ఎన్ని పూవులెన్ని ఫలములు
ఎన్నెన్నో ఉన్నా, చిన్నా!
చిన్నారి కన్నా, కన
లేరెవరూ నను మిన్న!
పెద్దలందు పేరుగన్నది
స్వదేశమును దాటి
విదేశాలకు మీకన్నా
ముందుగా ముస్తాబుగా
మురిసి పోతూ మురిపిస్తూ
మనసులోన మోహన రాగములే కురిపించే,
చెలి యెవరో ? నెచ్చెలులకు చెలువైన సఖి యెవరో!
అఖిలజగన్మాతకు ముద్దుబిడ్డయౌ
తెనుఁగు తల్లి పాలవెల్లి
ముంగిట ఆడే మంగళకరి,
జీర్ణ కారి శాకంబరి కన్న
ఉన్నారా ధరలోన మిన్న
కన్నారా ఇకనైనా, నేనే
జనులకు ఆరోగ్య ప్రదాత
ఈ ప్రభాత సమయాన
సుప్రభాతమనుచు
సిరులొలుకు సూర్య కిరణాలో
మెరియుచు అమెరికాలో
ఉషఃప్రభలీను నెరజాణ వలే
గారబు పట్టిని,
గోంగూర! యని నోరూర్చుకొనుచు
వడ్డించుకునే చారుగా,
ఫలవంతమగు
పప్పులుసుగా పదినాళ్ళ
పచ్చడిగా పలునెలలు
నిలువపచ్చడిగా
రూపాంతరాలు చెందినా,
మరిచెదవా మన ఊరి
చెరువు దాపల దాగిన
పొదలోన ఒదిగి ఉంచినా
దాగని ఘుమఘుమలతో
తనివితీర, ముదము మీర జాలని
జావళినై కోన గోట
చిన్న చిగురునైనా, మేలు
చేసెడి మేలు బంగరు వలె
షడ్రుచులలోన మేటి వలె
మురిసే పచ్చని శాకను,
నను కానవని అనుకొననులే,
సుజ్ఞానులని, విజ్ఞానధనులని,
అంతరిక్షయానమైనా
అలసట కలిగించక, 'నాసియా
కలిగించదని వాసిగా రిసెర్చ్
చేసిరని వసంత' గారి కోకిల
కంఠాన తమ తపోఫలము
నాసాకే ధారబోసిరని
వినలేదా, కనలేదా, తేట తెలుగు
వెలుగులార, అన్నలార, అక్కలార?
నన్నే మరిచారా? నన్నేమరిచారా?!
గోంగూర, కాడలే! అయినా,
'అచట పుట్టిన చిగురు కొమ్మైన జేవ' యనుచు,
నేలలో నాటినంతనే నవనవలాడు చిన్నారి సహోదరి, మన భూమాత కన్నబిడ్డ మహిలో