31, మే 2022, మంగళవారం

శ్రీ కృష్ణా కరుణించరా

0 comments

మది నిండ నీవే

నిండేవు రా

శ్రీ కృష్ణా యదునందనా

కష్ట నివారా

దుష్ట విదూరా

ఇష్టాయిష్టములు

కలగని వరదా

మది నిండ నీవే

నిండేవురా

శ్రీ కృష్ణా మునివందనా

యశోద నందన,

కష్ట సంహారణ

ఘఠనాఘఠనల

తలపెడువాడా

మదిలోన నిన్నే

తలచేనురా

శ్రీ కృష్ణా మధుసూధనా

 ఆది విష్ణుడవు

నీవే దేవా

దేవకీవసుదేవుల

సుతుడవు

పరిపూర్ణుడవు

నీవే గురుడవు

హే కృష్ణా కరుణించ రా!