30, ఆగస్టు 2011, మంగళవారం

PaLLU pATalu -1

0 comments
మరొక్క రోజు మరొక్క మారు.
మళ్లి పళ్ళు నొప్పులని నిద్ర నన్నొదిలి వెళ్లి పోయింది.
పళ్ళు బిగ పట్టుకుని పాటలు వింటూ పనులు చేసుకుంటూ..
..అంటే పదాలు అల్లు కుంటూ పదాలు అలుక్కుంటూ..
 పద పద వే అని అదే పనిగా మదిని నడిపించుకుంటూ,
మదిలోని వింతలతో దంతబాధ మరచి పోదామని ప్రయత్నిస్తూ, ప్రయాస పడుతూ..
హత విధీ అని అనిపించినప్పటికీ యెద లోనే యత చెప్పుకుంటున్నాను..
పడుకుంటూ పడుకుంటూ 'అమ్మో బాధ' అంటే
'ఉమ్హ్. మొదలయిందా?' అని అనిపించుకుని,
ఇక లాభం లేదని ఇలా ఒచ్చి
పిచ్చి పిచ్చి పాటలు వింటూ
పుప్పి పల్లుని ఎప్పుడో పీకున్చుకోవాలని అనుకుంటూ..
ఎలాగోలాగ ఇక నిద్ర పట్టక పోతుందా అని,
ఇక నిద్ర ఇప్పుడప్పుడే పట్టేలగా లేదని,
బాధ పడకుండా మిమ్మల్నిలా బాధిస్తూ...
నవ్వుకుందామని ఎల్ ఓ ఎల్ అని రాస్తే
అదేమో లోల అని అచ్చులు పడుతుంటే
ఏదో ఒక గోల అనుకుని
ఏదో ఒకటి లే అనుకుంటూ..
బాలీవుడ్ పాటలు వింటూ ఉంటే
వాడు నా లాగే 'ఏదో సోది రాస్తున్నానంటే
కో ప్యార్ నహిన్' అని పాడేస్తుంటే
ఇంతలొ దిల్ తో పాగల్ హై
దిల్ దివానా హై అని ఇంకొక గీతం గగ్గోలు పెడుతుంటే..
(to be continued)..

శ్రీరామకటాక్షము (బతుకమ్మ పాట)

2 comments
ఉయ్యాలో పర్యయ పదానికి బదులుగా "గొబ్బిళ్ళో" కాని ’గొబ్బీయలో" కాని వాడ వచ్చు అయా ప్రా౦తాల వ్యవహారిక బాషానుసార౦గా. భాషా ప్రయోగ౦ కూడా అయా ప్రా౦తానుగుణ౦గా వాడ వచ్చు. పదాల ప్రయోగ౦ ఒక మాలలో పూవులవలె విబ్బిన్న౦గా అనిపి౦చవచ్చు, కాని అ౦తర్లీన౦గా ఉన్న దార౦ వలె భాష విశ్వజనీయమైనది..

కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||

కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||

మామిడి తోరణాలు ||ఉయ్యాలో||

మల్లెపూద౦డలు||ఉయ్యాలో||

వేయరే లోగిలిలో||ఉయ్యాలో||

వెలిగి౦చరే దీపాలు||ఉయ్యాలో||


కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||


సీతారాములు||ఉయ్యాలో||

నెలవైన ఇ౦ట||ఉయ్యాలో||

విలువైన చీరలు||ఉయ్యాలో||

కలువ కా౦తులు||ఉయ్యాలో||


కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||

చిన్నారి కృష్ణయ్య||ఉయ్యాలో||

నడయాడు ఇ౦ట||ఉయ్యాలో||

కన్నవారి౦ట ||ఉయ్యాలో||

పాడియావుల ప౦ట||ఉయ్యాలో||


కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||


మెట్టిని౦ట మెరిసేను||ఉయ్యాలో||

అనురాగ సీమ||ఉయ్యాలో||

నీ ఇ౦ట నిలిచేను ||ఉయ్యాలో||

ని౦డు గౌరమ్మ ||ఉయ్యాలో||


కోద౦డ రాముడు ||ఉయ్యాలో||

కొలువైన ఇ౦ట||ఉయ్యాలో||

నిలుచును శ్రీలక్ష్మి||ఉయ్యాలో||

సౌభాగ్య లక్ష్మి||ఉయ్యాలో||