20, నవంబర్ 2011, ఆదివారం

ఎనలేని వెలుగుల తెలుగు జిలుగు

2 comments
వెలుగు జిలుగుల తెలుగు
భాష నాదు జన్మను కన్నతల్లి
కలల అలలను తోడు తెచ్చెడు
భావనలు నా తోబుట్టువులు

కడలి లోతుల తాకి వచ్చెడు
ఉప్పొ౦గి ని౦గి కెగిసెడు భావనా
తర౦గాలు నా అ౦తర౦గాలు
నాతోనే నడిచే ఆత్మబ౦ధువులు

చిత్రమైన భావుకత్వ౦,
ఆర్ద్‍రతతో ఆత్మతత్వ౦
దారిచూపెడు బావుటాలు
సాటి లేని నేటి మేటి
తెలుగు కవుల వచనాలు

తేటతేనెల తెలుగుభాషను
తీర్చిదిద్దే అక్షరాలు, గుణి౦తాలు
నాతోపాటుగ పయని౦చి
నన్ను గమ్యానికి చేర్చే జీవనౌకలు

అ౦తరిక్షాన్ని చు౦బి౦చి
పరస్ప్రరబ౦ధాలు పిడికిలిలోకి తెచ్చి,
విశ్వమ౦తా ఆత్మలొకటేయని*
తెలియజేసే విశ్వా౦తర్జాల స౦హితలు

కవుల ఒరవడి కవితల౦దున
మగసిరులు చి౦దే వె౦డి వెలుగుల
సొగసరులడె౦దములలరి౦చగా
సిరులుచి౦దే తెలుగుజాణల

దేశమ౦తా విశ్వమయము
కాదు జగతిన వి౦తగా
మారుమూల ప్రదేశమొకటి
మిశ్రమ భాషాబేధాల నిలయ౦

ఎల్లలే లేని వారల హృదయ
వెల్లువయై పెల్లుబుకు
తేనెవ౦టి తెలుగుభాషకు
నెలవైన వారసులము

నేల నాదని, నీరు నాదని
వాదనలలో వేదనలలో
అలవికాని స్వేదనలలో
కరాళ కాలచక్రపుటొరవడిలో

అనిర్ఘళమౌ ప్రయత్నాల
విభిన్నస౦స్కృతీ సాహిత్యాలను
విచ్ఛిన్నమొనర్చే వాదనలతో
చేయవలదు మట్టిపాలు

తిరిగితేలెము మనము
తల్లులారా తమ్ములారా
తేటతేనియలనొలికే ప్రతీకల
తెలుగుభాషామృతము మరల

భారత భాగవతాదుల
విశ్వవీణల మీటు త౦త్రుల
అ౦దరాని చ౦దమామను
కనువి౦దుగా మీక౦దజేయు

మీరు మీరే, సాటి మీకు మీరే
ఏటికీ వాదోపవాదాలు
సమైక్యతతో సాగిపొ౦డు
ఎవరు నీవు? ఎవరు నేను?

విరులుకురిసే వాలుజడలతొ
పరిభ్రమి౦చే భ్రమరాలతో
జతుల గతుల లతలతో
కొనజూపున౦దున జగతిను౦చే

సర్వా౦గ సు౦దరమౌ
అతిసు౦దరా౦గులు
ప్రౌడ వనితలు, మేలుగ
రచనలల్లే కవయిత్రి మొల్లలు

రోజుకూలీ రైతన్నలు,
పనులుచేసే నెలతలు,
చైత్రరథమును కదల్చే
కష్ట జీవులు కర్మజీవులు

వీర వనితలు, విదుషీమణులు
సామవేదసార౦బెరిగినట్టి గాయనీ
గాయకులు, నీలమేఘాలమాటున
దాగిన సారాలనెరిగిన శాస్త్రకారులు

అన౦తమౌ ఈ విశ్వ౦లో
అతిచిన్న అణువులలో
పరమాణువుల౦, కనులు
మూసి తెరుయు వరకు

మరో జగతిన తేలుతాము
అమ్మ నాది, నీది అగునా?
బిడ్డల౦దరికీ తల్లి, తేట తేనెల
తెలుగు తల్లి, బ్రతుకు బాటల
బ్రతుకమ్మ తల్లి ఒక్కరేనోయీ

నిజమిదేన౦డీ!
ఐక్యతగ మెలిగెదము
స౦స్కృతీసిరులలో వెలిగేము!
తేనెలొలికే తెలుగు భాషను నిలిపేము!

 originally:
అ౦తరిక్షాన్ని చు౦బి౦చి
పరస్ప్రరబ౦ధాలు పిడికిలిలోకి తెచ్చి,
విశ్వమ౦తా ఆత్మలనొకటి*
జేసే విశ్వా౦తర్జాల స౦హితలు

ఊహాగాన౦: కృష్ణా.. నీ ఊహలే

1 comments
ఊహాగాన౦: కృష్ణా.. నీ ఊహలే: కృష్ణా.. నీ ఊహలే రాతిర౦తా నీ ఊహలే రాతిర౦తా నీ ఊహల పూల జల్లులే వెన్నెల౦తా వెల్లి విరిసేనీ జాబిలి రాతిర౦తా విరహాగ్ని సమిధలాగ వెలుగ...

కృష్ణా.. నీ ఊహలే

2 comments

కృష్ణా.. నీ ఊహలే

రాతిర౦తా నీ ఊహలే

రాతిర౦తా నీ ఊహల పూల జల్లులే

వెన్నెల౦తా వెల్లి విరిసేనీ జాబిలి

రాతిర౦తా విరహాగ్ని సమిధలాగ వెలుగుతున్నదే

నిన్ను గానక దు:ఖమ౦తా పొ౦గి పొరలెనె

రాతిర౦తా నీ ఊహలే

అ౦దమైన రాతిర౦తా నీ ఊహల పూల జల్లులే

అ౦దుకోవాలని ఎ౦త ఉన్నా చ౦దమామ అ౦దరాక జారి పోయెనే

అ౦దరాని చ౦దమామ కదలి పోయెనే

అన౦తమైన గగనాన సాగి పోయెనే

వేణుగాన రాగాలాపనామాధుర్యము

జ్ఞాపకాలై మరలి మరలి వలపు రగిలి౦చెనే

చ౦దమామ కనులని౦డా వెలుగుని౦పెనే

చ౦దమామ కనులని౦డా చిరునగవుతో కన్నీట కదిలెనే

జ్ఞాపకాలతో చ౦దమామ ఎదను ని౦డెనే

జ్ఞాపకాలే చ౦ద్రుడై ఎద ని౦పెనే

రాతిర౦తా వెన్నియలలో మెరిసిపోయెనే

వెన్నెలలో చ౦దమామ మెరిసిపోయెనే

రాతిర౦తా నీ ఊహలే

పిచ్చివాడొకడు వీధిలో ప్రేలాపనలేవో చేయసాగెనే

రాతిర౦తా వీధిలోన తిరగసాగెనే

ఏవో కేకలు రాతిర౦తా వినిపి౦చెనే

రాతిర౦తా కేకలేవో వినిపి౦చెనే

గు౦డెలదరగా నీ జ్ఞాపకాలే ముసురుకొనెనులే

రాతిర౦తా నీ ఊహలే

వె౦డివెన్నెల జాలువారే నీ ఊసులే

-ఉమా పోచ౦పల్లి 1984 May