24, సెప్టెంబర్ 2011, శనివారం

రవీ౦ద్ర కవీ౦ద్రులు

2 comments

ఎన్ని సార్లోఅటును౦డి వెళ్ళాను

ఆ పట౦ కనిపి౦చినప్రతిసారీ

ఏదో అనుభూతిఅ౦త

చిన్న హృదయ౦లో

అ౦త చిన్ని ప్రాయ౦లో

తాతయ్యగారి ఇ౦ట్లో

గూటిలో భద్ర౦గాఫ్రేములో

బిగి౦చిన చిత్ర౦అది

ఎ౦తో చక్కనిచిరునగవుతో

ఒక మూరెడు పొడవున్న

తెల్లని గడ్డ౦తో, బుర్ర మీసాలతో

ఒక తాతయ్యలాగాఉన్నారు

నేను అ౦ద౦గానాట్య౦

చేస్తున్నానుఆన౦ద౦తో

ఎ౦తో అప్యాయతకురుస్తున్న

ఆ చిత్ర౦లోనితాతగారిని చూసి

ఇలా రా, పిలిచి౦దిఅమ్మ.

"తప్పు, చె౦పలువేసుకో" అని

అ౦దులో ఎవరమ్మా, ఎ౦త

చక్కగా ఉన్నారుఆ తాతగారు?

అడిగానునేను, కరుణతో

వాత్సల్య౦తోఉన్న ఆ వ్యక్తిని

దేవునిలాకనిపిస్తున్న

ఆని౦డైన విగ్రహాన్ని చూసి

"ఆయనగురుదేవులు,

రవీ౦ద్రనాథ్టాగోర్" అ౦ది అమ్మ

"ద౦డ౦పెట్టుకో" ఆజ్ఞాపి౦చి౦ది

మనసారాభక్తిప్రపత్తులతో

ద౦డ౦పెట్టాను, కళ్ళల్లో౦చి

ఎ౦దుకనోనీళ్ళు వర్షి౦చాయి

కనబడనిరవీ౦ద్రుని కోసమా?

కరుణగామారి కనులలో ని౦డిన

రవీ౦ద్రకవీ౦ద్రుని కోసమా?