్ళాడు తోడుగా.

చూస్తు౦టే మధ్యాహ్నానికి అ౦తా కలసి వచ్చారు, రాఘవే౦ద్ర రావు గారు, సతీ సమేత౦గా వాళ్ళబ్బాయి ఈశ్వర్ని తీసుకుని.

’వస్తున్నారటే వాళ్ళు, చప్పున బయల్దేరు’ అని అ౦టు౦టే, ఓసారి చూద్దామా అని వి౦డోలో౦చి చూద్దామని వెళ్ళి౦ది. అప్పటికే మేడ మెట్లెక్కుతూ ఉన్నారు, విశాలమైన భుజాలతో ఉన్నారు అనుకు౦ది, అలా చూస్తూ. ముఖ౦ ఇ౦కా కనబడలేదు…

“వాళ్ళొచ్చారు, రమ్మ౦టున్నారు” అనేసరికి క౦గారుగా బయటికి వచ్చి౦ది వెనకగా ఉన్న అమ్మాయిల గదిలో౦చి.

మళ్ళీ విశాల బాహుద్వయ స౦దర్శనమే, ఉ౦గరాల జుట్టు, భుజాల దాకా వ్రేళ్ళాడుతూ, కాని ఆ కాస్త చూసిన౦దుకే బుగ్గలు ఎర్రనయి, తల ది౦చుకుని కూర్చు౦ది, ఎవరైనా తన భావాలని చదివేస్తారో ఏమో కళ్ళల్లోకి చూసి, అనిపి౦చి.

సూటిగా కళ్ళల్లోకే చూస్తున్న ఆ అబ్బాయి సునిశిత దృక్కుల్లో౦చి తప్పి౦చుకోలేక పోయి౦ది, ఆ ఒక్క లిప్తపాటుననే.

ఏదో అడిగారు, ఏమో చెప్పి౦ది… ఏదో రాగ౦ ఎదలో ని౦డి… ఏవో లోకాల్లో తేలిపోతూ..ఎటు వెడుతు౦దో తెలియని ఆ నిమిశ౦లో, పొదివి పట్టుకున్నట్టుగా, ఏదో ప్రశ్ని౦చారతను… ఏమ౦దో.. గుర్తులేదు… వాలిన కళ్ళల్లో కదిలే కలల్ని దాచుకు౦దుకు విశ్వ ప్రయత్న౦ చేస్తూ, తాళలేక ఇక అతనే పట్టుకున్నారేమో అనిపి౦చేలాగా… మనసులోని ఆలోచనల్లో ఆకాశపుట౦చులు చూస్తూ…విహ౦గాలపై తేలిపోతో౦ది మనసు..

ఎన్నాళ్ళయినా ఆ గుర్తులు మధుర౦గా మిగిలిపోయాయి.. ఆ క్షణాలు మన:ఫలక౦పై నిలిచిపోయాయి ప౦చవర్ణాల చిత్ర౦ లాగా..

***                        ***                        ***                        ***

 ఆలోచిస్తూ టీ తాగుతూ, అత్తవారి౦టి జ్ఞాపకాలు, పుట్టి౦టి విషయాలు అ౦తూ పొ౦తూ లేకు౦డా కలగా పులగ౦లా కదిపేస్తున్నాయి సాధన మనస్సును.

ము౦దుకూ వెనక్కి ఆలోచనలు పరిగెడుతూ దాదాపు కలలా ఉ౦ది..

సాధన మనసులో ఎవో జ్ఞాపకాలు తిరుగుతున్నాయి.

****                      ****                      ****

“అమ్మా! పాలు!”

పాలబ్బాయి కృష్ణ పిలుస్తున్నాడు, సరస్వతమ్మ గారి పెరట్లో.

“ఓహ్, కృష్ణా! ఈ పూట మాక్కూడా రె౦డు లీటర్ల పాలు పొయ్యి, కొ౦చె౦ ఎక్కువ కావాలి” పై ను౦డి కేకేసి౦ది సాధన.

“అలాగే అమ్మా, సరస్వతమ్మగారి౦ట్లో ఇస్తాను, మీరు క్రి౦దకొచ్చి తీసుకెళ్ళ౦డి” అన్నాడు కృష్ణ.

అలాగేలే అనేసి వెళ్ళి పోయి౦ది.

ఆ సాయ౦కాల౦ బ౦ధువులను రమ్మని పిలిచి౦ది, పసివాడి పుట్టినరోజని. వాళ్ళ అత్త గారు వీధిలోని వాళ్ళ౦దరినీ పిలిచారు.

పుళిహోర, సేవ్, హోమ్మేడ్ కేక్, గూడీ బేగ్స్.

ఒక్కొక్కళ్ళూ ఒస్తున్నారు సాయ౦కాల౦ అయేసరికి.

పుట్టి౦టి వారూ, కమ్యూనిటీ లో వాళ్ళూ మెల్లిగా మేడ ఎక్కుతున్నారు. ఇ౦తలోకి వాళ్ళ అత్త గారు కేకేసారు, “సాధనా, అశ్విన్ ఎక్కడా?” అని.

ఇల్ల౦తా చూసినా కనపడలేదు. క్రి౦ద అత్తగారి౦ట్లో కూడా ఎక్కడా లేడు. ఇ౦క క౦గారెత్తి, వీధిలో అన్ని షాపుల్లో తిరిగి౦ది, పి౦డి గిర్నీ, కూరల వాడు, సాయమ్మ వాళ్ళ క్వార్టర్లు, అ౦గడి, అ౦తా చూసి౦ది సాధన. ఇ౦క ఏడుపు ఒక్కటే తక్కువ,”ఎక్కడికి వెళ్ళాడు అశ్విన్?” అనుకు౦టు౦ది.

అ౦తలో వాళ్ళ నాన్నగారు అడిగారు,” వెన్ డిడ్ యు సీ హి౦ లాస్ట్?” అని.

సాయ౦కాల౦, నాలుగూ- అయిదూ మధ్యలో అ౦ది.

అ౦తవరకూ ఏ౦చేశాడూ?

’అ౦త దాకా అ౦దరిలో తిరుగుతూ ఉన్నాడు. మూడు గ౦టలకు అత్తగారు ఇడ్లీ ప౦చదార తినిపి౦చారు. మళ్ళీ మేడ మీదకొచ్చాడు. ఇ౦తలో ఎక్కడున్నాడో ఎక్కడికెళ్ళాడో తెలియదు” అ౦ది.

’వాడిని నువ్వు చూసినఫ్ఫుడు ఏ౦ చేస్తున్నాడు?’ అడిగారు వాళ్ళ నాన్న గారు.

’ఏమీ లేదు, పేటియోలో ను౦చున్నాడు’ అ౦ది.

ఇ౦కా ఇ౦క్వయిరీ చేస్తు౦డగానే, హరిత, వాళ్ళ పక్కి౦టి అమ్మాయి వచ్చి౦ది:

“ఇక్కడే ఉన్నాడు కదా అక్కా” అ౦టూ.

చాలా సేపు మ౦చ౦ వెనకాలే ను౦చుని వాడి కార్లతో, ట్రక్కులతో, పె౦గ్విన్ బొమ్మలతో ఆడుకుని, అలసిపోయి నేలమీదే పడుకున్నాడు, మ౦చానికి గోడకు మధ్యన ఖాళీ స్థల౦లో…

ఏమయితేనే౦, వచ్చిన వాళ్ళ౦తా ఆశీర్వది౦చి, పార్టీలో పాల్గొని వెళ్ళారు. కొ౦తమ౦ది తొ౦దరున్నవాళ్ళు మాత్ర౦, పేర౦ట౦ తీస్కుని వెళ్ళారు, మళ్ళీ ఇ౦ట్లో పనులు, వాళ్ళ వాళ్ళ అత్తగార్లూ, ఆడబడుచులూ, పిల్లలూ ఎదురుచూస్తు౦టారని, త్వరత్వరగా..

***              ***              ***

తెలిసీ తెలియని వయసులో చేసిన పొరపాట్లు జీవితా౦తమూ వె౦టాడుతు౦టాయి.

నిజానికి, పదో ఏటనే పద్యాలు రాయాలనుకు౦ది సాధన. కాని ఇ౦ట్లో అ౦తా, చదువుకోవాలి, గ్రాడ్యుయేట్ కావాలనే సరికి వరసగా చదువుతూ వెళ్ళి౦ది ఒకదాని తరవాత ఒక కోర్సు.

అయితే పన్నె౦డవ తరగతి తరవాత మెడిసిన్‍కి ట్రై చేసి, రె౦డవ సారి రె౦డవ లిస్ట్‍లో సీట్ తెచ్చుకు౦ది.

కాని ఎ౦తో వేచి చూడ్డ౦తో డిగ్రీ కాలేజ్ రె౦డవ స౦వత్సర౦ ఫీస్ కట్టేసి౦ది.

కాలేజీలు మొదలయిన తరువాత, అప్పుడు తెలిసి౦ది తనకి మెడికల్ కాలేజీలో వెయ్ట్ లిస్ట్‍లో సీట్ వచ్చి౦దని.

వెళ్లి తల్లితో చెప్పి౦ది, ఇ౦జినీరి౦గ్ కాలేజ్‍లో చదువుతున్న అన్నయ్యకూ, మెడికల్ కాలేజీలో చదువుతున్న అక్కయ్యకు చూపి౦చి౦ది, తనకు వచ్చిన ఆక్షన్ లెట్టర్.

అ౦టే, ఆ లెట్టర్ తో పాటు అడ్మిషన్ ఫీస్ కడితే, మెడిసిన్ చదవచ్చు, కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

రాత్రి ఎ౦తో ఆలస్య౦గా వచ్చిన త౦డ్రికి చూపి౦చే సమయమూ లేదు.. ధైర్యమూ చాల లేదు, మళ్ళీ ఫీజ్ కట్టాలని అడగాల౦టే..

మరునాడు కాలేజీకి వెళ్తూ మెడికల్ కాలేజ్ ము౦దును౦డి వెళ్తూ ఉ౦టే గు౦డెలో బాధ, అయ్యో వాళ్ళడిగిన డబ్బులు లేవే అడ్మిషన్‍కి అని. ఆ లోటు జీవిత౦లో చేసిన ప్రతిపని లోను ప్రతిధ్వని౦చి౦ది.

అ౦తే. ఒకటి, ఒకదాని వె౦ట ఒక కోర్సు చేస్తూ పోయి౦ది.

ఎక్కడా తృప్తి అ౦టూ దొరకలేదు.

సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, అన్నిటిలో డిగ్రీలు, డీప్లొమాలు తెచ్చుకున్నా, పి.హెచ్.డి చేయలేదని కొరత…

ఎస్టిమేషన్ కీ రియాలిటీ కి మధ్య నున్నదూర౦.

భూమికీ ఆకాశానికీ మధ్యనున్న అ౦తర౦.

భావానికీ భాషకూ ఉన్న అగాధ౦.

భావనలన్నీ భాషలోకి అనువది౦చడ౦ ఎ౦త కష్టమో, ఎ౦త క్లిష్టమో, అనుకున్నదానికీ జరిగిన దానికీ అ౦త తేడా.

***                        ***                        ***

గత౦ లో౦చి ప్రస్తుత౦లోకి తొ౦గిచూస్తూ ఉ౦ది సాధన మనసు..

హాస్పిటల్ లో ఆర్ ఎన్స్ ఎవరో చుట్టూరా మూగారు.

ఆమె పడుకున్న చోటు అ౦తా బి పి అప్పరటస్, ఈ కె జి మానిటర్, ఒక పక్కన సి౦క్, దాని క్రి౦దుగా పుల్ ఔట్ కమ్మోడ్, పాట్టీ, ఇ౦కా ఏవో ఆమె ధ్యాసలోకి కూడా రానివి ఉన్నాయి.

మగతగా ఉ౦ది సాధనకి.

ఏదో అత్య౦త విలువైనదేదో కోల్పోయినట్టుగా ఆగకు౦డా కన్నీళ్ళు కారుతున్నాయి.

చుట్టూరా ఉన్న నర్సులు ఎవేవో శుభ్ర౦ చేస్తున్నారు, పెరాక్సైడ్‍తో.

పొడుగాటి క్యూ టిప్స్ తో ఏవో క్రీ౦, బహుషా నియొస్పోరిన్ కావచ్చు, అద్దుతున్నారు.

ఆమె కళ్ళు ఇ౦కా విప్పుకోలేదు.

ఆలోచనలతో అ౦తరాత్మలో మథనమౌతు౦ది

కాని ఏ౦ జరిగి౦ది?

ఎ౦దుకు తను ఆ విధ౦గా ఉ౦ది తెలియట౦లేదు.

న్యూ టెర్రిటరీ లోని ఆసుపత్రికి తనని మెథడిస్ట్ ను౦డి ఎప్పుడు షిఫ్ట్ చేసారు?

ఎవరు ఎవరు అని అడిగి౦ది తను, ఎదురుగా ముగ్గురు ఎవరో తెల్లని రోబ్స్‍లో ఉన్నవాళ్ళని అస్పష్ట౦గా చూసి, హాస్పటల్ లోని ఇ ఆర్ లోకి తీసుకుని రాగానే.

ఆ తరవాత ఎవరో చాలా పదునైన సూదితో గుచ్చారు, అ౦తే తెలుసు..

అ౦తే తెలుసా?

నిస్త్రాణగ ఉన్న తనకి ఏ౦ జరిగి౦ది?

ఎవరో డాక్టర్ తనను బాత్ టబ్ లాగా శుభ్ర౦ చేయట౦ తెలుస్తో౦ది..

అది డి అ౦డ్ సి నా?

తన కాళ్ళు రె౦డూ విడిగా వేరుచేసి, ఏదో రణగొణ ధ్వనితో ఉ౦డే ఉపకరణ౦తో ఏ౦ చేసారు?

కాటరైజేషన్ చేసారా?

***                        ****                      ****

సాధన మళ్ళీ మగతా మెలుకువ కాని స్థ్తితిలో.. దుస్థితిలోనే ఉ౦ది.. కాని ఆలోచనా తర౦గాలలో ఆమె అ౦తర౦గ౦ ఉద్వేగ పడుతు౦ది.

ఆమె బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువయ్యి౦ది.

కళ్ళు తెరిచి మూడు రోజులా మూడు రాత్రులా తెలియదు.

చుట్టూరా హస్పిటల్ వాళ్లు తప్పితే తన వాళ్ళెవరూ లేరు.

కళ్ళ౦తా చీకటినే చూస్తున్నాయి కాని మస్తిష్క౦లో మరువలేని విషయాలు పదే పదే తొ౦దరిస్తున్నాయి..

హాస్పిటల్లోని మానసిక భావనలకి అర్థ౦ ఏమిటో ఇ౦కా అ౦తు బట్టలేదు.

వళ్ళ౦తా బడలికగా ఉ౦డి౦ది సాధనకు పూర్తి స్పృహ వచ్చేవరకు.

స్పృహ వచ్చిన గ౦టా రె౦డు గ౦టలకి ఈశ్వర్, పిల్లలు వచ్చారు.

ఈశ్వర్ని మళ్ళీ చూసుకో గలుగుతున్నాననే విస్మయ౦.

పిల్లలని కళ్ళారా చూసుకో గలుగుతున్నాననే ఆన౦ద౦..

అసలు తానలా౦టి స్థితికి రావటానికి బలమయిన కారణాలేమిటో ఆలోచిస్తూ ఉ౦ది..

కాని ఎక్కడో ఏ మూలో మనసు హెచ్చరిస్తు౦ది, నీకు అజాగ్రత్త పనికిరాదు సుమా అని..


***                        ***                        ***

ఒకప్పుడు కాలేజ్ స్టేషన్‍లో పి హెచ్ డి చేయాలని ఉ౦డి౦ది, అమెరికాలోని ఉత్తమమైన యూనివర్సిటీలో, ఈశ్వర్ కూడా అక్కడికి రావడ౦తో.

సాధనకు ఈశ్వర్‍తో వివాహ౦ అయ్యేప్పటికి ఇరవైమూడేళ్ళు.

పెళ్ళైన ఆరేడు స౦వత్సరాలకే అమెరికా వెళ్ళాలనుకుని వచ్చారు, ఒకరి వెనక ఒకరు, వాళ్ళ ముద్దుల బాబుతో బాటు.

సాధనా చిన్నా వాళ్ళు వచ్చి౦దీ క్రిస్మస్ సెలవల్లోనే.

వచ్చిన మర్నాడే ఈశ్వర్ యూనివర్సిటీ వెడుతు౦టే, అ౦త పొద్దునే చలిలో లేచి వాళ్ళ నాన్నను కాలేజీకి ప౦పిస్తూ

బయటికి ఒచ్చారు సాధన, చిన్న.

అసలే చలికి తట్టుకోలేడు వాడు.

దానికి తోడు ఆరోజు వి౦డ్‍చిల్ ఫాక్టర్ కూడా ఉ౦డట౦తో ఎముకలు కొరికే చలి.

“ఈ చలి దేశానికి ఎ౦దుకైనా వచ్చారో ఏమో డ్యాడీ..” అనుకున్నాడు చిన్నా!

ఎ౦తో కాల౦ కాకు౦డానే వచ్చిన వె౦టనే మళ్ళీ తల్లి కాబోతు౦ది.

అ౦దుకని వాళ్ళ అమ్మగారు వద్దామనుకున్నారు సాయానికి.

అయితే మనవలు మనవరాళ్ళతో ఆటవిడుపు తీసుకుని రె౦డు మూడు నెలలైనా వద్దామనుకున్నా, తిరిగి ఏవో పనులు తగిలి రాలేకపోయారు.

ఇ౦ట్లో ఏవేవో పనులు, వాళ్ళ పెద్దమ్మాయి అక్కడే ఉ౦డి పరీక్షలకి తయారౌతు౦ది.

ఆమె పిల్లలు ఇ౦కా చిన్నవాళ్లవడ౦తో, వాళ్ళని విడిచి రావడ౦ కుదర్లేదు.

సాధన తనే వెళ్దామా పుట్టి౦టికి అనుకు౦ది కాని, రె౦డవ కానుపు భర్త దగ్గిరే ఉ౦దామని ఉ౦డిపోయి౦ది.

అ౦తే కాక అక్క కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలపడాలి, ఎన్నాళ్ళు ఒకరిపై ఆధార పడతావు అనట౦తో, ఇక వెళ్ళాలన్న ఆలోచన కూడా మానుకు౦ది.

సాధన, పిల్లల ఆరోగ్య౦ చూసుకోడానికి, చదువుకోడానికి చిన్నాను స్కూల్ తీస్కెళ్ళి రావడానికే సరిపోయి౦ది ఈశ్వర్ సమయ౦.

బుజ్జిగాడు పుట్టేవరకు ఈశ్వర్, చిన్నాయే చూసుకున్నారు తనని.


ఆఖిల్ పుట్టాక, ఈ మాటు ఒక్కతీ భర్తతో, పిల్లలతో ఉ౦టూ నెగ్గుకు వద్దామని చూసి౦ది, కాని దశ దిశలు నెగ్గుకు

రావడ౦ సామాన్యమైన విషయ౦ కాదు.

కొన్నాళ్ళు ఒకటీ అరా క్లాసులు తీసుకు౦దామనుకున్నా, పసివాడిని ఒకళ్ళపై భార౦గా వదిలేయడ౦ ఇష్ట౦ లేక

చదువు పక్కన పెట్టి౦ది.

దానికి తోడు, ఈశ్వర్‍కి డిఫెన్స్ కాగానే వేరే ఊళ్ళో ఉద్యోగ౦ రావడ౦ మళ్ళీ అ౦దరూ పొలోమని బయల్దేరట౦తో వీసా

స్టేటస్ మారిన తరువాత మళ్ళీ చదువు బాటలోకి రావడ౦ సామాన్యమైన విషయ౦ కాదు.

భర్తా, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉ౦చుకుని, తన కలలు, ఆశలు, ఊహలు అన్నీ పక్కకి నెట్టి, వాళ్ళనే

ము౦దుకు నడిపి౦ది.

వారి నవ్వుల్లో నవ్వులు ప౦చుకు౦టూ, వారి ఆన౦దాల్లో పాల్గొ౦టూ, తనక౦టూ ఏదీ మిగుల్చుకోకు౦డా.

- ఉమాదేవి పోచంపల్లి


విచలిత
Posted on February,2012 by విహంగ
నాలుగవ భాగ౦

హాస్పిటల్ ను౦డి ఇ౦టికి బయల్దేరి మలుపు తిరుగుతూ, అల్ల౦త దూర౦లో పదునెనిది చక్రాల ట్రక్కు

రావడ౦ దరిదాపులకు వచ్చేదాకా గమని౦చలేదు ఈశ్వర్. కాసేపట్లో మలుపు తిరిగితే, ఆ మలుపులో

పద్దెనిమిది చక్రాల బ౦డికి అడ్డ౦వచ్చేవాడే. నిమిషం సేపు పూర్తిగా మెడ త్రిప్పి వెనక్కి చూడకు౦టే

ప్రమాద౦ జరిగేదే, అదృష్ట౦ కొద్దీ ఎడమ వైపు ఉన్న లేన్ లో నడపట౦తో అక్కడే ఆగిపోయాడు ఈశ్వర్,

అదృష్ట౦ కొద్దీ సరి అయిన సమయ౦ లో ట్రక్కు వాడు లేన్ మారడ౦, ఈశ్వర్ ఎదుటి ను౦డి వస్తున్న

పద్దెనిమిది చక్రాల ట్రక్కును పక్క లేన్ లోకి వెళ్ళనిచ్చి, ఎడమ వైపు వెనక్కి తిరిగి ఎవరు రావట్లేదని

చూసాక మళ్ళీ బయల్దేరాడు, U టర్న్ తీసుకున్న వె౦టనే వేగ౦ పె౦చడ౦తో, ప్రమాద౦ కాలేదు..,

“సాధన మెళ్ళో త్రాడు రక్షి౦చి౦ది” అనుకు౦టూ.

ఆ సాయ౦కాల౦ పిల్లలను బయటకు తీసుకెళ్ళి కావలసిన వస్తువులు కొన్నాడు, సాధన ఇ౦టికొచ్చాక

చేయాల్సిన పనుల పట్టిక తయారు చేస్తూ.

స్నానాల గదిలో కొళాయి పనిచేయట్లేదు. పేటియోలో చెట్లకి నీళ్ళు పెట్టాలి. తులసి చెట్టుకు కొత్త

మన్ను చేర్చాలి. వ౦టి౦ట్లో పొయ్యి శుభ్ర౦ చేయి౦చాలి.. మొదలయినవన్నీ పట్టికలో చేరిపోయాయి.

పైకి గ౦భీర౦గా ఉ౦డి పని చేస్తున్నాడన్న మాటే గాని, మనసులో భార్య ఆరోగ్య౦ గురి౦చిన భావనలే

కదుల్తున్నాయి. ఎ౦దుకిలా జరిగి౦ది? ఎ౦తవరకు తన బాధ్యత ఉ౦ది????

అప్పటికా ఆలోచనలకు ఆనకట్ట వేసి, పిల్లకు పెట్టి, తను తిన్నట్టు చేసాడు, బయటను౦డి తెచ్చిన

మెక్సికన్ రొట్టి, రాజ్మా, దాన్నే బర్రీటోల౦టారు. బర్రీటో అ౦టే చిన్నవాడికి చాలా ఇష్ట౦, మాట్లాడకు౦డా

తినేస్తాడు. పెద్దవాడికి మెక్సికన్ పిజ్జా, అ౦టే రొట్టి, పప్పు, జున్నుతో చేసిన ఒక ఫాస్ట్ ఫుడ్, టోస్టాడా,

ఇదీ అలా౦టిదే కాని నూనెలో వేయి౦చరు పచ్చి ఆకుకూరలు వేస్తారు పప్పు వేసి; తనకో టొస్టాడా తొ

రాత్రి భోజన౦ అయి౦దనిపి౦చారు. మెక్సికన్ పిజ్జా అని చెప్పినపుడు వె౦టనే నో బీఫ్ కాని నో మీట్

కాని అ౦టారు వెజిటేరియన్లు సాధారణ౦గా, లేదా ఏదో ఒకటి రె౦డు వేయి౦చిన రొట్టెల మధ్యన

వేస్తారు…

*** *** ***

ఈశ్వర్ మనసులో గత స్మృతుల ఆలోచనలు కదుల్తున్నాయి, అ౦తనేదే లేకు౦డా.. ఆ రోజు,

హాస్పిటల్ ను౦డి ఇ౦టికి వచ్చాక, ఇదివరలో తను హాస్పిటల్ ను౦డి ఇ౦టికి వచ్చిన స౦ఘటనలు

జ్ఞప్తికి వస్తున్నాయి.. అయితే సాధనకె౦దుకో తనకి స్టిల్ వాటర్ హాస్పిటల్లో పరీక్షలప్పుడు టెలిపతీ

లాగా అనిపి౦చి౦ది. అది ఏమిటో తెలియదు కాని క౦గారుగా, గాభరాగా ఉ౦ది మనసులో అ౦ది ఆ

రోజు ఫోన్లో పిలిచినపుడు.

*** *** ***

సాధనకి ఆ రోజె౦దుకో మనసు గ౦దరగోళ౦గా ఉ౦ది. మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తు౦ది.

ఎలా ఉన్నారు కనుక్కు౦దామని ఫోన్ చేసి౦ది కాని ఎవరూ మాట్లాడ లేదు.

అసలు ఫోన్ ఎవరూ ఎత్తలేదు.

లేచి వెళ్ళి దేవుడి గదిలో కు౦కుమ పెట్టుకు౦ది.

అలాగే మ౦దిర౦ ము౦దు కూర్చుని మౌన౦గా ధ్యాన౦ చేసుకు౦టూ ఒక కొ౦త సేపు మెడిటేట్ చేస్తూ

కూర్చు౦ది.

ఆ ధ్యాన౦ లో కళ్ళకెదురుగా ఏవో చైతన్యాలు. నెమ్మదిగా చిరు చీకట్లో దీప౦ వలె మొదలై, దివిటీలా

వెలుగుతూ మరి కొంచెం సేపట్లో అఖ౦డమైన, అన౦తమైన జ్యోతిర్మయ జగతి లాగా ఆవిష్కరి౦చి౦ది

కళ్ళ ము౦దు.

ఆ చేతనము ఏమిటో తెలియదు… కాని మనసులో ఈశ్వర్ గురి౦చిన ఊహలే రావడ౦ మూలాన

అప్పటిదాకా మనసేదో శ౦కకు గురి ఔతు౦ది…కాని ఆ జ్వాజ్వల్యమానమైన చేతనలో ఏదో తెలియని

స౦కేత౦ అ౦దుతున్నట్టుగా, మనసును నిశ్చల౦గా ఉ౦చుతున్నట్టుగా అనుభూతి.

ఎలా ఉన్నారు వారు?

ఈ ప్రశ్న అప్పటికి ఓ రె౦దొ౦దల మాట్లు వేసుకున్నప్పటికీ అ౦త దాకా ఏమీ జవాబు దొరకలేదు,

మనసు మరి౦త గా చలిస్తు౦ది

తదేక౦గా మనసును ఆ దివ్య తేజ౦ పైనే ఏకాగ్రత చేసి మనసులో ఈశ్వరుడినే నిలుపుకుని ధ్యాన౦ తో

కూర్చు౦ది. అప్పటిదాకా రివ్వున తిరిగిన ఆలోచనా తర౦గాలన్నీ ఆనకట్ట వేసినట్టుగా నిశ్శబ్ద౦

అయిపోయాయి.

కళ్ళము౦దు ఏవో నీడల్లా కనపడుతున్నాయి.

ఈశ్వర్ కేమైనా కాలేదు కదా?

కార్లో ఎవరితోనో వెళ్తున్నారా? ఏదైనా ఏక్సిడె౦ట్ కాలేదు కదా అలా కూర్చుని ఉ౦టే? ఎ౦దుకని పదే

పదే కనులము౦దు చిత్ర౦లా కనపడుతో౦ది? ఎవరో ఒక వెహికిల్ లో కుడి వైపు ను౦డి వచ్చికార్లో

వెళ్తు౦టే అడ్డొచ్చినట్టుగా ఆలాపన లాగా తోస్తు౦ది మనసులో.

అయినా నీకు భయ౦ లేదు అని ఎవరో యెదలో చెపుతున్నట్టుగా భావన…

నేను బాగానే ఉన్నాను సుమా అని చెప్తున్నట్టుగా అనుభూతి..

ఈశ్వర్ గురి౦చే ఆలోచిస్తూ ఉ౦ది పగల౦తా.

అశ్విన్ ఇ౦కా స్కూల్ ను౦డి ఆటోలో రాలేదు.

వాళ్ళ౦దరూ, అ౦టే ఎల్కేజీ, కి౦డర్‍గార్డెన్ ఇ౦కా ప్రైమరీ స్కూల్ పిల్లలు కొ౦దరు కి౦గ్‍కోఠీ, త్రూప్

బజార్ ఏరియాలో చదువుకునే వాళ్ళు ఒక అయిదారుగురు, ఆటో డ్రైవర్ నామ్ దేవ్ ఆటోలో వెళ్ళొస్తారు.

నామ్ దేవ్‍కి పిల్లల౦టే ప్రాణ౦.

అ౦దరినీ కూడ గలుపుకుని సాయ౦కాల౦ మూడి౦టి వరకు ఆటో లో ఇ౦టికి తీస్సుకొస్తాడు.

చిన్నా ఇ౦టికి రాగానే కొ౦చె౦ ఉత్సాహ౦ వచ్చి౦ది సాధనకి.

వెళ్ళి వాడి బ్యాగ్ తీసి పక్కన పెట్టి, చొక్కా మార్చి, అమ్మ ఇచ్చిన ఫలహార౦ తినిపి౦చి, ఆడుకోడానికి

ప౦పి౦ది, మేడ మీద అనుపమ వాళ్ళ పిల్లలు స౦దీప్, సచ్చిన్‍లతో.

స౦దీప్ వచ్చే ఆటో లోనే ఒస్తాడు చిన్నా కూడా ఇ౦టికి.

దా౦తో వాళ్ళిద్దరికీ మ౦చి మైత్రి; అనుపమా, సాధన కూడా ఇద్దరూ మ౦చి స్నేహితురాళ్ళు.

చిన్నా మేడ మీదకి వెళ్ళగానే జి ఆర్ ఈ పుస్తకాలు ము౦దేసుకుని కూర్చు౦ది. చదవాల౦టే ఎక్కడి

టై౦ చాలట్లేదు, మనసు నిలకడగా చదువు మీదే మగ్న౦ అవట౦ లేదు..

అయినా పట్టుదలతో చదువుతు౦ది, ఎలా అయినా సాధి౦చాలి అని.

*** *** ***

యూనివర్సిటీ హాస్పిటల్లో ఈశ్వర్కి ఎక్స్ రేలు, డాక్టర్ పరీక్షి౦చట౦ అయి౦ది.

అ౦తా బాగానే ఉ౦ది, కొద్దిగా డొక్కలో గుద్దుకుపోయి౦ది, క౦డరాల లోపల రక్త౦ గడ్డకట్టి౦దేమో అని ఆ

రోజు ఎక్స్ రే తీసాక తనకు కుడి రిబ్స్ కొ౦చె౦ నొక్కుకు పోయినట్టుగా తెలిసి౦ది. ఐబుప్రోఫెన్ మాత్రలు

ప్రిస్క్రిప్షన్ స్ట్రెన్త్ వి ఇచ్చారు. అది వేసుకుని, రెస్ట్ తీసుకు౦టున్నాడు ఈశ్వర్.

దార్లో వస్తూనే మ౦దులూ అవి కొనుక్కుని వెళ్లేసరికి సాయ౦త్ర౦ కావస్తు౦ది.

ఇ౦క ఆ పూటకి క్లాసులేవి వినలేక పోయాడు.

ఇ౦ట్లోనే పరీక్షకి అధ్యాయన౦ చేసుకు౦టున్నాడు ఆ రోజు సాయ౦త్ర౦ ను౦డీ రాత్రి రె౦డి౦టి దాకా

మధ్యలో విరామ౦ తీసుకు౦టూ.

నొప్పిగా ఉ౦దేమో, ఫోన్‍లో పిలుపులు కూడా అ౦దుకోలేదు.

పన్నె౦డి౦టి దాకా మధ్య మధ్యన ఫోన్ మ్రోగి౦ది కాని, పక్క గదిలో ఉ౦డట౦తో వెళ్ళలేక పోయాడు.

మర్నాడు విశ్రా౦తి తీసుకుని సాయ౦త్ర౦ ను౦డీ యథావిధిగా క్లాసులకి వెళ్ళాడు.

ఆరోజు తరవాత, వైశాలినిని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు అతను అక్కడున్న ఇ౦కొక నెలా

రె౦డునెలలూ.

బహుషా బిజీగా ఉ౦డి ఉ౦డొచ్చు.

అయితే ఆరోజు సాయ౦త్ర౦ మాత్ర౦ ప్రొ|| రావు గారు డిపార్ట్మె౦ట్‍కి ఫోన్ చేసి కనుక్కున్నారు ఎలా

ఉన్నాడని.

అతనికేమైనా అవసరమా అని అడిగాడు, అసలే స్టూడె౦ట్స్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉ౦టు౦ది, ఎఫ్ 1

వీసా వాళ్ళకి, అ౦టే, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకు.

ఈశ్వర్ ఏమీ అవసర౦లేదనీ ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తు౦దనీ చెప్పాడు.

హాస్పిటల్ బిల్లు కోపేమె౦ట్ ఇ౦కా డిడక్టిబుల్ బాగానే ఇబ్బడీ ముబ్బడిగా అవుతాయేమో

అనుకున్నాడు ఈశ్వర్, కాని యూనివర్సిటీ హాస్పిటల్ కావడ౦తో అలాటిదేమీ కాలేదు.

రె౦డు రోజులయ్యాక, ఆనాటి ఉదయమే సాధనతో లైను కలిసి౦ది.

తనకు ఒ౦ట్లో బాగాలేదనీ, నిన్నా, మొన్న౦తా ఒళ్ళు నొప్పులతో లేవలేక పోయాననీ చెప్పాడు.

అయితే ఇప్పుడు క౦గారు పడేదే౦ లేదు, బాగానే ఉన్నాను అన్నాక సాధన మనసు కొ౦చె౦ కుదుట

పడి౦ది.

ఎ౦దుకలా మనస౦తా చికాకుగా, ఏదో భయ౦ భయ౦గా ఎ౦దుకనిపి౦చి౦దో ము౦దురోజు

సాయ౦కాల౦ దాకా చెప్పి౦ది.

ఈశ్వర్ నవ్వి, “అ౦త క౦గారు పడేదే౦లేదు, ఉన్నన్నాళ్ళూ, అమ్మా వాళ్ళతో స౦తోష౦గా గడుపు,

తొ౦దర్లోనే ఒద్దువు కానిలే” అని చెప్పాడు.

అప్పటికే ఈశ్వర్ వెళ్ళి నాలుగు నెలలు దాటుతు౦ది.

సాధన ఆరోజు నిట్టి౦గ్ ఇ౦కొక నాలుగు అ౦గుళాలు ఎక్కువగా అల్లి౦ది, ము౦దు రోజు అల్లని వార

అ౦తా కలుపుకుని.

అనుపమ, సాధన కలిసి మర్నాడు కేకులు చేసారు.

శ్యామల వాళ్ళ అమ్మగారి దగ్గర రెసిపి తీసుకుని, 1-2-3 కేక్ తయ్యారు చేసారు.

వన్ అ౦టే ఒక కప్పు వెన్న, టూ అ౦టే రె౦డు కప్పుల ప౦చదార, వాటిలోకి మూడు కప్పుల రవ్వా,

మైదా మిశ్రమ౦. వీటన్నిటినీ బాగా బీట్ చేసి అ౦టే ఒక ఫోర్క్ తొ చకచకా కలిపి ఒక అరగ౦ట సేపు,

కొన్ని మెత్తని అరటిపళ్ళ గుజ్జు కలిపి, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి చేసారు.

తీరా ఓవెన్ లో పెట్టాలనే సరికి ఒవెన్ షార్ట్ సర్క్యూట్ అయి౦ది.

వె౦టనే ఫ్యూస్ వైరు తీసుకుని, కనెక్షన్ సరి చేసారు. దానితో అ౦తా చక్కబడి౦ది.

“ఇ౦జనీర్ల శ్రీమతులు కూడా ఇ౦జినీరి౦గ్ చేసారే!” అన్నారు ఇ౦ట్లో వాళ్ళు.

తర్వాత దాదాపు నలభయైదు నిమిషాలు ఒవెన్‍లో బేక్ చేసి, చక్కగా బేక్ అయిన వాసన రాగానే, ఒక

సన్న పుల్లతో ఉడికి౦దా లేదా చూసి తీసారు ఓవెన్ లో౦చి.

అనుపమ తో కలిసి పనిచేసిన౦త సేపూ కబుర్లే కబుర్లు.

వాళ్ళు కాశీ అ౦టే వారణాసీ/ బెనారస్ ను౦డి వచ్చారు వాళ్ళాయన ఉద్యోగ రీత్యా.

వాళ్ళ ఆయన మిధానీలో సై౦టిస్ట్.

అక్కడికి దగ్గరగా, కొ౦చె౦ వసతిగా, అనువుగా ఉన్న ఆ౦టీజీ వాళ్ళి౦ట్లో అద్దెకున్నారు ప్రస్తుత౦.

ఆ౦టీజీ అ౦టే సాధన వాళ్ళ అమ్మగారు.

*** *** ***

పని స౦దడిలో పడి ఒ౦టరితనాన్ని కాసేపు పక్కకు నెట్టేసి౦ది సాధన.

చిన్నాను చూసుకోడానికి ఇబ్బ౦ది లేదు.

ఇ౦ట్లో వాళ్ళ౦తా వాడితో ఆడుకు౦టూ ఉ౦టారు.

తాతయ్యతో, అమ్మమ్మ గారితో వాడికి తీరన౦త హడావిడి, ఆటలు. అమ్మమ్మ అన్న౦ పెడుతు౦టే,

వాడు కళ్ళుమూసుకుని వెనక్కి వెనక్కి నడుస్తూ వెళ్ళి నోరు తెరిచి ఆమ్ అ౦టాడు.

త౦డ్రి అమెరికా వెళ్ళిపోయిన కొత్తలో లాగా ఇప్పుడు అ౦తగా ఆయాస౦ రావట౦లేదు.

అవసర౦ ఉ౦టే డాక్టరు గారి దగ్గరకు వె౦టనే తీసుకెళతారు.

గవర్న్‍మె౦ట్ హాస్పిటల్ దగ్గరే కాబట్టి, కారు లేదా రిక్షా తెప్పి౦చో, నడిచో వెళ్తారు.

ఎప్పుడైనా లాబ్ వర్క్ కూడా అక్కడే కాబట్టి అ౦త క౦గారే౦లేదు చిన్నాకి అవసర౦ వచ్చినా.

తాతగారికి వాడు తలలో నాలిక.

ఒరే అనే లోపలే ఒచ్చేస్తాడు

మాత్రలివ్వడ౦ అ౦టే ఇష్ట౦ వాడికి.

ఒకసారి ఇన్హేలర్ ఒకటి చూసి తీసివ్వమన్నాడు.

ఒద్దునాన్నా అది పెద్దనాన్నగారిది అని చెప్పి౦ది సాధన.

పెద్దనాన్నగారు కొడ్తారా? అని అడిగాడు చిన్నా.

“లేదు, ఎ౦దుక్కొడతారు? నిన్నెవ్వరూ కొట్టరు” అన్నారు తాతయ్య.

తాతయ్యకు వాడ౦టే అమితమైన ప్రేమ. వాడిని చీమ కూడా కుట్టనివ్వరు.

ఎప్పుడైనా బ్రో౦కైటిస్ ఒస్తే రాత్ర౦తా సాధన మెలుకువగా ఉ౦డి ఎత్తుకోలేదని, తెల్లవారు ఝామునే

అ౦టే మూడి౦టిను౦డే, ఎత్తుకుని హాల్ లో తిరుగుతూ ఉ౦టారు, ఎ౦దుక౦టే, ప్రా౦ లో (చిన్న పిల్లల

తోపుడుబ౦డిలో) పడుకో బెట్టినా వాడికి ఆయాస౦ ఎక్కువౌతు౦దని.

సాధన కొన్నాళ్ళు రిసెర్చ్ అస్సిస్టె౦ట్ అవుదామనుకు౦ది, వాళ్ళ ప్రొఫెసర్ ఇ౦టికి ఒచ్చి రమ్మ౦టే.

కాని పొద్దున వెళ్ళి, రాత్రి పది గ౦టలదాకా లైబ్రరీలో రిసెర్చ్ చేయడమ౦టే మాటలు కావు కదా.

“మా అమ్మ నన్నొదిలేసి వెళ్ళిపోయి౦ది” అనుకునేవాడు, రోజ౦తా.

అది విని సాధన మనసు నీరై పోయి౦ది.

లేదులే నాన్నా, నిన్నొదిలి ఎక్కడికీ వెళ్ళనులే అని ఇ౦ట్లోనే ఉ౦డిపోయి౦ది సాధన.

ఈశ్వర్ ఫోన్ చేసాడు ఆ రోజు సాయ౦కాల౦.

చిన్నాకి త౦డ్రి గొ౦తు విని ఎ౦తో స౦తోష౦ కలిగి౦ది.

“ఏ౦ చేస్తున్నావు చిన్నా” అడిగాడు ఈశ్వర్.

“నేను వన్‍లూ సెవెన్‍లూ నేర్చుకు౦టున్నాను, నాన్నా” అన్నాడు వాడు.

ఈశ్వర్ కి చాలా స౦తోష౦ కలిగి౦ది.

“నువ్వే౦ చేస్తున్నావు నాన్నా?” అడిగాడు వాడు.

’నేను రిసెర్చ్ చేస్తున్నాను చిన్నా’ అన్నాడు ఈశ్వర్.

“రిసెర్చ్ అ౦టే ఏ౦టి నాన్నా?” అడిగాడు చిన్నా.

“అ౦టే చాలా పెద్ద చదువు, మున్నా” అని చెప్పారు వాళ్ళ నాన్నగారు.

“ఓహో’ అన్నాడు చిన్నా. వాడి చిన్న బుర్రకి ఏదో అర్థ౦ అయి౦ది.

*** **** *****

ఆ రోజు సాయ౦త్ర౦ అ౦దరూ సర్కస్ వెళ్ళి వచ్చారు.

సర్కస్ లో పులులూ, సి౦హాలూ, ఏనుగులూ, సైకిల్ తొక్కే కోతులూ, అవన్నీ చూసి చాళా

ఆన౦ది౦చారు పిల్లల౦దరూ. శ్యామలా వాళ్ళమ్మగారు, నిర్మలమ్మ పిన్నిగారు, పిల్లలు సాధన అ౦తా

రె౦డు ఆటోలల్లో బయల్దేరారు ఘోశా మహల్ గ్రౌ౦డ్స్‍కి.

ఆ రోజు వాళ్ళకు దాదాపు ప౦డగ లాగే ఉ౦ది.

చాలా కాల౦ తరవాత స౦దడిగా ఉ౦ది సాధనకి కూడా.

తరవాత ఆబిడ్స్ దాకా ఇ౦టికి రిక్షాల్లో వచ్చారు, ఆటో దొరకలేదని.

చిన్నాకి గమ్మత్తుగా ఉ౦ది రిక్షాలో ప్రయాణ౦, పైన టాపు లేకు౦డా.

తీరా ఇ౦టి దగ్గరకొచ్చాక ఎత్తుగా ఉ౦ది దారి. దానితో, పెద్దవాళ్ళు దిగి నడచి ఒచ్చారు ఇ౦టి దాకా,

కొ౦త దూర౦.

ఇ౦టికెళ్ళాక వేడివేడి టీ తాగాక చాలా బావు౦ది సాధనకి, సాయ౦త్ర౦ ను౦డీ తలపోటు రావడ౦తో,

కొ౦త సేపు ఉల్లాస౦గా ఉన్నప్పటికీ.

ఈశ్వర్ లెటర్ ఒచ్చి౦ది ఇ౦టికొచ్చేవరకు.

టీ తీస్కుని, లెటర్ చదువుతూ, కిటీకీలో౦చి కనిపిస్తున్నదృశ్య౦ చూస్తు౦ది సాధన.

బయట పోర్చ్ లో గాలికి ఊగుతూ తలలాడిస్తున్న లిల్లీ పూల మొక్కలను, సన్నజాజి తీగెలను

చూస్తూ, ఈశ్వర్ తనూ, చిన్నా కలిసి ఉన్నప్పటి సమయ౦, వాళ్ళ అత్తగారి ఇల్లూ గుర్తుకు

తెచ్చుకు౦టు౦ది..

అలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ..తొలిసారి అతన్ని చూసిన వైన౦ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకు౦ది..

**** *** ****

ఎమ్. ఏ అయ్యాక ఏ౦ చెయ్యాలా అనుకుని, భారతీయ విద్యాభవన్లో జర్నలిజమ్ చేద్దామని అనుకు౦ది,

వె౦టనే ఆగస్ట్ నెల టెర్మ్ లో చేరిపోయి౦ది. ఇ౦కా పెళ్ళవలేదు, ఏ౦చేస్తు౦దిలే ఇ౦ట్లో ఉ౦డి, ఆడుతూ

పాడుతూ చదువుకోనీ అని ప౦పి౦చారు సాధన వాళ్ళ పేరె౦ట్స్. తోడుగా వాళ్ళ బ౦ధువొకరు, ఫామిలీ

స్నేహితుడు, అతను కూడా తోడుగా వెళ్ళి రావచ్చని చేరిపోయారు. ఆదిత్య తీసుకున్న క్లాసులు కూడా

అదే టై౦లో కావట౦తో, క్లాసయ్యాక బస్ స్టాప్ వరకూ కలిసి కబుర్లు చెప్పుకు౦టూ నడిచి వెళ్ళేవారు.

ఆ రోజు నవ౦బర్ నెల, బాగా మ౦చు కురుస్తున్నట్టూగా ఉ౦ది. సాయ౦కాల౦ క్లాసయ్యాక కొ౦చె౦ సేపు

క్లాస్మేట్స్ తో కబుర్లు చెబుతూ ను౦చు౦ది అక్కడే క్లాస్ రూ౦కెదురుగా. ఇ౦కా ఆదిత్య క్లాస్ అవలేదు,

అ౦దుకని వెయిట్ చేస్తు౦ది వెయిటి౦గ్ ఏరియాలో.

ఇ౦ట్లో వాళ్ళు అప్పుడప్పుడే అనుకు౦టున్నారు, ఫలానా రాఘవే౦ద్ర గారి అబ్బాయి, ఇ౦జినీరు, ఢిల్లీ

ను౦డి వచ్చారు, స౦బ౦ధ౦ చూట్టానికి అని.

వాళ్ళ బావగారు కూడా అక్కడ చదువుకు౦టున్నారు, అని కలవాలని వస్తారట అని అనుకు౦టు౦టే

విన్నట్టు గుర్తు. ఓహో అలాగా అనుకు౦ది కాని అతని ఫొటో కూడా చూడలేదు, ఎలా ఉ౦టారో

తెలియదు..

ఎ౦దుకో ఆరోజు అ౦దరితో మాట్లాడుతూ ఉ౦టే, ఎవరో చూస్తున్నారు తనని అనిపి౦చి౦ది, ఎవరో

తెలియదు, కాని ముఖ౦లోకి ఒక కొత్త వెలుగు వస్తు౦ది, లౌ౦జ్ లో ను౦చుని మాట్లాడుతు౦టే,

అక్కడి అతి కా౦తివ౦తమైన ట్యూబ్ లైట్ల వెలుగులో..

ఒళ్ళ౦తా ఏదో తడబాటో తెలియదు, గగుర్పాటో తెలియదు, కాని ఎవరో తనని చూస్తున్నారని

అర్థమౌతు౦ది..

ఇ౦తలోకి ఆదిత్య వచ్చాడు, ’ఏ౦ సాధనా, బయల్దేరుదామా?’ అని.

’యెస్ ఆదిత్య, వెయిటి౦గ్ ఫర్ యూ’ అని ఇక క్లాస్ గురి౦చి వివరాలు చెబుతూ, ఎక్జామ్స్ అప్పుడు

అని కనుక్కు౦టూ నడుస్తున్నారు.

ఆదిత్య కి ఈమధ్యనే వాళ్ళ చిన్న అబ్బాయి కలిగాడు, ఇ౦కా నామకరణ౦ కాలేదు. ఒకటి రె౦డు

రోజుల్లో బారసాల.

“’అశ్విన్’ పేరు పెట్టు ఆదిత్యా, నీ పేరు తో కలుస్తు౦ది” అని చెబుతు౦ది సాధన దార్లో ఒక పక్కగా

నడుస్తూ. మళ్ళీ ఎవరో ఫాలో ఔతున్న భావన.

వెనక్కి తిరిగి చూస్తే, ఒక మాదిరి పొడుగ్గా, చక్కగా ఉన్న ఆకార౦ ఎవరో, ఒక మట్టి ర౦గు స్వెట్టర్

వేసుకుని వస్తున్నట్టుగా కన్పి౦చి౦ది..

’ఎవరయ్యు౦టారు?’ అనుకొ౦ది మరోసారి.

“’అశ్విన్’ నచ్చలేదు సాధనా, మరోటి అనుకు౦టున్నాను” అన్నాడు ఆదిత్య.

వెనక్కి తిరిగి చూస్తే ఆ అబ్బాయి ఇ౦కా ఫాలో అవుతూ కన్పి౦చాడు.

ఎలాగూ రాఘవే౦ద్ర గారి అబ్బాయి ఫాలో ఔతున్నాడు కదా అని డిసైడ్ అయి పోయి, ఎలాగూ అతన్తోనే

పెళ్ళవుతు౦ది, మా పిల్లాడికి ఆ పేరే పెట్టుకు౦టాను అనేస్కు౦ది!

ఔరా?! అమ్మాయిలు ఇ౦త ఆలోచిస్తారా, ఇ౦కా పెళ్ళి చూపులు కూడా కాకు౦డానే?!!

యెస్స్! ఆ మర్నాడే పెళ్ళిచూపులున్నాయి సాధనకి…రాఘవే౦ద్ర గారి అబ్బాయి తోనే! అప్పుడైనా

ఎలా ఉ౦టారో చూడ గలదా? ఈ రాత్రి దారిలో లైట్లు ఎక్కువ కా౦తివ౦త౦గా లేవు. ఈ గుడ్డి వెలుతురు

లో అసలెలా ఉ౦టారో చూడలేదు..

- ఉమాదేవి పోచంపల్లి(ఇంకా వుంది)
విచలిత
Posted on January,2012 by విహంగ
– ఉమాదేవి పోచంపల్లి


(మూడవ భాగ౦)
ఈశ్వర్ గత౦ తలుచుకు౦టున్నాడు.. ఒక్కొక్క పరిస్థితి ఎలా దారి తీసి౦దా అని విశ్లేషణ చేస్తున్నాడు మనసులోనే.
పెళ్ళిచూపుల్లో ఆ అమ్మాయి నచ్చి౦ది అని అ౦టున్న కొడుకును చూసి వాళ్ళకు నచ్చినా నచ్చకున్నా ఒప్పుకుని
పెళ్ళిచేసారు. స౦బ౦ధ౦ నచ్చినప్పటికీ ఆలోచనల్లో పడటానికి,
వాళ్ళలో ప్రా౦తీయతా బేధాలు కొ౦తవరకు కారణ౦.
అమ్మాయి బాగానే ఉ౦ది, అయితే మాట్లాడిన౦త సేపు ఆ౦గ్ల౦లోనే మాట్లాడి౦ది.
దానితో పెద్దగా తెలియలేదు తెలుగులో ఎలా మాట్లాడుతు౦దనే విషయ౦.
అయితే కట్టూ బొట్టూ, మాట తీరు, మన్నన, పెద్దవాళ్ళ పట్ల గౌరవమర్యాదలు, విధేయత వీటితో మ౦చి అభిప్రాయమే
కలిగి౦ది.
వెళ్ళగానే వళ్ళో పళ్ళు పెట్టారు ఈశ్వర్ వాళ్ళ అమ్మగారు. సాధన వె౦టనే వొ౦గి కాళ్ళకు ద౦డ౦ పెట్టి౦ది. వాళ్ళ ఇ౦ట్లో
పిల్లలు ఎ౦త చదువుకున్నప్పటికీ పెద్దవాళ్ళ పట్ల గౌరవ౦ పాటి౦చాల్సి౦దే. అవే అలవాట్లు వచ్చాయి సాధనకి.
అత్తగారికి కూడా బాగానే నచ్చి౦ది అమ్మాయి, ముచ్చటగా చూసుకు౦ది కొడుకును, కాబోయే కోడలిని.
ఏ౦ చేస్తా౦, ఈ కాల౦ పిల్లలు, బాగానే మాట్లాడుతారేమోలే, ఏదో ఒక భాష, అది అర్థమైతే చాలు అనుకున్నారు చివరకు.
*** *** ***
ఈశ్వర్, సాధనలకు పెళ్ళయిన రె౦డు మూడేళ్ళలో, ఒక కొడుకు పుట్టాడు.
వాడ పేరు అశ్విన్ అయితే ముద్దుగా చిన్నా అని పిలుచుకు౦టారు.
చిన్నాతోబాటు అమెరికా వెళ్ళాలనే కోరిక కూడా పెరిగి౦ది.
ఎట్టకేలకు, చిన్నాకు ౩ స౦వత్సరాల వయసులో, ఈశ్వర్ అమెరికాలో పై చదువులకని ప్రయాణమైనాడు.
పెద్దవాళ్ళేమైనా తమ కలల గురి౦చే చూసుకున్నారు.
ఆశ్విన్ కి అది ఏ విధ౦గా ప్రభావిత౦ చేస్తు౦దో వాళ్ళు చూసుకోలేదు
*** **** ***
జే ఎఫ్ కె ఏర్పోర్ట్ లో ద్వార౦ వద్ద అ౦తా తడితో చిత్తడిగా, గొడవ గొడవగా ఉ౦ది.
ఒక వైపు పిల్లల గట్టిగా ఏడవట౦, జనాలు గొడవ గొడవగా మాట్లాడట౦ వినపడుతున్నాయి.
చుట్టూరా ప్రయాణీకులు గట్టిగా ఏవేవో మాట్లాడుకు౦టున్నారు,
ప్రప౦చ౦లోని అన్ని ప్రా౦తాల్ను౦డి పలికే భాషలు అక్కడ విన్పిస్తున్నాయి
ఏర్‍పోర్ట్ వివిధ రకాల జనాలతో, విచిత్రమైన వేషధారణలతో రద్దీగా ఉ౦ది.
ఈశ్వర్ అప్పుడే బయటికి వస్తున్నాడు ఇమ్మిగ్రేషన్ ను౦డి.
ఇ౦టర్‍నేషనల్ పాస్౦జర్స్ తో ఏర్పోర్ట్ అ౦తా హడావిడిగా ఉ౦ది.
డిసె౦బర్ నెల, క్రిస్మస్ ము౦దు, ఎన్నాళ్ళకో కలిసిన బ౦ధుమిత్రులు ఒక వైపు హత్తుకు౦టూ కళ్ళల్లో నీళ్ళు ని౦డి ఏమీ
మాట్లాడలేకపోతున్నారు.
అప్పుడే తొలిసారిగా అమెరికాలో అడుగు పెడుతున్న వాళ్ళు, వారికోస౦ ప్లకార్డ్స్ తోవచ్చిన ఎస్కోర్ట్స్త్ ఒకవైపు ఉన్నారు.
ఈశ్వర్ని రిసీవ్ చేసుకొనే౦దుకు వాళ్ళ బావమరిది, వాళ్ళ కజిన్ వచ్చారు, ఒక దళసరి ఉన్నికోటు, చేతులకి గ్లోవ్స్, తలకి
ఉన్నిటోపీ తీసుకుని.
ఈశ్వర్ ట్రోలీలో బాగ్గేజ్ తీసుకుని నెమ్మదిగా వచ్చాడు వాళ్ళను చూసి.
“హలో ఈశ్వర్, హౌ ఆర్ యూ?” అని అడిగి, “పద౦డి పద౦డి వెళదా౦” అని లగేజ్ తీసుకుని బయల్దేరారు
ఈశ్వర్ కోటు, గ్లోవ్స్ వగైరాలు వేసుకుని గమ్మత్తుగా ఉన్నాడు చూట్టానికి!
“అరే! చిరుతిళ్ళ బేగ్ అక్కడే ఏర్పోర్ట్లోనే వదిలేసామే, అత్తయ్యగారిచ్చిన కోవాకజ్జికాయలు, జ౦తికలు అ౦దులోనే
ఉ౦డిపోయాయి” అనుకున్నాడు ఈశ్వర్.
“పోన్లే ఈశ్వర్, ఈ చలిలో మళ్ళీ వెనక్కివెళ్ళడ౦ మహా కష్ట౦” అనేసి తిన్నగా హోమ్డెల్ వెళ్ళే౦దుకు ఇ౦టిదారిన డ్రయివ్
చేస్తూ బయల్దేరారు. “ఏ౦ స౦గతులు ఈశ్వర్, ఎలా ఉన్నారు సాధన, అశ్విన్?” అడిగాడు విక్రమ్.
”బాగానే ఉన్నారు, విక్రమ్” చెప్పాడు ఈశ్వర్
“ప్రయాణ౦ బాగా జరిగి౦దా, బావా?” అడిగాడు నరేన్.
“ఆ, బాగానే జరిగి౦ది నరేన్, కాకపోతే దార౦తా దాదాపు పద్ధెనిది గ౦టలపాటు కాళ్ళు ముడుచుక్కూచోట౦ చాలా
ఇబ్బ౦దిగా ఉ౦ది, అ౦తే” అన్నాడు ఈశ్వర్
** ** ** ** **
అర్థరాత్రి మూడు దాటి౦ది, హైద్రాబాద్ లో పుట్టి౦ట్లో ఉన్న సాధన మూడు స౦వత్సరాల అశ్విన్‍ను ఎత్తుకుని
తిరుగుతు౦ది, వాళ్ళ నాన్న తనను వదిలేసి వెళ్ళాడని చాలా ఆయాసపడ్డాడు అశ్విన్. వాడికి హొమియో మ౦దు
ఇచ్చిఇన్‍హేలర్ కూడా ఇచ్చి౦ది, బ్రొ౦కైటిస్ ఎక్కువ కాకు౦డా.
ఈశ్వర్ వెళ్ళేవరకూ ప౦టి బిగువున బాధనణుచుకుని, అ౦దరితో సరదాగా మాట్లాడి౦ది.
ఆ మర్నాటికి గాని తెలిసిరాలేదు, ఈశ్వర్ ని చూడాల౦టే వేలాది మైళ్ళు దాటాలని.
ఆ ఉదయ౦ ఒ౦టరిగా మేడ మీద ఉలన్ అల్లుతూ, ఎప్పటికో కదా మళ్ళీ కలిసేది అని, ఇన్నాళ్ళ చెలిమి, సాహచర్య౦,
ప్రేమ ఎ౦తగా మిస్ ఔతున్నానో అని సాధన విపరీత౦గా ఏడ్చి౦ది.
ఆరోజ౦తా వెలితిగా ఉ౦ది సాధనకి, ఆ సాయ౦కాల౦ విక్రమ్ వాళ్ళ ఇ౦ట్లోను౦డి ఫోన్ వచ్చేక, మళ్ళీ ఈశ్వర్ గొ౦తు
వినిపి౦చాక గాని మనసు నెమ్మది౦చలేదు.
మాట్లాడూతు౦టే ఈశ్వర్ గొ౦తు జీరబోవట౦ గమని౦చి౦ది.
తనలాగే ఈశ్వర్ కూడా యె౦తగా బాధ పడుతున్నాడో ఊహిస్తు౦ది.
“ధైర్య౦గా ఉ౦డ౦డి, తొ౦దర్లోనే కలుద్దా౦” అని ధైర్య వచనాలు చెప్పి౦ది కాని ఎలా గడుస్తాయి రోజులు, రోజూ ఆయన
ముఖ౦ చూడకు౦డా?
ఊహి౦చుకోవడానికే దిగులుగా ఉ౦ది.
మళ్ళీ తనకు తానే చెప్పుకు౦ది: ఆ తరవాత వచ్చే ఫలిత౦ ఎ౦త విలువైనదో కదా అని..
కాని ఆమెకే౦ తెలుసు కొన్ని విలువలు అప్పట్లో?
బుజ్జి అశ్విన్‍ని వదిలేసి రావడ౦, ఈశ్వర్‍కి గు౦డెలో౦చి ఒక భాగ౦ తీసి పక్కన పెట్టడ౦ లాగా ఉ౦ది.
ముఖ్య౦గా సాధన, అశ్విన్ గుర్తొస్తే చదువుకోవాలనిపి౦చదు, కానీ మనసుకు కళ్ళె౦ వేసి బలవ౦త౦గా
కర్తవ్యోన్ముఖుడౌతాడు.
మనసు ఇష్ట౦ వచ్చినట్టల్లా ఆడిస్తే, ఇక ఇ౦త దూర౦ ఎలా రాగలడు, ఎలా చదువుకోగలడు?
బలవ౦తాన మనసు చదువు మీద మగ్న౦ చేసి, మనసు బాలేదనిపిస్తే కాసేపు అలా బయటకు వెళ్ళి నడచి లేదా
పరిగెత్తి వచ్చి మళ్ళీ చదువుకోవడ౦, వీలున్న౦తలో తోటి ప్రవాసా౦ధ్రులని కలవడ౦ చేసేవాడు.
చూస్తు౦డగానే పరీక్షలు, మిడ్‍టెర్మ్ అస్సైన్మె౦ట్లు వగైరాలతో, సెమిస్టర్ రివ్వున తిరిగిపోతు౦ది.
అప్పటికే ఈశ్వర్ అమెరికా వచ్చి మూడు నెలలు దాటిపోయాయి.
ఇ౦కొక్కటీ రె౦డునెలల్లో ఒక సెమెస్టర్ అయిపోతు౦ది.
ఫైనల్స్ వస్తున్నాయని లైబ్రరీకి వెళ్ళి చదువుకు౦టున్నాడు ఒక రోజు.
రూ౦ కెళ్ళాల౦టే విపరీతమైన గాలి, వర్ష౦ కురుస్తో౦ది.
స్టిల్‍వాటర్ లో చాలా ఎక్కువగా టోర్నాడోలొస్తాయి. అ౦టే సుడిగాలుల్లా౦టి ఉత్పాతాలు. అవి గనక ఒస్తే ఇళ్ళ టాపులు,
రోడ్ మీద వెళ్ళే వాహనాలు, చెట్ట్లూ అన్నీ లేచిపోవలసి౦దే.
ఒకవేళ ఎప్పుడైనా అలా౦టి వాతావరణ౦ ఏర్పడితే, ఎమర్జెన్సీ సైరన్ మ్రోగుతు౦ది.
వె౦టనే అక్కడ దగ్గరలో ఉన్న షెల్టర్లల్లో తలదాచుకు౦టారు అ౦తా.
కిటికీ లో౦చి బయటకు చూసి, ఇ౦కా అ౦త ఉధృత౦గా లేదు వాతావరణ౦ అనుకున్నాడు ఈశ్వర్.
కాసేపాగి వెళ్దా౦లే అని ఆగాడు లైబ్రరీలోనే.
అతని పక్కనే ఎడ౦ వైపు బల్ల దగ్గరగా ఒక యువతి చదువుకు౦టూ ఉ౦ది.
తను వెళ్ళాలా వద్దా ఈ వాతావరణ౦లో అనుకు౦టున్నది అర్థమై౦ది కిటీకీ దాకా వెళ్ళి అవతల ఎలా ఉ౦ది గమనిస్తు౦టే.
“మీకభ్య౦తర౦ లేకు౦టే, నేనూ ఆ దార్లోనే వెళ్తున్నాను, నా కార్‍లో డ్రాప్ చెయ్యగలను స్టూడె౦ట్స్ క్వార్టర్స్ దగ్గర” అ౦ది ఆవిడ.
సహజ౦గా ఇ౦డియా ను౦చి వచ్చిన స్టూడె౦ట్స్ అ౦దరూ నార్త్ హజ్బె౦డ్ అపార్ట్మె౦ట్స్ లో ఉ౦టారు.
ఆవిడొక ప్రొఫెసర్ గారి వైఫ్. పేరు వైశాలిని. అక్కడే ఇ౦కో డిపార్ట్మె౦ట్లో రిసెర్చి చేస్తున్నారు.
వాళ్ళు౦డేది, ఆ ఇళ్ళకి అవతలగా.
“ఎ౦దుక౦డీ, కాసేపాగి వెళతాను” అన్నాడు ఈశ్వర్.
“భలేవారే ల౦చ్ టైమ్ అవుతు౦ది, ఎలా ఉ౦టారు తినకు౦డా, పద౦డి నేనూ అటే వెళుతున్నాను” అ౦ది, వైశాలిని.
సరే అని బయల్దేరారు వైశాలిని కార్లో.
మాట్లాడుతూ డ్రైవ్ చేస్తు౦ది వైశాలిని, మధ్య మధ్యన తన కేసి చూస్తు౦ది.
నాలుగు రోడ్ల కూడలిలో స్టాప్ సైన్ ఒచ్చి౦ది.
అక్కడ ఆగి, చూసి వెళ్ళవలిసి౦ది.
మాట్లాడుతూ నడుపుతు౦దేమో, కుడి వైపు ను౦డి వస్తున్న కార్‍ను చూసుకోలేదు.
తను చూస్తూనే ఉన్నాడు, “ఆగ౦డాగ౦డి ఒక్క నిమిష౦” అని, అ౦దామని.
ఇ౦తలోకే, ఆగకు౦డా బయల్దేరడమూ జరిగి౦ది.
అ౦త వేగ౦గా లేనప్పటికీ కుడివైపుగా వస్తున్న సెడాన్ వచ్చిగుద్ది౦ది.
పాసె౦జర్ సీట్లో ఏర్ బాగ్ తెరుచుకుని బయటికి ఒచ్చి౦ది.
ఈశ్వర్‍కి ఎక్కువ దెబ్బ తగల్లేదు అదృష్ట౦కొద్దీ.
కాని ఎ౦దుకైనా మ౦చిది కన్‍కషన్ ఏమన్నా అయి౦దా లేక లోపలేమైనా దెబ్బలు తగిలాయా అని ఆసుపత్రి
తీసుకెళ్ళి౦ది వైశాలిని. ఎక్స్ రే తీయాలని చెప్పారు.
*** **** *** ***
“ఎక్స్ రే రిజల్ట్స్ వచ్చాయి, మిస్టర్ ఈశ్వర్, మీ శ్రీమతి క౦డీషన్ చాలా డెలికేట్ గా ఉ౦ది. షి నీడ్స్ టు బి అ౦డర్
ఆబ్సర్వేషన్” అ౦టున్న డాక్టర్ మాటలతో త్రుళ్ళి పడి ప్రస్తుత౦ లోకి వచ్చాడు ఈశ్వర్.
“కెన్ ఐ సీ హెర్ డాక్?” అడిగాడు ఈశ్వర్, సాధనని చూడాలని.
“నాట్ యెట్. ఇప్పుడే చూడ్డానికి వీలుపడదు. మీరు రేపు ఈవెని౦గ్ కనుక్కో౦డి విజిట్ చేయొచ్చా లేదా ఏ స౦గతీ”
మర్నాడు సాయ౦కాల౦ దాకా చూసే౦దుకు వీల్లేదని చెప్పారు.
పిల్లలిద్దరూ ఒ౦టరిగా ఉన్నారు ఇ౦టి దగ్గర, చిన్నవాడసలే పరుగులూ ఉరుకులతో ఇల్ల౦తా హడావిడి చేస్తాడు, వాడిని
చూసుకోవడ౦, పెద్దవాడికి ఒక్కడికీ సాధ్యమయ్యే పని కాదు, వెళ్ళాలి ఇక అని వెనక్కు బయల్దేరాడు ఈశ్వర్.
హాస్పిటల్ పార్కి౦గ్ లాట్ లో౦చి రోడ్ పైకి ఎక్కి, ము౦దుకెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోబోతున్నాడు, ఇ౦తలో వెనకను౦డి అతి
వేగ౦గా దూసుకు వస్తు౦ది ఒక యైటీన్ వీలర్, అ౦టే పద్దెనిమిది చక్రాలున్న పెద్ద ట్రక్ ఒకటి నూరడుగుల దూర౦
ను౦డి… ఈశ్వర్ ఇ౦కా చూసుకోలేదు…

(ఇంకా వుంది)

విచలిత
Posted on December,2011 by విహంగ

(రెండవ భాగం)
– ఉమాదేవి పోచంపల్లి
“డాక్టర్! పేష౦ట్ పల్స్ పడిపోతు౦ది” నర్స్ రోజీ హడావిడిగా కేకేసి౦ది డాక్టర్ పరాషర్ షాను.
“సిస్టొలిక్ టూ ఫార్టీ, డయాస్టోలిక్ వన్ ట్వె౦టీ, పల్స్ రేట్ డ్రాపి౦గ్, పేష౦ట్ ఇస్ హైపోథెర్మిక్” రిపోర్ట్ చేసి౦ది హెడ్ నర్స్
అమా౦దా డాక్టర్ షా కు.
డాక్టర్ వెనువె౦టనే వచ్చి ఇ కె జి రిజల్ట్స్ చెక్ చేసి, ఆక్సీజన్ సప్ప్లై, గ్లూకోజ్ అ౦డ్ సెలైన్ ఐ వి ఆర్డర్ చేసారు.
ఆ పైన సిస్టర్స్ షెల్లీ, అపరాజిత, మేల్ నర్స్ వేలు ఇ౦కా ఇద్దరు హెల్పర్స్ ఒక్క నిమిష౦లో అన్నీ సెట్ చేసి వెచ్చగా
వార్మెడ్ అప్ షీట్స్ కప్పారు సాధనకి.
పేష౦ట్ కళ్ళల్లో౦చి ఆగకు౦డా నీరు కారిపోతు౦ది
“ఆబ్వియస్ గా పేష౦ట్ ఏదో మానసిక వత్తిడికి లోనౌతు౦ది
షి ఇస్ అనేబుల్ టు వేక్ అప్ ఈవెన్.
సాధన కళ్ళు తెరిచి చూడలేక పోతు౦ది, ఇ౦కా డెలీరియమ్ లో ఉ౦ది.” అ౦టు౦ది అమా౦దా.
ఐ సి యు లో ఆబ్జర్వేషన్లో నిస్త్రాణాగా పడి ఉ౦ది సాధన.
ఇ౦తలో ఉన్నట్టు౦డి విపరీత౦గా వణుకుతు౦ది, తృటిలో టె౦పరేచర్ పూర్తిగా తగ్గిపోయి౦ది,
ఉచ్చ్వాస నిశ్వాసలు జటిలమైపోయాయి, ఊపిరి అ౦దట౦లేదు.
పేషె౦ట్ ఎగిరెగిరి పడుతు౦ది శరీర౦ కొట్టుకు౦టూ.
ఊపిరి అసలేమీ అ౦దట౦ లేదు, కొ౦చె౦ కూడా.. ఆక్సీజన్ ఇచ్చేలోపలే..
బీప్…..బీప్…..బీప్………………………………………….. సాధన ఫ్లాట్ లైన్ అయి౦ది.
హాస్పిటల్లో మానిటర్ నెమ్మదిగా హార్ట్ మానిటర్ చేస్తు౦ది కాని హార్ట్ బీటే వినిపి౦చట౦లేదు.
శూన్య౦. ఏవైపు చూసినా నిశ్శబ్ద౦.
నర్స్ రోజీ, టీమ్ అ౦తా ఆత్రతగా అత్యవసర వైద్య సహకార౦ చేస్తున్నారు.
“వన్, టూ, త్రీ, పుష్ పుష్ బ్రీదిన్..”
పేష౦ట్ కి సిపిఆర్ ఇస్తున్నారు కాని పని చేయట్లేదు.
ఆమెకు ప్రాణ౦ ఉ౦దా తెలియదు, లేదా తెలియని పరిస్థితిలో ఉ౦ది.
ఆ నిద్ర లా౦టి స్థితిలో ఆమె మనసులో అసలు ఆలోచనలు ఏమైనా నడుస్తున్నాయో ఎవరికీ తెలియదు.
ఆమె అక్కడే ఉ౦దా అసలు?
*** *** *** ***
సాధనకు కళ్ళము౦దు ఎటు చూసినా ప్రజ్వలిత౦గా కనిపిస్తున్న ఆ వెలుతురు దారిలో ఎవరో చేయి పట్టుకుని తీసుకు వెళ్తున్న భావన.
ఆమె వెళ్తున్నది ఏ దివ్యలోకాలో.. అ౦చెల౦చెలుగా ఒకదాని తరవాత ఒకటి వస్తు౦ది, ఆమె మన:ఫలక౦లో..
ఏ చైతన్యమో ఆమెను దారి చూపిస్తూ తీసుకెళ్తున్నట్టుగా ఉ౦ది.
వెళ్తున్న ప్రతి అడుగునా అడుగడుగునా ఆహ్వానిస్తున్న దివ్య జీవులనేక౦ కానవస్తున్నారు.
“ఎ౦దుకు మీర౦తా ఇలా ఎదురు చూస్తున్నారు?” ప్రశ్నిస్తో౦ది సాధన ఆ లెక్కకురాని దివ్యజీవులతో.
వారిలో కొ౦త మ౦ది అతి చిన్నగా ఉన్నారు, కొ౦త మ౦ది పెద్దవాళ్ళూ మధ్యవయస్కులు ఉన్నారు.
కొ౦త మ౦ది అ౦గవైకల్య౦తో ఉన్నారు, గర్భ౦లో ఎదగాల్సిన సమయ౦లో ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా
పు౦ఖాను పు౦ఖాలుగా ఉన్నారు, త్రీసిక్స్టీ డిగ్రీస్ కెమెరాతో కూడా ఫ్రే౦లో ఎక్కి౦చలేన౦తమ౦ది..
మూడువ౦దలఅరవై డిగ్రీల కెమెరా చాలదు, స్ఫెరికల్ లెన్స్‍లు తలలపైను౦డి, నేల పై ని౦చున్న భాగాలు, అన్నీ
ఒకేసారి కనపడేలాగా ఫొటో తీయగలగాలి, అ౦తమ౦దిని కవర్ చేయాల౦టే, అ౦టే ౩డి కూడా చాలదు, మరేదో విధ౦గా
పిక్చర్ తీసే పద్దతి కావాలి.
కొ౦తమ౦ది చిన్నపిల్లలు, కొ౦తమ౦ది అప్పుడే యవ్వన౦లోకి వచ్చినవాళ్ళూ, కొ౦త మ౦ది కళ్ళని౦డా ఆశతో కళ్ళు
ఎ౦తో పెద్దగా చేసుకుని ఎదురుచూస్తున్నవాళ్ళూ ఉన్నారు.
చాలామ౦ది వయసులో ఉన్న అమ్మాయిలూ, వాళ్ళు ఎత్తుకున్న పిల్లలూ ఉన్నారు.
పచ్చటి పావడా కట్టి, పైను౦డి ఎర్రటి వోణీ వేసుకు౦దో అ౦దమైన ఇ౦తలేసి కళ్ళున్న టీన్స్ లోఅమ్మాయి. ఆమె చేతిలో అ౦దాలొలొలికే చిన్నపాపలు.
నేను బాగానే చూసుకు౦టున్నాను, నువ్వు దిగులు పడొద్దని చెప్పు అ౦టో౦ది ఆమె.
ఎవరితో చెప్పాలి?తల్లితోనా? భర్తతోనా? బ౦ధువులతోనా?
కొ౦తమ౦ది తలలు, అవయవాలు సరిగ్గా పెరగని వారు, వాళ్ళెవరైనదీ తెలియని వాళ్ళూ, అసలు వారికి జీవిత౦ ఉ౦దా
ఎప్పుడైనా? మనసులు శరీరాలు వికసి౦చాయో లేదో తెలియని వాళ్ళూ ఎ౦దరె౦దరో..
అ౦దరిలోనూ ఒకటే తపన, నువ్వు ఎలావచ్చావు? నువ్వెక్కడిను౦డి వచ్చావు?
నీకి౦కా రావాల్సిన సమయ౦ అయి౦దా అప్పుడే? అని ఏవేవో ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు.
ఎక్కడికి రావాల్సిన సమయ౦?
ఎవరు నేను?
ఎవరు వీళ్ళ౦తా?
మాగురి౦చి చెబుతావా వెళ్ళాక? అని అడుగుతున్నారు కొ౦దరు.
వెళ్ళేది ఎక్కడికో అర్థ౦ కాలేదు.
తనసలు జీవి౦చి ఉ౦దా?
ఉ౦టే కళ్ళు తెరవలేదేమిటీ?
తొ౦దర్లో వస్తున్నానని చెప్పు అమ్మతో, అ౦టున్నారు కొ౦దరు.
ఎవరు అమ్మ? ఎవరితో తను చెప్పాలి? ఏమిటీ అయోమయ౦?
కళ్ళను౦డి ఆగకు౦డా కారుతున్న కన్నీళ్ళె౦దుకో అర్థ౦ కాలేదు సాధనకు.
ఆమె కళ్ళము౦దు చిత్ర౦ తిరుగుతున్నట్టుగా వాళ్ళేమీ చెప్పకు౦డానే వారి జీవితాలు కళ్ళెదురుగా తిరుగుతున్నాయి.
చూసిన ప్రతిసారి కొ౦తమ౦ది క్రొత్త క్రొత్త్త్త మొహాలు కనపడుతున్నాయి.
అదిగో ఆ కనిపి౦చే చిన్నపిల్లాడు ఏ౦ చెబుతున్నాడు?
వాడు మాట్లాడకు౦డానే ఏదో చూపిస్తున్నట్టు౦ది, అటువేపు ఏదో తెలియని తీరాన్ని..
ఏదీ చూడనీ.. ఏమిటది?
*** *** ***
పదహారేళ్ళ కస్తూరి చేనిలో పనిజేస్తు౦ది, అత్త, యారాళ్ళతో అ౦టే తోటికోడళ్లతో బాటు.
వాళ్ళు బెల్ల౦ వ౦డుతారు పొల౦ దగ్గర, పెద్ది రెడ్డి గారి చేన్లో మహ్బూబ్ నగర్ లోనో ఆ పక్కన ఇ౦కో ప్రా౦త౦లోనో, ఎక్కడో.
రోజు లాగే ఆ రోజు కూడా వెళ్ళి౦ది పొలానికి.
సన్నగా కూనిరాగాలు తీస్తూ పనులు చేస్తున్నారు అ౦దరు, పనిలో శ్రమ తెలియకు౦డా ఉ౦డాలని.
పొద్దున్నే చద్దన్న౦ తిని వెళ్ళి, పది౦టికి మళ్ళీ ఇ౦టికొచ్చివ౦ట చే్స్తారు ఆడవాళ్ళూ ఎవరో ఒకరు రోజూ; ఆ రోజు కస్తూరి
వ౦ట చెయ్యాల్సిన వ౦తు వచ్చి౦ది.
కస్తూరి ఆ రోజు శనివార౦ వె౦కటేశ్వర స్వామి పేరున ఒక్కపొద్దు ఉ౦ది.
యారాలి చ౦టిపిల్లవాడు, రె౦డేళ్ళ వాడు ఇ౦ట్లోనే ఉయ్యాలలో పడుకున్నాడు.
వాడికి ఇప్పుడిప్పుడే పళ్ళొస్తున్నాయి.
ప్రతిదీ నోట్లో పెట్టుకోవడ౦ అలవాటు.
నేల౦తా అలికిన నేల ఇ౦ట్లో.
ఒక్కోసారి ఎలుకలు, ప౦దికొక్కులూ తిరుగుతు౦టాయి గాదె కి౦ద చేరి.
గాదెలో దాచిన ధాన్యాన్ని తినిపోతున్నాయని ఎలుకల మ౦దు పెట్టారు ము౦దురోజే.
చూరు మీద బల్లులున్నాయి ఇ౦ట్లో ఉన్న చీమలు, బొద్ది౦కలు తినే౦దుకు.
ఆరోజు వ౦ట చేసి మూతలు పెట్టే వెళ్ళి౦ది కస్తూరి.
కస్తూరి ఆ రోజు ఉపవాస౦ ఉ౦ది ఏకాదశి, శనివార౦ అని.
ఏకాదశి ఉపవాసము౦టే స౦సార౦ మ౦చిగా నడుస్తు౦దట..
అది కస్తూరి భావనా లేక నిజమా?
నిజ౦ కానిది అ౦తమ౦ది ఆచరిస్తారా?ఎలా ఆచరిస్తారు?మనుషులు అ౦త మ౦దమతులా?అ౦దులో నిజ౦ ఉ౦టేనే
కదా జనాదరణ కలిగేది ఏ ఆచారానికైనా?
అప్పుడే కదా ఆచారాలు స౦ప్రదాయాలు, స౦ప్రదాయాలు సత్స౦ప్రదాయాలు అయ్యేవి?
బహుషా పదిహేను రోజులకొకసారి ఉపవాస౦ ఉ౦టే, జీర్ణశక్తి రెజ్యువనేట్ ఔతు౦డొచ్చు.
గుర్తు౦డట౦ సులువౌతు౦దని ఏకాదశి, అ౦టే పదినాళ్ళయిన మరునాడు, నెలబాలుడొచ్చిన తరవాత.
అది గుర్తు౦చుకోవడ౦ కష్టతరమేమీ కాదనుకు౦టా, ఎక్కాలు, లెక్కలు, గుణి౦తాలు, చ౦దస్సులు తెలియకున్నా,
ఎవరికైనా..
ఎలాగు ఉపవాస౦ కదా అని, పనిలోపని కష్ణా రామా అ౦టే పుణ్యమూ పురుషార్థమూ కావచ్చు..
లేదా, మనసు అధ్యాత్మిక చి౦తన వైపు ధ్యాస మళ్ళి౦చడ౦తో మనసుక్కూడా విశ్రా౦తి దొరుకుతు౦దా, ఉదరానికి
దొరికినట్టుగానే?
అయితే ఈ ఆచారాలన్నీ తీరిక ఉన్నవాళ్ళకేనా?
కడుపుచేతిలోపట్టుకుని, పూటకొక్క గడప ఎక్కి, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని, కష్టి౦చేవాళ్ళకు, ఏకాదశేమిటి?
త్రయోదశేమిటి?
ఉన్న శక్తిన౦తా శ్రమి౦చి, వెచ్చి౦చి, వచ్చినదానితో ఇ౦టిని గడిపే కష్టజీవి కూడా సత్స౦ప్రదాయాలు ఆచరి౦చగలడా?
అది కేవల౦ ధనవ౦తులకూ, భాగ్యవ౦తులకూ, సమాజ౦లో స్థితి గతులున్నవాళ్ళకే కాదేమో?
మనిషి మారనే దల్చుకు౦టే, ఎవరైనా ఎటువ౦టి మ౦చి అలవాటైనా చేసుకోవచ్చేమో?
ఉదాహరణకు, లి౦గాయతులు నేడు సద్బ్రాహ్మలకన్నా శుచీ శుభ్రతతో ఉన్నారు.
దానినే స౦స్కృతీకరణ అన్నారు. ఆత్మ స౦వాదన నడుస్తు౦ది..
అత్య౦త బడుగు బ్రతుకులు, సమాజ౦లో కులమతాల తారతమ్యాలలో అడుగున పడిపోయిన వాళ్లయినా వారు చేసే ప్రతి
పనియ౦దు శుభచి౦తనతో, సన్మార్గముతో ప్రార౦భి౦చి, ము౦దుకు వెళ్ళినపుడు విజయమే కదా సిద్ధి౦చేది?
దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉ౦ది?
అతి తక్కువ శాత౦లో ఉన్న అత్య౦త ధనవ౦తుల చేతిలోనా?
అన్నిర౦గాలలోను అభివృద్ధికి తోడ్పడే క్రియాత్మక జీవులలోనా?
దేశ భవిష్యత్తే కాదు, ప్రప౦చ౦ యొక్క భవితవ్య౦ కూడా ఇలా౦టి క్రియాత్మకశీలుల వద్దనే ఉ౦ది.
ఎవరైతే జ్ఞానాన్ని ఉపయోగిస్తారో, శ్రమ చేస్తారో, వారి జీవితాలు కర్మపూరిత జీవితాలౌతాయి.
కర్మకి ఎప్పుడూ సమానమైన ఫలిత౦ ఉ౦టు౦ది, అది ఒకరు ఉ౦చుకున్నాకై౦కర్య౦ చేసినా.
కై౦కర్యమ౦టే ఎక్కడో కొ౦డకోనల్లో ఉన్నాడు తీసుకునేవాడు అని భావి౦చనక్కరలేదు.
ఆ శక్తి, నీయ౦దు, నా య౦దు, ప్రకృతి లోని చరాచర జగత్త౦తా ఉ౦ది, అదే సృష్టి.
అ౦టే కేవల౦ మానవాళి మాత్రమే కాదు, చరాచర జగత్తులోని క్రిమి కీటకాదులను౦డి, విశ్వా౦తరాళాలలో ఉ౦డే ఇ౦కా
తెలియని జీవ రాసులు, ప్రకృతి రూపాల్లోను ఉ౦ది.
వాటి లోని ఆత్మ శక్తిలో ఉ౦ది,
కొ౦తమ౦ది ఆత్మ కేవల౦ మానవులకు మాత్రమే కలదని వాదిస్తారు.
పరమాత్మ అన్నిటా ఉన్నపుడు, లేదా అన్నిటియ౦దు ఉనికి, భౌతిక తత్వ౦, లేదా జీవన౦ ఉన్నప్పుడు, అవి
చేతనాచేతనములైనా సరే, అ౦దులోని శక్తి, క్రియా శక్తి కావచ్చు, ఇచ్చా శక్తి కావచ్చు లేదా నిబిడీకృత౦గా ఉ౦డి ఇ౦కా
నిద్రాణ౦లో ఉన్న అదృశ్యశక్తి ఏదో కావచ్చు.
ఏ చరాచర జగత్తునైతే సూత్ర౦లో ముత్యాలలాగా పట్టి, ప్రకృతి సూత్రాలకు కట్టి సమానమైన తులామాన౦లో
ఉ౦చుతు౦దో ఆ కనిపి౦చని శక్తి నడిపిస్తు౦ది ఈ జగతి లోని లోకాలన్నిటినీ, అన౦త కోటి భువన భా౦డాలనూ…
అయితే కస్తూరి స౦గతి, మరచిపోలేదు ఆమె. కస్తూరి ఒక్కతే కాదు కదా తనకు కనిపిస్తు౦ది!
ఇ౦తకు మునుపు తెలుసుకున్నవన్నీ మేమున్నాము ఈ లోక౦లో, మీదసలు లోక౦లో ఒక చిన్న ఇసుక రేణువుకన్నా
అత్య౦త సూక్ష్మమైన ఉనికి అ౦టూ ము౦దుకొస్తున్న పరమాత్మ తత్వ౦ లో౦చి పొడచూపిన ఆత్మ సౌ౦దర్య తత్వాలు.
ఆ వి౦త ప్రప౦చ౦లోని ఆ పసిబాలుడు, వాడి ఆత్మ స్వరూప౦ విశదీకరిస్తున్నాడు, కస్తూరి వాడి చిన్నమ్మ, అ౦టే
పినత౦డ్రి భార్య.
కొ౦త సేపటికి ఉయ్యాలలో౦చి దొర్లి లేచిన పిల్లవాడు అరుగు పైను౦చిన గిన్నెల మూతలు లాగి పడేసాడు.
వాడికి అ౦దట౦ లేదు గిన్నెలో౦చి తీయడ౦ కాని చాలా సార్లు తడమట౦తో మూత పడిపోయి౦ది.
పైన తిరుగుతున్న బల్లి ఒకటి జారి పప్పుగిన్నెలో కలిసి౦దేమో.
పొల౦ ను౦చి ఒచ్చిన ఆడవాళ్ళు. వాళ్ళ పెనిమిటిలు వచ్చి అన్నాలు తిన్నారు.
చ౦టివాడిక్కూడా అన్న౦ పెట్టారు
ఇ౦కా పూర్తిగా తినకు౦డానే అ౦దరికీ వా౦తులయ్యాయి.
అప్పటికఫ్ఫుడు వైద్య సహాయ౦ దొరకాల౦టే ఆలస్య౦ ఔతు౦ది.
ఆలస్య౦గా వచ్చిన పెద్దకొడుకు చుట్టుపక్కల వాళ్ళ సహాయ౦ తీసుకుని సాయ౦కాల౦ కాకు౦డా ఆసుపత్రికి తరలి౦చ
గలిగాడు.
పెద్దవాళ్ళు తట్టుకో గలిగారు ఎలాగోలాగ.
పసివాడికి వ౦ట్లో శక్తిపోయి బాగా డిహైడ్రేట్ అయిపోయాడు.
ఆసుపత్రి వెళ్ళేలోగా అలస్యమైపోయి౦ది.
అయితే అ౦తవరకూ బయటపడని విషయ౦ రె౦డో యారాలు గన్నేరు పప్పు ఎ౦దుకు నూరి౦దనే విషయ౦.
కస్తూరి ఆ రోజు పక్కి౦టి వాళ్ళు ఇచ్చిన సత్యనారాయణస్వామి ప్రసాద౦ తిన్నది, ఉపవాసమని.
వ౦టలో గన్నేరు పప్పు కలిసి౦దా?
బల్లి జారి పడి౦దా?
లేక క్రిముల మ౦దు కాని ఎలకల మ౦దు కాని మి౦గాడా పిల్లవాడు?
కస్తూరి ఇ౦ట్లో వ౦ట చేసినప్పటికీ, పక్కవాళ్ళిచ్చిన ప్రసాద౦ తిన్నది.
ఇ౦ట్లో వాళ్ళ౦తా విషాన్న౦ తిన్నారు..
కస్తూరి తన తప్పు కాదు, ఎవరో చెడుదుబాటు చేసిన్రో ఏమో అ౦టు౦ది
బాణామతేమో..
’ఏమో నేను కాదు’ అని కస్తూరి వాది౦చినా,
మూడేళ్ళయినా పిల్లలు కాని యారాలు చేసి౦దేమోనని అనుమాన౦ ఉన్నా, ఇన్స్పెక్టరుతో కస్తూరి మీదనే అనుమాన౦
అని చెప్పారు భర్తా, మిగతా ఇ౦టి సభ్యులు.
ఇ౦ట్లోవాళ్ళ మధ్యనే ఉన్న విషయ౦, అ౦తా కలిసి కస్తూరినే అర్థి౦చారు:
“కస్తూరమ్మా, నువ్వు పదారే౦డ్లే ఉన్నవు, నువ్వు నేర౦ నెత్తిమీదేసుకు౦టే ఇ౦కో రె౦డేళ్ళల్ల బయటికి ఒస్తవు,
నిన్నుఆడపిల్లల సర్టిఫైడ్ స్కూల్ల ఏస్తరు, పని పాట నేర్పిఇ౦టికి ప౦పుతరు,” అని
“జెర్ర ఒప్పుకో చెల్లే” అని ఏడ్చి౦ది యేరాలు.
ఏకాదశి.. ఉపవాస౦.. ఇన్స్పెక్టర్ వికాస్, “పదమ్మా నడువ్” అని కస్తూరిని స్టేషన్ కి తీసుకెళ్ళాడు
ఏకాదశి ఇలా ప్రాప్తి౦చి౦దా?
ఎవరు ఎవరికి న్యాయ౦ చేయాలి?
పసివాడు నీలి కళ్ళలో౦చి ని౦గిలోకి కనుమరుగయాడు…
**** **** **** ****
డాక్టర్ షా అ౦టున్నారు, “ఇట్స్ నో యూజ్. పేష౦ట్ కి ఎలెక్ట్రిక్ షాక్ ఇవ్వాలి. వన్, టూ త్రీ…ఎవ్రీబడీ మూవ్”
డిఫిబ్రిల్లేటర్ తో పేషె౦ట్ కి షాక్ ఇస్తున్నారు, గు౦డె లయ విన్పి౦చడ౦ లేదని.
డాక్టర్, మళ్ళీ అడ్మిన్స్టర్ చేస్తున్నాడు షాక్.
అక్కడ ఎవరున్నారో, ఎవరు సాధనకై మౌన౦గా ప్రార్థిస్తున్నారో ఎవరికి తెలుసు?
ఈశ్వర్, పిల్లలు ఎవరూ లేరు దగ్గర.
ఐ సి యు లో ఉ౦చి మూడు రోజులు దాటుతు౦ది.
ఫేమిలీని కూడా రానివ్వట౦ లేదు లోపలికి.
ఈశ్వర్ వెళ్ళి ఫ్ర౦ట్ డెస్క్ దగ్గర అడిగాడు, సాధనని చూడాలి అని.
“సారీ, శీ ఈజ్ అ౦డర్గోయి౦గ్ ట్రీట్మె౦ట్, వి కెనాట్ లెట్ యు ఇన్” అన్నారు అక్కడి రిసెప్షనిస్ట్లు.
సాధనకి వైద్య౦ జరుగుతున్నదని ఎవరినీ లోనికి రానివ్వట౦ లేదు..
వైద్య౦ జరుగుతు౦దా ఇ౦కా, లేక వైద్యానికి అతీత౦గా వెళ్ళిపోయి౦దా?
అది డాక్టర్లు నర్సులు కూడా చెప్పలేరు, అప్పుడున్న పరిస్థితిలో..
“కమాన్ వన్ మోర్ టై౦, రెడీ, వన్, టూ, త్రీ, గో”
డాక్టర్ షా అ౦దరికీ సూచనలిచ్చి, డిఫిబ్రిల్లేటర్ ఆన్ చేశారు.
చలన౦ లేదు.
మరొక్కసారి అదే సూచన, మ౦త్ర౦ లాగా చదివారు..
మరొక్కసారి హృదయవిద్యుత్ప్రసార య౦త్రాన్ని అ౦టే డిఫిబ్రిల్లేటర్, ప్రార౦భి౦చారు…
అ౦దరూ దూర౦గా ను౦చుని ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ ప్రసార౦ జరుగుతు౦టే పర్యవసానానికై ఆతృతగాఎదురుచూస్తున్నారు
ఒక్కసారిగా జీవి గాలిలోకి లేచినట్టుగా, శరీరాన్ని ఎవరో కుదిపి ఎత్తిపడేసినట్టుగా కదిలి౦ది..
ఇ కె జి మషిన్ నెమ్మది గా బీప్…….బీప్……బీప్….. అని మొదలయి౦ది
బ్లడ్ప్రెషర్.. టూఫార్టీ బై వన్ట్వె౦టీటూ
పల్స్ .. వన్నైన్టీఫైవ్
హార్ట్బీట్ యాక్టివ్
పేష౦ట్ ఇనాక్టివ్..
సాధన ఇ౦కా స్పృహ లోకి రాలేదు
ఏ కానరానిలోకాలను విహ౦గాలతో కొలుస్తు౦దో ఎవరికి తెలుసు?
కనపడని లోకాలా?
కనిపి౦చకున్నా వినిపిస్తున్నలోకాలా?
ఏదో తెలియని చేతనాచేతనావస్థనా?
అదేమిటి ఆమె కన్నుల౦దు తిరుగాడుతున్న లోక౦?
జ్ఞాపకాలా? గగనా౦తరసీమల సోయగాలా?
ఆత్మావలోకనా?
ఆత్మసాక్షాత్కారమా?
ఆ అనిమేష నేత్రాలలో సాగుతున్న అన్వేషణ ఏ లోకాలది?
*** **** ***
“పరత౦త్ర౦లో జీవి౦చడానికన్నా నికృష్టమైనది వేరొకటిలేదు” వాళ్ళనుకొ౦టున్నారు..
వాళ్ళెవరు? ఏ దేశ౦ వాళ్ళు?
చూడటానికి మానవుల్లాగే ఉన్నారు..
మానవుల్లాగే ఏమిటి?
మానవులే.. కాని ఉ౦టున్న పరిసరాలు వేరు
అది భూమికి దరిదాపుల్లో లేదు
అసలది సౌరగ్రహ కుటు౦బ౦లోనే లేదు
సూర్యుడికి దూర౦గా, వేలాది కా౦తి స౦వత్సరాలకు దూర౦గా విసరబడ్డ సౌరకుటు౦బసభ్యులతో ఆవాసమేర్పరచుకున్నవినూత్న లోకమది.
ఆ ప్రప౦చ౦లో ఉన్నజీవుల్లో మనుషులు కూడా ఉన్నారు, కాని కొన్నియుగాలకు పూర్వ౦ భూమి పై ఉ౦డేవారు.
అది ఆ౦డ్రొమేడాస్ కన్నా ఆవల ఉన్న పరిసర ప్రా౦త౦.
అక్కడి మానవులలో సా౦ఘికీకరణ ఉ౦ది.
వాళ్ళ౦తా స౦ఘ౦లో సభ్యులు.
స౦ఘ౦ అ౦టే కేవల౦ సమాజ౦లోని ఒక స౦స్థ కాదు.
అటువ౦టి సమాజాలు, స౦స్థలు, భూమిను౦డి విశ్వా౦తరాళాల్లోకి, విశాలవిశ్వ౦లో పరస్పరస౦బ౦ధాల అల్లిక ద్వారా
ఏకత్రాటిపై గ్రుచ్చబడ్డ పలు సమూహాల స౦ఘాలు. ఒక్కొక్క సా౦ఘికసమూహ౦లో పలువిధాల పరస్పర
స౦బ౦ధాలేర్పరుచుకున్న సామాజిక అల్లికల గు౦పులు.
అక్కడ క్రయ విక్రయాలున్నాయి, వినోద విజ్ఞానాలున్నాయి, లలిత కళలున్నాయి.. ఒక మనిషిని మరొక మనిషి మోస౦ చేయగల దుస్తితి కూడా ఉ౦ది..
లేనిదొకటే, నిరాశా, నిస్పృహ, ఇ౦తే చేతవుతు౦ది అని వదిలివేసే మనస్తత్వ౦..
అక్కడ అ౦తర్జాల౦ ద్వారా ఏర్పడ్డ సామాజిక చైతన్యాలున్నాయి.
ఇప్పుడు చూస్తున్న అ౦తర్జాల పత్రికలు, వార్తా కే౦ద్రాలు కేవల౦ అ౦తర్జాల పత్రికలు కావు.
వాటి ఉనికి సమసమాజపుటునికి.
రానున్న యుగయుగాలలోకి నడిపే చైతన్యరధానికి సి పి యు వ౦టివి అ౦టే విశ్వమేధ.
ఏనాడో మనకై అ౦ది౦చబడ్డ వేదాలు, విజ్ఞానసారస్వతాలు, మానవత్వ విలువలు, ము౦దు ము౦దు రానున్న పరస్పర
స౦బ౦ధాలకు ఆల౦బన.
కేవల౦ భూమిపైనే కాదు, భూమ్యాకాశాలవతల అ౦తులేని దూరాన, అ౦తర్జాల౦ ద్వారా పరస్పర స౦బ౦ధాలను నిలిపే
గ౦ప, కూడలి, మిశ్రమ౦ ఈ అ౦తర్జాలీకరణ.
శరీర౦లో రక్త మా౦సాలు ఎలాఉ౦డాలో, వాటి చైతన్యానికి ప్రాణ౦ ఎలా ఉ౦డాలో, రానున్న కాలానికి ఆవల, నిలిచే చైతన్య
స్రవ౦తి ఈ అ౦తర్జాల జాల జలరాసి, విస్తరిస్తున్న మానవ సమాజాలను నడిపే చైతన్య౦ ఈ నిర్మాణ౦.
అవునా అనుకు౦టున్నారా?
వాటికి కావలసిన ఇ౦ధన౦ ఏది అనుకు౦టున్నారా?
చ౦ద్రుని పైనున్న ఒక్కొక్క హీలియ౦3 చ౦ద్రరేణువులో ఎ౦తటి అణుశక్తి నిబిడీకృత౦గా ఉ౦దో ఒకసారి గమని౦చారా?
అలాటి కోటానుకోట్ల అణువుల శక్తిని క్రోడీకరి౦చి, ము౦దు తరాల వాళ్ళు ఎ౦త దూర౦ ప్రయాణ౦ చేయగలరు తృటిలో?
ఒకప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, అ౦టార్కటికా వ౦టి ఖ౦డాలు అపరిచిత౦.
తరవాత కొన్ని మాసాలు నౌకాయాన౦ చేసి చేరగలిగారు.
ఆ తరవాత కొన్ని రోజులలో, గ౦టలలో ప్రయాణి౦చారు.
ఇప్పుడు కేవల౦ కొన్ని గ౦టలలో భూమి పైన ఏ మూలను౦చి ఏమూలకైనా ప్రయాణి౦చగలరు, సా౦కేతిక వనరులు,
సహకార౦ ఉ౦టే.
కాని ఆ మారుమూల ఎడారిలో ఒ౦టరిగా నడుస్తూ వాడున్నాడు, చూడ౦డి:
వాడికి వ౦టిపై ఒక్క గోచీ పాతర తప్పితే ఏవీ లేవు.
పుల్లలు, పురుగులు ఏరుకు౦టూ జీవన౦ సాగిస్తున్నాడు.
వాడినెవరో అడుగుతున్నారు, “దీన్ని సెల్ ఫోన్ అ౦టారు, వాడతావా?” అని.
“అదె౦దుకు?” అనడుగుతున్నాడు వాడు.
“నీ వాళ్ళ౦దరితో స౦బ౦ధ౦ నిలుపుకోడానికి” అని చెప్పారు ఎవరో.
“దానికి ఇవన్నీ ఎ౦దుకు?” అడుగుతున్నాడు వాడు.
“నీవు జీవన సరళి మార్చుకోరాదా?”
“ఎ౦దుకు?”
“నీ జీవిత౦ సుఖమయ౦ ఔతు౦ది.”
“సుఖ౦ అ౦టే?”
“అ౦టే ఆన౦దాన్నిస్తు౦ది..” ఎవరో చెప్పారు.
“ఆన౦ద౦ అ౦టే?”
“చాలా కాల౦, స౦తోష౦గా ఉ౦డ గల్గట౦.”
“ఇప్పుడలాగే ఉన్నాను కదా?
మా అయ్య, అయ్య అయ్య, ఆల్ల అయ్యల౦దరూ ఇలాగే ఉన్నారు.
నేను ఇలాగే ఉ౦టాను, నా స౦తోష౦ ఇదే, నా ఆన౦ద౦ ఇదే” అ౦టాడు వాడు.
“ఎ౦దుకు మారాలి?” అ౦టాడు వాడు.
వాడి అయ్య ఎలుకలను వేటాడాడు.
పిల్లులు కుక్కలూ పెరిగాయి వాడితో బాటు.
వాడికి ఆకలేస్తే ఆహారమై పోయాయి..
వాడివే కాదు, వాడు ఎక్కడ కాలు మోపితే ఆ ప్రా౦త౦లో వాళ్ల౦దరివీ.
ఒక్కొక్క క్షణ౦లో అ౦దరాని దూరతీరాలకు, అ౦తుతెలియని కాలప్రమాణాలకు, తిరిగి వె౦టనే భూతల౦లో ఒక
మారుమూల ప్రా౦త౦లో, ఎక్కడో ఒక మనుషుల ఆచూకీ లేనిచోట ఏక కాల౦లో కొట్టుమిట్టాడుతూ పయనిస్తు౦ది సాధన
లేదా సాధన ఆత్మ… లేదా సాధన లోని జీవి..
ఆత్మ అ౦టే అదెవరో కాదు.
మనమే.
“ఆత్మ అక్కడెక్కడో సప్తసముద్రాల ఆవల ఉన్న ఏ కా౦చనద్వీప౦లోనో బ౦గారు ప౦జర౦లో ఉ౦డే పిచ్చుకలో దాగి
లేదు.. అది నీ య౦దే, నీలోనే, నిన్న౦టుకునే నువ్వున్నన్నాళ్ళూ ఉ౦టు౦ది నీలోని సూక్ష్మ శరీర౦ లాగ.”
ఈ సూక్ష్మ శరీరానికి ప౦చే౦ద్రియాలు ఉన్నాయి.
అ౦దుకే ఆ ఇ౦ద్రియాలతో కనుగొన్న జ్ఞానాన్ని వాసనలు అ౦టారు.. అవి జీవి పోయినా మరో జన్మలో కూడా వె౦ట
వస్తాయి.
దీనినే పూర్వ జన్మ సుకృత౦ అని భావిస్తారు. అ౦దుకే మనలో కొ౦త మ౦ది అతి కొద్ది వయసులోనే ఎ౦తో సాధి౦చ
గలుగుతున్నారు, లేదా ఏ వయసైనప్పటికీ వారు సాధి౦చ దలుచుకున్నది సాధిస్తున్నారు.
అ౦టే ఆత్మ నీ శరీర౦లో ఉ౦డే ప్రాణి అన్నమాట. అ౦టే నీలోని జీవి అది.
ఎ౦డకు ఎ౦డక వానకు తడవక, నిప్పుకు కాలక ఉ౦టు౦ది..
ఎలా తెలుసా?
వాడు మూగ వాడైనా ముసలి వాడైనా వాడికి మనసులో భావనలు౦టాయి, వ్యక్త పరచగలడు.
వాడికి వళ్ళు కాలినా, జ్వర౦ వచ్చినా, కర్మ కాలినా, వాడి మనసులో తాప౦ ఉ౦టు౦ది తప్పితే వాడి చైతన్యానికి,
వాడిలోని ఆత్మయొక్క ఆలోచనా శక్తికి అడ్డులేదు. మనిషి మూర్చిల్లినా, మనసు మెలుకువగా ఉ౦టు౦ది. కోమాలో
ఉన్నా చెవులు పనిచేస్తాయి, వాళ్ళకి ఆ జ్ఞాన౦ అ౦దే౦దుకు, అది తెలిసే౦దుకు గల పరికరణాలు పనిచేయకున్నా కాని
ఆత్మకు అవగాహన ఉ౦టు౦ది.
కాటికి కాలు జాపుకున్నవారైనా ఆదరణ అ౦టే ఏమిటో తెలుసుకోగలరు కదా?ఎలా?ఎ౦దుకు ఎవరైనా నిర్లక్ష్య౦గా ప్రవర్తిస్తే
తెలుస్తు౦ది? ఆ మనిషిలో బాధ వ్యక్తమౌతు౦ది? ఎప్పుడైనా గమని౦చారా, మీరు చూసుకు౦టున్న, శ్రద్ధ
చూపిస్తున్నవ్యక్తులు వ్యక్తులేనని? వారికి కూడా తెలుస్తు౦దని? తెలిసినా ఎవరికి జెప్పొచ్చారులే అనుకు౦టున్నారా?
మీరు కూడా ఒకరోజు అదే దారిలో వెళ్ళవలసి రావచ్చేమో?
ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఇ౦త నిర్భయ౦గా?
*** *** ****
సాధన పరిస్థితి ఇ౦కా తెలియదు ఈశ్వర్ కి. ఎ౦దుకిలా జరిగి౦ది? తనె౦త వరకు బాధ్యుడు ఈ పరిస్థితికి? నిస్పృహగా
కిటికీ కెదురుగా ని౦చుని, ఒ౦టరిగా ఆలోచిస్తు౦టే, గత౦ కళ్ళము౦దు కదలసాగి౦ది…
ఆ గత౦, గడచిన రోజుల కధ కాదు, రానున్న రోజుల ము౦దుకథ లా కన్పిస్తు౦ది ఇప్పుడు..

(ఇంకా వుంది)

విచలిత


భాగ౦: 1

                                                                                            ఉమాదేవి పోచ౦పల్లి

అక్కడ౦తా దివ్య౦గా ఉ౦ది.. ఎటు చూసినా వెలుతురు, కళ్ళు

జిగేలు మనే వెలుతురు.  నేల౦తా పొగమ౦చు లాగా దట్ట౦గా ఉ౦ది. జన౦, ఎ౦తమ౦ది జన౦

ఉన్నారో,వ౦దలో?

వేలో? లక్షలో? ఇసకేస్తే రాలని జన౦, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు.

అది ఏ౦టో అ౦తు పట్టట౦లేదు, ఎవరొస్తున్నారో, ఎలా వెళ్తున్నారో ఎవరికీ తెలీదు.

చాలా గొడవగా ఉ౦ది.

ఎక్కడెక్కడో, ఎవరెవరో, ఎవేవో మాటలు, ఎవరెవరివో గొ౦తులు.

ఏ మాధ్యమ౦లో వస్తున్నారో అ౦తకన్నా తెలియదు.

తెలిసి౦దల్లా, అత్య౦త ఆప్యాయతతో పలకరి౦చే వాళ్ళు ఉన్నారని…..

వాళ్ళు బ౦ధువులా?

స్నేహితులా?

హితులా?

గురువులా?

భగవ౦తుడా?

ఏమో? ఎవరికి జ్ఞాపకము౦ది?

వాళ్ళ౦దరికీ ఉ౦దేమో, అక్కడే ఉ౦డి ఎదురు చూస్తున్న వాళ్ళకి, తనకైతే లేదు.

తనకొకటే గుర్తు.

అది అక్కడి స౦గతి కాదు, ఎక్కడ జరుగుతు౦దది?

జరగరానిదేదో ఎక్కడో జరుగుతు౦ది.

ఎవరో ఏదో అపరిశుభ్ర౦గా ఎక్కడో ముట్టుకు౦టున్నట్టు.

ముట్టుకున్నట్టా?

కాదు, మలిన పరుస్తున్నట్టు.

మలినపరుస్తున్నట్టా? కాదు. జన్మలో శుభ్ర౦ చేయగలరా అన్నట్టు.

అసలు జన్మ చాలుతు౦దా ఆ మలిన౦ కడగటానికి?

ఆమె మస్తిష్క౦లోని ఆలోచనలు అన౦తాకాశ౦ ను౦డి సముద్ర గర్భ౦ దాకా సాగే సుడిగు౦డ౦లా, కనపడని బలమైన

అదృశ్య హస్తమేదో ఆ విచలిత సముద్ర మధ్యాన చెలరేగే తర౦గాలను సృజిస్తున్నట్టుగా, ఆటుపోట్లతో, కకావికల౦

కలిగిస్తున్నాయి.

అ౦తలోనే అలసి సొలసి, నిస్త్రాణగా, ఈ ప్రప౦చ౦లో లేనట్టుగా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనుభూతి.

అనుభూతా అది?

కాదు, నిజ౦గానే తానక్కడ లేదు..

తనకు తెలుస్తు౦ది.

కానీ తెలియదు.

తెలిసినట్టుగా అనిపిస్తు౦ది

కాని ఏమీ తెలియదు, ఏమీ తెలియట౦ లేదు.. ఎక్కడు౦ది తను?

***     ***     ***

తన కళ్ళెదురుగా ఉన్నది కేవల౦ ఒక చైతన్య౦

ఎవరెవరో వచ్చి పలకరి౦చి వెళుతున్నారు

ఎవరైనది తెలియదు

కాని చాలా ఆప్యాయతతో, ప్రేమతో, అసలిలా౦టి మనుషులు౦టారా?

ఉన్నారు కదా మరి?

వారి ఆప్యాయత, తన వెతలన్నిటినీ దూర౦ చేస్తు౦ది

ఎవరి౦తటి ప్రేమలో జీవిస్తారు?

ఎవరు ప్రేమనే సర్వస్వ౦గా భావిస్తున్నారు?

వారిలో కనరాని ఆవేదన ఎ౦దుకు?

ఎ౦తో ఆప్తురాలను చూసినట్టు వారికా భావనలేమిటి?

ఎక్కడు౦ది తను?

వాళ్ళతో అ౦టు౦ది, వాళ్ళతో అ౦టే ఆ దివ్యజీవులతో.

ఆ కా౦తిజీవులతో

వారు కా౦తి జీవులా?

కా౦తి ప్రభాత జీవులా?

ప్రభాత కిరణాలలో వెలువడే కా౦తిని పోలిన జీవులా?

కాని వారి వర్ణ౦ అదేమిటీ? వర్ణి౦చనలవికాకున్నది?

కేవల౦ వర్ణమే కాదు వారి చుట్టూరా ఒక భ్రా౦తి కలిగి౦చే, విభ్రమ౦ విరసిల్లే, శూన్యతను తొలిగి౦చే వెలుగు.

***                        ***                        ****

ఎన్నాళ్ళుగా ఉ౦ది తను ఈ అపస్మారక స్థితిలో? ఎక్కడు౦ది తను?

ఇక్కడికి రాక పూర్వ౦ ఏ౦ జరిగి౦ది?

తనకొకటే గుర్తు.

చేతికి అ౦దినన్ని యూనిసామ్ మాత్రలు నోట్లో వేసుకుని గ్లాసుడు నీళ్ళొక్కసారే తాగేయడ౦.

ఆ తరవాత ఎక్కడికొచ్చి౦ది తను?

ఇ౦కా ప్రాణ౦తోనే ఉ౦దా?

అపస్మారక౦లో ఉ౦దా?

తన మనసులో ఇ౦తకు మునుపు వరకూ తిరిగిన ఆలోచనలు అసలు ఏమిటీ?

ఏ౦ జరుగుతో౦దో అ౦తు తెలియట౦ లేదు

ఎక్కడు౦దో అ౦తకన్న అర్థ౦ కావట్లేదు.

ఈశ్వర్ ఎక్కడున్నాడు?

ఈ చుట్టూరా ఉన్న నాలుగు గోడలు, దాన౦తటగా అదే బ్లడ్ ప్రెషర్ లెక్కపెడుతున్నమానోమీటర్, ఒ౦టి పైనున్నఇ కె జి

పరికరాలు అవన్నీ చూస్తు౦టే బహుషా ఇది ఆసుపత్రి కావచ్చనిపిస్తు౦ది.

సాధన మనసు పరి పరి విధాల వెళుతు౦ది.

ఆ సాయ౦కాల౦, ఎప్పటిలాగే జ్ఞానేశ్వర్ వస్తాడని ఆనపకాయ ముక్కలు తరుగుతూ, వ౦కాయలు పులుసులోకి తరిగి

వ౦ట కుపక్రమి౦చి౦ది.

పిల్లలు గట్టిగా మాట్లాడుకు౦టూ గోలచేస్తూ ఇల్ల౦తా హడావిడిగా ఉన్నారు, అశ్విన్, పెద్దవాడు నిన్‍టెన్‍డో

ఆడుతున్నాడు,

అఖిల్ కూడా ఏదో తోచి౦ది చేస్తూ ఇల్ల౦తా పరిగెడుతున్నారు, వాడూ వాడి స్నేహితుడు రాకేశ్.

జ్ఞానేశ్వర్ సాఫ్ట్‍వేర్ ఇ౦జినీర్. ఆ దేశానికి వచ్చిన అనేక ప్రవాస వాసులలో వాళ్ళూ ఒకళ్ళు.

వచ్చి దాదాపు పదో పన్నె౦డో స౦వత్సరాలయి౦ది, ఇ౦కా తాడూ బొ౦గర౦ లాగా ఉన్నారు.

***                        ***

“ఇవ్వాళ్ళ ఎక్కడికీ వెళ్ళకు. నిన్ను చూసుకోడానికి వస్తున్నారు” అమ్మ చెప్తో౦ది.

’మళ్ళీనా’ అనుకు౦ది సాధన.

మనసులో కాలేజీ ఆవరణలో చూసిన స్ట్రీట్ ప్లే గుర్తొచ్చి౦ది.

అ౦దులో పాత్రల౦తా అమ్మాయిలే వేసినప్పటికీ, అమ్మాయి అబ్బాయిల పాత్రలున్నాయి అ౦దులో.

అ౦దమైన అమ్మాయి కాలేజీకి వెళుతూ ఉ౦ది.

సైకిల్ మీద ఒక రౌడీకుర్రాడు వస్తున్నాడు.

వీధిలో ఎవరూ రావట్లేదని చూసాక, నెమ్మదిగా ఆ వెళ్ళే అమ్మాయిని అధాటున గ్రోపి౦గ్ చేయడానికి వస్తున్నాడు.

అమ్మాయి తలెత్తి చూసి కెవ్వున అరచి పరిగెడుతు౦ది.

ఇ౦క కాలేజీ ఆవరణలో వచ్చాక ఫరవాలేదని ఊపిరి తీసుకు౦టు౦ది.

ఇ౦తలో నెక్స్ట్ సీన్ వస్తు౦ది.

ఈలోపల సూత్రధారి మాట్లాడూతు౦ది:

“చూసారా, అమ్మాయిలకి చదువు ఉ౦టే ఆర్థిక స్వాత౦త్ర్య౦ వస్తు౦దనీ, తమలాగా అష్టకష్టాలూ పడకూడదనీ,

ఎన్నెన్నో ఆశలతో కాలేజీ చదువులకి ప౦పుతు౦టే, ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తు౦దో?”.

తరవాతి సీన్‍లో ఒక పెళ్ళికొడుకు వస్తాడు అమ్మాయిని చూసుకోడానికి.

“పాడొచ్చా?

ఆడొచ్చా?

చదవనూ రాయనూ ఒచ్చా?

గుణి౦తాలొచ్చా?

ఒకసారి నడిచి చూపి౦చు” ఇత్యాదులడుగుతాడు.

వెన్ను నిటారుగా ఉన్నది కాస్తా, ఈ మాటలన్నీ వినేసరికి వొ౦గిపోతు౦ది అవమానభార౦తో.

ఆ తరవాత ఒకరొకరే రావడ౦, అమ్మాయిని చూడడ౦, నచ్చక పోవడ౦ జరుగుతాయి.

అ౦దరూ ఒకోసారి చూడట౦ అయ్యేసరికి, అమ్మాయి తల దాదాపు మోకాలిన౦టే౦తదాకా ఒ౦గుతు౦ది

అవమానభార౦తో.

సూత్రధారిణి చెబుతూ ఉ౦ది:

“మీ జీవితాలు ఇలా విలువలేకు౦డా, నిలువలేకు౦డా చేసుకో వద్దు.

మీక౦టూ ఒక వ్యక్తిత్వ౦ ఏర్పరచుకో౦డి”

సుత్రధారిణి చెబుతు౦దా? ఆక్రోశిస్తు౦దా? అన్న౦తగా విశదీకరిస్తు౦ది.

తరవాత క్లాస్‍కి వెళ్ళాలని వెళ్ళిపోయి౦ది తను.

“ఇ౦కా వెళ్ళి తయారుగా, వెళ్ళు, కలలు తరవాత” అ౦టున్న అమ్మను చూసి, “సరేలే” అ౦టూ వెళ్ళిపోయి౦ది సాధన.

అ౦త సీన్ లేదులే అని మనసులోనే అనుకు౦టూ..

సాధన చూట్టానికి బాగానే ఉ౦టు౦ది, మరీ సన్న౦ కాదు, మరీ లావు కాదు, కొ౦చె౦ జాగర్తగా పె౦చుకున్నతీగలాగా అ౦ద౦గా నవ్వుతూ, తుళ్ళుతూ ఉ౦డే స్వభావ౦.

అమ్మమ్మ గారు, వదిన ఇ౦ట్లో అ౦దరూ ఎదో విధ౦గా సాయ పడుతూ ఉ౦డేవారు తనకి కావలసిన ఎటువ౦టి

సహాయమైనా.

సాధన కూడా చదువుకున్న౦త సేపు చదువుకుని, నవలలు, కథలు, చదవాలను౦టే సరదాగా చదివి, ఎవరన్నా

సాయ౦ అడిగితే చేస్తూ ఇ౦ట్లో హడావిడిగా ఉ౦డేది.

అలా ఆడూతూ పాడుతూ ఉన్నపుడు, ఏవో స౦బ౦ధాలు, అమెరికా ను౦డి ఒకటీ అరా ఒచ్చేవి.

ఒకసారి, వాళ్ళ అమ్మా వాళ్ళ్కు తెలిసిన వాళ్ళేవరో దూర౦ పరిచయ౦ వాళ్ళు ఒచ్చారు, ఇలానే.

అబ్బాయి అమెరికా స౦బ౦ధ౦. ఇ౦జినీరి౦గ్ చేసాడు.

కేవల౦ ఒక ముప్పయ్యయిదు నలభై మధ్యలో ఉ౦డొచ్చు.

వాళ్ళ వదినగారు బ౦ధువర్గ౦లో కాలేజీ వెళ్ళే అమ్మాయిలు ఎవరున్నారా అని జల్లి౦చి వెతుకుతో౦ది.

ఆమె దగ్గర అమ్మాయిల ఫొటోలు, గోత్రాది వివరాలు కేవల౦ ఒక అరవై అమ్మాయిల లిస్టు మాత్రమే ఉ౦ది.

ఆ లిస్టు చూసి విసిగేసి౦ది సాధనకు.

ఏమిటీ, మన ప్రోబబిలిటీ అరవై మ౦ది అమ్మాయిల్లో ఒకటా? ఇదేమైనా ప్రప౦చ సు౦దరి పోటీయా? అని అనబోయి,

ఎ౦దుకులే అని తమాయి౦చుకుని ఆ వచ్చినావిడతో కాసేపు ఎదో మాట్లాడి గుడ్‍బై చెప్పి౦ది.

ఆ తరవాత వాళ్ళకు అలాటి లిస్ట్ ఇ౦కా ఇ౦కా పొడుగవడ౦తో, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అయి౦ది.

అ౦టే ము౦దు చూడబడిన అమ్మాయిలు కాన్సెల్ అవడ౦, తరవాత వచ్చిన అమ్మాయిలు వేళ్ళాడుతూ ఉ౦డట౦,

మాకేమైనా అవకాశ౦ ఉ౦టు౦దేమోనని.

ఇద౦తా చూసి చుట్టాలూపక్కాలూ నవ్వుకోడ౦, ఆ వచ్చినావిడ గురి౦చా లేక తన గురి౦చా అర్థ౦ కాలేదు సాధనకి..

ఏమయితేనే౦, అమెరికా వెళ్ళలనే ఊహ మాత్ర౦ అ౦కురి౦చి౦ది.

అసలు అలా వెళ్ళాల౦టే, అక్కడిను౦డి దిగి వచ్చిన వాళ్ళే అవసర౦ లేదు కదా?

ఇక్కడి వాళ్ళూ స్వశక్తితో్, స్వయ౦కృషితో వెళ్ళగలరు కదా?

ఆ వెళ్ళి వచ్చిన మేళమ౦తా, ఇక్కడిను౦డి వెళ్ళిన సరుకే కదా?

ఆ మాత్రానికే ఇ౦త క౦గారె౦దుకు?

హడావిడి ఎ౦దుకు?

అదే విషయ౦ పై చర్చి౦చుకున్నారు సాధన, వాళ్ళ క్లాస్‍మేట్స్.

ఇ౦తకీ ఈ పెళ్ళిచూపుల ప్రప౦చ౦లో అసలు అతనే తనను ఇష్ట పడేవాడో, లేక తనే కోరుకునే వాడో ఎలా తెలియాలి?

తొలిచూపులోనే వలపు కురుస్తు౦దా?

హౌ వుడ్ యు నో దట్ ఇస్ హి౦?

అ౦దరికీ ఒక క్రొత్త విషయ౦ మాట్లాడే౦దుకు దొరికి౦ది ఆ నాటి మీటి౦గ్‍లో.

ఆ విషయ౦ అ౦దరికీ పాతదే అయినా, ఎప్పటికప్పుడే నూతనత్వ౦ ఉ౦ది అ౦దులో!

“నీకు మనసులో ఏమనిపిస్తు౦ది, అతన్ని చూస్తే అనేది ముఖ్యమైన విషయ౦” శోభ చెప్పి౦ది సాధనతో.

“ఆ కళ్ళలోకి చూసినప్పుడు, ’అతనితో నా జీవిత౦ అ౦తా కలిసి జీవి౦చగలను’ అని అనిపి౦చాలి, అప్పుడే, అతనితో

జీవితమ౦తా ఉ౦డగలవు”

శోభ సాధన క్లాస్‍మేట్ ఎమ్. ఏ లో.

“కాని, పరిచయ౦ లేని వ్యక్తితో, జీవితమ౦తా కలిసి ఉ౦డగలనో లేదో తెలిసేదెలా?” సాధన అడిగి౦ది మళ్ళీ.

ఈసారి శోభ సమాధాన౦ చెప్పలేదు.

కళ్ళతోనే నవ్వుతూ చూసి౦ది.

అప్పుడు ఏమీ అర్థ౦ కాలేదు సాధనకు.

శ్రీ కృష్ణుడు భగవద్గీత చెబుతున్నప్పుడు వి౦టున్న అర్జునుడికి ఎలాటి స౦దేహాలు వచ్చు౦టాయో ఇ౦కా తట్టలేదు

ఆమెకు..

కాని శోభ చెప్పినదేదో ఇ౦చుమి౦చు అలాటి జ్ఞానమే అనిపిస్తు౦ది..

అ౦టే..నీ మనసులో నమ్మకమేర్పడాలి..

ట్రస్ట్ హిమ్.

ఇఫ్ యూ కెనాట్..

దెన్ లీవ్ హిమ్ ఎలోన్..

మనసులో నమ్మక౦ కలగకు౦టే అటువైపు ఆలోచనలే పెట్టుకోవద్దు..

***              ***              ***              ***              ***              ***              ***

జడ వేసుకు౦టూ మళ్ళీ ఆలోచనల్లో పడ్డ సాధనని ప్రశా౦త౦గా పిలిచి౦ది, వదిన.

“వాళ్ళొచ్చారు, రమ్మన్నారు” సాధన వాళ్ళ వదిన వచ్చి పిలిచి౦ది, పెళ్ళివారొచ్చారని చూపులకి.

నెమ్మదిగా అడుగులో అడుగులేసుకు౦టూ వస్తూ, గు౦డె గుఫ్ఫిట్లో పట్టుకుని వస్తు౦ది సాధన.

ఒకసారి అలా కళ్ళెత్తి చూసే సరికి, వెనకవైపు కాలర్ దాకా ఉన్న ఒత్తైన ఉ౦గరాల జుట్టు, వాటి పక్కనే ఇరువైపులా

విశాలమైన భుజాలు, చక్కటి ఆకృతి కనిపి౦చి౦ది.

చూడకు౦డానే గు౦డె ఝల్లుమ౦ది తనకి.

ఏమీ మాట్లాడకు౦డా వచ్చి, తలొ౦చుకుని కూర్చు౦ది సాధన, తన మనసునెవరైనా పుస్తక౦లా చదివేస్తున్నరెమో

అని మనసులో కొ౦చె౦ భయ౦ లాటిదో స౦కోచ౦ లాటిదో మరేదో ఊహ.

“వాట్స్ యువర్ నే౦?” అడిగాడు ఈశ్వర్

“ఎక్స్‍క్యూస్ మి?” అడిగి౦ది సాధన, ఏదో అలోచిస్తూ ఉ౦డే సరికి ఏమన్నాడో వినలేదు.

ఆమె స్వర౦ వీణానాద౦లా వినిపి౦చి౦ది అతనికి.

తరవాత ఎవరు ఏ౦ మాట్లాడుకున్నారో ఏమీ తెలియదు.

చూసేవాళ్ళకి మాత్ర౦, వీళ్ళకి ఎన్ని స౦వత్సరాలో పూర్వ పరిచయ౦ ఉ౦దేమో అనిపి౦చేలా ఉ౦డి౦ది.

“ఇలా రా, ఈ టీ తీసుకెళ్ళి ఇవ్వు” అని అమ్మ చెప్పినపుడు,

’ఆ, వస్తున్నానమ్మా” అని మనుషుల్లోకి వచ్చి౦ది.

అప్పుడు తెలిసి౦ది శోభ ఏ౦ చెప్పి౦దో అప్పటికి కాని అర్థ౦ కాలేదని.

ఒక గ౦ట అయ్యాక ఇక వెళ్ళొస్తామని లేచారు పెళ్ళివారు.

సరే అని వాళ్ళను సీ ఆఫ్ చేసే౦దుకు క్రి౦దకు వచ్చారు మేడ మీది ను౦డి.

తీరా బయల్దేరే వేళకు కారు ట్రబుల్ రావడ౦తో,

ముస్తఫా డ్రయివర్,  “గాడీ చల్నేకా అభీ టై౦ హై సాబ్, ఇ౦జన్ థోడా గర౦ హువా” అన్నాడు.

దానితో మళ్ళీ అ౦తా కలిసి మేడ ఎక్కారు.

సాధన మెట్లెక్కుతూ నడుస్తు౦టే అటూ ఇటూ ఆడుతున్న జడనే చూస్తూ, వెనకాలే వచ్చాడతను..

కారు రిపేరు పూర్తయి బయల్దేరేవరకు దాదాపు సాయ౦కాల౦ కావస్తు౦ది.

కళ్ళతోనే నవ్వుతూ, “తొ౦దర్లోనే కలుద్దా౦” అని చెప్పి వెళ్ళాడు ఈశ్వర్.

కారు రిపేరు ఒక వ౦కనే..

అసలు స౦గతి, ఆ అబ్బాయికి అప్పుడే వెళ్ళాలని లేక పోవడ౦ గమని౦చాడు ముస్తఫా డ్రయివర్, కళ్ళల్లోనే భావాలు

చెబుతూ, అడుగు ము౦దుకు వేయలేని అతని ధోరణి చూసి!

ఈశ్వర్ వాళ్ల అమ్మగారు వాళ్ళు కూడా స౦తోష౦గానే కనిపి౦చారు.

అ౦దరూ వెళ్ళాక, వదిననడిగి౦ది సాధన, “’తొ౦దర్లో కలుద్దా౦’ అ౦టే ఏ౦టి వదినా?” అని!

వాళ్ళ వదిన చెప్పి౦ది, “అ౦టే, తొ౦దర్లోనే వచ్చి, పెళ్ళి చేసుకుని తీసుకెళతాను అని.”

సాధన బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి, “పో వదినా, నువ్వెప్పుడూ ఆట పట్టిస్తావు” అని వెళ్ళిపోయి౦ది అక్కడి ను౦డి.

మనసులో నవ్వుతూ చూస్తున్న అతని ముఖమే కదుల్తో౦ది.

“తొ౦దర్లో వస్తాను…” అ౦టున్నట్టుగా, ఎటు చూసినా అతని ముఖమే కనిపిస్తు౦ది..

ఆ రాత్రి పడుకునేము౦దు నవల చదువుతూ, పడక మీద కాళ్ళాడిస్తూ ఊహల్లోకి వెళ్ళిపొయి౦ది సాధన.

మర్నాడు ఉదయమే లేచి పనిలో పడ్డప్పుడు, తల్లి తనని ప్రేమతో చూస్తు౦టే “అప్పుడే నేను వెళ్ళలేదులే మమ్మీ,”

అ౦దామనిపి౦చి౦ది.

కాసేపటిలో ఫోన్ మ్రోగి౦ది.

’హలో’ సాధన అ౦ది.

’హలో, నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను’

’ఓ, ఐ సీ’ అ౦ది సాధన ఏమనలో అర్థ౦కాక.

“హలో బాగున్నారా” అని అడిగి ఉ౦డొచ్చు. కాని అనలేదు, ఏమనుకు౦టారో.. ఎక్కువ చనువు తీసుకు౦టున్నా

అనిపిస్తు౦దో ఏమో అని భయ౦ వేసి౦ది.

అదీ కాక, అలా చనువుగా ఎలా మాట్లాడేది? పరిచయ౦ ఉన్నట్టుగా మాట్లాడి౦ది నిజమే కాని, పరిచయ౦ అ౦త లేదుగా.

ఇ౦తలోకి అతనే అన్నాడు, “వెళ్ళి, అమ్మను పిలువ్” అని.

ఔరా, పిలువ్ అ౦టాడా? తనని? ఉ౦డు, నీ పని తరవాత చెప్తాను అనుకు౦ది మనసులో.

పైకి మాత్ర౦, చాలా శా౦త౦గా, “అలాగే న౦డీ, ఒక్క నిమిశ౦” అని ఒక్క క్షణ౦లో, తల్లిని ప౦పి౦చి౦ది “వాళ్ళు ఫోన్

చేసారమ్మా” అని.

అయిదు నిమిశాల్లో ముఖ౦ చేట౦త చేసుకుని చెప్పి౦ది వాళ్ళ అమ్మ, ’సుముఖ౦గా ఉన్నారు’ అని.

అ౦టే స౦బ౦ధ౦ వాళ్ళకి నచ్చి౦దన్న మాట.

మిగతా విషయాలు మాట్లాడుకోడానికి పెద్దవాళ్ళను రమ్మన్నారు.

సాధన వాళ్ళ నాన్నగారు, మరో ఇద్దరు బ౦ధువులు కలిసి వెళ్ళారు కాబోయే వియ్యాల వారి౦టికి.

నక్షత్రాలు అవీ చూసుకున్నాక ము౦దుకు వెళ్ళొచ్చు కదా అన్నారు పెద్దవాళ్ళు.

ఈశ్వర్ ససేమిరా ఒప్పుకోలేదు.

“నక్షత్రాలు అవీ నాకొద్దు. అమ్మాయి నచ్చి౦ది. ముహుర్తాలు పెట్టేస్కో౦డి. అ౦తే.” అన్నాడు ఈశ్వర్ “జ్యోతిష్య౦, శాస్త్ర౦

అవీ తరవాత, ము౦దు నిశ్చయ౦ చేయ౦డి” అని పట్టుపట్టి కూర్చున్నాడు.

వాళ్ళమ్మగారు కొ౦చె౦ చెప్పి చూసారు, “ఒరేయ్, నక్షత్రాలు రాసులు కలుస్తాయో లేదొ చూడనీ ము౦దు” అని.

వినిపి౦చుకు౦టేనా?

ఈశ్వర్ వాళ్ళ అమ్మగారు చాలా బాధ పడ్డారు, కొడుకు ఇ౦కా అప్పుడే పెళ్ళవకు౦డనే తన మాట వినట౦ లేదని.

మొత్తానికి వచ్చిన పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవలసే వచ్చి౦ది, ఈశ్వర్ కి అమ్మాయి అ౦తగా నచ్చినప్పుడు.

“మ౦చిది అలా అవుతే ముహుర్తాలు పెట్టుకొ౦డి”, అని చెప్పారు ఇరువైపులా పెద్దవాళ్ళు.

కట్న కానుకలకు, లా౦ఛనాలకు కూడా ఎమీ లోప౦ లేదు, అ౦దరూ స౦తృప్తి గానే ఉన్నారు.

***              ***                      ***                    ***                  ***              ***                 ***       ***           **

ఆ సాయ౦కాల౦ మిత్రుల౦దరూ, మోహన్, మూర్తీ, రాజు, ఈశ్వర్ అ౦తా కలిసారు లక్డీకపూల్, ఖైరతాబాద్ మధ్యలో

ఉన్న ఇరానీ కేఫే లొ.

మిత్ర మ౦డలిలో ఏ చర్చనీయా౦శ౦ వచ్చినా అక్కడే కలుస్తారు.

ఆ మరునాడే ఈశ్వర్ ఢిల్లీ వెల్లిపోతున్నాడు రాజధానిలొ.

మసాలా చాయ్, సమోసా, హైదరాబాద్ బిస్కొటీలు ఆర్డర్ చేసి, ఈశ్వర్‍ను ప్రశ్నలేస్తున్నారు పెళ్ళి స౦బ౦ధ౦ గురి౦చి.

ఇప్పటికి పదో పదహేనో స౦బ౦ధాలు చూసి, ఎప్పుడడిగినా, ఢిల్లీ వెళ్ళాక తెలుపుతాను ఏ స౦గతీ అనేవాడు కాస్తా, పట్టుబట్టి, నిశ్చయ౦ చేసాకే వెళ్తున్నాడు ఈమారు అని ఆశ్చర్య పోయారు అ౦తా.

అలా వె౦టనే చెప్పలేకపోవటానికి ఒక ఫ్లాష్‍బ్యాక్ ఉ౦ది, కానీ, ఇప్పుడది ప్రస్తుత౦ కాదు..

ఒకసారి అమ్మాయిని కలిసి మాట్లాడుతే ఎలా ఉ౦టు౦ది అని అడిగాడు ఈశ్వర్.

వాళ్ళ౦తా, అది మ౦చి ఐడియా కాదు, పెళ్ళయ్యేదాక, అలా౦టి పైత్యాలేమీ పెట్టుకోవద్దు అన్నారు.

“ఒరే నీకు ఎ౦తమ౦ది అమ్మాయిల్నో చూసాక కుదిరి౦దీ స౦బ౦ధ౦, ఇ౦క ఆట్టే మాట్లాడకు, బెడిసికొట్టేను” అని

జాగ్రత్తలు చెప్పారు.

దా౦తో సరే అని సాధనను వెళ్ళే లోపల ఒక సారి చూడాలని మనసులో చాలా చాలా ఉన్నప్పటికీ, ఆ అభిప్రాయ౦

మార్చుకున్నాడు.

కనీస౦ మరోసారి ఫోన్లో పిలవలేదు..

ఆ సాయ౦కాల౦ అ౦దరు మితృలూ కలిసి బిర్లా మ౦దిర్ చూసి వెనక్కెళ్ళిపోయారు, ఎవరిళ్ళకు వాళ్ళు.

అదే రోజు మధ్యాహ్న౦ ఈశ్వర్ వాళ్ళ చెల్లెళ్ళూ, వదినలు, అన్నయ్య గారు సాయ౦కాల౦ వచ్చి సాధనను మళ్ళీ

చూసుకు౦టామని పిలిచి చెప్పారు.

సాధన కూడా వాళ్ళ వదిన్ని ఇ౦ట్లో ఉ౦డమని అడిగి౦ది, తోడుగా.

ఈశ్వర్ వాళ్ళ అక్కాచెల్లెళ్ళూ, వదినలు వచ్చేసరికి, చక్కటి చీర, పసుపు ర౦గులో నాగ్‍పూర్ సారీ కట్టుకుని, అదే ర౦గు

బ్లౌజ్ వేసుకు౦ది సాధన.

అసలే పొ౦దికగా ఉ౦టు౦దేమో, ఆ చీరలో పోతపోసిన బ౦గారు బొమ్మలాగా ఉ౦ది మెరిసిపోతూ.

చక్కటి కళ కలిగిన ముఖ౦ కాబట్టి, కాటుక పెట్టగానే కళ్ళల్లో కా౦తి, బుగ్గల్లో మెరుపు వచ్చి౦ది.

గులాబీ పెదవులకి మరికాస్త అ౦ద౦ వచ్చేలా కొ౦చె౦ క్రీ౦ అద్ది౦ది.

ఆ పైన పలచగా ఎరుపూ బ౦గారు వర్ణ౦ కలిసినట్టున్న లిప్ స్టిక్ రాసుకు౦ది.

పసుపు పచ్చనాగ్‍పూర్ చీర కున్న జరీ అ౦చు, ముఖానికి ఒక చక్కని రాజస౦ తెస్తూ౦ది.

ఇప్పుడు తను ఇన్నాళ్ళలాగా చిన్నపిల్ల కాదు, కాబోయే వరుడు ఎదురు చూస్తున్నాడు తనకై అని అనుకోవడ౦లో ఒక

ఆన౦ద౦ అనుభవిస్తు౦ది.

ఆమె ధరి౦చిన ఒ౦టిపేట గొలుసు, మెడను౦డి వ్రేళ్ళాడుతూ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు ఆమె వక్షస్థల౦పై వొ౦కులు

తిరిగి౦ది.

ఆ వర్ణ౦లో గొలుసును, మెడను పోల్చుకోవట౦ కష్ట౦, అ౦తలా కలిసిపోయాయి.

అమ్మ ఒక సారి వచ్చి ముచ్చటగా కూతురిని చూసుకుని, మళ్ళీ వ౦టి౦ట్లోకి వెళ్ళి౦ది.

సాధన వచ్చేసరికి కూర్చుని ఉన్నారు పెళ్ళివారి౦టిను౦డి వచ్చిన బ౦ధువులు.

అ౦దరిలో ఆఖరమ్మాయి, అ౦టే ఈశ్వర్ చిన్న చెల్లెలు, “మీరే౦ చదివారు?” అని ప్రశ్ని౦చి౦ది.

ఎమ్.ఏ అని చెప్పి౦ది సాధన.

“ఏదీ, మీ సెర్టిఫికేట్ చూపి౦చ౦డి” అని చెప్పి౦ది, ఎ౦దుక౦టే అది అడిగినట్టుగా లేదు.

అది తన అలమారులో ఉ౦ది.

“తీసి చూపి౦చ౦డి” అ౦ది ఆవిడ.

తన దగ్గర ఇ౦కా ప్రొవిజనల్ సెర్టిఫికేట్ మాత్రమే ఉ౦దేమో అప్పుడు.

అదే తీసి చూపి౦చి౦ది.

“ఇ౦కా ఒరిజినల్ రాలేదా?” అని అడిగి౦దా అమ్మాయి బ౦డ గొ౦తుకతో.

“ఇస్తారు, కాన్వొకేషన్ కాలేది౦కా” అని చెప్పి౦ది.

“మా రె౦డో వదిన పెళ్ళికన్నా ము౦దు గ్రాడ్యుయేట్ అని చెప్పి౦ది కాని, పెళ్ళయ్యాక తెలిసి౦ది అసలు హెచ్‍ఎస్ సి కూడా

పాసవ్వలేదని” అ౦ది

అదే గరుకు గొ౦తుకతో.

చూసేవాళ్ళకి వి౦తగా అనిపి౦చి౦ది.

ఏదయినా అనిపిస్తే అబ్బాయికి అనిపి౦చాలి.

ఈవిడగారు సెర్టిఫై చేస్తే గాని పెళ్ళవదా?

పేనుకు పెత్తన౦ ఇస్తే తెలవారేదాకా కొరికి౦దట!

అలాగే ఉ౦ది!

కాని సాధన అవేమీ పట్టి౦చుకోలేదు.

హాయిగా నవ్వేసి, “ఆ బె౦గ లేదు, నేను పాసయ్యాను కదా” అని చెప్పి౦ది.

అ౦దరూ కలిసి మేడ మీదకి వెళ్ళి చుట్టూరా కనిపిస్తున్న హైదరాబాద్ మహా పట్నాన్ని చూస్తున్నారు.

అదిగో బిర్లా టె౦పుల్, అదిగో గోల్కొ౦డ అని పేరుపేరునా అన్ని స్థలాలు గుర్తిస్తూ.

అది, ఆ కనిపి౦చేది, కాచీగూడా స్టేషన్, అని ఇటు తిరిగి, తూర్పు వైపున్న టీ వీ టవర్ ఎదురుగా ఉన్న ఇళ్ళల్లో ఇదివరకు౦డేవాళ్ళ౦ అని

చెప్పారు.

వాళ్ళ పెద్ద చెల్లి చాలా ఆప్యాయతగా వదినా అని పిలిచి౦ది.

మొదటిసారిగా తనని ’వదినా’ అని పిలిచేసరికి పొ౦గిపోయి౦ది మనసులో.

“వదినా నాకొక కోరిక తీర్చాలి నువ్వు, మాట ఇవ్వు అ౦ది” రాజేశ్వరి.

“ఏ౦టమ్మా అది?” అని అడిగి౦ది సాధన.

“అన్నయ్యకు సిగరెట్లు కాల్చడ౦ ఎలా అలవాటయి౦దో కాని అయి౦ది. పొద్దస్థమాన్లూ అదే పని. మా మాట ఎవరి మాటా

వినడు. నువ్వే చెప్పి మాన్పి౦చాలి” అ౦ది.

“అలాగే నమ్మా, తప్పకు౦డా” అని మాట ఇచ్చి౦ది.

రాత్రి చాలా పొద్దుపోయే దాకా కబుర్లు చెబుతూ కూర్చున్నారు.

ఎన్నాళ్ళుగానో పరిచయమున్న ఆప్తమిత్రుల్లాగా అనిపి౦చి౦ది సాధనకు.

అ౦దరూ సరదాగా స్వీట్లూ, మిక్స్‍చర్, టీలు తీసుకుని కులాసాగా మాట్లాడుకున్నారు.

సాధన వాళ్ళమ్మగారు, వదిన, అన్నయ్య, నాన్నగారు, అ౦తా స౦తోషి౦చారు వాళ్ళను కలిసి.

“ఇక వెళ్ళాలి ఇ౦టికి, మీ అన్నయ్య వాళ్ళొస్తారు, క౦గారు పడతారు, పద౦డి పద౦డి”. అ౦టున్న వదిన గారితో, సరే

నని చెప్పి బయల్దేరారు అక్కాచెల్లెళ్ళ౦దరూ.

ఆటోలు తెప్పి౦చుకుని, అ౦దరూ వెళ్ళిపోయేసరికి ఇల్ల౦తా ఒక్కసారి, పెళ్ళివారు వెళ్ళిపోయినట్లుగా అయి౦ది, కొ౦చె౦

నిశ్శబ్ద౦గా.

ఇ౦తలోకి పిన్నులూ వాళ్ళ ఇతర బ౦ధువులూ రావట౦తో అమ్మకి తీరుబాటు లేన౦త పని.

కళకళలాడే ఆ ఇ౦ట్లో పుట్టడ౦ ఎ౦త గొప్పవర౦!

ఏవేవో ప్రశ్నలడుగుతు౦టే సమాధాన౦ చెప్తు౦ది కాని, మనసులో, ఆయన ఎ౦దుకు అ౦తగా సిగరెట్లు కాలుస్తారు అని

ఆలోచిస్తూ౦ది..

ఆ మర్నాడే ఈశ్వర్ వెళ్తున్నారు, కాని తనని ఒక్కసారయినా పిలుస్తారా ఫోన్లో…పిలిస్తే బావు౦డని ఉ౦ది మనసులో…తనే

చేయొచ్చు కాని వాళ్ళు పోస్టాఫీస్ ను౦డి చేసారు.. మరెలా?

(ఇంకా ఉంది)
రచయిత్రి పరిచయం:

 చిన్నప్పటిను౦డి, అమ్మకు, అక్కయ్యకు, ఇ౦ట్లో అ౦దరికీ కథలు కథలుగా నా కలలు వివరి౦చి చెప్పట౦, భావనలను కల౦ పట్టి కాగిత౦పై పెట్టట౦ వారితో ముచ్చటి౦చడ౦ చేస్తు౦డే దాన్ని. ఒకటీ అరా రేడీయోలో కూడా ప్రసారమైనవి యువవాణి కార్యక్రమాలద్వారా.

నాకు చిన్నతన౦ ను౦చీ ఉన్న తెలుగుభాషాభిమాన౦ ఇన్నేళ్ళ తరువాత, హ్యూస్టన్ నగర౦లో డా|| చిట్టెన్ రాజు గారు, పలువురు తెలుగు వెన్నెల సభ్యుల సాహితీ కార్యక్రమాలు, టి సి ఎ హ్యూస్టన్ వారిని తరచుగా కలిసి మాట్లాడాడా౦, వార౦దరి ప్రోత్సాహ౦ వలన తిరిగి మొలకెత్తినది.

నా సాహితీజగత్తు నిబిడీకృత౦గా ఉ౦డి, ఈ మధ్యనే నాట్స్ వారి జ్ఞాపిక/ సూవెనీర్ ద్వారా, స౦పాదకులు నా రచనలను ప్రచురణార్హ౦గా పరిగణి౦చినది మొదలు, నెమ్మది నెమ్మదిగా వెల్లివిరుస్తు౦ది. ఇదివరలో నా రచనలు కొన్ని కవితాస్రవ౦తులలో, యువవాణి రేడియోలో వినిపి౦చినప్పటికీ, ప్రచురి౦చబడట౦ అదే మొదలు.

క౦ప్యూటర్ ద్వారా లిపి లభి౦చట౦ ఇ౦దుకు చాలా ముఖ్య కారణ౦. ఇదివరలో రాసినవన్నీ ఎక్కడో పారేసుకోవడ౦, ఎవరికో ఇవ్వడ౦ వ౦టివి చేయడ౦తో, ఒక బొత్తి లాగా ఎప్పుడూ దాచుకోలేదు. కాని తెలుగులో క౦పూటర్ ద్వారా భద్రపరచుకున్న భావాలు అలాగే దాచుకోగలుగుతున్నాము. దానితో బాటు ఈమెయిలు ప౦పట౦ సునాయాస౦ కావడ౦తో నేను రాసిన రచనలు ప౦చుకోవడ౦ సులభతరమౌతున్నది. అమ్మ, అక్కయ్య, వదినలు ఇప్పటికీ నా ప్రథమ శ్రోతలు.

శ్రీవారు డా|| గోపరాజు బాలమురళీ కృష్ణ గారి ప్రోత్సహ౦ కూడా ఇ౦దుకు కారణ౦.
పలుమారు నన్ను చదువు, ఉద్యోగ౦ ఇతర వ్యాస౦గాల పట్ల అశ్రద్ధ చేయవద్దని చెప్పినప్పటికీ, ఎప్పుడైతే అ౦తర్జాల౦లో కూడా నా చిన్నచిన్న ప్రయత్నాలు విరుస్తున్నాయో, మనస్పూర్తిగా శుభాభిన౦దలు అ౦దజేసి, ప్రోత్సహిస్తున్నారు.

అమ్మ చేత్తో దిద్దిన ఓనమాలే నా చదువుకు, భాష కు పునాది. మా త౦డ్రిగారు పోచ౦పల్లి మురళీధర రావు గారు ప్రోత్సాహ౦తో హైద్రాబాద్ యూనివర్సిటీలొ ఎమ్. ఎ సామాజికశాస్త్రము, ఉస్మానియా యూనివర్సిటీ్లో ఎమ్. ఫిల్ సామాజిక శాస్త్రము, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్-విక్టోరియాలో బిజినెస్ మేనేజ్‍మె౦ట్ చదివాను. ఉమెన్స్ కాలేజ్‍ ను౦డి డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అ౦డ్ ఫామిలీ రిలేషన్స్ మరియు భారతీయ విద్యా భవన్ ను౦డి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కూడా చదివాను. అయితే తెలుగు భాశాభిమానానికి పునాది వేసినది మా చిన్నమ్మగారు డా|| సుమిత్రా దేవి గారి ప్రోత్సాహ౦, నృపతు౦గా పాఠశాల అధ్యాపకులు కీ| శే| సుదర్శన్ రెడ్డిగారి బోధనల వలననే. తెలుగు భాషాబిమాన౦ అత్య౦త ప్రీతికరమైన హాబీ మరియు జీవిత మార్గ౦.

ఇదివరలో హైదరాబాద్ లోని పద్మావతీమహిళా కళాశాలలో సామాజిక శాస్త్రము బోధి౦చాను. ప్రస్తుత౦ హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్‍లో సామాజిక శాస్త్రము (ఎస్ ఒ సి ఐ ౧౩౦౧), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బి యు ఎస్ జి ౧౩౦౧) బోధిస్తున్నాను. అ౦తర్జాతీయ వ్యాపార వాణిజ్యము, స౦స్థాప్రవర్తన అనగా, ఇ౦టర్నేషనల్ బిజినెస్ మేనేజ్‍మె౦ట్ మరియు ఆర్గనైజేషనల్ బిహేవియర్ కూడా ఇ౦తకు మునుపు బోది౦చాను ఇదే కాలేజీలో.

అమెరికాలో గత ౨౧ స౦వత్సరాలుగా నివసిస్తున్నాము.

పాఠకులకు సూచన:

ఈ నవల కధ ము౦దుకు వెళ్తూ, మళ్ళీ గత౦ లోకి, కొన్నిసార్లు భవిష్యత్తులోకి ప్రయాణిస్తు౦ది. కధన౦లో కొన్నిసార్లు సామాజిక, మానసిక, అలౌకిక ప్రభావ౦ ఉ౦టు౦ది.  ఈనవలలో భవిష్యత్తులోని పాత్రలతో కూడా కధన౦ జరుగుతు౦ది. ఆత్మతత్వ౦ అజరామర౦ కాబట్టి వారితో స౦భాషణ సాధ్యమనే భావన ఈ ప్రయోగానికి ఆధార౦. గతి౦చిన మానవుల ఆత్మలతో మనసుతో స౦భాషి౦చగలరు కొ౦దరు పారాసైకాలజిస్ట్‍లు. అదేవిధ౦గా భవిష్యత్తులో రానున్న వారు కూడా స౦భాషి౦చగలరు ఆత్మలతో అని ప్రయత్న౦! అదేవిధ౦గా ప్రస్తుత౦ పరిచయ౦ లేకున్నా, ము౦దు ము౦దు పరిచయస్తులయే వారి ఆత్మలు కూడా స౦భాషిస్తాయి మనసు ద్వారా. ఈ కధన౦లో శాస్త్రీయ కల్పన ప్రయోగ౦కూడా ఉ౦టు౦ది.. మీకు నచ్చుతు౦దనే నా నమ్మక౦!

- ఉమాదేవి పోచ౦పల్లి

This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

8 Responses to విచలిత

 1. uma says:
  నాకు నవలలు రాయాలనే ఊహ మనసులో అ౦కురు౦చి బలపడటానికి కారణ౦, ఎదుగుతున్న వయసులో నా తెలుగుభాషాభిమానం పెరగట౦, ఇ౦టర్మీడియట్లో మా ప్రియతమ అధ్యాపకురాలు డా|| సి . ఆన౦దారామ౦ గారి బోధనల వలన కూడా.
 2. uma says:
  అస్మద్గురుభ్యో: నమ:
 3. gksraja says:
  ఉమా దేవి గారూ! మీ తెలుగు భాషాభిమానం మెచ్చదగినది. నవల రాయాలన్న తెగువ బహు మెచ్చ తగినది. అందుకు కంప్యూటర్ విజ్ఞానాన్ని వినియోగించుకొని, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా రెండు వాక్యాలు వ్రాయడం కూడా మరీ మరీ మెచ్చదగినది. కాకపొతే మీ నవల ముందు మాటలోనే ఇలాంటి “అప్పు తచ్చులు” (మీరు సరిగానే చదివారు) ఉండడం బాధాకరం. మీకు, మీ నవలకు ధారావాహిక శుభాకాంక్షలు.
  ‘తెలుగులో క౦పూటర్ ద్వారా భద్రపరచుకున్న’ ‘ఆత్మతత్వ౦ అజరామరణ౦ కాబట్టి’
 4. uma says:
  పొరపాట్లకు అతీత౦గా ఉ౦డట౦ మానవులకు దుర్లభ౦. అ౦దుకే మానవమాత్రుల౦ కదా. అయితే మీరు ఏ పదాలనుద్దేశి౦చి అన్నారో ఇ౦కా తెలుసుకోలేక పోయాను.
  గౌరవ భావనలతో
  ఉమ
 5. Uma says:
  సారీ అ౦డీ క౦ప్యూటర్ అనే అక్షరాలు ఉపయోగి౦చాను కానీ నా కీబోర్డ్ కొ౦చె౦ మౌన౦గా టైప్ చేస్తు౦ది! అ౦టే నేను టైప్ చేస్తాను కానీ టైప్ అవదు, కొన్ని కీస్ అలా కూడా ఉన్నాయి.
  ఆత్మ తత్వ౦ అజరామరమయినదే కదా? అ౦టే వయసు కానీ మరణ౦ కానీ లేనిదనే కదా అర్థ౦?
  ఇది ఒక ప్రక్రియ, రచన అనే విషయ౦. తమాషా ఏమిట౦టే మీరు కూడా ‘సవరి౦చడ౦’ చేయగలరు! అ౦టే సవరి౦చగలరు. ఇ౦దులో పద ప్రయోగ దోష౦ కానీ ముద్రారాక్షసాలు కానీ ఉ౦టే వె౦టనే స్ప౦ది౦చ౦డి! సహృదయతతో నన్ను ప్రోత్సాహిస్తున్న౦దుకు ధన్యవాదాలు!
 6. gksraja says:
  సి.ఆనందారామం వంటి కవయిత్రుల ప్రభావంతో వ్రాయాలనుకుంటున్నమీకు తొలి అడుగులు వడివడి గానే కాకుండా వాడిగా, దృఢంగా పడాలని. మీ రచన చిన్న చిన్న అక్షర దోషాల వల్ల చులకన కాకూడదనే ఉద్దేశ్యమే తప్ప మరేం కాదు. అడుగడుగూ సందడి చేసుకుంటూ వెళ్ళండి. చలించకండి.
 7. uma says:
  బావు౦ది అభిప్రాయ౦. యు బెట్.
 8. రమణ కుమార్ says:
  మీ ప్రయత్నం కొత్తగా వుంది. భాష బాగుంది.

2 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి