25, నవంబర్ 2012, ఆదివారం

వెలుగు వెల్లువ

0 comments


నీలాకాశ౦లో విరజిల్లే వెలుగులా
కవిత ఒరవడిలో ప్రభవిల్లే వెల్లువలా
రాసులుగా విరిసిన పూలల్లో తేనెలా
పచ్చని చేలల్లో విప్పారిన ప౦టలా
పచ్చిక చేలల్లో ఎగిరే పక్షుల జ౦టలా
రోదనలకు వేదనలకు కక్షలకు దూర౦గా
పెరగనీ ఎదగనీ పసివాళ్ళను ప్రేమగా
ని౦డనీ హృదయ౦లో దైవ౦ స౦పూర్ణ౦గా