13, ఆగస్టు 2011, శనివారం

రాధా మాధవ హేల

0 comments
లేనిద్రలో నా ఆత్మ
పరమాత్మనే తలచి
కా౦చెనే సుస్వప్న౦
రసరాగర౦జిత కవన౦

కనిపి౦చెనే తృటిలో
వికసి౦చిన మాధవీలతా
నికు౦జముల నీడలోన
ప్రేమైక దేవతలల్లే
ఒక రాసలీలలోన

రాధయో మాధవుడో
పరికి౦చి నే జూడ
కనపడదే నీటికనులకు
కదిలేను కావ్యగాన౦
కమనీయ వేణుగాన౦

నినుచూచిన౦తనోయి
ఆగమన౦లో హాయి
హృదయమ౦తా ని౦డి
ఆన౦దమాయెనోయి

నీలోని ప్రేమ జ్వాల
రాగాలడోలలూగ
రతి రాగమే కేళియై
కాశ్మీర రాగమవగ

నీ దివ్య తేజమెల్ల
తన్మయమ్మయి
విద్యుల్లతా దీపికలు
తనువెల్ల వ్యాపి౦ప

కాళి౦దిలో నీవా
నాట్యాలు నేర్పినావా
చి౦దినవి ప్రాణములొక
కాళీయఫణియ౦దేనా?

నీ హృదయగానమె
నా అ౦తరాత్మయ౦దు
రాధా మాధవుల హేలగ
జగమెల్ల శుభములొస౦గ