17, జులై 2012, మంగళవారం

కల- నిజం!

0 comments

అందమైన సాయంకాలం, నీలి మబ్బులు ఆకాసం నిండా, సముద్ర తీరాన్నానుకుని ఇల్లు. ఇంటి వెనక రాతి అరుగు, నీటి అలలను తాకుతూ,  ఒక వైపు తీరాన బంగారు వర్ణంలో ఇసక, నీటి మీదుగా దూరంగా తెరచాప ఎత్తి ప్రయాణం చేస్తున్న పడవలు.

ఆ వాతావరణ౦లో చేతిలో కలంపట్టుకుని రాతి అరుగు పై కూర్చుని ఆలోచిస్తున్న ఆమె.
ఇంతలో అతను, నాగార్జున లా ఉన్నాడు (కాని కాడు!)..(ఔనా?!), చక్కటి పొడువరి! దగ్గరగా వచ్చాడు, పక్కనే ఆనుకుని కూర్చున్నాడు,
“ఏంచేస్తున్నావిలా ఒంటరిగా?” అడిగాడు అతను..
“ఆకాశంలో నీలి మేఘాలను చూస్తూ, నిన్న ఇంటికెడుతుంటే కారులో, ఇలాంటి నీలి మేఘాలు ఆకాశం నిండా వ్యాపించాయి కదా, అది..”

అతను వంగి ఆమె పెదవులను స్వాదిస్తున్నాడు, ఒక చేత్తో ఆమెను పొదివి పట్టుకుని, మరో చేత్తో ఆమె అందాలను

చేత్తో తీయని నొక్కులతో స్పర్షా ఆనందాన్ని ఆస్వాదిస్తూ..

“.. చూస్తుంటే నీవే గుర్తొచ్చావు.” అంది ఆమె పెదాలను చుంబన బంధం నుండి ఇంకా బయటికి తీయకు౦డానే..
ఝల్లుమంది అతని హృదయం, మరింతగా పొదివిపట్టుకుని, రెండు చేతులతో కౌగిలించుకుని ఆమె కళ్ళలోని తమకాన్ని చూస్తూ మరింత గాడాలింగనంలో వాళ్ళిద్దరూ..
ఆ నల్లని ఆకాశం, మేఘావృతమై, వొంగి నీలి సముద్రాన్ని ఎక్కడ చుంబిస్తుందో, ఎక్కడ సముద్రం ఆగిపోయిందో ఎక్కడ నింగి వంగి కడలిని ముద్దాడుతుందో కనుగొనలేని కలయిక అల్లంత దూరాన నుండి భూమ్యాకాశాల కలయిక చూస్తుంటే వారి పరిష్వంగంలా తోస్తుంది..
..
***                        ***                        ***
చప్పున కళ్ళు తెరిచింది ఆమె.
చుట్టూరా చీకటి, బెడ్ లైట్ కాంతి గది నిండా మసకగా వ్యాపించి ఉంది.
పక్కనే, గోడ వైపు తిరిగి నిదరపోతున్న భర్తని చూసింది, పెదవులపై చిరునవ్వు మెరిసి, గోముగా దగ్గరకు జరిగింది.
“ఇటు తిరుగవూ ఒక సారి?” అని...
ఇటు తిరిగిన భర్తతో, “ఏం కల వచ్చిందని అడగవూ..” అంది
“తెల్లారేక అడుగుతాన్లే, ఇప్పుడు నన్ను పడుకోనియ్యి, జరుగు” అని నిద్రలోకి జారుకున్నాడతను..

*** *******

"అంటావా మళ్ళా?" అడిగాడు అతను.
నవ్వాపుకుంటుంది ఆమె, "ఏదీ నేననందే! ఏదో రాసానంతే, ఉబుసుపోక!" ముందురోజు కథ రాసి అందరికీ ఫేస్బుక్లో పెట్టటం గుర్తుంచుకుని!
"మళ్ళీ చెప్పు?"
"ఐ.. .."ఆపై మాటలు అననివ్వలేదతను..
ఆపై మాటలు అవసరం లేదు కూడా!
"అలా రా దారికి!" 
అరగ౦ట ఆలస్యంగా, ఆఫీసుకు బయల్దేరాడతను!
***           ***.      ***.        ***

“ఏవమ్మా రచయిత్రీ!” పిలిచాడు అతను.

“ఏమిటండీ?”

“ఈవేళైనా వంట చేసావా? కథలు రాస్తూ కలలు కంటూ ఉన్నావా?”

ఆమె కళ్ళెత్తి అలా చూసింది.

అతనికి అంతా అర్థమైపోయింది.

“ఓరి దేవుడా, పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యమంటే, కొరివినిచ్చి తలకంటగట్టావురా” అనుకున్నాడతను.

“నేను అన్నీ రెడీ చేసి, వ౦ట చేసి పెడతాను, పక్కకి జరగండి” అంది ఆవిడ

“ఆ అలాగే కాసేపు అలా నీ సరికొత్త కథ ఏమిటో చెప్పు ఇంతలో నిమిశంలో అన్నీ అమరిస్తానులే”

“మరేమో మీకు కోపం వస్తుందేమో..”

“కోపమేమీ రాదులే, కథేమిటి?”

“నేను ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టాను.. కినిగె లో నాలుగు పుస్తకాలు, అమెజాన్ లో ఆరు పుస్తకాలు, బార్న్స్ అండ్ నోబుల్

లో బోలెడు పుస్తకాలు, సుపథ లో సుభాషితాలు, ఇవి కాక ఎమెస్కోలో, గోరఖ్పూర్ గీతా ప్రెస్ లో..”

“ఏమిటీ ఇవన్నీ నీవే చదివేందుకే?”

“అంటే, అన్నీ ఒక సారి కాదు, అన్నట్టు వంగూరి వారి బుక్స్, సత్యం గారి బుక్స్, యెండమూరి గారి..”  ఇంకా ఆమె

పూర్తి చేయలేదు వాక్యం.

“యెండమూరి కాదు యండమూరి”

“యెద్దనపూడి.. కాదు, యద్దనపూడి”

“పోండి, మీరు మరీను, అంత నోరు తిరగదా ఏమిటీ నాకు?”

“యద్దనపూడి గారి సెక్రెటరీ నా తొలి తెలుగు రొమా౦టిక్ నవల తెలుసా, ఎన్ని సార్లు పుస్తకాల మధ్యలో పెట్టుకుని

చదివేదాన్నో గదిలో తలుపేసుకుని.. తెలుసా?”

“ఔనా? గది తలుపులేసుకున్నాక మళ్ళీ పుస్తకం మధ్యలో ఎందుకు దాచుకోవడం?”

’అంటే ఎవరైనా గబుక్కున వస్తే తిట్టకుండా అన్నమాట..”

“ ఎందుకు తిడతారు?”

“ మరి పొట్టలో నొప్పని స్కూలు ఎగ్గొట్టి, ఇంట్లో ఉండిపోయాను కదా, నవల్లు చదువుకోవాలని..”

“బావుందే, నవల్లు చదవాలని స్కూలు ఎగ్గొట్టావు, ఇప్పుడేమో కథలు, నవల్లూ రాయాలని పని ఎగ్గొడ్తున్నావు”

“సరే, వస్తావా, సాంబారు, ఇడ్లీ రెడీ, కొబ్బరి పచ్చడి చేసావంటే..”

“లాగించొచ్చు..”బావగారు ఇడ్లీ లాగిద్దామా!” అని మా నాన్నగారు మామయ్యగారితో అన్నట్టుగా!”

ఓకె, పిల్లల్నిలా రమ్మను, చల్లార్తున్నాయి వాడికోసం రవ్వ ఇడ్లీ కూడా పెట్టాను..

***                        ****                                ***

ఉలిక్కిపడింది తలుపు దబా దబా మోగుతుంటే, కథలు రాస్తున్నది కాస్తా ఈ లోకంలోకి వచ్చింది.

“వాట్స్ ఫర్ డిన్నర్?” అడిగాడతను లోనికొచ్చి కోట్ హ్యాంగర్ కి తగిలిస్తూ.

“సాంబారు, ఇడ్లీలు” నీర్స౦గా అని, పచ్చడి కూడా  అని చెప్పింది…

’పిల్లలేరి?”

“పిల్లలు బయటే తింటున్నారు ఈ రోజు.. మీరు కానివ్వండి”

టైప్ టూ ఎక్కువ కావొద్దని రెడ్డీ బ్రెడ్ కాలుస్తూ తనకోసం కాల్చిన

సోయాబీన్ బార్లీ బ్రెడ్ కోసం ప్లేట్ తీస్తూంది ఆమె..

- ఉమా పోచంపల్లి

- See more at: http://vihanga.com/?p=6193#sthash.2z0r18u7.dpuf