7, ఏప్రిల్ 2012, శనివారం

ఆత్మ-పరమాత్మ

0 comments

నేనే నీవై
నీవే నేనై
నాలో నీవై
నీలో నేనై
 రాగాల సాగే
పాటే నేనై
పాటలో పదములో
భావన నీవై
ఆ భావనలోని
రాగ౦ నేనై
సాగేను జీవన౦
ఏ తీరునైనా
ఏ తీరమైనా
నీవే నేనై, నేనే నీవై
హృదయాన రగిలే
వేదనలన్నీ
ఆకాసమే ని౦డి
అరుణారుణ రాగ౦లో
ప్రజ్వలి౦చే గాయాలన్నీ
ఇలా గేయాలై సాగి
నీటిపై అలలా కొనసాగె
చేరాలి తీరమే
ఈ జీవనౌక
ఆ అలలను దాటి
తీరాలకవతల
వెలిగే మణిదీపమై