వచ్చెనదే వర్షసుందరి
తెచ్చెను స్వేచ్ఛాఝరి
మేఘ మాలిక వోలె
పురివిప్పిన నెమలి
విరజిమ్మెను కాంతులను
కనువిందు జేయు విసిరి విసిరి,
బంగారపు రంగులను
సింగారించుకుని,
ఏ నీలి నెమలి కన్నె
వలచి వచ్చునోయని
ఆమె కన్న అతిశయముగా
చూప వలెనని తన సిరి
పరుగు పరుగున
అడుగడుగునా
ఆరవేయును అందాలను
మధుర మనోహరములైన
మోహన శిఖిపింఛములతో
కనువిందు జేయు కృష్ణనికై
ప్రేమ మీరగా మయూరి