కొత్త యుగం రానున్నది సరికొత్త యుగం
విరిసిన కుసుమం వోలె
ముసిరిన చీకట్లు తొలిగి
మెరిసి వెలిసి నడిపించే
కొత్తయుగం రానున్నది
ఉగాదియై యుగాదివలె
వసంత ఋతు ఆగమనం
ఆమనిలో తెలియచేయు
కొంగ్రొత్త రుచుల మామిడివలె
కుహు కూజిత కోకిల ఆగమనం
అదియే క్రొత్త భావనాయుగం
నీలినీలి ఆకాశపుటంచుల చేరాలని
ఉవ్వెత్తిన హృదయ తరంగాల విహంగాలతో
నూతన శక మారభింప వినూత్న గాన రవళితోడ
కొత్తయుగం నడుపుతుంది
నాటి నుండి నేటి వరకు
రేపటి మేటి తరం కావాలని నవయుగం
విచ్చుకునే చివురుల వలె
చివురుతొడిగి ఫలవంతమై
ఎదిగి ఒదిగిపోవు యువతర౦
శుభకరమై శుభతరమై
కాలవాహినిలో లీనమైన
నిన్ననే నేడుగ మారే
రేపటి సరికొత్త యుగం
రానున్నది నూతన ఉత్తేజముగా
జాలువారు రవితేజము
నాటి మన వారలు నాటినట్టి
ఆశయాల చిగురుతొడిగి
కలకాలం మమత సంస్కృతుల తోడ
మనసెరిగిన కొత్తయుగం
కావాలి నేటి యుగం లోని
మేటి యువతరం లో సంతరించి
అంతరించలేదు నిన్న
ఉద్భవించింది నేడని
మరి చూడమనే క్రొత్త యుగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)