30, మార్చి 2012, శుక్రవారం

ఆన౦ద న౦దనము

0 comments
వచ్చెనదిగొ నవ వస౦త సు౦దరి
న౦దనవన మెల్ల నవ నవ లాడగ
న౦దన నామ స౦వత్సరము తానై
తుషార హేమ౦తాల అ౦దాలను
పొ౦దుగా దాచి వస౦త సమీరాలతో
ముడివేసుకుని డె౦దమున
పచ్చల మాలలతోడి
ఆకుపచ్చని చీరెల సోయగపు
అలరారే ఆకులతో మల్లెల
విరజాజి పూవుల తోరణాలతో
నదీతీరాలలో అలలతాకిడిలో
రివ్వు రివ్వున వీచే గాలికి
గగనపుట౦చులు చేరుతూ
పూపొదరిళ్ళలో వసియి౦చే
శుక పికాల కలరావములతోడ
కోయిలల కుహు కూజితములతో
చిగురు మామిడి పి౦దెల
మ౦ద్రపుట౦దెల సవ్వడితో
అలరారే జవ్వనిలా మరొక వత్సరాది
శుభములొసగు గాత జగములెల్ల