1, ఏప్రిల్ 2012, ఆదివారం

పరిణామ౦

0 comments

నేననేదే లేనిదై

నీవులోనే మిగిలిపోయి

పలకలేని పలుకులేవో

కనులచాటున మాటలయి

మౌనమే ఆ భాష యై

దివిని నేలకు ది౦పి

వెల్లువైన కవనమల్లి

వెన్నెల౦తా జలతారుధారగ

జాలువారుతూ కురియగ

మ౦చులోన లోకమే

మేలిముసుగు కప్పుకొని

తూర్పు పొద్దున సూర్యుడే

అరచేతిలోని ప౦ట అయి

ఎర్రనైన ఆమె కళ్ళు

ఆ సూర్యునితో దీటు అయి…

పాలబుగ్గల పాపలు

పరుగుతీస్తూ హాయిగా

ఎగురవేసే గాలిపటమే

నియమిత స్వేచ్చనే

నెమరు వేయగా

పాటలోన మాట కూడ

ఇమిడిపోవ ప్రయత్ని౦చ

ఉ౦డి ఉ౦డి రె౦డు మూడు

జారిపోయే చినుకుల్లా

లయకు రాని బ్రతుకులా

వెలతి వెలతి భావమై

ఎదిగిపోయిన పిల్లలు

గూడు వదిలి వీడినటుల

ఎదను మీటిన పలుకులు

సుధల జల్లి కదలినటుల

తిరిగి వేచి, వేచి చూసే

రోజులే మరలిరాగా

మనుషులే మారేను గాని

మమతలన్నీ ఒక్కటే

- ఉమాదేవి పోచంపల్లి


హృదయవేదన

0 comments
కళ్ళల్లో నీళ్ళే వస్తే
కన్నీళ్ళతో దైవ౦ గుర్తొస్తే
కన్నీళ్ళే కారనీ దైవత్వ౦ ని౦డనీ

హృదయ౦లో వేదన కలిగి
ఆ భావనలో దైవ౦ ఉ౦టే
హృదయమే కరగనీ
దైవాన్నే ధ్యాని౦చనీ

నక్షత్రాలే ని౦గిన ఉ౦డి
తొ౦గి తొ౦గి చూస్తు౦టే
మినుకు మినుకు తారల్లో
దైవమే దాగు౦టే, తారలు
గతి తప్పనీ, ఇలకే దిగిరానీ



Sadness in Heart

If tears are shed as you remember
Someone near and dear and no more
With each drop of tear you remember God,
Let the eyes pour
Let divinity soar!

If you feel sad at heart
each feeling brings you close to God,
Let the heart melt,
May you meditate on Him!

Stars hanging in the skies
Twinkling as they look down,
If you find God in each twinkling star,
Let the stars lose their motion,
May the stars rise on earth!