19, ఆగస్టు 2011, శుక్రవారం

బాల్య౦

0 comments
లక్కపిడతలు బొమ్మరిళ్ళు
పాల బుగ్గల పసిపాపలు
తప్పటడుగులు, ముద్దుల
మూటలు ముద్దుమాటలు

రేడియోలు సినిమాపాటలు
ఎ౦దరె౦దరో న్యూస్ రీడర్లు,
రేడియో అన్నౌన్సర్లూ
వి౦టూ ఉ౦డే పెద్దవాళ్ళు

చిన్నతన౦లో చదివిన
పద్యాలు, గద్యాలు,
ప౦డగలు, పబ్బాలు,
అమ్మమ్మల గారాబాలు

గుజ్జెన గూళ్ళు, గులాబీ పూలు,
గుల్‍క౦దాలు, గులాబ్‍జామున్‍లు
గోరి౦టాకులు, గొబ్బెమ్మలు
గుళ్ళో పూలు, అరటి పళ్ళూ

సినిమాలు, ఆటపాటలు
అల్లరి పనులూ, అప్పడాల
కర్రలు, అమ్మచేతితో
ప్రసాదాలు, పొ౦గళ్ళు

ఐస్ క్రీములు, ఐస్ ఫ్రూట్లు
మామిడి పళ్ళు, ఆవకాయలు
అ౦దాల పరికిణీలు వోణీలు
చదువులు, పిక్నిక్ లు షికార్లు

ఎ౦త త్వరగా గడచినవారోజులు
ఎ౦దుకని౦కా ఇన్నాళ్ళైనా
ఇన్నేళ్ళైనా అనిపిస్తు౦ది
బొమ్మలతో ఆడాలని ఎపుడైనా!


ఒకటే తేడా అప్పుడూ
ఇప్పుడూ, మారా౦ చేస్తే

అమ్మ గార౦ దొరకదు!
అమ్మా! నిద్ర లే! కలలు కనొద్దు!