5, మార్చి 2022, శనివారం

"నీ హృదయంలో నిదురించే నా, ఊహవే నీవు!"

0 comments
నీ చుట్టూ వెలుగునై
నీ లోపలి ప్రేమ వెల్లువ వలె,
నీ గళంలో సాగే పాటనై 
నీ మోవిపైన పలికే రాగమై 
నీ మురళిలో మ్రోగే గానమై  
సదా నీ హృదిలో  మధురంగా
ధ్వనియించే ప్రణయరసధునినై 
నీ బాహువులలో మైమరచే
నీ జీవనవాహినినై, సహచరినై 
నీ ప్రేమానురాగాల మోహినియై,
నీవెవరో నేనెవరో తెలియని
అగోచర దృగాంచలసన్నిభమై
నీలోనే నిమగ్నమై 
నిరతం నీతలపులలో 
కృష్ణా నీ సన్నిధిలో నేను