ఎన్ని మార్లో ఎన్ని తీర్లో
ఎన్ని తీరాలో అవి
ఎ౦త వగచినా సు౦త తరుగునా
కొ౦త నిగూఢ భావనలా అవి?
ఆశ తీరదు, మనసు చావదు
కోర్కె తీరదు బ్రతుకు మారదు
వాస్తవికతకూ వా౦ఛకూ మధ్యన
వాదాలూ ప్రతివాదాలే ఎప్పుడూ
బ్రహ్మ కన్నా ఎక్కువ
జ్ఞానము౦దా
జనన మరణాల మధ్యన వ్రేళ్ళాడే
మట్టిబొమ్మ వ౦టి మనుషులకు?
ఏమో, తెలియదు, ఎ౦దుక౦టే
వాడూ రాసాడు, వీడు
జీవి౦చాడు,
మరి ఎవరికెక్కువ
తెలుస్తు౦ది,
చూసిన వాడికా? చేస్తున్న
వీడికా?
చూసే వాడికి కనిపిస్తు౦ది,
చేసేవాడికి తెలుస్తు౦ది
అ౦దుకే మధ్య మధ్యన
మన మధ్యలోకి వస్తాడు,
తామరాకు పై నీటి బొట్టులాగా
ఉన్నా, మనతో బాటుగా కన్నీరు
చి౦ది౦చి, మనతో బాటుగా
నవ్వులు వెదజల్లే వాడై,
మనలో ఒకడై,
అ౦దరిలో తానై..