3, డిసెంబర్ 2017, ఆదివారం

గులాబీ మొగ్గలు

0 comments

ఆమె స్నిగ్ధమోహనమూర్తి
మూర్తీభవించిన అందం
ఆ ఎర్రని రేకుల వెనుక
ఏదో తెలియని బాధని
నిగూఢంగా విరజిమ్ముతుంది
ఒక మంచు తునక కరిగిపోతూ

ఎందుకయ్యుంటుందో అసలు తెలియదు
ఆ చరిత్ర పుటలు తిరిగివేసె దాక
ఎందుకన్నదీ అంతు చిక్కదు
ఆ తోటలో విరిసే గులబీ మొగ్గలు
రంగు సంతరించేందుకు
ఆ దేశపు జనాల రక్త మాంసాలను
ఖండ ఖండాలుగా జేసి
ఆ మొక్కలకు ఎరువుగా వాడారని
వారి ఆత్మ ఘోషలోని విషాదమే
ఆ మొగ్గలలో కుసుమించిందని
ఆ మొగలాయి తోట పూవులు
చెప్పకనే చెబుతున్నాయి
అందుకే ఆ రంగు అంత నిఖార్సు
అందుకే ఆ అందంలో వేదనా, వెలితీ..