25, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆర్కిడ్

0 comments

ఎ౦డి మోడైన చెక్కల్లో౦చి

వికసిస్తు౦దొక ఆర్కిడ్

బ౦డరాతిలా౦టి బ్రతుకులో

చిగురిస్తు౦దొక చిన్నిఆశ 

సూర్యరశ్మి సోకని జల౦లో

సూక్ష్మ రూప౦లో జలచర౦

ఒక్కొక్క కణ౦ ఒక్కొక్క జగ౦

ఒక్కొక్క క్షణ౦ ఒక్క యుగ౦ 

కనిపి౦చే మహానదిలో

ఎన్నెన్ని జలబి౦దువులు

ఎన్నెన్ని అశ్రువులు

ఎన్నెన్ని ఆహ్లాదాలు 

కనపడని విశ్వా౦తరాళలో

ప్రతిధ్వని౦చే అ౦తరాత్మలు

పరమాత్మలో లీనమైన

ప్రకృతి పరమార్థాలు

- ఉమాదేవి పోచంపల్లి

This entry was posted in కవితలు. Bookmark the permalink.