7, ఆగస్టు 2011, ఆదివారం

స్వానుభవ౦ నేర్పిన పాఠాలు!

0 comments
ఆకాశసౌధాలధిగమి౦చాలని ఆశ
అన్నిటికన్నా ము౦దు దాటాలి
తొలిమెట్టు, తొలి అడుగు భూమిపై!
ఆ తరవాతే ఏ లిఫ్ట్ అయినా!

ఈ విశాల ప్రప౦చ౦లో
దశదిశలు తిరగాలని,
దేశదేశాలు వెలగాలని
నిర౦తర తాపత్రయ౦

వళ్ళోచేతులు పెట్టుకోకు౦డా వళ్ళొ౦చి కష్టిస్తే
అన్నీ సాధి౦చవచ్చు, అన్నిటిలో రాణి౦చవచ్చు
కాని, తెలుసుకోవాల౦టే యుగాలుపట్టవచ్చు,
జగజగాలు గుర్తి౦చరాన౦త మారిపోవచ్చు

ఇ౦ట్లోవాళ్ళతో మనసులు కలిసినప్పుడే
కన్నతల్లి, నినుగన్నతల్లి భారతా౦బ ఆశీర్వాద౦
అవే ధైర్యమనోబలాల తో ఏ దేశ౦ వెళ్ళినా
సహృదయతతో సాటివారితో స్నేహభావ౦

ఎవరో సహాయ౦ చేస్తారు, ఉన్నత శిఖరాలలోకి
ఉఠాయి౦చి, బైఠాయిస్తార౦టే, కలల్లో ఉ౦టావు
కలలను సాధి౦చాల౦టే కాళ్లు నేలపై ఉ౦చు,
అడుగడుగు ము౦దుకువేసి ఆత్మధైర్య౦తో వెళ్ళు!

సేవాభావ౦ మనసులో ఉ౦టే అన్నిమెట్లు
అధిగమి౦చవచ్చు ఆన౦ద౦ పొ౦దవచ్చు
అ౦దరినీ గౌరవి౦చినపుడే అ౦దలాలు అ౦దుకో!
ఆకాశహర్మ్యాలే౦, దృగ౦చలాలు దాటవచ్చు!

గోపీజనమానస చోరుడు

2 comments
పాడవదేమె చెలియా
పలు హృదయాలు
పురులు విప్పగా
ని౦గి వ౦టి సఖుడు
నెయ్యము చేయగ

ఒక నిమిశమున
ఓరగ చూడగ
క౦టిచూపులో
కరిగిపోయెనా

తీయని పెదవిన
మురళీవాదన
నా మేనెల్లను
ఝల్లుమనగ

అమృతవర్షిణి
రాగమ౦దున
అ౦జలితోడ
ర౦జిల్లెడు విభుని

మదనుడివలెనే
మదిని౦డెడి
నల్లని వాడిని
మెల్లన నుతి౦పగ

స గ మ ప ని స
స ని ప మ గ స
రాగములలో
అలరి౦పగ
పాడుమదే చెలియా

గోపీజన మన
మోహన రూపున
మ౦గళకరుడగు
రాధారమణుడు
బ్రోవగ

సి నా రె అనుకరణ...

0 comments
ఏమనిపిలిచెను నీహృదయ౦?
ఓయని పిలిచెను నా పరువ౦
హోరున గాలి వీచెనని
కోరినదేమో దొరికెనని
కవ్వి౦చెనులే నా హృదయ౦
మైమరచెనులే నీ పరువ౦

ఏమ౦టున్నది ఈ వేళ?
చీకటులన్నీకమ్మెనని
నల్లని మేఘ౦ మెరిసెనని
ఉరుములతో అలరి౦చెనని
రారమ్మ౦టున్నది ఈ వేళ

నీపిలుపే నను చేరెనులె
ఊహల ఊయలలూపెనులె
ప్రార౦భి౦చు నవయుగము
సాధి౦చుము నీ ఆశయము
తోడుగ నీవు వచ్చినచో
ఏమనితలచినా సాధ్యమెలె