నగు మోము చూసాను
నయనాలు చూసాను
నవ్వే కనుల వెనుక
ఏముందో ఎవరికెరుక
విరహాగ్నిలొ వేగాను
సామీప్యత నెరిగాను
సామీప్యత తెర వెనుక
ఏముందో తెలుసునా
మధురోహలలొ మునిగాను
మధురస్మృతి అని తలచాను
మైమరచిన నా మదిలొ
ముంచుకు వచ్చేది కల గనలెదు
అందము నీదని తలచాను
అందినంతనే మురిసాను
అందమైన ఆ నవ్వు వెనక
ఏముందో నేను కనలెదు…
-ఉమా పోచంపల్లి గోపరాజు