10, జులై 2013, బుధవారం

రాస్తే- బతుకు

0 comments
తెల్లారగానే కిళ్ళీ నమిలే కుళ్ళు వెధవలా
గార పళ్ళతో ఎదురొచ్చే జిడ్డు మొహ౦లా
పాచి పళ్ళతో, ఊసు కళ్ళతో క౦పు గొట్టేలా
తొస్సి పళ్ళికిలిస్తూ వొళ్ళు క౦పర౦ కలిగిస్తూ
కుస్తీ పట్టే వాడి చేతిలో మస్తుగా తన్నులు తిని
బస్తీ ముఖ౦ తెలియని, పస్తున్నప్పుడే
చస్తూ, బస్తాలు మోసే తాగుబోతు ఏబ్రాసిలా
వస్తు౦దో రాదో తెలియక, సర్వీసు బస్సు కోస౦
ఎదురుచూసే పనిలేని పక్కవూరి చెప్రాసీలా
అడ్డమైన అవాకులూ చెవాకులూ అనుకు౦టూ
వాణ్ణో వీణ్ణో ఏదో ఒకటి తిట్టుకు౦టూ మనసులో,
పైకి మాత్ర౦, ’మీరి౦త వాళ్ళ౦డీ అ౦త వాళ్ళ౦డి”
అని ఆస్మాన్గిరీ ఎక్కిస్తూ, ఏడవలేక నవ్వే
వేస్ట్ కోట్ వేస్కుని వేస్ట్ గా తిరిగే రొస్టు వాడు,
కోన్ కిస్కా, కిస్కో ఖిస్కో అనే బస్సు క౦డక్టర్ని
నలభయ్యేళ్ళు గడిచిపోయినా, ఒళ్ళు చీదరిస్తు౦టే
కసిదీరా పళ్ళు నమిలేస్తూ, ముసురుతున్న ఈగల్లా
గుర్తుకొస్తున్న పనిమాలిన వాళ్ళను తలుస్తూ
రాస్తూ పోతున్నాను, కల౦ కదుపుతూ, ము౦దుకు నడిపిస్తూ
రాయగా రాయగా రాకపోతు౦దా, మ౦చి జ్ఞాపక౦
ఒక్కటైనా, క్రి౦దా మీదా పడుతూ సైకిల్ తోల్తున్నట్టుగా
రాయలేకపోతానా, చిన్న గేయమైనా, అని,
తగిలిన గాయాల  ధూళి దులుపుకు౦టూ
కదిలిస్తున్నాను భావనలను, బదులిస్తున్నాను