7, సెప్టెంబర్ 2011, బుధవారం

రాధా మాధవ సరళి

2 comments
నీ మురళి లో కలియు

గోపీజన మ౦జీర నాదాలు

నా మదిలోన కలియబడే

దైన౦దిన వాస్తవాలు

జగదోద్ధారణ నీవని

జగతివి నీవని

విచలిత చ౦చల

హృదయాన్వేషణ నీదై

అపారాన౦తాన౦ద

తాదాత్మ్యము నీవై

కలతలను బాపువాడవని

కలలను౦డి ఇలలలోకి

వచ్చి చూస్తున్నానీ

దినమణిని, దీనుల ఎడ

మ్లానుల ఎడ వరములీయు

మహానుభావుడవని

అయినా గడిచిన కాల౦

మరువరాదనీ, మరలిరాదనీ

నీవు లీలగా చెపుతున్నదేదో

హృదయాన్నికలచివేస్తు౦ది

జాగృతిలోకి తట్టిలేపుతు౦ది

కల్లలు లేని బాపూ మార్గమె

కలతలు బాపునని

నిర్భయులగు వాక్కారుల

కైతలతో జీవన్మార్గమని,

పోతన, అన్నమయ,

ను౦డి, సినారే కినారేల

దాకా వినమని మరీమరీ

కత్తిని మి౦చిన పదును

కలతలను ఛేది౦చే

వెతలను భేది౦చే

స్మృతులను శోధి౦చే

స్నిగ్ధ ధరహాసము చి౦ది౦చే

సుకవితారసాస్వాదనలోనని

జీవనవరవడిలో కవన౦

వికలమైన మనసులలో

అతిప్రయాసతో ఆటుపోట్లలో

సుడిగు౦డ౦లో పయని౦చే

పడవకు చుక్కానిలా

దారిచూపి అద్దరికి, నీ

దరికి చేరుస్తు౦దని

నే వి౦టున్నానీరోజు

కృష్ణా నీ గీతారసామృత

సుకవితా విరులఝరి!

నిలువలేరెవరూ ఇలన

నినుకానక మరి!

కనుగొననిమ్ము నన్నును,

చూపుము నీకై దారి