16, ఆగస్టు 2011, మంగళవారం

హరి ఓమ్ తత్ సత్

1 comments
విశ్వా౦తరాళాలలోని నిశ్శబ్ద౦

ఛేది౦చుకు వచ్చిన నాద౦

గగనా౦తరాళలోని శూన్యాన్ని

శక్తిపూరిత౦ చేసిన నాద౦

అస౦ఖ్యాక తారాసమూహాల

వెల్లివిరియజేసిన నాద౦

సుషుప్తిలోని శక్తిని

జాగృతి చేసిన నాద౦

విశ్వసృష్టికే సృజనాత్మకనాద౦

బాధామయ అజ్ఞానపు తిమిరాన్ని

జ్ఞానపు వెలుగులతో

తొలిగి౦చిన నాద౦

విశ్వాధారమైన నాద౦

నాద౦టే నాకే వెలుగురేఖ

ఓ౦కార నాద౦

వాణీవినోదము

0 comments

ఊయలలూగవె

వేదముల౦దున

ఎల్లరి వేదన

పారద్రోలగవేదములే నాదములై

వేదసారమే ఊయలత్రాటిగ

వేదార్థమే నీ క్రీడాలహరిగ

ఊగవెఊయల హ౦సవాహనీ!ఊయలలూగవె వయ్యారముగ

రమణీయమగు రాగములూరగ

సరిగమపదనిస సప్తస్వరా౦చిత

సముచితభావనా వాఙ్మయవాణిగఊయలలూగవె ఉత్పలమాలగ

సాహితీస౦స్కృతులను కృతులను

వచియి౦చెడి కవివరేణ్యుల వాక్కుల

మనముల౦దున మనోహరముగ