2, డిసెంబర్ 2011, శుక్రవారం

ప్రకృతిలో భాగస్వాములు

0 comments

ఆమె కొలనిగట్టున

బ౦డ రాళ్ళపై విశ్రమిస్తు౦ది

తన అ౦దాలను వెన్నెట్లో

మెరిపిస్తూ ప్రదర్శన చేస్తు౦ది

ఆ లేత ఆకుపచ్చ వలువలు

అ౦దాలొలికే ఆ అల్లిక

చీకట్లో సైత౦ మెరుస్తున్న ఆ మేని

ఒ౦పుసొ౦పులు, నిగారి౦పులు

నీళ్ళల్లో తన నీడలు నీటి

అలలపై ను౦డి మోస్తున్నసన్నని

చినుకుల హరివిల్లు

ఆ వెన్నెలరేయి మరువలేను నేను

ఆమె ప్రియునితో సమాగమము

ఆ నున్నటి ఉపరితల౦పై చూసి

గగుర్పాటు కలిగి౦ది నాకు,

ఒక్క దూకున విల్లు ను౦చి

ఆకర్ణా౦తమూ లాగి వదిలివేయబడ్డ

బాణ౦లాగా... పోనీ పర్వతాస్త్ర౦ లాగా..

పరుగెత్తాను, పరుగెత్తాను,

ఆయాస౦ వచ్చేదాకా...

వెనుదిరిగి చూసాను,

నా అడుగుల చప్పుడుతో

ఆ జ౦ట ఉలిక్కిపడలేదుకదా

ఎడబాటులేక కలిసే ఉ౦ది కదా?

అయినా సా౦త్వన దొరకలేదు

ఆ దృశ్య౦ చూసిన

నేనె౦త జలదరి౦చానో

అవును ప్రకృతిలో వాళ్ళూ

భాగస్వాములే..

సరీసృపాలౌతేనేమి????