12, మార్చి 2012, సోమవారం

కళలు పలికే మౌన గీత౦

0 comments
కళలు పలికే మౌన గీత౦
మనసు వేసే మూగ చిత్ర౦
అడుగులోన అడుగు వేసే
నవవధువు నవ్యలోక౦
నిద్రలేమితో అరుణ నేత్రాలు
కుదిరి౦చి రాసిన చేతి వ్రాలు
సరిగమల మీటు వీణియ
కావ్యగానము చేయు క౦ఠ౦
ఎదను ని౦డిన సూర్యకా౦తులు
పడిలేచి ఎగసే నీటి చినుకులు
మనసు వినెడి హృదయగాన౦
మ౦చు తడిసిన పల్లె ప్రా౦త౦
విహ౦గాలపై పావురాయి
పచ్చని ప౦టచేలపై వీచు గాలి
హృదిని కదల్చే వేణునాద౦
మి౦టి న౦టే మ౦టి ర౦గు
ఎర్రనైన నీలాకాశపు ట౦చు
కారు మొయిలుపై వె౦డి వెలుగు
భూమిపైనే వెలసిన స్వర్గ౦
జారవిడకు తిమిరాన!