21, మే 2015, గురువారం

గడుసరి జడ

0 comments
మిడిసి పడబోకు నరకా!
విడువను నిన్నింక యంచు, వీరాంగన యా 
గడుసరి సాత్రాజితి, తా
'జడ' ముందుకు వైచి నాడు సమరము సలిపెన్!  

1, మే 2015, శుక్రవారం

అందని ఆమని

0 comments

ఈ మధుమాసం లో నా మనోల్లాసం
ఆమని అందని సుదూరం లో
ఉండుండి కలవరపరుస్తుంది
పాటపాడలేని మైనా ఒకటి
ఎరుపెక్కిన కన్నులతో
పీకలదాకా తాగివచ్చి
తూలుతున్న తుంటరి గుంపు
రెక్కలన్ని చిదిమేసి
రాక్షసత్వంతో దానిని కుళ్ళబొడుస్తూ
వికటాట్టహాసం చేస్తూ వెడుతుంది
పాడలేకా, ఎగరలేక
మూగవోయిన మైనాకి
ఏమని వస్తుంది? ఏమనిఓదారుస్తుంది
రానేలేని ఆమని?

- See more at: http://vihanga.com/?p=14495#sthash.79KkpbiA.dpuf

27, జనవరి 2015, మంగళవారం

వడగాల్పులు- వాడే బ్రతుకులు

0 comments
ఈ గ్రీష్మం కోరలు చాచి
కాలుస్తోంది ఉగ్ర తాండవం తో
శీతల వాయుజనకాలు లేవు
నివాస యోగ్యము కాని నీడలు తప్ప
పైన ఫంకా కూడా లేదు, ఆ
ముదుసలి పేదరాలు, పాట్లు
పడుతూ, నేల ఊడ్చుకుని,
ద్వారం తెరిచి ఉంచింది
చల్ల గాలి ఏమైనా ఒస్తుందేమోనని ఆశతొ
మల్లెల మకరందాలు, పిల్లగాలి పై తేలి వచ్చే
వేణువు నాదాలు లేవు, నిశ్శబ్దం గా పైకి
వచ్చే పెను ప్రాయపు ఈతి బాధలు తప్ప
కోకిల కలకూజితాలు వినపడవు, టపటపలాడుతూ
ఎగిరి వచ్చే ఎండుటాకులూ, చిత్తు కాగితాలు తప్ప
సూర్యుడు పశ్చిమాన కృంగి పోతే
గాలి చొరబడని గతుకుల బ్రతుకులో
ఒక దీపం వెలిగించాలని, చీకటి చీల్చుకు
వచ్చే వెలుగు కిరణం కోసం,
ఆ సాయంకాలం, చిన్న నూనె దీపం వెలిగిస్తుంది,
ఎటువెళ్ళిందో మధ్యాహ్నం అగడు పుట్టించిన
ఎర్రని ఎండ, ఎక్కడినుంచో వీస్తున్న వడగాలికి
చేయడ్డు పెట్టి, వెలిగిస్తుంది చిన్న దీపపు వత్తి

13, జనవరి 2015, మంగళవారం

తపన్

0 comments

జయము నొ౦దగ నీవు

విజయలక్ష్మీ సుతుని,

మా అన్నయ్య వదినయౌ

ఛాయారవి౦దుల పౌత్రునిగ

వేగాన విచ్చేసినావు మాకై

వారి కుమారు శశా౦క సుష్మల

తనయుడవు నీవా? కాదులే నీ

తనయులమే మేమ౦దరము దా?

తపనతో తపియి౦చి తపమునే

ఒనరి౦చిన నీదు తలిద౦డ్రులకు

ని౦డుగా ఉ౦డమని ఉదయి౦చినావు

మురళీ నారాయణా కార్తికేయ తపన్

నిన్ను హత్తుకున్న మాకెల్లరకు

ప్రేమాతిశయముతో బహు ప్రీతి యగున్!

ఆ శ్రీమన్నారాయణ నిన్నెపుడు

చల్లగా కాపాడు, రాధికా గారాల

మేనల్లుడవు మురళీ నారాయణా

కార్తికేయ తపన్! చిర౦జీవ ఎల్లరు

చిరుత కూకలౌ చిన్నవార౦దరికిన్!