తూనీగా బల్ తూనీగా
ర(య్యిమనీ తిరిగేవు
ఏ ఊరి నించి వచ్చావే!
ఓహోహో తూనీగా
నీ తీరు ఎంతో హుషారులే
పారిపోవు సమయాన్ని
పట్టుకోబోతావేమో
నిను పట్టు కొనేవారిని
ఎన్ని తిప్పట్లు పెడతావే!
ఔనౌనే తూనీగా,
ఓ ఒంటరి తూనీగా,
ఎవరే వారెవరూ నిన్ను
జోరైన నీ విహారము
వారెవరో నీకిచ్చారని
అనేవారు ఎవరే తెలుపవే
ఎగరాలని ఎంత ఉన్నా
ఆ రాతిబండ ఎగిరేనా!
ప్రపంచమొక సాధన జగతి
కనులు ఉన్న వారలెపుడూ
కనిపించునది చూడలేరూ?!
కావరముతో కాకులు
కూసినంత కోకిలలౌనా!
సరిగమలను సాధిస్తూ
పాడునదే పంచమ స్వరాళి
కోకిల తన సుస్వనంలో
మాధుర్యం దోచుకున్నదా!
కృష్ణుని వలనే నల్లనై,
పిల్లనగ్రోవియె దాని ధ్వని
అతి మధురమౌ కూజితం విని
సాగిపోవుదువు త్వర
త్వరగా
కన్నులనలరించే
తూనీగా తూనీగా
కానవచ్చేవిటు,
కానరావటు!
జాణవులే తూనీగా!!
ర(య్యిన సాగే తూనీగా!!