1, ఏప్రిల్ 2022, శుక్రవారం

అమెరికాకా?

0 comments

అమెరికాకా?

ఎవరే? ఎక్కడికే?

అమెరికా కట.

ఏమిటీ అమెరికాకా?🤣

అమెరికాకి.🤣🤣

అమెరికా కీ జపానుకూ వెళ్ళండి వెళ్ళండి, పక్కకు జరుగమ్మా, మా ఊడుపులు మేమే ఊడ్చుకోవాలే…🤨-------------------------------------------------------------

అదేమిటే, అమెరికా కు అన్నాను, అంతేగా?🤨 అంత దెప్పాలా?

ఏమిటీ గోల? ఎందుకలా పోట్లాట? ఇంతకీ అదేమందనీ, అమెరికాకు. అంతేగా?

అమెరికాకూ?? ఆహా బావుంది, బావుంది. మేమేమో మేడం మేడం అని మే డే  కోసం మేడెక్కాలె.

ఎందుకే అంత జె నీకు, ఒసే, అమెరికా కృయెల్లా!

అమ్మా చూడవే, ఇదికూడా, ఎలా నన్నే అంటోంది, చదివేది చదవకుండా అమెరికా’….  కౄసిఫెరేసీ..పాఠం అప్పచెప్పు?

ఏమిటో కాలం పిల్లలు, ఏదీ విషయం అమెరికా’.. క్లుప్తంగా చెప్పు.

ఆగండాగండి, పంచె కాదు పక్కనుంది ఉతికి  పెట్టింది, అది తీసుకోండి. ఇదుగో కాఫీ.

ఏమిటో,  గాల్స్, ఎప్పుడూ అమెరికా.. క్లూలెస్.

ఔనూ, ఒరేయ్, నువ్వు అమెరికా కెప్పుడెడతావ్?

ఏమిటే నువ్వూనూ, టవలందుకో ఇలా, అమెరికాకేంపని, నాతో?

.. యెమ్మైటీ లో అమెరికాకై దేశం త్యాగం చేసే ప్రొఫెసర్ పరంధామం.. అనీ

దేశం త్యాగం లేదూ, దేహం కాదూ, నడువ్ సిసింద్రీ!

అన్నట్టు, చెప్పడం మరిచాను, మీఅమెరికా కొచ్చిన క్రొత్తలోవాడొచ్చాడు, తిరిగి వచ్చి పదేళ్ళు దాటినాఇంకా

ఓహో అమెరికా కోతల్రాయుడా? బాగా కాలక్షేపం, వాడి కబుర్లన్నీ.. పెళ్ళైందా ఇంకా లేదా?

ఊరుకోవే, ఇప్పటికీ కాకుండా ఉంటుందా?

ఏమో, ఏదో అమెరికా కౌలు గర్లో, కౌ గర్లో ప్రేమించాడట కదా, మరచి పోలేక, అలా అని విన్నానులేకాలం..

మామ్మా, నీకెందుకే? బుగ్గలు లేనుకూడాలేవు, బాగానే నొక్కులు నొక్కుతున్నావు

అమ్మమ్మా, నీ కమ్మని నెయ్యి దోసె, కారప్పొడి ముందు, అమెరికా కం అంటేవెడతామటే, అమెరికా కః, అమ్మ చేతి వంట, అః!!