15, సెప్టెంబర్ 2012, శనివారం

Goddess

0 comments


Goddess
don't weep sweet love
don't weep little dove
you don't worry about
the world in a hurry
to leash out on innocents
and punish the victims
to reason the goons
in white collar and crowns
sleep tonight, away from the
atrocities and horrors
that take your peace in nights
for you are precious as flower
you are prose running the poets
you are to look up for any lover
you are the energy of the river!

దేవత
ఏడవకమ్మా, తీయని ప్రేమా!
ఏడవకే ఓ చిన్ని పావురమా!
అమాయకులపై ఆగడమొనరుస్తూ ..
తెలి మేలిమి వస్త్రాల వెనుక
తలపై వజ్ర కిరీటాల వెనుక
జరిగే తప్పులనొప్పుల జేయ
అతి వేగ౦గా పరుగిడు లోకానికై
వృథాగా వ్యథ చె౦దకునీవు
నీ మనశ్శా౦తిని హరి౦చే
కుటిల కల్మష ఘోర యాతనల
ను౦డి దూర౦గా అతి దూర౦గా
నిశ్చి౦తగా పడుకో ఈ రేయి
ఎ౦దుకన౦టే అతిసు౦దర
అపురూప కుసుమ౦ నీవు
కవులను నడిపి౦చే కావ్యానివే!
ఎపుడూ ఆరాధనల౦దుకునే
ప్రేమికుడి అనురాగమూర్తివి!
పారే నదిలోని చైతన్యానివి నీవే!