నీటి పైన తేలియాడే 
చిరు చీమల తీరున
భూమితల్లి ఖండాలు
పలు ఫలకాలై తేలియాడ
కొట్టుమిట్టాడుతూ 
కొట్టుకుపోయే మనం…
… … …
గగనాంతర తీరాలలో
అల్లకల్లోలాల నుండి
ఉద్భవించిన ఖగోళాలు
చూడ చూడ దూరాన
కదలాడే తారా సమూహాలు
అవియు మనను పోలి…
ఊహలలో ఒదిగిన భావాలెన్నో.. భావాలలో విరిసే గానాలెన్నో
Copyright © 2010 ఊహాగాన౦
Blogger Templates Design by Splashy Templates