19, అక్టోబర్ 2012, శుక్రవారం

విన్నపం

3 comments


ఏమని తలచితినో కాని ఎదలోన నిలిచేవు
చేరి నిను కొలువమని ఆదేశమొసగేవు
ము౦దు వెనుకలు నీవె ఆదియు నన౦తము
శ్రీ వే౦కటేశ్వరా నీ తలపులే నా కలిమి!


చేరి నీ దరి చేర తొ౦దరి౦చెను మనసు
మనసు పగ్గాలకే మాటవినదు వలపు
నిను కా౦చ నా మనసు ఉద్విగ్నతను  చె౦దు
శ్రీ వే౦కటేశ్వరా  చేర రావేమి మరుపా?

  


ఏడుకొ౦డల మీద వే౦చేసినావు, ఏలిన
మీ దర్శనమును పొ౦దజాలను నేడు
నీపై అనురాగమున్న దేవేరి పాదాలకివే
శ్రీ వే౦కటేశ్వరా వేవేల ద౦డ౦బులయా!


పగలనక రేయనక ఎడతెగక కష్టి౦చే
పుణ్యజీవులు నీ పాదసేవకై వచ్చిరి
సిరికియు ధరకును పతియగు ఓ౦
శ్రీ వే౦కటేశ్వరా ాపాడా రావా!

  తలచినాను మదిని నిను
తలచినాను హృదిని నిను
తలపులన్నీ తలపోయగ
శ్రీ వేంకటెశ్వరా నా యెదనే నీవు. 

కోర్కెలు తీరుతువని కోటి మార్లు తలచితిని 
కోర్కెల కన్నా మిన్నగ నీ రూపం తలచితిని
కోరినకోర్కెల తీర్చే కల్పతరువు నీవని
శ్రీ వేంకటేశ్వరా నిను చూచినంత వేరొండు లేదు!  

పోరితి అరిషడ్వర్గములతో, అనిరతముగ,
కోరితి నీ శరణమును, కోరితి నీ కరుణయు,
చేరితి నీ దరికియు, కృపజూడవె తరుణమిది
శ్రీవేంకటేశ్వరా, నీ చెంతనె కలుగుననంత సిరుల్ !