12, అక్టోబర్ 2014, ఆదివారం

నరక చతుర్దశి

0 comments
అరివీర భయంకర భద్రకాళి వలె
భద్రాంగన బాణములనెక్కించి విల్లు సారించగ,
వీరొచితముగ రణమున విలు వంచిన
నారీమణి జడయందము నారయణుని మనమున్ దోచెన్

వేసెను వడి వడి బాణములు
రోసముతో పొగరణచగ తన వాడి వాడి అమ్ములతోడన్
బెదిరెను ఆ నరకుని హృది, జడను 
ముడిచి వింటి నారి సారించిన యా సత్యాభామను చూడన్

అడుగులలో అడుగు వేసి
వడి వడి నడచిన రోసి రోసముతో అటునిటులూ
లయబద్ధముగా తాకెడి
జడవిసురుల తాడనకు  నిలువదేల నీ నడుము సత్యా?

అనియెడి కృష్ణుని కాంచిన
అరుణిమ దాల్చెను సత్య చెక్కువలు కెంపులబోలెన్
అనలములౌ ద్రుక్కుల వాల్జడవిసిరి
కనినంతనె నరకుని, తుద మార్చెను తీక్ష్ణ బాణాఘాతములన్ 

సోయగపు జడను చూచి
శోభిల్లెను రమణుని హృది యా సత్యభామను కాంచన్
శోభాయమాయె ద్వారక
శోభిల్లెదరెల్లరు శ్రీమన్నారాయణును లీలలు తలవన్ 

భూభారము తీరినదని
ఆనందించి విశ్వజనులు దీపావళి జరుపుకొనిన
దేదీప్యమానముగ భువి 
వేవేల వెలుగులొందెను సమ్రంభముగా