బహుశా నేను మరచిపోయానేమో
మీరు ఎలా ఉంటారన్నది..
బహుశా నాకు గుర్తు లేదో ఏమో
మిమ్మల్ని ఎక్కడైనా కలుసుకున్నానని
అంతేలే, చింతలోనే ఉండాలంటే,
జీవితం అతి చిన్నది!
ఒక్కోసారి నాకు మన కలలు గుర్తుకొస్తాయి
అవే మనని ఒకే చోట చేర్చింది
ఇరువురం చేతులు పెనవేసుకొని నడవటం
సరస్సు మీదుగా, వంతెన మీదుగా
అని నా మనసంతా చెబుతోంది
కేవలం మరొక్క రోజుని ఎక్కడని వెతకను?
నేను ఎటునుంచి వచ్చాను? ఏ దిశ నా గమ్యం?
మన ఇరువురి కళ్ళు పరస్సరం కలిసినప్పుడు
ఒకరినొకరం ఆలోచనల లోనే కలుసుకుని
పొగమంచులో మీతోనే సుదూరంగా పయనిస్తూ
ఇరువురం సన్నని చలిగాలిలో తేలిపోయినట్లుగా
శూన్యం కన్నా దగ్గరగా...మన ప్రేమలోనే…
మనోలోకంలోనే..
అంటే జగత్తంతా… కృష్ణా, ఇక ఎప్పటికీ మనదే!