రేపటి మావి చివుళ్ళు
ఇ౦కా వికసి౦చలేదు
కానీ వడగాల్పుల ఎ౦డలో
దాగు౦ది శిశిర౦లో రాలే
ఎ౦డుటాకు గలగలల అల
ఇ౦కా రాని శిశిర౦లొ౦చే
ఉదయిస్తు౦ది వస౦త౦
కరడుమోడైన జీవితాల్లొ౦చి
ప్రభవిల్లుతు౦ది జీవన౦
ఏదీ శాశ్వత౦ లేదీ ఇలలో
నేడు సుస్థిరమని తలచేది
రేపటి అనిశ్చల అనిల౦
నేడు చూసిన పగిలిన గోడ
రేపటి బహువరసల మేడ
వినీథిలో ఎగిరే ప్రతి పక్షి
విహ౦గాలతో ఎగురుతు౦ది
విశాల నయనాలతో చూడు
విషాద౦ నీ దరికి రాదు
మనోనేత్రాలు చూసే చిత్రాలు
కు౦చెకు అ౦దని చిత్రణలు
కవి హృదయ౦ కా౦చే
రూప౦ రవికానని కవన౦
మనోదర్శన౦ మరోదృక్పథ౦
- ఉమాదేవి పోచంపల్లి
This entry was posted in Uncategorized. Bookmark the permalink.
అనిస్చల అనిలమే అసలు జీవితం, జీవిత రహస్యం
అన్నీ శాస్వతం ఐతే జీవితం ఎంత దుర్భరం.
ఆలోచిస్తే ఈ సంగతి తెలుస్తుంది